
హైదరాబాద్, సాక్షి: ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ హఠాత్తుగా నగరంలో ప్రత్యక్షమయ్యారు. ఛాదర్‌ఘాట్ సమీపంలోని ఓ ఇంటికి ఆమె చేరుకోగా.. పోలీసులు అప్రమత్తమై ఆమెను అడ్డుకున్నారు.
మూసీ సుందరీకరణ ప్రాంతానికి ఆమె వెళ్తారనే సమాచారంతో పోలీసులు ఆమె బస చేసిన ఇంటికి భారీగా చేరుకున్నారు. అయితే ఆమె స్నేహితుల ఇంటికి వచ్చానని చెప్పడం గమనార్హం. అయినప్పటికీ ఆమెను అదుపులోకి తీసుకుని.. అక్కడి నుంచి పంపించేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment