MGBS
-
భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ
-
పాతబస్తీ మెట్రోకు భూసేకరణ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మెట్రో మార్గంలో భూసేకరణపై హైదరాబాద్ మెట్రో రైల్ కసరత్తు చేపట్టింది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు ఉన్న ఓల్డ్‌సిటీ మెట్రో మార్గాన్ని రెండోదశలో భాగంగా చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. కొత్త అలైన్మెంట్ కోసం భూసేకరణకు హెచ్ఎంఆర్ఎల్ నోటిఫికేషన్ వెల్లడించింది. కారిడార్‌లోని వివిధ ప్రాంతాల్లో సేకరించనున్న స్థలాలపై అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం 60 రోజుల గడువు విధించారు. మరోవైపు అభ్యంతరాలను స్వయంగా తెలియజేసేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ అవకాశం కలి్పంచింది. భూ సేకరణలో భాగంగా ఆస్తులను కోల్పోయే బాధితులు అభ్యంతరాలను, ప్రతిపాదనలను బేగంపేట్‌లోని మెట్రో భవన్ కార్యాలయంలో స్పెషల్ కలెక్టర్‌కు స్వయంగా తెలియజేయవచ్చు. అక్టోబర్ 7వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ప్రత్యక్షంగా అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. దారుషిఫా నుంచి శాలిబండ వరకు.. మొదటి దశలోని మూడో కారిడార్‌లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ వరకు నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ మార్గాన్ని రెండో దశలో భాగంగా ప్రస్తుతం చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. కానీ.. ఈ రూట్లో దారుíÙఫా జంక్షన్ నుంచి షాలిబండ జంక్షన్ వరకు మొత్తం 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషుర్ ఖానాలు, 33 దర్గాలు, 7 శ్మశాన వాటికలు మరో 6 చిల్లాలు సహా మొత్తం 103 నిర్మాణాలు ఉన్నట్లు గతంలోనే గుర్తించారు. మతపరమైన, సున్నితమైన నిర్మాణాలను కాపాడేందుకు రోడ్డు విస్తరణను సైతం 80 అడుగులకే పరిమితం చేయాలని నిర్ణయించారు. ప్రైవేట్ ఆస్తులూ పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ రూట్లో ఆస్తులను కోల్పోనున్న వివిధ వర్గాలకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం వారి నుంచి అభ్యంతరాలు, ఆస్తుల అంచనాలను స్వీకరించనున్నారు. ⇒ 2012లోనే చేపట్టాల్సిన ఈ ప్రాజెక్టు పనులను 2023 వరకు కాలయాపన చేయడంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగి ప్రస్తుతం రూ.2500 కోట్లకు చేరింది. కిలోమీటర్‌కు సుమారు రూ.250 కోట్లకు పైగా ఖర్చు కానున్నట్లు అంచనా. 5.5 కిలోమీటర్ల కారిడార్‌తో పాటు భూములు, ఆస్తులను కోల్పోయిన వారికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైన చోట్ల రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులు చేపట్టాల్సి ఉంటుంది. దారుíÙఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇత్తెబార్ చౌక్, అలీజా కోట్ల, మీర్ మోమిన్ దర్గా, హరి»ౌలి, శాలిబండ, షంషీర్గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్‌నుమా వరకు ఈ అలైన్మెంట్ ఉంటుంది. ⇒ మెట్రో రైల్ మార్గంలో ఎంజీబీఎస్ తర్వాత సాలార్జంగ్ మ్యూజియం, చారి్మనార్, శాలిబండ, షంషీర్గంజ్, ఫలక్‌నుమా స్టేషన్లను నిర్మించాల్సి ఉంది. చాంద్రాయణగుట్ట నుంచి మైలార్‌దేవ్‌పల్లి మీదుగా ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రెండో దశ చేపట్టనున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని వచి్చన తర్వాత మెట్రో రెండోదశ డీపీఆర్‌ను వెల్లడించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు -
ఎలాగైనా.. ఊరికి పోవాల్సిందే!
నగర దారులన్నీ పల్లె‘టూరు’ దారి పడుతున్నాయ్. బస్సూ, రైలూ, కారూ, బైకూ.. ఏదైనా సరే ఊరికి పోవడమే లక్ష్యం. ఆదివారం సద్దుల బతుకమ్మ, సోమవారం దసరా పండగ కావడంతో శనివారం పట్నవాసులు పల్లెలకు పయనమయ్యారు. సొంతూరిని ఓసారి మనసారా చూసొద్దామని ఆశగా బయలుదేరారు. నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్ తదితర బస్టాండ్లు, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. – సాక్షి, స్టాఫ్‌ఫొటోగ్రాఫర్ -
పాతబస్తీ మెట్రో మార్గంపై డ్రోన్ సర్వే
హైదరాబాద్: పాతబస్తీ మెట్రో పనులను హైదరాబాద్ మెట్రో రైల్ వేగవంతం చేసింది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల మార్గంలోని ఆధ్యాత్మిక స్థలాల పరిరక్షణ కోసం ఆదివారం డ్రోన్ సర్వే చేపట్టింది. మెట్రో అలైన్మెంట్లో భాగంగా పలు చోట్ల రోడ్డు విస్తరణ చేపట్టవలసి ఉంటుంది. ఈ క్రమంలో మసీదులు, ఆలయాలు, తదితర కట్టడాలకు ఎలాంటి విఘాతం కలగకుండా పిల్లర్స్ నిరి్మంచేందుకు హైదరాబాద్ మెట్రోరైల్ అధికారులు సాధారణ సర్వేతో పాటు, ఈ డ్రోన్ సర్వేను ప్రారంభించారు. డ్రోన్ నుంచి సేకరించిన హై రెజల్యూషన్ చిత్రాలు, రియల్ టైమ్ డేటా, 3డీ మోడలింగ్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆయా కట్టడాల కొలతలను కచి్చతంగా అంచనా వేయనున్నారు. దారుల్ఫా జంక్షన్ నుంచి షాలిబండ జంక్షన్ వరకు ఉన్న 103 కట్టడాల పరిరక్షణ కోసం ఈ డ్రోన్ సర్వే దోహదం చేయనుందని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు నిరి్మంచనున్న 5.5 కిలోమీటర్ల మెట్రో అలైన్మెంట్ ఇంజనీరింగ్ రిఫైన్మెంట్ పనులు కొనసాగుతున్నాయని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎనీ్వఎస్‌రెడ్డి తెలిపారు. ఈ మార్గంలో మొత్తం 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషూర్ఖానాలు, 33 దర్గాలు, 7 శ్మశానవాటికలు మరో 6 చిల్లాలతో సహా మొత్తం 103 మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయి. కర్వేచర్ సర్దుబాటు, వయాడక్ట్ డిజైన్,ఎత్తులు, మెట్రో పిల్లర్ లొకేషన్లలో తగిన మార్పులు,తదితర ఇంజనీరింగ్ పరిష్కారాల కోసం డ్రోన్ సర్వే ద్వారా సేకరించిన డేటా ఉపయోగపడనుంది. మతపరమైన/సున్నితమైన నిర్మాణాలను కాపాడేందుకు రోడ్డు విస్తరణను కూడా 80 అడుగులకే పరిమితం చేయనున్నారు.నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో మొదటి ఫేజ్ ప్రాజెక్ట్ నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా స్టేషన్ స్థానాల్లో మాత్రం రహదారిని 120 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. త్వరలో భూసామర్ధ్య పరీక్షలు.... ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల పాతబస్తీ మెట్రో మార్గంలో త్వరలో భూసామర్ధ్య పరీక్షలు ప్రారంభించనున్నట్లు ఎనీ్వఎస్ రెడ్డి తెలిపారు. ఫలక్‌నుమా నుంచి ఈ పరీక్షలను ప్రారంభించనున్నారు. నిజానికి జేబీఎస్ నుంచి పాతబస్తీలోని ఫలక్‌నుమా వరకు 2012లోనే మెట్రో రైల్ ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ పాతబస్తీలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ప్రాజెక్టును ఎంజీబీఎస్ వరకు పరిమితం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజుల క్రితం పాతబస్తీ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్ మెట్రో రైల్ ఈ మార్గంలో పనులను ప్రారంభించింది. ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు అందుబాటులోకి వస్తే నగరవాసులు జేబీఎస్ నుంచి నేరుగా ఫలక్‌నుమా వరకు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే నాలుగు వందల ఏళ్ల నాటి చారిత్రాత్మక చారి్మనార్ కట్టడాన్ని మెట్రో రైల్లో వెళ్లి సందర్శించుకోవచ్చు. సాలార్జంగ్ మ్యూజియం, ఫలక్‌నుమా ప్యాలెస్ వంటి చారిత్రక కట్టడాలను సందర్శించవచ్చు. నిత్యం వాహనాల రద్దీతో కిక్కిరిసిపోయే పాతబస్తీలో మెట్రో అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికులకు ఎంతో ఊరట లభించనుంది. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చారిత్రక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఐదు స్టేషన్లు... ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే.అక్కడి నుంచి దారుíÙఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇత్తెబార్ చౌక్, అలీజాకోట్ల, మీర్ మోమిన్ దర్గా, హరిబౌలి, శాలిబండ, షంషీర్గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్‌నుమా వరకు ఈ 5.5 కిలోమీటర్ల అలైన్మెంట్ ఉంటుంది. ఈ మెట్రో రైల్ మార్గంలో 5 స్టేషన్లు రానున్నాయి.ఎంజీబీఎస్ తర్వాత సాలార్జంగ్ మ్యూజియం, చారి్మనార్, శాలిబండ, షంషీర్గంజ్, ఫలక్‌నుమా స్టేషన్లు ఉంటాయి. సాలార్జంగ్ మ్యూజియం, చారి్మనార్ స్టేషన్లకు మధ్య 500 మీటర్ల దూరమే ఉన్నప్పటికీ, ఈ రెండు స్టేషన్లకు నగరంలో ఉన్న చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని వాటికి ఆ పేర్లు పెట్టినట్లు ఎనీ్వఎస్ రెడ్డి తెలిపారు. -
పాతబస్తీ మెట్రోపై కదలిక!
హైదరాబాద్: పాతబస్తీలో ఇక మెట్రో పరుగులు తీయనుంది. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ సన్నాహాలు చేపట్టింది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు నిర్మించనున్న 5.5 కిలోమీటర్ల మెట్రో అలైన్మెంట్ ఇంజనీరింగ్ రిఫైన్మెంట్ పనులు కొనసాగుతున్నాయని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. నిజానికి జేబీఎస్ నుంచి పాతబస్తీలోని ఫలక్‌నుమా వరకు 2012లోనే మెట్రో రైల్ ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ పాతబస్తీలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ప్రాజెక్టును ఎంజీబీఎస్ వరకు పరిమితం చేశారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజుల క్రితం పాతబస్తీ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హైదరాబాద్ మెట్రో రైల్ కార్యాచరణ చేపట్టింది. ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు అందుబాటులోకి వస్తే నగరవాసులు జేబీఎస్ నుంచి నేరుగా ఫలక్‌నుమా వరకు రాకపోకలు సాగించేందుకు అవకాశం లభిస్తుంది. అలాగే నాలుగు వందల ఏళ్ల నాటి చారిత్రాత్మక చార్మినార్ కట్టడాన్ని మెట్రో రైలులో వెళ్లి సందర్శించుకోవచ్చు. సాలార్‌జంగ్‌మ్యూజియం, ఫలక్‌నుమా ప్యాలెస్ వంటి చారిత్రక కట్టడాలనూ సందర్శించవచ్చు. నిత్యం వాహనాల రద్దీతో కిక్కిరిసిపోయే పాతబస్తీలో మెట్రో అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికులకు ఎంతో ఊరట లభిస్తుంది. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చారిత్రక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఐదు స్టేషన్లు.. ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి దారుషిఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇత్తెబార్ చౌక్, అలీజాకోట్ల, మీర్ మోమిన్ దర్గా, హరిబౌలి, శాలిబండ, షంషీర్గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్‌నుమా వరకు ఈ 5.5 కిలోమీటర్ల అలైన్మెంట్ ఉంటుంది. ఈ మెట్రో రైలు మార్గంలో 5 స్టేషన్లు రానున్నాయి. ఎంజీబీఎస్ తర్వాత సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్గంజ్, ఫలక్‌నుమా స్టేషన్లు ఉంటాయి. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్ స్టేషన్లకు మధ్య 500 మీటర్ల దూరమే ఉన్నప్పటికీ, ఈ రెండు స్టేషన్లకు నగరంలో ఉన్న చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని వాటికి ఆ పేర్లు పెట్టినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆలయాలు, మసీదుల పరిరక్షణ.... ఈ మెట్రో మార్గంలో మొత్తం 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషూర్ఖానాలు, 33 దర్గాలు, 7 శ్మశానవాటికలు మరో 6 చిల్లాలతో సహా మొత్తం 103 మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయి. కర్వేచర్ సర్దుబాటు, వయాడక్ట్ డిజైన్, ఎత్తులు, మెట్రో పిల్లర్ లొకేషన్లలో తగిన మార్పు తదితర ఇంజనీరింగ్ పరిష్కారాల ద్వారా, కేవలం 4 మినహా మిగిలిన అన్ని మతపరమైన, సున్నితమైన నిర్మాణాలను పరిరక్షించినట్లు ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ల ఆదేశాల మేరకు ఆ నాలుగు ఆదేశాల మేరకు మిగిలిన నాలుగు మతపరమైన నిర్మాణాలను కూడా కాపాడేందుకు మెట్రో అలైన్‌మెంట్‌కు ఇంజినీరింగ్ పరిష్కారాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఆ మార్గంలో రోడ్డు విస్తరణను 80 అడుగులకే పరిమితం చేయనున్నట్లు పేర్కొన్నారు. కానీ నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో మొదటి ఫేజ్ ప్రాజెక్ట్ నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా స్టేషన్ స్థానాల్లో మాత్రం రహదారిని 120 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. పాతబస్తీ మెట్రో విస్తరణలో నష్టపోయే సుమారు 1000 ఆస్తుల వ్యక్తిగత స్కెచ్‌ల తయారీ కూడా ప్రారంభమైందని, నెలరోజుల్లో భూ సేకరణకు నోటీసులు ఇవ్వనున్నట్లు ఎండీ తెలిపారు. -
కనిపించని ‘జీవా’
సాక్షి, హైదరాబాద్: బ్రాండెడ్ మంచినీటి సీసాల వినియోగంతో సాలీనా రూ.కోట్లలో అవుతున్న వ్యయాన్ని నియంత్రించడంతోపాటు అదనపు ఆదాయాన్ని పొందే ఉద్దేశంతో ఎంతో ఘనంగా ప్రారంభించిన ఆర్టీసీ సొంత నీటి బ్రాండ్ ఎక్కడా కానరావడం లేదు. జీవా బ్రాండ్‌ను ఆర్టీసీ నెలన్నర క్రితం ఎంతో అట్టహాసంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంజీబీఎస్‌లో కార్పొరేట్ పద్ధతిలో ఆ బ్రాండ్‌ను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు ఆరు నెలలు శ్రమించి రెండు సంస్థలతో ఒప్పందం చేసుకుని ఈ నీటిని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఆర్టీసీ కృషి చేసింది. కానీ ఇప్పటివరకు ఇటు బస్టాండ్లలో కాని, ఆర్టీసీ బస్సుల్లో కానీ ఎక్కడా అది కనిపించటం లేదు. ఇప్పటికీ ప్రైవేటు బ్రాండెడ్ నీటినే వినియోగిస్తున్నారు. భారీగా వ్యయం చేయటంతోపాటు ప్రసార మాధ్యమాల ద్వారా ముమ్మరంగా ప్రచారం జరిగి ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొన్న తర్వాత ఆ బ్రాండ్ కనిపించకపోవటం విశేషం. ♦ కేవలం బస్టాండ్లలోని దుకాణాల్లోనే కాకుండా క్రమంగా, మార్కెట్లోని ఇతర దుకాణాల్లో కూడా అందుబాటులోకి తెచ్చేలా చూడాలని నిర్ణయించారు. కానీ మార్కెట్లోని దుకాణాల్లో కాదు కదా కనీసం ఆర్టీసీ బస్సుల్లో కూడా అవి కనిపించడం లేదు. ఇక ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లో అధికారులకు కూడా అవి అందుబాటులో లేకుండా పోయాయి. బస్సులు, ఆర్టీసీ కార్యాలయాల్లో ప్రైవేట్ బ్రాండ్ నీళ్లే.. ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా 500 మి.లీ. వాటర్ బాటిళ్లను అందిస్తారు. ఆర్టీసీ సొంతంగా జీవా పేరుతో నీటిని మార్కెట్లోకి తీసుకురావటంతో, ఇక బస్సుల్లో అవే నీళ్లు పంపిణీ జరుగుతాయని ప్రచారం చేసింది. కానీ తాజాగా బస్సుల్లో పంపిణీకి ఓ బడా బ్రాండెడ్ నీటి సీసాలు పెద్ద ఎత్తున డిపోలకు చేరాయి. ఇంతకాలం స్థానికంగా తయారయ్యే ఓ బ్రాండ్ సీసాలు పంపిణీ జరుగుతుండగా, తాజాగా ఓ అంతర్జాతీయ కంపెనీకి చెందిన బ్రాండ్ సీసాలు డిపోలకు చేరాయి. ప్రైవేటు బ్రాండెడ్ కంపెనీ నుంచి నీటి సీసాల కొనుగోలుకు సాలీనా రూ.5 కోట్ల వరకు ఖర్చవుతున్నట్టు సమాచారం. డిమాండ్ ఉన్నా కానరావడం లేదు.. ♦ ప్రకాశం, కాంతి అన్న అర్ధంలో వినియోగించే జీవా (జెడ్‌ఐవీఏ) అన్న హిబ్రూ భాష నుంచి పుట్టిన పేరును ఖరారు చేసిన ఆర్టీసీ ఆ నీటి సీసాల డిజైన్‌లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇప్పటి వరకు ఏ కంపెనీ వినియోగించని రీతిలో డైమర్ కటింగ్స్ డిజైన్ ఉన్న సీసా ఆకృతిని ఎంపిక చేసింది. చూడగానే ఆకట్టుకునేలా ఉన్నందున, ఆర్టీసీ బ్రాండ్ తోడు కావటంతో సాధారణ ప్రజలు కూడా దాని మన్నికపై నమ్మకంతో కొనే అవకాశం ఏర్పడుతుందని దీంతో ఈ నీటి విక్రయాల ద్వారా సాలీనా రూ.20 కోట్ల ఆదాయం పొందే వీలుందని ఆర్టీసీ అంచనా వేసింది. ప్రస్తుతం వేసని ప్రారంభం కావటంతో వాటర్ బాటిళ్ల విక్రయం ఊపందుకుంది. ఆర్టీసీ ప్రయాణికులు బస్టాండ్లలో నీటి సీసాలు కొని బస్కెక్కుతున్నారు. ఇలా మంచి డిమాండ్ ఉన్న సమయంలో కూడా ఆర్టీసీ నీళ్లు కనిపించడం లేదు. తయారీ కంపెనీల నిర్వాకంతోనే.. ఎంతో గొప్పగా జీవా బ్రాండ్‌ను ప్రారంభించినప్పటికీ, ఆ నీటిని, సీసాలను రూపొందించేందుకు ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల నిర్వాకం వల్లనే సమస్యలు తలెత్తాయని సమాచారం. సీసాల ఆకృతి గొప్పగా ఉన్నప్పటికీ, వాటి నాణ్యత అత్యంత తీసికట్టుగా ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆ బ్రాండ్‌పై చెడ్డపేరు వస్తుందనే వాటి మార్కెటింగ్‌ను ఆపేసినట్టు తెలిసింది. నాణ్యమైన సీసాలు, నీళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాతనే ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. -
TSRTC: రాత్రివేళల్లోనూ శ్రీశైలం బస్సులు
సాక్షి, హైదరాబాద్: పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. శ్రీశైలం వెళ్లే భక్తులకు ఈ నెల 20 వరకు రాత్రి వేళల్లో ఎక్కడా ఆగకుండా శ్రీశైలంలో దర్శనం చేసుకునేలా వీలు కల్పించారు. ప్రస్తుతం రాత్రివేళల్లో ఘాట్ రోడ్ల వద్ద బస్సులను నిలిపి తిరిగి ఉదయం వేళల్లో ఫారెస్ట్ అధికారులు బస్సులను అనుమతించేవారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రిజినల్ రీజియన్ మేనేజర్ ఎ.శ్రీధర్ ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండ్ల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను మున్ననూర్, దోమలపెంట చెక్‌పోస్టుల వద్ద నిలపకుండా రాత్రివేళల్లోనూ ప్రయాణానికి అనుమతించాలని ఫారెస్ట్ అధికారులకు విన్నవించారు. ఇందుకు అంగీకరించిన తెలంగాణ ఫారెస్ట్ అధికారి రాకేష్ మోహన్ డోపిడియాల్ ఈ నెల 20 వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ... హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రాత్రివేళల్లో బస్సులను అనుమతించిన ఫారెస్ట్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. (క్లిక్ చేయండి: ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులు.. వచ్చేస్తున్నాయ్!) -
హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో TSRTC MD సజ్జనార్ ఆకస్మిక తనిఖీ
-
ఆర్టీసీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కేంద్రాల్లో నగదు రహిత సేవలు
సాక్షి, హైదరాబాద్: దూర ప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకునే వెసులుబాటును తెలంగాణ ఆర్టీసీ కల్పించింది. నగదు రహిత, స్పర్శ రహిత లావాదేవీలను రేతిఫైల్, జేబీఎస్, సీబీఎస్, కేపీహెచ్‌బీ కేంద్రాల్లో పొందవచ్చని ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ వి.వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా కేంద్రాలు ఉదయం 6.30 నుంచి రాత్రి 8.15 గంటల వరకు పని చేస్తాయన్నారు. క్యూఆర్ కోడ్, యూపీఐ యాప్‌ల ద్వారా స్మార్ట్ ఫోన్లతో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకుని బస్‌పాస్‌ల మొత్తాలను చెల్లించవచ్చని తెలిపారు. (చదవండి: క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు) -
గుడిమల్కాపూర్ మార్కెట్ కు చేరుకుంటుంన్న ప్రజలు, వ్యాపారాలు
-
మాస్కు పెట్టుకోకుండా అజాగ్రత్తగా వ్యవహరిస్తున్న ప్రయాణికులు
-
జేబీఎస్ టు ఎంజీబీఎస్ మెట్రో పరుగులు
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ వాసుల కలల మెట్రో రైల్‌ను జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గంలో శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ పచ్చ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. జేబీఎస్ వద్ద నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైల్లో ప్రయాణం చేశారు. సీఎం ప్రయాణించడంతో ఈ మార్గంలోని చిక్కడపల్లి మినహా ఇతర మెట్రో స్టేషన్లలో ఎక్కడా రైలును నిలపకుండా నేరుగా ఎంజీబీఎస్ వరకు నడిపారు. దీంతో 13 నిమిషాల్లోనే జర్నీ పూర్తయ్యింది. సాధారణంగా ఈ మార్గంలో మిగతా ప్రతీ స్టేషన్లో మెట్రో రైల్ నిలిపితే ప్రయాణానికి 16 నిమిషాల సమ యం పడుతుంది. ఎంజీబీఎస్ వద్ద మెట్రో దిగిన సీఎం స్టేషన్ లో ప్రయాణికులకు కల్పించిన వసతులను పరిశీలించారు. ఎల్అండ్టీ, హెచ్ ఎంఆర్ అధికారులు నగర మెట్రో ప్రాజెక్టు విశేషాలను కేసీఆర్‌కు వివరించారు. మెట్రో ప్రస్థానంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి తిలకించారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎంపీ రేవంత్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్అండ్టీ సీఈఓ ఎస్ఎన్ సుబ్రమణ్యన్, ఎల్అండ్టీ మెట్రో రైల్ ఎండీ కేవీబీ రెడ్డి, నగర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉన్నారు. నేడు ఉదయం 6–30 నుంచి అందుబాటులోకి... జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గంలో శనివారం ఉదయం 6–30 గంటల నుంచి మెట్రో సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. నిత్యం ఈ మార్గంలో సుమారు 60 వేల నుంచి లక్ష మంది వరకు జర్నీ చేసే అవకాశాలున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. కాగా, మెట్రో ప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకావడంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో జోష్ కనిపించింది. జేబీఎస్ మెట్రో స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్న నాయకులు, కార్యకర్తలు బ్యాండ్ మేళాలు, నృత్యాలతో సందడి చేశారు. చిక్కడపల్లి మెట్రో స్టేషన్ వద్ద కొన్ని నిమిషాల పాటు రైల్ నిలపడంతో కేసీఆర్‌ను చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరికి సీఎం అభివాదం చేశారు. మెట్రో విస్తరణకు ప్లాన్ సిద్ధం చేయండి... నగరం నలుమూలలా మెట్రో విస్తరణకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మెట్రోలో ప్రయాణిస్తూ ఆయన.. ఎన్వీఎస్ రెడ్డి, ఇతర అధికారులతో మాట్లాడారు. నగరవాసులకు కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ లేకుండా ప్రయాణం సాగించేందుకు, హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు మెట్రో ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. మూడు మార్గాల్లో మెట్రో పూర్తితో ఆ ఫలాలను నగరవాసులు అందిపుచ్చుకున్నారని సీఎం అన్నారు. జేబీఎస్, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లు అత్యాధునిక ఎయిర్ పోర్టుల తరహాలో కనిపిస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. టెక్నాలజీ, విజన్‌పరంగా ఢిల్లీ మెట్రో కంటే హైదరాబాద్ మెట్రో మరింత అత్యాధునికంగా ఉందన్నారు. మెట్రో రైల్లో ప్రయాణిస్తూ ఆ మార్గంలోని ప్రతి ప్రాంతాల విశిష్టతలను ముఖ్యమంత్రి గుర్తు చేసినట్లు హెచ్ఎమ్ఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. -
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో ప్రారంభించిన కేసీఆర్
-
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో ప్రారంభం
-
వైఎస్సార్ స్వప్నం సాకారమైన వేళ
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగర వాసుల మెట్రో కల సంపూర్ణమైంది. హైదరాబాద్ మహానగర కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిన మెట్రో రైలు జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గంలో పరుగులు పెట్టింది. దీంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రారంభించిన యజ్ఞం నేటితో నెరవేరింది. హైదరాబాద్ మెట్రో తొలిదశ ప్రాజెక్ట్ పూర్తయ్యింది. 2008 మే 14న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నగర మెట్రోప్రాజెక్ట్ రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. (హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డు) జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గంలో (11 కి.మీ) ముఖ్యమంత్రి కేసీఆర్ చేతలు మీదగా మెట్రో రైళ్లు శుక్రవారం లాంఛనంగా ప్రారంభం అయ్యాయి. సాయంత్రం 4 గంటలకు జేబీఎస్ వద్ద ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మార్గం పూర్తితో గ్రేటర్ నగరంలో 69 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చింది. ఈ మెట్రో రైలు మార్గంలో జేబీఎస్-పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ వెస్ట్, న్యూ గాంధీ హాస్పటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లు ఉంటాయి. ఈ మార్గంలో ఒక చివర నుంచి మరో చివరకు చేరుకునేందుకు 16 నిమిషాలు పట్టనుంది. కాగా ఎల్బీనగర్– మియాపూర్, నాగోల్–రాయదుర్గం మార్గాల్లో నిత్యం 4 లక్షలమంది రాకపోకలు సాగిస్తున్నారు. (హైదరాబాద్ మెట్రోలో ‘గరుడ వేగ’ సర్వీసులు!) -
వైఎస్సార్ స్వప్నం సాకారమైన వేళ
-
కొత్త రూట్లో మెట్రో కూత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు మరో కొత్త రూట్లో పరుగులు తీయడానికి సిద్ధమైంది. జేబీఎస్– ఎంజీబీఎస్ రూట్లో ఇది ప్రయాణికులకు అందుబా టులోకి రానుంది. 7వ తేదీన సాయంత్రం 4 గంటలకు జేబీఎస్ వద్ద జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ జెండా ఊపి ఈ మూడవ మెట్రో రైలు కారిడార్‌ను ప్రారంభిస్తారు. హైదరాబాద్ –సికింద్రాబాద్ జంటనగరాలను అనుసంధానించే ఈ మార్గాన్ని.. మెట్రో అధికారులు వ్యయ ప్రయాసలకోర్చి పూర్తి చేశారు. తొలుత సంక్రాం తి నాటికి ప్రారంభించేందుకు ప్రయత్నించినా, మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైంది. ఈ మార్గం అందుబాటులోకి రానుండటంతో నగరంలో తొలి దశ మెట్రో ప్రాజెక్టు సంపూర్ణమైంది. ప్రస్తుతం ఎల్బీ నగర్–మియాపూర్ రూటులో 29 కి.మీ., నాగోలు– రాయదుర్గం రూటులో 29 కి.మీ. మేర మెట్రో మార్గం అందుబాటులో ఉంది. ఈ రూట్లలో నిత్యం 3.8 లక్షల నుంచి 4 లక్షల మంది రాకపోకలు సాగి స్తున్నారు. 7న ప్రారంభమయ్యే నూతన మార్గం తో కలిపి 3 కారిడార్ల పరిధిలో 69 కి.మీ. మేర నగరంలో మెట్రో రైలు అందుబాటులోకి వస్తుం ది. ఢిల్లీ తర్వాత అత్యంత నిడివి గల మెట్రో మార్గమున్న నగరంగా హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టిన మొదటి, అతి పెద్ద మెట్రో ప్రాజెక్టు మనదే కావడం విశేషం. పాతనగరానికి మరింత ఆలస్యం.. జేబీఎస్–ఎంజీబీఎస్.. ఈ రెండు బస్సుస్టేషన్లకు పొరుగు రాష్ట్రాలు, దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు నగరంలో ఒకచోటు నుంచి మరోచోటుకు ప్రయాణించేందుకు ఈ మెట్రో మార్గం వీలు కల్పిస్తుంది. కొత్త మార్గం లో 45 రోజుల పాటు మెట్రో రైళ్లకు 18 రకాల సామర్థ్య పరీక్షలు విజయవంతంగా నిర్వహిం చారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి కమిషనర్ ఆఫ్ రైల్వేసేఫ్టీ ధ్రువీకరణ సైతం లభించింది. కాగా, ఈ మార్గాన్ని పాతనగరంలోని ఫలక్‌నుమా వరకు పొడిగించాలని తొలుత నిర్ణయించారు. సుల్తాన్‌బజార్‌లో ఆస్తుల సేకరణ, అలైన్మెం ట్ చిక్కులతో ప్రాజెక్టు ఆలస్యమైంది. ఆస్తులు కోల్పోయిన బాధితులకు మెరుగైన పరిహారం అందించడంతో పాటు వాణిజ్య కాంప్లెక్స్‌లో వారి వ్యాపార సముదాయాలకు చోటుకల్పించడంతో ఎట్టకేలకు మార్గం సుగమమైం ది. ఈ కారిడార్‌ను పాతనగరం వరకు విస్తరించే ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ►3వ కారిడార్ స్వరూపం ►11 కి.మీ. జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గం నిడివి ►9 ఈ రూట్లో గల స్టేషన్లు ►18 ని‘‘ప్రయాణ సమయం ►1,00,000 రోజువారీ ప్రయాణికుల సంఖ్య (అంచనా) -
నగర వాసులకు మరో శుభవార్త
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తి స్థాయిలో నగర వాసులకు అందుబాటులోకి రానుంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గాన్ని ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిచనున్నారు. ఈ మేరకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జెబీఎస్ నుంచి ఎమ్‌జీబీఎస్‌కు రోడ్డు మార్గం ద్వారా వెల్లాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ సమస్య కారణంగా ఈ మార్గంలో ప్రయాణం దాదాపుగా 40 నిమిషాలకు పైగా సమయం పడుతుంది. అదే మెట్రో రైల్లో అందుబాటులోకి వస్తే.. కేవలం 15నిమిషాల్లోన్నే గమ్యాన్ని చేరుకోవచ్చు. దీంతో ప్రయాణికుల ట్రాఫిక్ సమస్య ఇక తీరనుంది. కాగా ఈ మార్గం పూర్తవడంతో నగరంలో మొత్తం 69 కిలోమీటర్ల మెట్రోరైల్ నగరవాసులకు అందుబాటులోకి రానుంది. మొత్తం 72 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ నగరంలో ఏర్పాటు చేయాలనుకున్నా, ఎమ్జీబీఎస్ నుంచి ఫలక్నామ నిర్మాణ దశలోనే ఆగిపోయింది. ఆ 5 కిలోమీటర్ల మినహాయిస్తే హైదరాబాద్‌లో మెట్రోరైల్ నిర్మాణం మొత్తం పూర్తయినట్లే చెప్పాలి. -
అందుబాటులోకి రానున్న మెట్రో కారిడార్–2
సాక్షి, సిటీబ్యూరో : సికింద్రాబాద్, హైదరాబాద్ మధ్య మెట్రో బంధం వేయనుంది. పాత నగరాన్ని కొత్త నగరంతో అనుసంధానం చేసే మణిహారంగా జేబీఎస్–ఫలక్‌నుమా కారిడార్ నిలిచిపోనుంది. ఈ మెట్రో–2 కారిడార్‌లో భాగంగా జేబీఎస్–ఎంజీబీఎస్ వరకు సోమవారం ట్రయల్ రన్ ప్రారంభమైంది. హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి నేతృత్వంలో సాంకేతిక బృందం, హెచ్ఎంఆర్ఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.నాయుడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఏకే సాయిని ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా కారిడార్‌లో సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. ఈ రెండింటి మధ్య 11 కిలోమీటర్ల మార్గంలో 9 స్టేషన్లు ఉన్నాయి. జేబీఎస్–పరేడ్‌గ్రౌండ్స్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌బజార్, ఎంజీబీఎస్ వరకు 16 నిమిషాల సమయం పట్టనున్నట్లు అధికారులు అంచనా వేశారు. సాధారణంగా అయితే ఈ రూట్లో రోడ్డు మార్గంలో 45 నిమిషాల వరకు సమయం పడుతుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మరికొన్ని వారాల పాటు ట్రయల్ రన్ నిర్వహించి.. ఆ తర్వాత ప్రయాణికుల రాకపోకలకు అనుమతినిస్తారు. ట్రయల్ రన్లో భాగంగా సాంకేతిక సమర్థత, రైళ్ల నిర్వహణ, సమయపాలన, సిగ్నలింగ్ వ్యవస్థ పనితీరు, బ్రేక్ టెస్ట్, ట్రైన్ కంట్రోల్ సిస్టమ్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్, రైళ్ల రాకపోకల అనౌన్స్మెంట్ తదితర అంశాలను పరిశీలిస్తారు. ప్రయాణికులకు ఊరట... కరీంనగర్, సిద్దిపేట, మెదక్, గజ్వేల్ తదితర ప్రాంతాల నుంచి జేబీఎస్‌కు వచ్చే ప్రయాణికులు మెట్రో మార్గంలో నేరుగా ఎంజీబీఎస్‌కు చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రతిరోజు వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే రైల్వేస్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా మెట్రో ఎంతో సౌకర్యంగా ఉండనుంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ నుంచి సుల్తాన్‌బజార్ వరకు వాహనాల రాకపోకలతో ప్రతినిత్యం ఎంతో రద్దీగా ఉంటుంది. మెట్రో రాక వల్ల ప్రయాణికులకు ఈ మార్గంలో ఊరట లభించనుంది. కోఠీకి కొత్త కళ... నిజాం కాలం నుంచి అతిపెద్ద వ్యాపార, వాణిజ్య కేంద్రంగా కొనసాగుతున్న అబిడ్స్, కోఠీ, సుల్తాన్‌బజార్ ప్రాంతాలు మెట్రోరైలు రాకతో సరికొత్త కళను సంతరించుకోనున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు మెట్రో రైలులో సుల్తాన్‌బజార్‌కు చేరుకునేందుకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఈ రూట్లో సిటీ బస్సులు మాత్రమే ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి కోఠీ వరకు ప్రతి 30 నిమిషాలకు ఒకటి చొప్పున బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. మెట్రో అందుబాటులోకి వస్తే ఈ రూట్లో నడిచే సిటీ బస్సులపై పెద్ద ఎత్తున ప్రభావం పడనుంది. ఇప్పటికే ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో సిటీ బస్సులు ఆదరణ కోల్పోయాయి. నాగోల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా అమీర్‌పేట్ వరకు రాకపోకలు సాగించే బస్సుల్లోనూ ఆక్యుపెన్సీ తగ్గింది. ఈ రెండు ప్రధాన మార్గాల్లో ఆర్టీసీ ఏసీ బస్సులను చాలా వరకు తగ్గించింది. తాజాగా జేబీఎస్ నుంచి సికింద్రాబాద్ మీదుగా ఎంజీబీఎస్ వరకు కొత్త లైన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఈ మార్గంలో నడిచే బస్సుల్లోనూ ఆక్యుపెన్సీ తగ్గే అవకాశం ఉంది. మరోవైపు హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు 1.05 కిలోమీటర్ల మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకలను ఈ నెల 29న ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగోల్–అమీర్‌పేట్, ఎల్బీనగర్–మియాపూర్ మార్గాల్లో 3.5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రెండు రూట్లలో ప్రయాణికులకు మెట్రో సదుపాయం అందుబాటులోకి వస్తే మరో 2లక్షల మందికి పైగా అదనంగా రాకపోకలు సాగించే అవకాశం ఉంది. -
మానవ హారాలు..మహిళా కార్మికుల నిరసనలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా మండల, తాలూకా, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో మానవ హారాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎంజీబీఎస్, సిటీ పరిధిలోని బస్ డిపోల వద్ద మహిళా కండక్టర్లతో నిరసనలు చేపట్టి డిమాండ్లు పరిష్కరించి విధుల్లో చేర్చుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటంతో పాటు సమ్మెలో భాగంగా మృతి చెందిన కార్మికులకు నివాళులర్పించారు. కాగా, ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 6,141 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఇందులో ఆర్టీసీ బస్సులు 4,260, అద్దె బస్సులు 1,881 ఉన్నట్లు తెలిపింది. ప్రజారవాణా ఏర్పాట్లలో ప్రయాణికుల సేవలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొంది. 6,058 బస్సుల్లో టిమ్‌ల ద్వారా టికెట్లు ఇవ్వగా ,63 బస్సుల్లో మాన్యువల్ పద్ధతిలో టికెట్లు జారీ చేసినట్లు చెప్పింది. -
ఎంతమంది ఉద్యోగాలు తీసేస్తారో చూస్తాం...
సాక్షి, హైదరాబాద్ : సమ్మెపై తెలంగాణ కార్మిక సంఘాలు పట్టు వీడటం లేదు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకూ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు శనివారం ఎంజీబీఎస్‌లో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేసీఏ నేత అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించాలని అన్నారు. తమతో ప్రభుత్వం చర్చలు జరిపితేనే సమ్మెపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఎస్మాకు భయపడేది లేదని, ఎంతమంది ఉద్యోగాలు తీసేస్తారో చూస్తామని అన్నారు. ప్రభుత్వం బెదిరింపులకు కార్మికులు భయపడవద్దని అశ్వత్థామరెడ్డి కోరారు. ఆర్టీసీ ఈయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మాట్లాడుతూ.. సకల జనుల సమ్మె కన్నా ఎక్కువగా తాము పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ప్రయివేట్ సిబ్బందితో బస్సులు నడిపించాలన్న ప్రభుత్వ నిర్ణయం సరికాదని మండిపడ్డారు. బంగారు తెలంగాణ ఒక్క కేసీఆర్ కుటుంబానికి మాత్రమే పరిమితం అయిందని విమర్శించారు. బతుకు తెలంగాణ కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఉద్యమానికి ప్రజలు సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళనలో ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, థామస్ రెడ్డి, తిరుపతి, వీఎస్‌రావు, ఇతర నేతలు పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు చేపట్టారు. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆందోళన చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు రాజేంద్రనగర్ బస్ డిపో ఎదుట ఆందోళన చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు -
ఒక్క బస్సు... చుట్టుముట్టేశారు...
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం 57వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో అన్ని జిల్లాల్లోనూ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2వేల స్పెషల్ బస్సులతో పాటు 10,395 బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు బస్సులు లేకపోవడంతో వెలవెలబోతున్నాయి. అయితే తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపేందుకు అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా జూబ్లీ బస్టాండ్‌లోకి ఓ బస్సు రావడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న ప్రయాణికులు... బస్సు ఎక్కేందుకు పోటీ పడ్డారు. ఉదయం నుంచే బస్సు కోసం వేచి చూస్తున్నామని, వచ్చిన ఒక్క బస్సులో అయినా కాస్త జాగా దొరికితే చాలునుకుంటూ లగేజీ పట్టుకుని పరుగులు పెట్టారు. అలాగే హైదరాబాద్‌లో ఒక్క ఆర్టీసీ బస్సు కూడా రోడ్డెక్కలేదు. సెట్విన్ బస్సులు మాత్రం యథాతథంగా నడుస్తున్నాయి. మరోవైపు జిల్లాల్లో కూడా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో దసరా పండుగక సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు బస్టాండ్లలో పడిగాపులు పడుతున్నారు. సందట్లో సడేమియా అన్నట్లుగా ప్రయివేట్ వాహనదారులు, ఆటోవాలాలు అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ గత్యంతరం లేని పరిస్థితుల్లో అధిక మొత్తం చెల్లించి ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. పలు జిల్లాల్లో పోలీసుల భద్రత నడుమ ఆర్టీసీ బస్సులను... కాంట్రాక్ట్ సిబ్బందితో నడిపిస్తున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులు ...అడ్డుకునేందుకు ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఏపీ, కర్ణాటక నుంచి బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. చదవండి: ఆర్టీసీ సమ్మె: మా టికెట్ రిజర్వేషన్ల సంగతేంటి? -
ఇద్దరు జీహెచ్ఎంసీ ఉద్యోగులు మృతి
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎంజీబీఎస్ కేంద్రంలో చెత్త తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు ఉద్యోగులు మంగళవారం మృతి చెందారు. జీహెచ్ఎంసీ ప్రభుత్వ ఉద్యోగి హెల్పర్ ఆరీఫ్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి హాజిఖాన్.. విధుల్లో ఉండగా భారీ వాహనం ఒక్కసారిగా వెనుకకు రావడంతో ఈ ఘటన సంభవించింది. ఈ దుర్ఘటనపై మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దానకిషోర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చిన మేయర్.. ప్రభుత్వ ఉద్యోగి ఆరీఫ్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని వెల్లడించారు. అంతేగాక ఇరు కుటుంబాలకు పింఛను సదుపాయం కల్పిస్తామని మేయర్ భరోసానిచ్చారు. -
కిడ్నాప్ కథ సుఖాంతం
హైదరాబాద్: యువతి కిడ్నాప్ కథ ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. వారం క్రితం కిడ్నాపునకు గురైన బీ ఫార్మసీ విద్యార్థిని సోనీ సురక్షితంగా నగరానికి చేరడంతో ఉత్కంఠకు తెరపడింది. ఈ నెల 23న రాత్రి యువతి అపహరణకు గురైనప్పటి నుంచి పలు మలుపులు తిరుగుతూ వచ్చిన కిడ్నా ప్ కథ మంగళవారం ఉదయం సోనీ నగరానికి వచ్చిందని తెలి యడంతో పోలీసులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నా రు. ఇబ్రహీంపట్నం సమీపం లోని బొంగుళూరు గేటు వద్ద టీ స్టాల్ నడిపే ఎలిమినేటి యాదగిరి కూతురు సోనీ(22)కి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి 23న రవిశేఖర్ కారులో ఎక్కించుకుని హయత్‌నగర్ వరకు తీసుకొచ్చి రాత్రి 8:30 గంటల సమయంలో కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అప్పటి నుంచి నిందితుని కోసం గాలిస్తున్నారు. నిందితుడు వాడిన కారు నంబర్ నకిలీదని తెలిసి కంగుతిన్నారు. అతని ఆచూకీ కోసం ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఆధ్వర్యంలో గురువారం నుంచి ఐదు ప్రత్యేక బృందాలు వేట సాగిస్తున్నా యి. 3 రోజులు గడిచినా ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు, కుటుంబ సభ్యు ల్లో ఆందోళన పెరిగింది. చివరకు నిందితుడిని రవిశేఖర్‌గా గుర్తించిన పోలీసులు అతను ఆ కారును బళ్లారి నుంచి దొంగిలించినట్లుగా కనుగొన్నారు. రోజులు గడుస్తున్నా నిందితుడు చిక్కకపోవడంతో పోలీసులు అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతిని ప్రకటించారు. ఏం జరిగిందో ఏమో కానీ మంగళవారం ఉదయం సోనీ నగరానికి చేరుకుంది. మీడియా కంట పడకుండా... ఎంజీబీఎస్‌లో బస్సు దిగిన వెంటనే సోనీ తల్లిదండ్రులకు ఫోన్ చేయగా వారు పోలీ సులకు సమాచారం ఇచ్చారు. వారు సోనీ ని సరూర్‌నగర్ మహిళా పోలీస్టేషన్‌కు తరలించి, అక్కడి నుంచి ఎల్బీనగర్ సీసీఎస్ కార్యాలయానికి తీసుకెళ్లారు. మంగళవారం మొత్తం సోనీ మీడియా కంట పడకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు. నిందితుడు రవిశేఖర్ పోలీసుల అదుపులో ఉన్నాడని ప్రచారం జరుగుతున్నా అధికారులు ధృవీకరించడంలేదు. ఈ కిడ్నాప్ ఘటనపై రాచకొండ పోలీసులు సోనీని, రవిశేఖర్‌ను విచారిస్తున్నట్లు తెలిసింది. వైద్య పరీక్షల నిమిత్తం సోనీని వైద్య పరీక్షల నిమిత్తం పేట్ల బురుజులోని మెటర్నిటీ ఆస్పత్రికి తరలించి నట్లు సమాచారం. నిందితుడు బళ్లారిలో దొంగిలించిన కారుకు ఉన్న జీపీఆర్ఎస్తో పోలీసులు కారు కదలికలను కనుగొన్నారు. కర్నూలు, తిరుపతిలో అతని కదలికలు గుర్తించారు. చివరికి అద్దంకి, ఒంగోలులో పట్టుకున్నట్లు సమాచారం. -
మార్వలెస్.. మెట్రో స్టేషన్
సాక్షి, సిటీబ్యూరో: మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు సమీపంలో నిర్మించిన మెట్రోస్టేషన్ ఆసియాలోనే అతిపెద్ద స్టేషన్ కావడం విశేషం. ఈ భారీ స్టేషన్ నగరవాసులకు సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఎల్బీనగర్–మియాపూర్(కారిడార్–1)మార్గంతోపాటు కారిడార్–2(జేబీఎస్–ఫలక్‌నుమా)మార్గాన్ని సైతం అనుసంధానించేలా నాలుగు అంతస్తుల భారీ స్టేషన్‌ను ఇక్కడ నిర్మించడం ఇంజినీరింగ్ అద్భుతమని హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. సోమవారం నుంచి ఎల్బీనగర్–అమీర్పేట్రూట్లో మెట్రో రాకపోకలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ స్టేషన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ స్టేషన్‌కు 58 ప్రధాన పిల్లర్లు, ఆరుగ్రిడ్లతో నిర్మించారు. ఈ స్టేషన్ నిర్మాణానికి అత్యంత ఒత్తిడిని తట్టుకునే స్టీలు, రీయిన్‌ఫోర్స్‌డ్ సిమెంట్ కాంక్రీటును వినియోగించినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఈస్టేషన్‌కు ఇరువైపులా ఉన్న ఎంజీబీఎస్, చాదర్‌ఘాట్ పరిసరాలను సుందరీకరించామన్నారు. కబుల్స్టోన్స్, తాండూర్, షాబాద్ రాళ్లతో పరిసరాలను తీర్చిదిద్దామన్నారు. అసెంబ్లీ–ఎంజీబీఎస్ మార్గంలో 5 కి.మీ మెట్రో మార్గంలో చారిత్రక,వారసత్వ కట్టడాలున్నందున వాటి ప్రత్యేకతను చాటేలా పరిసరాలను తీర్చిదిద్దామన్నారు. ఈ మార్గంలో ప్రధానంగా నాంపల్లి, ఎంజేమార్కెట్, జాంభాగ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, రంగమహల్ ప్రాంతాలున్నాయన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్, రంగమహల్ ప్రాంతాల్లో అత్యధిక ఎత్తులో ఉన్న పిల్లర్లతో నిర్మిచినట్లు తెలిపారు. ఈ పిల్లర్లు, స్టేషన్ల నిర్మాణం ఎన్నో ఇంజినీరింగ్ అద్భుతాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఆయా స్టేషన్లను వారసత్వ కట్టడాలను తలపించేలా తీర్చిదిద్దుతామని..పర్యాటకులను ఆకర్షించే స్థాయిలో సుందరీకరిస్తామని తెలిపారు. ఈ మార్గంలో తీరైన స్ట్రీట్‌ఫర్నీచర్, చూపరులను కట్టిపడేసేలా ఉండే తీరైన ఫుట్‌పాత్‌లు,హరిత వాతావరణంతో తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు.