ముక్కంటిచెంత మాస్టర్ ప్లాన్
- దేవస్థానంలో భారీ మార్పులు
- ఆలయం వద్ద భవనాల తొలగింపు
- భవనాలన్నీ భరద్వాజతీర్థం వద్దకు తరలింపు
శ్రీకాళహస్తి : మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా శ్రీకాళహస్తి దేవస్థానంలో భారీ మార్పులు చేయనున్నట్లు ఈవో బి.రామిరెడ్డి తెలిపారు. శనివారం దేవస్థానంలోని పరిపాలన భవనంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేవస్థానంలో భారీ మార్పులు చేస్తున్న నేపథ్యంలో ఆల యాన్ని పరిశీలించడానికి సోమవారం(22వ తేదీ) ఆర్కియాలజీ శాఖకు చెందిన బృం దం వస్తోందని చెప్పారు. వారి సలహాల మేరకు భవనాల తొలగింపు, నిర్మాణాలు ఉంటాయన్నారు. అన్ని రకాల రాహుకేతు పూజలు ఇకపై ఆలయంలోపల కాకుండా ఆలయ ప్రాంగణంలోనే పెద్దఎత్తున భక్తులు విచ్చేసినా ఇబ్బం దులు లేకుండా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.
ఆలయ ప్రాంగణంలోని అన్నదాన మండపం, పరిపాలన భవనం, జ్ఞానప్రసూనాంబ, త్రినేత్ర అతిథి భవనాలను తొలగించి భరద్వాజతీర్థం(ఆలయానికి 500 మీటర్ల దూరంలో) వద్ద నిర్మించనున్నట్లు చెప్పారు. సన్నిధివీధిలోని పలు ప్రైవేటు భవనాలు తొలగిస్తారని తెలిపా రు. ఆలయ ఈఈ కె.రామిరెడ్డి మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్‌లో చేపట్టాల్సిన అంశాలపై ఇటీవల తమకు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారని తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగుమాడ వీధుల్లో రథోత్సవం నిర్వహించడం ఇబ్బందిగా ఉందన్నారు. ట్రాఫిక్, భక్తులకు సౌకర్యాల దృష్ట్యా నాలుగు మాడ వీధుల్లోనూ మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా పెద్ద ఎత్తున భవనాలు తొలగిస్తారని తెలిపారు. భరద్వాజతీర్థంలోనే గోశాలకు అవసరమైన షెడ్లు ఏర్పాటు చేస్తారని చెప్పారు. స్వర్ణముఖినదిలో మురుగునీరు తొలగించి భక్తులు స్నానాలు చేసే విధంగా మం చినీరు నిలువ ఉండడం కోసం చెక్‌డ్యామ్‌లు ఏర్పాటు చేస్తారని చెప్పారు.