Chadarghat
-
నిద్రించడానికి స్థలం లేదని వాహనాలకు నిప్పంటించాడు
హైదరాబాద్: రెండ్రోజుల క్రితం చాదర్‌ఘాట్ మెట్రోస్టేషన్ పార్కింగ్ స్థలంలో నిలిపిన వాహనాలు దగ్ధం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మహా రాష్ట్రకు చెందిన జాకీర్ మహ్మద్ (32) ఎనిదేళ్ల క్రితం నగరానికి వచ్చి కూలీ పనులు చేస్తున్నాడు. మద్యానికి అలవాటు పడి ఫుట్‌పాత్‌లపైనే నిద్రిస్తున్నాడు. తాను నిద్రించడానికి పార్కింగ్ వాహనాలు ఇబ్బందిగా మారాయని వాటికి నిప్పంటించాడు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఆదివారం అక్బర్‌బాగ్ వద్ద అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మెట్రో స్టేషన్.. మెరిసెన్..ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలను హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఘనంగా నిర్వహిస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహ నమూనా చిత్రాన్ని రద్దీ ఎక్కువగా ఉండే మెట్రో స్టేషన్లలో ప్రదర్శిస్తున్నారు. ‘జయ జయహే తెలంగాణ.. జననీ జయ కేతనం’ అంటూ తెలంగాణ స్ఫూర్తిని అంది పుచ్చుకుంటూ హైదరాబాద్‌లోని మొత్తం 25 మెట్రో స్టేషన్లలో కొత్తగా రూపొందించిన ‘తెలంగాణ తల్లి’ చిత్రాలను ఏర్పాటు చేసినట్లు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాలను హైదరాబాద్ మెట్రో స్టేషన్ల పరిధిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందమైన విద్యుద్దీపాల అలంకరణతో ప్రధానం మెట్రో మార్గాలు నగరవాసులను విశేషంగా అలరిస్తున్నాయి. -
వరద నీటిలో మునిగిన మూసారంబాగ్ బ్రిడ్డి
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో మూసి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో, హైదరాబాద్‌లోని మూసారంబాగ్ బ్రిడ్డి వరద నీటిలో మునిగిపోయింది. ఇక, చాదర్‌ఘాట్‌లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరి కాలనీలు నీటమునిగాయి. #HYDTPinfo Commuters, please make a note that due to the overflow of the Musi River on Jiyaguda 100ft road, the route is temporarily closed and traffic is diverted. @JtCPTrfHyd pic.twitter.com/nPofNIOVx8 — Hyderabad Traffic Police (@HYDTP) July 26, 2022 ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో, వాహనదారులను అలర్ట్ చేస్తూ వేరే రూట్స్‌లో వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉండగా.. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ 12 గేట్లు, ఉస్మాన్ సాగర్ 8 గేట్లు ఎత్తారు. ఈ క్రమంలో మూసీలోకి వరద పోటెత్తింది. హియామత్ సాగర్ ORR సర్వీస్ రోడ్డు బ్రిడ్జి మధ్యలో చిక్కుకున్న యువకుడిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు. ప్రవహిస్తున్న వాగుల నుండి వాహనాలు తీసుకెళ్లడం, నడుచుకుంటూ దాటకండి. pic.twitter.com/e3NCPyVvUT — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) July 26, 2022 ఇది కూడా చదవండి: వానల ఎఫెక్ట్: తెలంగాణలోని ఆ జిల్లాలో స్కూల్స్ బంద్ -
HYD: పాతబస్తీలో దారుణం.. ఆసుపత్రిలో డ్యాన్స్‌లతో హంగామా
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చాదర్‌ఘాట్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గానా బజానా, బాణాసంచాలో సిబ్బంది హంగామా చేశారు. వచ్చే నెలలో డాక్టర్ కూతురు వివాహం ఉండటంతో ముందస్తుగానే ఆసుపత్రి బిల్డింగ్‌పై పార్టీ చేసుకున్నారు. డీజేలతో డ్యాన్స్‌లు చేస్తూ ఆసుపత్రి సిబ్బంది వేడుకల్లో మునిగిపోయారు. ఈ సమయంలో పురిటి నొప్పులతో ఓ గర్భిణి ఆసుపత్రిలో చేరింది. మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసినా.. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదు. పార్టీలో లీనమై ఎంజాయ్ చేశారు.ఈ క్రమంలో శిశువు మృతిచెందింది. తల్లి ఆరోగ్యం కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు.. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ముందు నిరసనలకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. మృతి చెందిన శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. సదరు ఆసుపత్రిపై కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: ఆమ్నేషియా పబ్ కేసులో మరో ట్విస్ట్.. -
కి‘లేడీ’ల హల్చల్: వృద్ధులను కత్తితో బెదిరించి భారీ దోపిడీ
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు మహిళలు దోపిడీకి పాల్పడ్డారు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని కత్తితో బెదిరించి రూ.6 లక్షల నగదుతో ఉడాయించారు. ఈ సంఘటన హైదరాబాద్ చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ యువతుల దాడిలో వృద్ధురాలు గాయపడింది. వెంటనే సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే వచ్చి పరామర్శించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉస్మాన్‌పురాలో ఇద్దరు మహిళలు బురఖాలో వచ్చి వృద్ధురాలి (85)ని గొంతుపై కత్తి పెట్టి బెదిరించారు. నగదు, నగలు కావాలని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆమె ప్రాణభయంతో గజగజ వణికింది. అనంతరం ఆ యువతులు బెదిరించి ఆమె నుంచి రూ.6 లక్షల నగదుతో పాటు ఒంటిపై ఉన్న బంగారు నగలు దోచుకుని పరారయ్యారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించారు. అయితే ఆ సమయంలో ఆమె భర్త ఇంట్లోనే ఉన్నారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే అహ్మద్ బలాల వృద్ధ దంపతులను పరామర్శించారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పెళ్లింట విషాదం.. తమ్ముడి పెళ్లికొచ్చి ఎన్నారై కరోనాకు బలి చదవండి: 577 మంది టీచర్లు కరోనాకు బలి ఈ వృద్ధ దంపతులను బెదిరించిన యువతులు -
చాదర్‌ఘాట్ వద్ద మూసీ నది ఉధృతి
-
చాదర్‌ఘట్‌లో నీట మునిగిన కాలనీలు
-
ఈసారైనా పట్టాలెక్కేనా?
సాక్షి, సిటీబ్యూరో: సుదీర్ఘ కాలంగా ప్రతిపాదనల రూపంలో పెండింగ్‌లో ఉండిపోయిన మలక్‌పేట రైల్ అండర్ బ్రిడ్జ్‌కి (ఆర్యూబీ) మోక్షం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) కింద మరికొన్న పనులతో పాటు దీన్నీ చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దీనికోసం రూ. 18.14 కోట్లు కేటాయించడానికి సిద్ధమైంది. అయితే గతంలో మాదిరిగా ఇది ప్రతిపాదనల స్థాయిలోనే అటకెక్కకూడదని నగర వాసులు కోరుతున్నారు. సాధారణ రోజుల్లో ఓ స్థాయిలో, వర్షం కురిస్తే తీవ్రంగా ట్రాఫిక్ ఇబ్బందుల్ని సృష్టిస్తున్న ఈ ప్రాంతంలో సమస్యలు తీరాలంటే ఆర్‌యూబీతో పాటు నాలాపై రోడ్డు నిర్మాణం కావాలని ట్రాఫిక్ విభాగం అధికారులు చెప్తున్నారు. ఈ రూట్ ఎంతో ఇంపార్టెంట్... నగరంలోని అత్యంత కీలకమైన రహదారుల్లో దిల్సుఖ్నగర్–చాదర్‌ఘాట్ మధ్యలోనిది ఒకటి. ఈ మార్గంలో అంతర్గత వాహనాలే కాకుండా అంతరాష్ట్ర, అంతర్ జిల్లాలవీ నడుస్తుంటాయి. మలక్‌పేట రైల్వేస్టేషన్ పక్కన ఉన్న రైలు వంతెన వద్ద ఉన్న బాటిల్ నెక్, వాటర్ లాగింగ్ ఏరియా కలిసి ఈ రూట్లో తిరిగే వాహన చోదకులకు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఆ ప్రాంతంలో చాదర్‌ఘాట్ వైపు మెట్రో రైల్ స్టేషన్ కూడా రావడంతో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దీని ప్రభావంతో రద్దీ వేళల్లో అటు చాదర్‌ఘాట్ కాజ్ వే వరకు... ఇటు నల్లగొండ చౌరస్తా వరకు వాహనాలుబారులు తీరుతున్నాయి. అంతర్ జిల్లా ఆర్టీసీ బస్సుల రద్దీ ఎక్కువగా ఉండే పండగల సీజన్లో నరకం చవిచూడాల్సిందే. నాలుగేళ్ల క్రితం నుంచీ... ప్రస్తుతం మలక్‌పేట రైల్ వంతెన వద్ద ఉన్న రెండు మార్గాలను ఒకటి చాదర్‌ఘాట్ వైపు, మరోటి మలక్‌పేట వైపు వెళ్లే వాహనాల కోసం వినియోగిస్తున్నారు. ఇవి రద్దీకి పట్టుకోలేకపోవడంతో మూడో మార్గం అందుబాటులోకి తీసుకురావాలని 2016లో తొలిసారిగా నిర్ణయించారు. ఇది అందుబాటులోకి వస్తే ఆ రూట్లను డైనమిక్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌గా పిలిచే రివర్సబుల్ లైన్ ట్రాఫిక్ మెథడ్‌లో వినియోగించుకోవచ్చని అధికారులు భావించారు. అంటే ఈ మార్గాలను పూర్తి స్థాయిలో వన్ వేగా మార్చకుండా... రద్దీని బట్టి ఆయా సమయాల్లో వన్‌వేగా చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా రద్దీని తట్టుకోవడంతో పాటు ఒకే మార్గాన్ని వివిధ రకాలుగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆర్‌యూబీతో పాటు మలక్‌పేట వైపు నాలాపై రోడ్డు సైతం నిర్మించాల్సి ఉంది. అప్పుడే పూర్తి ఉపయోగం ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. రెండుసార్లు ప్రతిపాదనల వద్దే... మలక్‌పేట రైలు వంతెన సమీపంలో వాహనాల కోసం మరో అండర్ పాస్ ఏర్పాటుకు సహకరించడానికి 2018లో హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) ముందుకు వచ్చింది. ఈ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రైల్వే శాఖ ప్రారంభించడానికి ముందే రూ. 10 కోట్లు డిపాజిట్ చేయాలని షరతు పెట్టింది. ఈ మొత్తం చెల్లించేందుకు హెచ్ఎంఆర్ ముందుకు వచ్చింది. ఆ తర్వాత గత ఏడాది ఓ సందర్భంలో ఈ ‘మూడో మార్గం’ ఏర్పాటుకు జీహెచ్ఎంసీ ముందుకు వచ్చింది. అయితే అదీ ప్రతిపాదన స్థాయిలోనే ఆగిపోయంది. ఇటీవల నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇక ఇప్పట్లో ఈ ఆర్యూబీ అందుబాటులోకి రావడం అసాధ్యమని అందరూ భావించారు. అయితే గ్రేటర్ వ్యాప్తంగా అనేక ఆర్‌యూబీలు, ఫ్లై ఓవర్లు, మార్గాల అభివృద్ధి చేపట్టిన జీహెచ్ఎంసీ ఈ ఆర్‌యూబీకి రూ. 18.14 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. దీంతో ఈ సారైనా ఇది అమలులోకి రావాలని, ప్రతిపాదనల స్థాయిలోనే ఆగిపోకూడదని నగరవాసులు కోరుతున్నారు. -
నకిలీ ఐఏఎస్ ఆటకట్టు
చాదర్‌ఘాట్: ఐఏఎస్ అధికారినని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని చాదర్‌ఘాట్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. సీఐ నాగరాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా, నారాపల్లికి చెందిన సూరప్పగారి సంపత్‌కుమార్ (29) ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. 2011లో అతను ఢిల్లీలోని వజీరామ్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందాడు. 2013లో పార్లమెంట్ లో కాంట్రాక్టు ప్రాతిపదినక పీఆర్ఓగా పని చేసేవాడు. ఆ సమయంలో అతడికి పార్లమెంట్లో బెనర్జీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ సందర్భంగా అతను ఐఏఎస్ అధికారులకు హడ్కో ద్వారా విల్లాలు మంజూరవుతున్నాయని, అందులో మధ్యవర్తిత్వం చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చునని సంపత్‌కుమార్‌కు తెలిపాడు. దీంతో తానే ఐఏఎస్ అధికారిగా మారితే ఎక్కువ మందిని నమ్మించవచ్చునని భావించిన సంపత్ పార్లమెంట్ లో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పనిచేస్తున్నట్లు నకిలీ గుర్తింపు కార్డను తయారు చేసుకుని మోసాలకు శ్రీకారం చుట్టాడు. ఈ నేపథ్యంలో వరంగల్‌కు చెందిన రిటైర్డ్ పీపీ తన కుమార్తెకు మెడికల్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఇప్పించాలని కోరుతూ సంపత్‌కు రూ.20 లక్షలు ఇచ్చాడు. అయితే పని పూర్తికాకపోవడంతో అతను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. అనంతరం నగరానికి మకాం మార్చిన సంపత్ కుమార్ మలక్‌పేట్‌కు చెందిన తన స్నేహితుడు వెంకన్నతో మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో మలక్‌పేట హరిహర క్షేత్రానికి వెళ్లిన వెంకన్నకు పూజారి ద్వారా వనస్థలిపురం ప్రాంతానికి చెందిన వ్యక్తితో పరిచయం పరిచయం ఏర్పడింది, సదరు వ్యక్తి వరంగల్‌లో గుడి నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పడంతో వెంకన్న అతడికి రూ.60 వేలు విరాళంగా అందచేశాడు. ఇదే సందర్భంగా తనకు తెలిసిన ఐఏఎస్ ద్వారా బంజారాహిల్స్ ప్రాంతంలో రూ.3.5 కోట్ల విలువైన విల్లాను కేవలం రూ.1.5 కోట్లకే ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో సదరు వ్యక్తి తన బావమరిదికి విల్లా ఇప్పించాలని కోరుతూ రూ.1.38 కోట్లు సంపత్‌కుమార్‌కు ముట్టజెప్పాడు. అదేవిధంగా సదరు వ్యక్తి ఇంట్లో ట్యూటర్‌గా పనిచేస్తున్న మహిళకు డీఆర్డీఓలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.12 లక్షలు తీసుకున్నాడు. అయితే రోజులు గడిచిని విల్లా ఇప్పించకపోవడంతో బాధితుడు చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు సంపత్‌కుమార్ దిల్సుఖ్నగర్ లో ఉన్నట్లు సమాచారం అందడంతో సోమవారం అతడిని అరెస్ట్ చేశారు. అతడికి బెనర్జీ, వెంకన్న పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. నిందితుడి నుంచి ల్యాప్‌ట్యాప్, 4.7 తులాల బంగారం, రూ. వెయ్యి నగదు ఐదు డెబిట్, క్రెడిట్ కార్టులు స్వాధీనం చేసుకున్నారు. -
చాదర్‌ఘాట్‌లో దొంగల బీభత్సం
సాక్షి, హైదరాబాద్: చాదర్‌ఘాట్ పీఎస్ పరిధిలో శుక్రవారం అర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో చొరబడిన దొంగలు భారీగా బంగారం, నగదు దోచుకెళ్లారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. దాదాపు 35 తులాల బంగారం, రూ. 3 లక్షల నగదు అపహరణకు గురైనట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. -
ఏక్ నంబర్ దో గాడీ
హైదరాబాద్: ఒకే రిజిస్ట్రేషన్ నంబరుతో తిరుగుతున్న రెండు ఆటోలను ఆదివారం ఆబిడ్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని, ఆటోయజమానిని అరెస్టు చేశారు. ఏపీ 11 వై 8876 నంబరుతో ఆటో రిజిస్ట్రేషన్ చేయించి అదే నంబరుతో రెండు ఆటోలను నడుపుతున్న వారి ఆటకట్టించడానికి రంగంలో దిగిన పోలీసులకు కఠోరమైన నిజాలు తెలిశాయి. ఇది కేవలం ఒక ఆటోకు సంబంధించిన విషయం కాదని దీని వెనక పెద్ద మాఫియా ఉందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో నగర పరిధిలో ఇలాంటి సంఘటనలు ఎక్కువవుతుండటంతో పోలీసులు వీటిపై దృష్టి సారించారు. దీని వెనక పాతబస్తీకి చెందిన ముఠా ఉన్నట్లు ప్రాథమిక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. తాజా ఘటనలో ఆటో ఓనర్‌తో పాటు ఈ ముఠాకు చెందిన ఇద్దరు వ్యక్తులను చాదర్ ఘాట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సైకో వీరంగం, ఎస్ఐ, కానిస్టేబుళ్లకు గాయాలు
హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఏకంగా పోలీసులపైనే దాడి చేశాడు. చాదర్ఘట్ పోలీస్‌స్టేషన్ పరిధి శంకర్‌నగర్‌కు చెందిన సైకో ఇసామియా.. ఓ ఫంక్షన్‌కు వెళ్లి అక్కడ శివ, బాబులపై కత్తితో దాడి చేశాడు. దీనిపై ఫిర్యాదు అదుకున్న చాదర్ఘట్ ఎస్సై మహేష్...కానిస్టేబుల్స్‌ను వెంటబెట్టుకొని ఘటనాస్థలానికి వెళ్లారు. అయితే ఇసామియా అనూహ్య రీతిలో ఎస్ఐతో పాటు, కానిస్టేబుళ్లపైన కత్తితో దాడి చేశాడు. గాయాలైన ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎట్టకేలకు సైకో ఇసామియాను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
హైదరాబాద్‌లో సైకో వీరంగం
-
సిటీలో సగం పార్కింగ్ లేని పోలీసుస్టేషన్లే
నగర ట్రాఫిక్ పోలీసులు ‘ర చ్చ’కె క్కే ముందు ‘ఇంటి’ని సరిదిద్దుకోవడం మర్చిపోతున్నారు. ‘తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరన్న’ చందంగా వ్యవహరిస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో నో-పార్కింగ్ ఏరియాలో వాహనం ఆపితే రూ.1000 చలాన్‌తో సామాన్యులను చావబాదేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు.. పార్కింగ్ వసతులు లేని ఠాణాల వ్యవహారం ఎందుకు పట్టదని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. సిటీలో సగానికి సగం ఠాణాలకు సరైన పార్కింగ్ వసతులు లేవు. ఈ కారణంగానే బాధితులతో పాటు పోలీసుల వాహనాలనూ ఆయా ఠాణాల ఎదురుగా ఉన్న రోడ్డుపైనే ఆపాల్సిన పరిస్థితి. ఇదే గత ఏడాది నారాయణగూడ పరిధిలో ఓ యువకుడు ప్రాణాలు కూడా తీసింది. నగరంలోని చాలా పోలీసుస్టేషన్లు నిజాం కాలం నాటి భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అక్కడున్న మౌలిక సదుపాయాలు ప్రస్తుత అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. కొన్ని పోలీసుస్టేషన్లలో సిబ్బంది కూర్చోవడానికే అవకాశం ఉండదు. ఇక పార్కింగ్ ప్లేస్ గురించి ఆలోచించడం అత్యాశే అవుతుంది. ఈ కారణంగానే ఇన్స్పెక్టర్ మెబైల్ మొదలు పోలీసు జీపులు, బందోబస్తు సిబ్బందిని తరలించే ఐఛ ర్లు, రక్షక్ వాహనాలు, సిబ్బందికి చెందిన వెహికల్స్‌తో పాటు చివరకు ఫిర్యాదుదారులకు చెందినవి, నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నవి ఇలా అన్ని వాహనాలూ రోడ్లపైనే నిలపాల్సి వస్తోంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడిని దృష్టిలో పెట్టుకునే గతంలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ తొలుత ట్రాఫిక్ పోలీసుల నుంచే అమలు చేసేవారు. ఆపై ఇతర విభాగాల అధికారులు, చివరకు సామాన్యుల వద్దకు వచ్చేవారు. కార్లపై ఉండే బుగ్గలైట్ల తొలగింపు, అడ్డదిడ్డంగా ఉండే నెంబర్ ప్లేట్లు, అద్దాలపై ఉన్న నల్లరంగు ఫిల్మ్‌లపై స్పెషల్ డ్రైవ్ తదితర కార్యక్రమాలు చేపట్టేముందు పోలీసుల వాహనాలపై తీయించేశారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరవాత మాత్రమే నగరవ్యాప్తంగా అమలు చేశారు. అయితే ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నానే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్లపై వాహనాలు ఆపిన సామాన్యులను చలాన్లతో చావబాదేస్తూ.. తమ సొంత శాఖలో ఉన్న ఉల్లంఘనలను మాత్రం చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. అనేక పోలీసుస్టేషన్లు రోడ్లనే తమ పార్కింగ్ ప్రాంతాలుగా మార్చుకున్నా వీరికి పట్టట్లేదు. ఇందుకు నారాయణగూడ, రామ్‌గోపాల్‌పేట్, సుల్తాన్‌బజార్, చాదర్‌ఘాట్, చార్మినార్, ఎస్సార్‌నగర్ తదితర పోలీసుస్టేషన్లు మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇవన్నీ పాత భవనాల్లో కొనసాగుతున్న ఠాణాలే అని అధికారులు సర్దిచెప్పాలని చూసినా... కొత్తగా నిర్మించిన వాటిలోనూ సరైన వసతులు ఉండట్లేదు. సిద్ధి అంబర్‌బజార్ ప్రధాన రహదారిపై నిర్మించిన బేగంబజార్ పోలీసుస్టేషన్‌కూ సరైన పార్కింగ్ వసతి లేదు. సాధారణంగా రోడ్డుపై ఎవరైనా వాహనాన్ని ఆపినా, తీయడానికి కాస్త ఆలస్యం చేసినా చుట్టుపక్కల వాహనచోదకులు అప్రమత్తమవుతారు. వాటిని తీసేవరకు నానా రాద్దాంతం చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇలా ఏర్పడిన తగాదాలే పెద్ద గొడవలుగా మారిన సందర్భాలూ ఉన్నాయి. అదే పోలీసుస్టేషన్ ఎదుటో, పోలీసులకు చెందిన వాహనమో ఇలా ఆగినా మాట్లాడే ధైర్యం ఎవరికుంటుంది? ఇదే అధికారుల ధీమా. ఈ విషయంపై ఉన్నతాధికారులే ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది. తమ శాఖలోని తప్పుల్ని మాత్రం పట్టనట్లు వదిలేస్తున్న ట్రాఫిక్ పోలీసులు, సామాన్యులపై మాత్రం చలాన్లతో విరుచుకుపడుతున్నారన్న సిటీజనుల విమర్శకు ట్రాఫిక్ విభాగమే సమాధానం చెప్పాలి.