పాతబస్తీ మెట్రో మార్గంపై డ్రోన్‌ సర్వే | Drone survey commences for old city Metro works - Sakshi
Sakshi News home page

పాతబస్తీ మెట్రో మార్గంపై డ్రోన్‌ సర్వే

Aug 28 2023 8:30 AM | Updated on Aug 28 2023 2:53 PM

Telangana Hyderabad Drone survey commences for old city Metro works - Sakshi

హైదరాబాద్: పాతబస్తీ మెట్రో పనులను హైదరాబాద్‌ మెట్రో రైల్‌ వేగవంతం చేసింది. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల మార్గంలోని ఆధ్యాత్మిక స్థలాల పరిరక్షణ కోసం ఆదివారం డ్రోన్‌ సర్వే చేపట్టింది. మెట్రో అలైన్‌మెంట్‌లో  భాగంగా పలు చోట్ల రోడ్డు  విస్తరణ చేపట్టవలసి ఉంటుంది. ఈ క్రమంలో మసీదులు, ఆలయాలు, తదితర కట్టడాలకు ఎలాంటి విఘాతం కలగకుండా పిల్లర్స్‌ నిరి్మంచేందుకు హైదరాబాద్‌ మెట్రోరైల్‌ అధికారులు సాధారణ సర్వేతో పాటు, ఈ డ్రోన్‌ సర్వేను  ప్రారంభించారు. డ్రోన్‌ నుంచి సేకరించిన హై రెజల్యూషన్‌ చిత్రాలు, రియల్‌ టైమ్‌ డేటా, 3డీ మోడలింగ్, జియోగ్రాఫిక్‌ ఇన్‌ఫర్మేషన్‌ ద్వారా ఆయా కట్టడాల కొలతలను కచి్చతంగా అంచనా వేయనున్నారు. 

దారుల్‌ఫా జంక్షన్‌ నుంచి షాలిబండ జంక్షన్‌ వరకు ఉన్న 103 కట్టడాల పరిరక్షణ కోసం ఈ డ్రోన్‌ సర్వే దోహదం చేయనుందని హెచ్‌ఎంఆర్‌ఎల్‌  ఎండీ ఎనీ్వఎస్‌ రెడ్డి తెలిపారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు నిరి్మంచనున్న 5.5 కిలోమీటర్ల మెట్రో అలైన్‌మెంట్‌ ఇంజనీరింగ్‌ రిఫైన్‌మెంట్‌ పనులు కొనసాగుతున్నాయని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎనీ్వఎస్‌రెడ్డి తెలిపారు. ఈ మార్గంలో మొత్తం 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషూర్ఖానాలు, 33 దర్గాలు, 7 శ్మశానవాటికలు మరో 6 చిల్లాలతో సహా మొత్తం 103 మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయి.

 కర్వేచర్‌ సర్దుబాటు, వయాడక్ట్‌ డిజైన్,ఎత్తులు, మెట్రో పిల్లర్‌ లొకేషన్‌లలో తగిన మార్పులు,తదితర ఇంజనీరింగ్‌ పరిష్కారాల కోసం  డ్రోన్‌  సర్వే ద్వారా సేకరించిన డేటా ఉపయోగపడనుంది. మతపరమైన/సున్నితమైన నిర్మాణాలను కాపాడేందుకు  రోడ్డు విస్తరణను కూడా 80 అడుగులకే పరిమితం చేయనున్నారు.నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో మొదటి ఫేజ్‌ ప్రాజెక్ట్‌ నుంచి  పాఠాలు నేర్చుకోవడం ద్వారా స్టేషన్‌ స్థానాల్లో మాత్రం రహదారిని 120 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు.  

త్వరలో భూసామర్ధ్య పరీక్షలు.... 
ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల పాతబస్తీ మెట్రో మార్గంలో త్వరలో  భూసామర్ధ్య పరీక్షలు  ప్రారంభించనున్నట్లు ఎనీ్వఎస్‌ రెడ్డి తెలిపారు. ఫలక్‌నుమా నుంచి  ఈ  పరీక్షలను  ప్రారంభించనున్నారు. నిజానికి జేబీఎస్‌ నుంచి పాతబస్తీలోని ఫలక్‌నుమా వరకు 2012లోనే  మెట్రో రైల్‌  ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ పాతబస్తీలోని వివిధ  ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున  అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ప్రాజెక్టును ఎంజీబీఎస్‌ వరకు పరిమితం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొద్ది రోజుల క్రితం పాతబస్తీ మెట్రోకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఈ మార్గంలో పనులను ప్రారంభించింది. 

ఫలక్‌నుమా వరకు  మెట్రో రైలు అందుబాటులోకి వస్తే నగరవాసులు జేబీఎస్‌ నుంచి నేరుగా ఫలక్‌నుమా  వరకు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే నాలుగు వందల ఏళ్ల నాటి చారిత్రాత్మక చారి్మనార్‌ కట్టడాన్ని మెట్రో రైల్‌లో వెళ్లి సందర్శించుకోవచ్చు. సాలార్‌జంగ్‌ మ్యూజియం, ఫలక్‌నుమా ప్యాలెస్‌ వంటి చారిత్రక కట్టడాలను సందర్శించవచ్చు. నిత్యం వాహనాల రద్దీతో కిక్కిరిసిపోయే పాతబస్తీలో  మెట్రో అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికులకు ఎంతో ఊరట లభించనుంది. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చారిత్రక ప్రదేశాలను సందర్శించవచ్చు. 

ఐదు స్టేషన్‌లు... 
ప్రస్తుతం  జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మెట్రో రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే.అక్కడి నుంచి దారుíÙఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇత్తెబార్‌ చౌక్, అలీజాకోట్ల, మీర్‌ మోమిన్‌ దర్గా, హరిబౌలి, శాలిబండ, షంషీర్‌గంజ్, అలియాబాద్‌ మీదుగా ఫలక్‌నుమా వరకు ఈ 5.5 కిలోమీటర్ల అలైన్‌మెంట్‌ ఉంటుంది. ఈ మెట్రో రైల్‌ మార్గంలో 5 స్టేషన్లు రానున్నాయి.ఎంజీబీఎస్‌ తర్వాత సాలార్‌జంగ్‌ మ్యూజియం, చారి్మనార్, శాలిబండ, షంషీర్‌గంజ్, ఫలక్‌నుమా స్టేషన్‌లు ఉంటాయి. సాలార్‌జంగ్‌ మ్యూజియం, చారి్మనార్‌ స్టేషన్‌లకు మధ్య 500 మీటర్ల దూరమే ఉన్నప్పటికీ, ఈ రెండు స్టేషన్‌లకు నగరంలో ఉన్న చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని వాటికి ఆ పేర్లు పెట్టినట్లు ఎనీ్వఎస్‌ రెడ్డి తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement