నివాసభవనాలు, స్కూళ్లు, చారిత్రక సమాధులకు ముప్పు
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్లు
సుమారు 1100 నిర్మాణాల కూల్చివేతకు చర్యలు
శతాబ్దాల చారిత్రక అస్తిత్వం.. హైదరాబాద్ సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతిరూపం. విభిన్న జీవన సంస్కృతుల సమాహారం పాతబస్తీ.. కుతుబ్‌షాహీల నుంచి ఆసఫ్‌జాహీల వరకు 400 ఏళ్ల నాటి చార్మినార్ మొదలుకొని ఎన్నెన్నో అద్భుతమైన చారిత్రక కట్టడాలు, మరెన్నో అందమైన ప్యాలెస్‌లు, మహళ్లు, దర్వాజాలు, దేవిడీలు, బౌలీలు, నవాబుల సమాధులు, పార్కులు ప్రపంచ చిత్రపటంలో పాతబస్తీ ఉనికిని సమున్నతంగా ఆవిష్కరిస్తాయి. హైదరాబాద్‌కు వచ్చే దేశవిదేశాలకు చెందిన పర్యాటకులు పాతబస్తీని సందర్శిస్తేనే ఆ పర్యటన పరిపూర్ణం అవుతుంది. అలాంటి పాతబస్తీలో ఇప్పుడు మెట్రో నిర్మాణానికి మార్గం సుగమమైంది.
ఏ ఒక్క చారిత్రక కట్టడానికి విఘాతం కలిగించకుండా, వాటి ఔన్నత్యాన్ని చాటే విధంగా మెట్రో మెలికలు తిరగనుంది. చారిత్రక కట్టడాలను చుట్టేస్తూ మహాత్మా గాంధీ బస్‌స్టేషన్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్ నిర్మాణానికి కార్యాచరణ మొదలైంది. ఈ మార్గంలో రోడ్డు విస్తరణ వల్ల చారిత్రక భవనాలకు ఎలాంటి ముప్పు లేకపోయినప్పటికీ కొన్ని చోట్ల వందేళ్లకు పైబడిన ఇళ్లు, హోటళ్లు, దుకాణాలు, స్కూళ్లు తదితర భవనాలు పాక్షికంగానో, పూర్తిగానో నేలమట్టం కానున్నాయి. సుమారు 1100 నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుందని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ గుర్తించింది. ఇప్పటి వరకు 270 మంది తమ ఆస్తులు అప్పగించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు హెచ్‌ఏఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
⇒ చదరపు గజానికి రూ.81 వేల చొప్పున ఆస్తులు కోల్పోనున్న వారిలో 170 మందికి సుమారు రూ.80 కోట్లు ఇప్పటి వరకు చెక్కులు పంపిణీ చేశారు. కానీ మెట్రో నిర్మాణంలో భాగంగా ఆస్తులను కోల్పోతున్న ఎంతోమంది పాతబస్తీవాసులుపూర్వీకుల నాటి భవనాలను కోల్పోవడంపై ఆందోళనకు గురవుతున్నారు. మెట్రో వల్ల తరతరాలుగా వారసత్వంగా వచ్చే భవనాలను కోల్పోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో నిర్మాణం నేపథ్యంలో పాతబస్తీలో ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పర్యటించింది.
ఆ వివరాలతో ప్రత్యేక కథనం..
చారిత్రక రహదారులపై మెట్రో కారిడార్..
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మీరాలంమండి రోడ్డు మీదుగా దారుల్‌షిఫా, పురానీహవేలి, ఎతెబార్‌చౌక్, అలీజాకోట్ల,
బీబీబజార్, సుల్తాన్‌షాహీ, హరి»ౌలి, శాలిబండ, అలియాబాద్, శంషీర్‌గంజ్, ఫలక్‌నుమా వంటి చారిత్రక రహదారిపైన మెట్రో కారిడార్
నిర్మించనున్నారు.
⇒ ఈ మార్గంలో దాదాపు 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా మెట్రోనూ మళ్లించారు. చారి్మనార్‌కు 500 మీటర్ల దూరంలో మెట్రో రానుంది. ఇలా చారిత్రకకట్టడాలు ఉన్న చోట ఇంజినీరింగ్ పరిష్కారాలు, మెట్రో పిల్లర్ స్థానాల సర్దుబాటు వంటి చర్యలు చేపట్టారు. కానీ ఇదే రూట్‌లో ఎంతోమంది పాలు, పండ్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువులను విక్రయించే కిరాణా దుకాణాలు, హోటళ్లు, పలు చోట్ల స్కూల్ భవనాలు ప్రభావితం కానున్నాయి. ప్రతి సంవత్సరం మొహర్రం సందర్భంగా బీబీకా ఆలం ఊరేగింపుతో ఎంతో సందడిగా ఉండే దారుల్‌ఫా స్వరూపం మారనుంది.
⇒ ‘ఒకప్పుడు మా ఇల్లు 1200 గజాల్లో ఉండేది. 2002లో రోడ్డు విస్తరణ కోసం 131 గజాలు తీసుకున్నారు. ఇప్పుడు మెట్రో కోసం 700 గజాలు ప్రభావితమవుతోంది. పూరీ్వకుల నుంచి ఉన్న మా ఇంటి ఉనికిని కోల్పోతున్నాం.’ అని దారుల్íÙఫాకు చెందిన ఆబిద్ హుస్సేన్ తెలిపారు. మొహర్రం బీబీకాలం ఆలం సందర్భంగా ఏనుగు మా ఇంటికి వస్తుంది. రేపు మెట్రో వచి్చన తర్వాత అది సాధ్యం కాదు కదా’ అని ఆవేదన వ్యక్తం చేశారు. హెరిటేజ్ రోడ్లపై నుంచి కాకుండా ఇతర మార్గాల్లో మెట్రో నిర్మించాలన్నారు.
⇒ పాతబస్తీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని..
నిజాం కాలం నాటి భవనాలు కోల్పోవడం బాధగా ఉంది. మాపూర్వీకులు ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇంట్లో మా తాత, మా నాన్న, ఇప్పుడు మేము కిరాణ జనరల్ స్టోర్ నడుపుతున్నాం. 280 చదరపు గజాలు ఉన్న మా ఇంటి నుంచి మెట్రో కోసం 65 చదరపు గజాల స్థలాన్ని కోల్పోతున్నాం. పాతబస్తీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సి వచి్చంది. – సయీద్ బిన్ అహ్మద్ మహపూజ్, వ్యాపారి
పాతకాలం నాటి ఇల్లు పోతోంది
ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా మెట్రోరైల్ ఎంతో అవసరం, పాతబస్తీ ప్రజలకు మెట్రో సదుపాయం రావడం ఆహ్వానించదగ్గదే.. కానీ పూరీ్వకుల నాటి ఇంటిని కోల్పోవాల్సి రావడం కష్టంగానే ఉంది. మా కళ్ల ముందే మా ఇంటిని కూల్చివేస్తుంటే చూడలేకపోతున్నాం. ఎంతో బాధగా ఉంది.
– మహ్మద్ బీన్ అహ్మద్, ఇంటి యజమాని
పరిహారం అవసరం లేదు
హెరిటేజ్ రోడ్లపై నుంచి మెట్రో నిర్మించడం సరైంది కాదు.. దీనివల్ల మా ఇల్లు 700 గజాలు కోల్పోవాల్సి వస్తుంది. పరిహారం కోరుకోవడం లేదు. త్వరలో న్యాయం కోసం కోర్టుకు వెళ్తాను. ఎట్టిపరిస్థితుల్లోనూ మెట్రోకు స్థలం ఇవ్వను.
– ఆబిద్‌హుస్సేన్, దారుల్‌ఫా
జిగ్‌జాగ్ మెట్రో ఉంటుందా
ప్రపంచంలో ఎక్కడైనా మెట్రో ప్రధానమైన మార్గాల్లో కట్టారు. కానీ పాతబస్తీ అందుకు విరుద్దం. ఇలాంటి జిగ్‌జాగ్ మెట్రో ఎక్కడా చూడలేదు. చాలావరకు చారిత్రక భవనాలను కాపాడుతున్నామంటున్నారు. కానీ స్పష్టత లేదు.
– అనురాధారెడ్డి, ఇంటాక్
ఆ ఘుమఘుమలు మాయమేనా..?
పాతబస్తీ పేరు వింటేనే కమ్మటి ఇరానీచాయ్, ఉస్మానియా బిస్కెట్లు, సమోసా, బన్‌మస్కా, పసందైన బిర్యానీ రుచులు ఘుమఘుమలాడుతాయి. ప్రతిరోజూ తెల్లవారు జాము నుంచే జనజీవనంతో బీబీబజార్, మొగల్‌పురా, షాలిబండ తదితర ప్రాంతాలు సందడిగా కనిపిస్తాయి. మెట్రో రాక వల్ల అనేక మార్పులు రానున్నాయి. బీబీబజార్‌లోని విక్టోరియా హోటల్ కనుమరుగవుతోంది. అలాగే ఎతేబార్‌చౌక్‌లోని ఏళ్ల నాటి ముఫీద్–ఉల్–ఆనమ్ స్కూల్, పురానీహవేలీలోని ప్రిన్సెస్ ఎస్సేన్ గరŠల్స్ హైసూ్కల్ తదితర విద్యాసంస్థలు ప్రభావితం కానున్నాయి. కొన్ని స్కూళ్లు పాక్షికంగా దెబ్బతింటాయి. పాతబస్తీ మెట్రోపైన మొదట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత గత ప్రభుత్వ హయాంలోనే మార్గం సుగమమైంది. ‘అభివృద్ధిని అడ్డుకోవడం లేదు. కానీ పాతబస్తీ రూపురేఖలు, చిహ్నాలు మారిపోతాయనే బాధ మాత్రం తీవ్రంగా ఉంది.’ అని మీర్ యూసుఫ్ అలీ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment