హైదరాబాద్: రెండ్రోజుల క్రితం చాదర్‌ఘాట్ మెట్రోస్టేషన్ పార్కింగ్ స్థలంలో నిలిపిన వాహనాలు దగ్ధం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మహా రాష్ట్రకు చెందిన జాకీర్ మహ్మద్ (32) ఎనిదేళ్ల క్రితం నగరానికి వచ్చి కూలీ పనులు చేస్తున్నాడు. మద్యానికి అలవాటు పడి ఫుట్‌పాత్‌లపైనే నిద్రిస్తున్నాడు. తాను నిద్రించడానికి పార్కింగ్ వాహనాలు ఇబ్బందిగా మారాయని వాటికి నిప్పంటించాడు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఆదివారం అక్బర్‌బాగ్ వద్ద అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
మెట్రో స్టేషన్.. మెరిసెన్..
ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలను హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఘనంగా నిర్వహిస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహ నమూనా చిత్రాన్ని రద్దీ ఎక్కువగా ఉండే మెట్రో స్టేషన్లలో ప్రదర్శిస్తున్నారు. ‘జయ జయహే తెలంగాణ.. జననీ జయ కేతనం’ అంటూ తెలంగాణ స్ఫూర్తిని అంది పుచ్చుకుంటూ హైదరాబాద్‌లోని మొత్తం 25 మెట్రో స్టేషన్లలో కొత్తగా రూపొందించిన ‘తెలంగాణ తల్లి’ చిత్రాలను ఏర్పాటు చేసినట్లు హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
ప్రజాపాలన విజయోత్సవాలను హైదరాబాద్ మెట్రో స్టేషన్ల పరిధిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందమైన విద్యుద్దీపాల అలంకరణతో ప్రధానం మెట్రో మార్గాలు నగరవాసులను విశేషంగా అలరిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment