ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట దాకా అలైన్‌మెంట్
5.5 కి.మీ నుంచి 7.5 కి.మీ వరకు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మెట్రో మార్గంలో భూసేకరణపై హైదరాబాద్ మెట్రో రైల్ కసరత్తు చేపట్టింది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు ఉన్న ఓల్డ్‌సిటీ మెట్రో మార్గాన్ని రెండోదశలో భాగంగా చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. కొత్త అలైన్‌మెంట్ కోసం భూసేకరణకు హెచ్‌ఎంఆర్‌ఎల్ నోటిఫికేషన్ వెల్లడించింది. కారిడార్‌లోని వివిధ ప్రాంతాల్లో సేకరించనున్న స్థలాలపై అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం 60 రోజుల గడువు విధించారు. మరోవైపు అభ్యంతరాలను స్వయంగా తెలియజేసేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ అవకాశం కలి్పంచింది. భూ సేకరణలో భాగంగా ఆస్తులను కోల్పోయే బాధితులు అభ్యంతరాలను, ప్రతిపాదనలను బేగంపేట్‌లోని మెట్రో భవన్ కార్యాలయంలో స్పెషల్ కలెక్టర్‌కు స్వయంగా తెలియజేయవచ్చు. అక్టోబర్ 7వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ప్రత్యక్షంగా అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు.
దారుషిఫా నుంచి శాలిబండ వరకు..
మొదటి దశలోని మూడో కారిడార్‌లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ వరకు నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ మార్గాన్ని రెండో దశలో భాగంగా ప్రస్తుతం చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. కానీ.. ఈ రూట్‌లో దారుíÙఫా జంక్షన్ నుంచి షాలిబండ జంక్షన్ వరకు మొత్తం 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషుర్ ఖానాలు, 33 దర్గాలు, 7 శ్మశాన వాటికలు మరో 6 చిల్లాలు సహా మొత్తం 103 నిర్మాణాలు ఉన్నట్లు గతంలోనే గుర్తించారు.
మతపరమైన, సున్నితమైన నిర్మాణాలను కాపాడేందుకు రోడ్డు విస్తరణను సైతం 80 అడుగులకే పరిమితం చేయాలని నిర్ణయించారు. ప్రైవేట్ ఆస్తులూ పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ రూట్‌లో ఆస్తులను కోల్పోనున్న వివిధ వర్గాలకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం వారి నుంచి అభ్యంతరాలు, ఆస్తుల అంచనాలను
స్వీకరించనున్నారు.
⇒ 2012లోనే చేపట్టాల్సిన ఈ ప్రాజెక్టు పనులను 2023 వరకు కాలయాపన చేయడంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగి ప్రస్తుతం రూ.2500 కోట్లకు చేరింది. కిలోమీటర్‌కు సుమారు రూ.250 కోట్లకు పైగా ఖర్చు కానున్నట్లు అంచనా. 5.5 కిలోమీటర్‌ల కారిడార్‌తో పాటు భూములు, ఆస్తులను కోల్పోయిన వారికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైన చోట్ల రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులు చేపట్టాల్సి ఉంటుంది. దారుíÙఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇత్తెబార్ చౌక్, అలీజా కోట్ల, మీర్ మోమిన్ దర్గా, హరి»ౌలి, శాలిబండ, షంషీర్‌గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్‌నుమా వరకు ఈ అలైన్‌మెంట్ ఉంటుంది.
⇒ మెట్రో రైల్ మార్గంలో ఎంజీబీఎస్ తర్వాత సాలార్‌జంగ్ మ్యూజియం, చారి్మనార్, శాలిబండ, షంషీర్‌గంజ్, ఫలక్‌నుమా స్టేషన్‌లను నిర్మించాల్సి ఉంది. చాంద్రాయణగుట్ట నుంచి మైలార్‌దేవ్‌పల్లి మీదుగా ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రెండో దశ చేపట్టనున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని వచి్చన తర్వాత మెట్రో రెండోదశ డీపీఆర్‌ను వెల్లడించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment