moosi river
-
పత్తి మనదే ప్రతిఫలం మనదే
హైదరాబాద్‌కు చెందిన దండోతికర్ అంబిక చిన్నప్పటి నుంచి మూసీ నది కాలుష్యాన్ని చూస్తూ పెరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాలు మూసి నీళ్లలో నింపుతున్న విషాన్ని గురించి తెలుసుకుంది. అప్పటి నుంచే ప్లాస్టిక్‌కు ప్రత్నామ్నాయాలు వెదకడం మొదలుపెట్టింది. ప్రత్యామ్నాయంగా కాటన్ బ్యాగులను తయారుచేయడమే కాదు వాటి గురించి విస్తృత ప్రచారం చేస్తోంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్న ఆమె కృషికి గుర్తింపుగా ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. తాజాగా ఎంఎస్ స్వామినాథన్ అవార్డు అందుకుంది.ఉస్మానియా యూనివర్సిటీలో ‘సోషల్ సర్వీసెస్’లో పీజీ చేసింది అంబిక. ఇది కేవలం చదువు కాదు. సామాజిక సేవ దిశగా వేసిన తొలి అడుగు. రైతుల ఆత్మహత్యలతో కలత చెందిన అంబిక ఎన్నో గ్రామాల్లోకి వెళ్లి ఎంతోమంది పత్తి రైతులతో మాట్లాడింది. వారి సమస్యలను తెలుసుకుంది.ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కాటన్ బ్యాగులను వినియోగంలోకి తీసుకువస్తే పర్యావరణానికే కాదు పత్తి రైతుకూ మేలు జరుగుతుందని ఆలోచించింది. మచ్చలు వచ్చిన పత్తిని కూడా సేకరించి వస్త్రాన్ని తయారుచేసి, బ్యాగులు తయారు చేయాలని నిర్ణయించుకుని ముందడుగు వేసింది. పర్యావరణ స్పృహ, ఉపాధి కల్పన, కాటన్ దుస్తుల గురించి ప్రచారం... అనే మూడు లక్ష్యాలను నిర్దేశించుకుంది. మూసీ ప్రక్షాళన చేసే దిశగా విద్యార్థులతో కలిసి ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. 2016లో జరిగిన హిల్లరీ వెబర్ బూట్ క్యాంప్‌లో పాల్గొని కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంది. ఎన్ ఐఆర్డీ ఏర్పాటు చేసిన రిస్క్ కాంక్లేవ్‌లో అంబిక ఇచ్చిన ప్రెజెంటేషన్ కు ‘బెస్ట్ స్టార్టప్ ఇన్ సస్టెయినబుల్ లైవ్లీహుడ్’ ‘బెస్ట్ ఇన్నొవేటివ్ ఆస్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్’ అవార్డులు వచ్చాయి. సామాజిక సేవ పునాదిపై సొంతంగా స్టార్టప్‌ను నిర్మించిన అంబిక రూపాయి లాభంతో మాత్రమే సేవలు అందించింది. రైతుల నుంచి పత్తిని సేకరించడం నుంచి బ్యాగులు తయారు చేయడం వరకు ఎంతో మందికి శిక్షణ ఇచ్చింది. సంప్రదాయంగా వస్తున్న డైయింగ్, ప్రింటింగ్ కళలను ప్రోత్సహించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ‘పర్యావరణ స్పృహతో ఒక్క అడుగు పడినా....ఒక్క అడుగేనా అని నిరాశపడాల్సిన పనిలేదు. ఆ అడుగును అనుసరిస్తూ వందల అడుగులు పడతాయి’ అంటుంది దండోతికర్ అంబిక. కాలుష్య సమస్యకు కలత చెందడం కంటే ‘నా వంతుగా ఒక పరిష్కారం’ అనుకుంటే ఎంతో కొంత పరిష్కారం దొరుకుతుంది. ఎటు చూస్తే అటు ప్లాస్టిక్ వ్యర్థాల వరద భయపెడుతున్న వేళ, వాటి దుష్పరిణామాల గురించి తెలిసినా....అవి మన దైనందిన జీవితంలో భాగమైన దురదృష్ట కాలాన.....అంబికలాంటి పర్యావరణ ప్రేమికులు పరిష్కార మార్గాలు ఆలోచిస్తున్నారు.తన వంతు పరిష్కారంగా ప్లాస్టిక్ బ్యాగులకు ప్రత్యామ్నాయంగా కాటన్ బ్యాగులు తయారుచేస్తూ వాటి ్రపాముఖ్యత గురించి ప్రచారం చేస్తోంది దండోతికర్ అంబిక. ‘పత్తి మనదే ప్రతి ఫలం మనదే’ అనే నినాదంతో రైతుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న అంబికకు ‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’ ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్‌ను ప్రధానం చేసింది.– ఎన్.సుధీర్‌రెడ్డి, సాక్షి, హైదరాబాద్ -
పరిహారమిచ్చాకే కూలుస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: ‘మూసీ నదీ గర్భం (రివర్ బెడ్)లో నిర్మాణం చేపట్టారంటూ మార్కింగ్ చేసిన ఇళ్లను పరిహారమిచ్చాకే కూలుస్తున్నారా? నోటీ సులు జారీ సహా చట్టప్రకారం అనుసరించాల్సిన ప్రక్రియను పాటిస్తున్నారా?’ అని రాష్ట్ర ప్రభుత్వా న్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్ సమాధానమిచ్చారు. పరిహారంపై నిర్వాసితులతో మాట్లాడి, వారు సమ్మతించిన తర్వాతే ఇళ్ల కూల్చివేత చేపడుతున్నామని కోర్టుకు వివరించారు. ఏఏజీ చెప్పిన అంశాలను నమోదు చేసుకుంటున్నట్టు పేర్కొన్న ధర్మాసనం.. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు హైడ్రాను ఆదేశించింది.కేఏ పాల్ పిటిషన్ మేరకు..‘‘మూసీకి సంబంధించి సరైన సర్వే నిర్వహించి, ఆక్రమణలను గుర్తించే వరకు భవనాలను కూల్చివేయకుండా హైడ్రాను ఆదేశించాలని.. బాధితులకు నోటీసులు ఇచ్చి, ఇళ్లు ఖాళీ చేయడానికి లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి నెల రోజుల సమయం ఇవ్వాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావుల ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది.పారదర్శకంగా చర్యలు: ఏఏజీవిచారణ సందర్భంగా ఏఏజీ ఎక్కడ అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ న్యాయ వాదులు హాజరుకాకుంటే ఎలాగని, పిటిషనర్ల వాదనలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని పేర్కొంది. దీనితో ఏఏజీ విచారణకు హాజరై వాదనలు వినిపించారు. ‘‘చట్టప్రకారం చర్యలు తీసుకుంటూనే ప్రభుత్వం ముందుకెళ్తోంది. నోటీసు లిచ్చి సమయం ఇచ్చిన తర్వాతే కూల్చివేతలు చేప డుతున్నాం. ప్రజలందరి విషయంలో ఒకేలా వ్యవ హరిస్తున్నాం. తారతమ్యాలు లేవు. పారదర్శకంగా, నిష్పక్ష పాతంగా చర్యలు చేపడుతున్నాం’’ అని వివరించారు. చెరువులు, కుంటల పరిరక్షణ కోసం కోర్టు ఆదేశాల మేరకు హైడ్రా ఏర్పాటైందని.. రివర్ బెడ్లోని ఇళ్లకు మార్కింగ్ మాత్రమే చేసిందని, ఇంకా కూల్చివేతలు చేపట్టలేదని తెలిపారు. హైడ్రాకు చట్టబద్ధత ఇస్తూ ఇటీవల ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా జారీ చేసిందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఏఏజీ వాదనలను రికార్డు చేశామని, ఈ పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. బాధితుల్లో ఎక్కువ మంది పేదలే..: పాల్విచారణ సందర్భంగా పార్టీ ఇన్ పర్సన్‌గా కేఏ పాల్ తానే వాదనలు వినిపించారు. ‘‘ఆక్రమణదారులు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రిజిస్ట్రేషన్, విద్యుత్, నిర్మాణ, నల్లా అనుమతులు ఇచ్చిన అధికారులు అందరూ ఆనందంగానే ఉన్నారు. అనుమతులు ఉన్నాయి కదా అని కొనుగోలు చేసిన పేద, మధ్యతరగతి వారే రోడ్డున పడుతున్నారు. ‘హైడ్రా’ బాధితుల్లో ఎక్కువ మంది వారే. 462 నిర్మాణాలను, భవనాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చారు. ఎన్ కన్వెన్షన్‌ను ఒక్కరోజులో కూల్చిన అధికారులు.. దాదాపు 250 మంది పెద్దలకు మాత్రం నోటీసులు జారీ చేసి వదిలేశారు. పేద, మధ్యతరగతికి సమయం ఇవ్వకుండా ప్రతాపం చూపిస్తున్నారు. కూల్చడానికి నేను వ్యతిరేకం కాదు.. కానీ, చట్టాన్ని పాటించాలి. న్యాయవాదులను పెట్టుకోలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. లక్షల మంది హైడ్రా తమ ఇంటి మీదకు ఎప్పుడో వస్తుందో అని భయంతో బతుకుతున్నారు. అలాంటి వారి కోసమే పిల్ వేశాను. ఇళ్లు కూల్చే వారికి ముందే పరిహారం ఇవ్వాలి. నోటీసులిచ్చి ఖాళీ చేసే సమయం ఇవ్వాలి. తెలంగాణ మరో ఉత్తరప్రదేశ్‌లా మారకముందే చర్యలు తీసుకోవాలి. ఇళ్ల కూల్చివేతపై సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలి’’ అని పాల్ వాదనలు వినిపించారు. -
హాన్, మూసీ మధ్య పోలికలెన్నో!
(సియోల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) అధిక పట్టణీకరణ, కాలుష్యం కారణంగా ఏదైనా నది ప్రాభవం కోల్పోతే దాని పునరుజ్జీవం ఆ ప్రాంత ఆర్థికాభివృద్ధిలో భాగమే. దక్షిణ కొరియా వేగవంతమైన ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్న హాన్ నదే అందుకు ఉదాహరణ. వరదల నియంత్రణతోపాటు పర్యావరణ సమతౌల్యతను కాపా డుతూ వినోద, పర్యాటక కేంద్రంగా పట్టణ నదులను ఎలా అభివృద్ధి చేయవచ్చో హాన్ నది నిరూపిస్తోంది. మూసీ నది ని పునరుద్ధరించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందు లో భాగంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని హాన్ నదిని అధ్యయనం కోసం ఎంపిక చేసుకుంది. రెండు నదుల మధ్య చాలా పోలికలు ఉండటమే అందుకు కారణం.విజయవంతమైన హాన్ రివర్ ఫ్రంట్ అభివృద్ధి..సియోల్‌లో స్థిరమైన పట్టణాభివృద్ధికి విజయవంతమైన నమూనాగా హాన్ రివర్ ఫ్రంట్ నిలుస్తోంది. సియోల్ నగర సామాజిక, సాంస్కృతిక రంగాలను హాన్ నది ప్రతిబింబిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నీటి నాణ్యతను మెరు గుపరచడంతోపాటు నది ఒడ్డునున్న పర్యావరణ వ్యవస్థ లను పునరుద్ధరించారు. ఫలితంగా సియోల్‌లో ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గాలి నాణ్యత మెరుగుపడింది. జీవ వైవిధ్యం పునరుద్ధరణ సైతం జరిగింది. హాన్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు విజయం అంత సులువుగా జరగలేదు. స్థిరమైన పట్టణ ప్రణాళిక, నది నిర్వహణ కోసం భారీ ఎత్తున అక్కడి ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది. పాలకుల చిత్తశుద్ధి, సుస్థిరతతో నది సుందరీకరణతోపాటు ప్రజా వినోద కేంద్రంగా హాన్ గణనీయమైన అభివృద్ధిని సాధించింది. హాన్ నదిని సియోల్ నగరంలో వరద నీటి నియంత్రణ, నీటి నిర్వహణ కోసం కూడా వినియోగిస్తున్నారు.మూసీ పునరుజ్జీవం అనివార్యమే..సహజ వనరుల సంరక్షణతోపాటు హైదరాబాద్‌లో పట్టణ పునరుద్ధరణ, పర్యావరణ పునరావాసానికి మూసీ పునరుజ్జీ వం అనివార్యమే. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగ రాల దాహార్తిని తీర్చిన మూసీ.. కాలక్రమేణా మురికి కూపంగా మారిపోయింది. గృహ, పారిశ్రామిక వ్యర్థాలు కలవడంతోపాటు ఆక్రమణలకు సైతం గురైంది. ఫలితంగా మూసీ చుట్టూ ఉన్న సాంస్కృతిక, వారసత్వ సంపద నాటి ప్రాభ వాన్ని, ప్రాముఖ్యతను కోల్పోయింది. మూసీ పునరుద్ధరణ, పునరుజ్జీవం కోసం గతంలో ప్రతిపాదనలు సిద్ధమైనా కార్యరూపం మాత్రం దాల్చలేదు.మూసీ–హాన్ నదుల మధ్య భౌగోళిక సారూప్యతలు ఇవీ..హాన్» దక్షిణ కొరియా ఉత్తర భాగంలోని తైబెక్ సన్మేక్ పర్వతాల్లో పుట్టిన హాన్ నది.. గాంగ్వాన్, జియోంగ్లీ, ఉత్తర చుంగ్‌చియాంగ్ ప్రావిన్సుల ద్వారా సియోల్ నగరంలోకి ప్రవేశిస్తుంది. ఈ నగరంలో సుమారు 40 కి.మీ. మేర ప్రవహిస్తూ పశ్చిమాన ఉన్న ‘ఎల్లో సీ’లో కలుస్తుంది.» దీని మొత్తం పొడవు 514 కి.మీ.కాగా సియోల్ నగరంలో 40 కి.మీ. మేర ప్రవహిస్తుంది.మూసీ» వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ గుండా హైదరాబాద్‌లోకి ప్రవేశిస్తుంది. పాత, కొత్త నగరాలను రెండుగా విభజిస్తూ పురా నాపూల్, డబీర్‌పురా, అంబర్‌పేట, చాదర్ ఘాట్, ఉప్పల్ మీదుగా నగరం నడిబొడ్డు నుంచి మిర్యాల గూడ సమీపంలోని వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.» మూసీ నది మొత్తం పొడవు 240 కి.మీ. కాగా హైదరాబాద్‌లో 57.5 కి.మీ. మేర ప్రవహిస్తుంది. -
బిడ్డలకు మూసీ పేరు పెట్టుకునేలా చేస్తాం!: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఎవరు అడ్డొచ్చినా మూసీ రివర్ ఫ్రంట్ పథకం ఆగదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మూసీ పరీవాహకం పరిధిలో ఉన్న పది వేల కుటుంబాలకు మురికి జీవితం కాకుండా మంచి జీవితం అందించటం కూడా ఈ ప్రాజెక్టులో భాగమని పేర్కొన్నారు. ‘‘మన ఇళ్లలో ఆడబిడ్డలకు గోదావరి, సరస్వతి, నర్మద, కృష్ణా.. ఇలా నదుల పేర్లు పెట్టుకుంటాం. మరి మూసీ కూడా నది పేరే కదా. ఆ పేరు ఎందుకు పెట్టుకోవటం లేదు. మూసీ అనగానే మురికి కూపమన్న భావన రావడమే దీనికి కారణం. అందుకే ఆ మురికిని ప్రక్షాళన చేసి.. నదిని అద్భుతంగా మార్చుతాం. పిల్లలకు మూసీ అన్న పేరు పెట్టుకునేలా చేస్తాం’’ అని రేవంత్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో గతంలోనే నోటిఫికేషన్లు జారీ అయిన ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైన 1,635 మందికి ఉద్యోగ నియామక పత్రాలను సీఎం రేవంత్ అందించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘గతంలో ఎన్నో ప్రాజెక్టులకు భూసేకరణ జరిపినప్పుడు లేని ఇబ్బంది మూసీ విషయంలో ఎందుకు? ఆ కుటుంబాలు జీవితాంతం మురికిలోనే ఉండాలా? వారిని బాగు చేసే బాధ్యత ప్రభుత్వంతీసుకుంటుంది. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించటంతోపాటు వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. మూసీ పరిధిలో 10వేల కుటుంబాలు ఉన్నాయని 33 బృందాలు ఆరునెలల పాటు సర్వే చేసి తేల్చాయి. బఫర్ జోన్లో ఉన్న వారిని ఎలా ఆదుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రాజెక్టును అడ్డుకోవడం కాదు.. కావాలంటే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి. కాళేశ్వరం కోసం లక్ష కోట్లు తగలబెట్టిన వారికి ఇది తెలియదా? ఇటీవల బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా బీఆర్ఎస్ నేతల తరహాలోనే మూసీ ప్రాజెక్టుపై మాట్లాడుతున్నారు. ఆయన అంగీ మార్చినా బీఆర్ఎస్ వాసనను వదిలించుకున్నట్టు లేదు. సబర్మతి తరహాలో మూసీని అభివృద్ధి చేద్దాం. కేంద్రం నుంచి ఓ 20 వేల కోట్లు వచ్చేలా బీజేపీ ఎంపీలు చేయలేరా? పరామర్శల పేరుతో మూసీ పరీవాహక ప్రాంతాలకు వచ్చే కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లను ఓ వారంపాటు అక్కడే ఉంచితే ఆ ప్రాంత జనం కష్టాలేమిటో తెలిసి వస్తాయి. గతంలో నోటిఫికేషన్లు ఇచ్చి చేతులెత్తేశారు.. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిన నాటి ప్రభుత్వ పెద్దలు.. నియామకాలను పట్టించుకోలేదు. వీటికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులను పరిష్కరించటం తమ బాధ్యతగా భావించకపోవటం వల్ల ఏళ్ల తరబడి నియామకాలు పెండింగ్‌లో ఉండిపోయాయి. యువతకు ఉద్యోగాలు రావాలంటే నాటి సీఎం, మంత్రుల కుర్చీల్లో కూర్చున్న వారి ఉద్యోగాలు ఊడాలని విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమంలో చెప్పాను. దాన్ని మీరు చేసి చూపించారు. మా కుటుంబ సభ్యుల కళ్లలో ఆనందం చూస్తూ.. మేం సీఎంగా, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశాం. ప్రభుత్వం ఏర్పడ్డ 90 రోజుల్లోనే 31వేల ఉద్యోగాలు కల్పిస్తూ.. నిరుద్యోగ యువత తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూసేలా నియామక పత్రాలను అందించాం. ఇప్పుడు దసరా ముందు 1,635 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించటం ద్వారా వారి కుటుంబాలు మరింత ఆనందంగా పండుగ నిర్వహించుకునేలా చేశాం. మరో 11,063 మందికి ఈ నెల 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ఉపాధ్యాయ నియామక పత్రాలను అందించబోతున్నాం. ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు? భాక్రానంగల్ డ్యామ్ నుంచి నాగార్జునసాగర్, శ్రీశైలం వరకు దశాబ్దాలుగా నిలబడి ఉండేలా కట్టిన నాటి ఇంజినీర్లను, హైదరాబాద్ వెలుపల జంట జలాశయాలకు ప్లాన్ చేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యలను ఆదర్శంగా తీసుకుంటారా? లేక కట్టిన కొన్నేళ్లకే కూలిపోయిన కాళేశ్వరాన్ని నిర్మించిన వారిని ఆదర్శంగా తీసుకుంటారో ఉద్యోగులు, ఇంజనీర్లు నిర్ణయించుకోవాలి. కొత్తగా విధుల్లోకి చేరుతున్న ఇంజనీర్ల చేతుల మీదుగా రీజనల్ రింగురోడ్డు, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, ఫార్మాసిటీ, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతున్నాయి. చెక్‌డ్యామ్‌లు మొదలు కాళేశ్వరం వరకు గత పదేళ్లలో అప్పటి ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాల నాణ్యత డొల్లతనాన్ని చూపిస్తాం రండి.. నాటి మంత్రులకు ఇదే నా సవాల్. దసరా ముందు సంతోషం నింపాం: మంత్రి కోమటిరెడ్డి మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి మహనీయ ఇంజనీర్లు పనిచేసిన ఈ నేలమీద ఇప్పుడు కొందరు ఇంజనీర్లు విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి రావటం బాధగా ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ‘‘అధికారులు అందించిన ప్లాన్లను పక్కనపెట్టి తానే పెద్ద ఇంజనీర్ అన్నట్టుగా నాటి సీఎం కేసీఆర్ కట్టిన మూడేళ్లకే కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతినేలా చేశారు. ఏళ్ల క్రితం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదు. అలా పెండింగు పెట్టిన వాటిని తమ ప్రభుత్వం పరిష్కరించి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వటం ద్వారా దసరా ముందు వారి ఇళ్లలో సంతోషాన్ని నింపుతోంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్నవారు బాధ్యతగా పనిచేయాలి. నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలి. దశాబ్దాలుగా అద్భుత సేవలందిస్తున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టును కొత్త ఇంజినీర్లు ఆదర్శంగా తీసుకోవాలి. కట్టిన మూడేళ్లకే కుంగిన కాళేశ్వరం ప్రాజెక్టును కాదు’’ అని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు కె.కేశవరావు, నేతలు కోదండరెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు.. ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టులో నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తూ ఈ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.కాగా మూసీ నదిని ప్రక్షాళన చేసి.. దానిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మూసీ పరిసరాల్లో నివసిస్తున్న కుటుంబాలను తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల డబుల్ బెడ్ రూం గృహాలను ఇవ్వనుంది ప్రభుత్వం.చదవండి: ఓటుకు నోటు కేసు.. విచారణకు రావాలని సీఎం రేవంత్‌కు కోర్టు ఆదేశంమూసీలో మొత్తం 10,200 మందిని నిర్వాసితులుగా ప్రభుత్వం గుర్తించింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మూడు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు రేపు ఇంటింటికి వెళ్లి అక్కడున్న ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించారో తెలియజేయనున్నారు.మరోవైపు రివర్ బెడ్లో ఆక్రమణలో ఉన్న 1600 ఇళ్లను తొలగించి.. అక్కడ ఉన్న వారిని తరలించనుంది ప్రభుత్వం. మూసీ బఫర్ జోన్లో నివసించే వ్యక్తులు, నిర్మాణాలకు RFCTLARR చట్టం ప్రకారం పరిహారం చెల్లించనుంది. నిర్మాణ ఖర్చుతో పాటు, పట్టా ఉంటే భూమి విలువను పరిహారంగా చెల్లించనుంది. వీటితోపాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూడా కేటాయించనుంది. -
మూసీ సుందరీకరణే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: మూసీ నది సుందరీక రణ, స్థిరమైన అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ’’రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుస్తుందా? అని ఎన్నికల వేళ మాట్లాడుకున్నారు, గెలిచి చూపించాం. ఇ ప్పుడు ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేస్తుందా? అని హేళనగా మాట్లాడుతున్నారు. మూ సీ పరీవాహక ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయబోతున్నాం’’ అని ఆయన వెల్లడించారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో గురువారం నగరంలో జరిగిన ఇన్ఫ్రా అండ్ రియల్ ఎస్టే ట్ సమ్మిట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి మాట్లాడారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓ ఆర్ఆర్ఆర్), రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) మధ్య 13 క్లస్టర్ల ఏర్పాటుతో ఆయా ప్రాంతాలలో సాంసృతిక వ్యాపారాలకు అవ కాశం ఉంటుందని వివరించారు. పీపీపీ విధా నంలో టౌన్‌షిప్‌ల నిర్మాణం చేపడతామని చెప్పారు. ప్రభుత్వం అనేది.. కేవలం వ్యాపా రాన్ని సులభతరం చేసే ఒక వేదిక మాత్రమే నని, మౌలిక వసతుల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తల సహకారం అవసరమని ఆయన పునరుద్ఘాటించారు. మూడు దశాబ్దాలుగా స్థిరాస్తి రంగం పుంజుకుందని, సుస్థిరమైన విధానాలతో స్థిరాస్తి రంగంలో మరింత అభివృద్ధి కోసం కృషి చేస్తామని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనులను ఆపబోమని స్పష్టం చేశారు. మూసీనదిలో పడవ రవాణా సదుపాయం: దాన కిషోర్ గ్రేటర్ హైదరాబాద్‌కు మూసీ నది చోదక శక్తికి మారనుందని హెచ్ఎండీఏ పిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ తెలిపారు. గ్రేటర్లో దాదాపు 55 కిలోమీటర్లు మేర ఉన్న మూసీ నది వెంట గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజి యం, చార్మినార్, హైకోర్టు, ఉస్మానియా వంటి ఎన్నో వారసత్వ ప్రదేశాలు కొలువై ఉన్నాయని, అందుకే మూసీ రివర్ ఫ్రంట్ కోసం ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. మూసీ ప్రవాహంలో సగ భాగం మెట్రో, సగం భాగం రోడ్డు మార్గం ఉంటుందని, దీంతో పాటు మూసీలో పడవ రవాణా ప్రయాణ సదుపాయం వచ్చేలా పటిష్టమైన ప్రణాళికలుంటాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు పశ్చిమ ప్రాంతంలోనే కేంద్రీకృతమైన అభివృద్ధిని మూసీ రివర్ ఫ్రంట్‌తో నగరం నడిబొడ్డుకు తీసుకొస్తామని దాన కిషోర్ హామీ ఇచ్చారు. ఇందుకోసం మూసీ పరివాహం వెంట వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌లను నిర్మించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువతకు నైపుణ్యం పెంపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని దాన కిషోర్ తెలిపారు. ఇప్పటివరకు ఉన్న డిప్లమో కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు, వేతనాలు తక్కువ అని అందుకే ఈ కోర్సులను గ్రాడ్యుయేషన్ స్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని ఆయన వెల్లడించారు. -
గోదావరి నీళ్లతో మూసీని నింపుతాం
నాగోలు/అంబర్పేట్/మన్సూరాబాద్ (హైదరాబాద్): మహా నగరంలో ఉన్న చారిత్రక మూసీ నదిని స్వచ్ఛమైన గోదావరి నీళ్లతో నింపుతామని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు చెప్పారు. నార్సింగి వద్ద గోదావరి జలాలను మూసీలో కలిపి మురుగు నీరు లేకుండా చర్యలు చేపడతామని, దీనికోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎస్టీపీ ప్లాంట్లను నిర్మిస్తామని తెలిపారు. హైదరాబాద్‌కు గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిన మూసీని గత ప్రభుత్వాలు పట్టించుకోక మురికి కూపంగా మారిపోయిందన్నారు. సోమవారం రూ.52 కోట్ల అంచనా వ్యయంతో మూసారంబాగ్ వద్ద మూసీ నదిపై నిర్మించ తలపెట్టిన హైలెవెల్ బ్రిడ్జికి కేటీఆర్ శంకుస్థాపన చేసి మాట్లాడారు. మూసీపై రూ.545 కోట్లతో 14 బ్రిడ్జిలను నిర్మిస్తున్నామని, వీటికి అద్భుతమైన డిజైన్లను రూపొందించేందుకు మన ఇంజనీర్లతో విదేశాల్లో అధ్యయనం చేయించామని తెలిపారు. సినిమాల్లో చూపిన మాదిరిగా బ్రిడ్జి డిజైన్లు ఉంటాయని, శంకుస్థాపన చేసిన వంతెనలు 18 నెలల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మురుగునీటి శుద్ధిలో దేశంలోనే హైదారాబాద్ మొదటి స్థానంలో ఉందని వివరించారు. ఇప్పుడు రోజుకు 2వేల మిలియన్ లీటర్ల సామర్థ్యంతో ఎస్టీపీల నిర్మాణం చేస్తున్నామని, ఇవి పూర్తయితే మూసీలోకి పూర్తిస్థాయి శుద్ధి చేసిన నీటిని వదిలే పరిస్ధితి ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, అహ్మద్ బలాల, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ గుప్త, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. సీఎం కలను నెరవేరుస్తాం మంచిరేవుల నుంచి ఘట్కేసర్ దాకా మూసీ నదిని అద్భుతంగా సుందరీకరించాలన్న సీఎం కేసీఆర్ కలను నెరవేరుస్తామని కేటీఆర్ చెప్పారు. 160 కి.మీ. ఓఆర్ఆర్ చుట్టూ తిరగకుండా మధ్యలో మూసీ నది మీదుగా వెళ్లేలా బ్రిడ్జిలు, రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. రూ. 5వేల కోట్లతో రెండో విడత ఎస్ఎన్డీపీ పనులు త్వరలోనే చేపడతామని తెలిపారు. వారం పది రోజుల్లో 40 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను పారదర్శకంగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. జీవో 118లో చిన్న చిన్న సాంకేతిక సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కేసీఆర్ తెలిపారు. ఎల్బీ నగర్‌లోని కామినేని ఫ్లైఓవర్ల కింద ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పార్కు అద్భుతంగా ఉందని కేటీఆర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్‌రెడ్డికి కితాబునిచ్చారు. కేటీఆర్ పార్కు మొత్తం కలియతిరిగి అక్కడ ఏర్పాటుచేసిన ఆకృతులను ఆసక్తిగా తిలకించి.. జీహెచ్ఎంసీ కార్మికులతో ఫొటోలు దిగారు. హైదరాబాద్ మతసమరస్యానికి ప్రతీక అని, పార్లమెంటులో లేని మతసమరస్యాం మన హైదరాబాద్‌లో ఉందని కేటీఆర్ అన్నారు. గణేశ్ నిమజ్జనం పురస్కరించుకొని మిలాద్ ఉన్ నబీ ర్యాలీ వాయిదా వేసుకోవడం ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నారనే దానికి నిదర్శనమని తెలిపారు. -
ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తనున్న అధికారులు.. మూసీతో టెన్షన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సహా తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్ట్‌ల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. అటు లోతట్టు ప్రాంతాలు సైతం జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదిలా ఉండగా.. నగరంలోని జంట జలాశయాలకు సైతం వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో అధికారులు ఉస్మాన్‌సాగర్ గేట్లు ఎత్తివేసేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం ఒంటి గంటకు ఉస్మాన్ సాగర్ గేట్లను లిఫ్ట్ చేయనున్నారు అధికారులు. ఉస్మాన్‌సాగర్ రెండు గేట్లు ఎత్తి 208 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేయనున్నారు. ఇక, ఇప్పటికే అధికారులు హిమాయత్ సాగర్ నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో, మూసీలోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఈ క్రమంలో మూసీ ఏడు గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం మూసీ పరిస్థితి.. ఇన్ ఫ్లో: 13140 క్యూసెక్కులు అవుట్ ఫ్లో: 10047 క్యూసెక్కులు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు ప్రస్తుత మట్టం: 642.40 అడుగులు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 4.46 టీఎంసీలు ప్రస్తుత నీటి నిల్వ: 3.79 టీఎంసీలు. ఇది కూడా చదవండి: భారీ వర్షాల ఎఫెక్ట్.. టెన్షన్ పెడుతున్న మున్నేరు, పాలేరు -
నాలుగోరోజూ కుమ్మేసిన జడివాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం
సాక్షి, సిటీబ్యూరో: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఆవర్తనం ప్రభావంతో వరుసగా నాలుగోరోజైన శుక్రవారం నగరంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. తెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నగరం నిండా మునిగింది. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల ఇళ్లలోకి చేరిన వరద నీటిని తొలగించేందుకు పలు బస్తీల వాసులు అవస్థలు పడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం కురిసిన జడివానకు రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో వినాయక నిమజ్జనానికి స్వల్పంగా అంతరాయం కలిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నగరానికి ఆనుకొని ఉన్న జంటజలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్లకు వరద నీరు పోటెత్తుతుండడంతో..జలమండలి అధికారులు రెండు జలాశయాలకు రెండు గేట్ల చొప్పున తెరచి మూసీలోకి వరదనీటిని వదిలిపెట్టారు. సాయంత్రం 6 గంటల వరకు ఉ స్మాన్సాగర్లోకి 500 క్యూసెక్కుల వరద నీరు చేరగా..442 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలిపెట్టారు. హిమాయత్‌సాగర్‌లోకి 600 క్యూసెక్కుల వరద చేరగా.. 678 క్యూసెక్కుల నీటిని దిగువనకు వదిలారు. దీంతో మూసీలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండడంతో బాపూఘాట్–ప్రతాపసింగారం(44 కి.మీ)మార్గంలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, బల్దియా యంత్రాంగం హెచ్చరికలు జారీచేసింది. పోలీసు విభాగం కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా రాగల 24 గంటల్లో అల్పపీడన ప్రభావంతో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు నగరంలో నమోదైన వర్షపాతం వివరాలివీ.. (సెంటీమీటర్లలో) రాజేంద్రనగర్ 8.75, శివరాంపల్లి 6.6, గోల్కొండ 5.1, చాంద్రాయణగుట్ట 2.58, కిషన్‌భాగ్ 2.4, అత్తాపూర్ 2.33, జూపార్క్2.1 చదవండి: ఇంటర్ ఛేంజర్లకు అదనంగా భూసేకరణ -
హైదరాబాద్: మూసీ నదికి పోటెత్తిన వరద.. రాకపోకలు బంద్
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా ఉస్మాన్, హియాయత్‌సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఒక్కో రిజర్వాయర్‌కు 8 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. హిమాయత్ సాగర్ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులకు గాను ప్రస్తుతం 1761.9 అడుగులుగా ఉంది. రిజర్వాయర్‌లోకి ఇన్ ఫ్లో 8000 క్యూ సెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 10700 క్యూ సెక్కులు ఉంది. దీంతో 8 గేట్లు 4 అడుగులు మేర ఎత్తి మూసికి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఉస్మాన్ సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులకు గాను ప్రస్తుతం 1789.10 అడుగులుగా ఉంది. రిజర్వాయర్‌లోకి ఇన్ ఫ్లో 8000 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 8281 క్యూసెక్కులుగా ఉంది. 13 గేట్లు ఆరు అడుగులు మేర ఎత్తి మూసికి నీటిని వదులుతున్నారు. రాకపోకలు బంద్ మూసీ నది ఉధృతితో అధికారులు అలర్ఠ్ అయ్యారు. అంబర్‌పేట-కాచిగూడ, మూసారాంబాగ్- మలక్‌పేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేరే మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మరోవైపు హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురువనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. మరికొన్ని గంటల్లో అల్వాల్, కుత్బుల్లాపూర్, కంటోన్మెంఠ్ ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశ ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సీపీ సందర్శన ఉస్మాన్ సాగర్, ఓఆర్ఆర్ వద్ద వరద ప్రవాహాన్ని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పరిశీలించారు. వర్షం ముంపునకు గురైన ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ నాయుడుతో కలిసి హిమాయత్ సాగర్ చెరువు, హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు, గండిపేట చెరువులను సందర్శించారు. భారీ వర్షాల కారణంగా హిమాయత్, ఉస్మాన్ సాగర్ పూర్తిగా నిండిపోవడంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై వరద నీరు పెరుగుతోందని, పరిస్థితిని సమీక్షించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నామని తెలిపారు. ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లవద్దని సూచించారు. సైబరాబాద్ పోలీసులు ఎలాంటి సంక్షోభాన్ని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని తెలదిపారు. పోటెత్తిన వరద మూసీ ప్రాజెక్టుకు అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో ముందస్తుగా మూసీనది ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తి నాలుగు అడుగుల ఎత్తిత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ఇన్ ఫ్లో 5,733.36 క్యూసెక్కులు వస్తుండగా 17, 809 క్యూసెక్కులు కాగా. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 645 అడుగులు ఉండగా.. ప్రస్తుతం నీటి సామర్థ్యం 637.500 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 2.67 టీఎంసీలుగా కొనసాగుతోంది. యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలం రుద్రవల్లి గ్రామ శివారులో లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసీ వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. బీబీనగర్ మండలం, రుద్రవల్లి, భూదాన్ పోచలంపల్లి మండలం జూలురు గ్రామాల వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. లోలెవ్ బ్రిడ్జికి ఇరువైపుల వాహనదారులు, ప్రజలు ప్రయాణించకుండా బీబీనగర్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు వలిగొండ మండలం సంగెం సమీపంలోని భీమలింగం వద్ద లోలెవల వంతెనపై మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. దీంతో భువనగిరి మండలం, భుల్లేపల్లి, వలిగొండ మండలం, సంగెం గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. -
మూసీ నదికి భారీగా వరద ఉధృతి
-
వరద నీటిలో మునిగిన మూసారంబాగ్ బ్రిడ్డి
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో మూసి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో, హైదరాబాద్‌లోని మూసారంబాగ్ బ్రిడ్డి వరద నీటిలో మునిగిపోయింది. ఇక, చాదర్‌ఘాట్‌లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరి కాలనీలు నీటమునిగాయి. #HYDTPinfo Commuters, please make a note that due to the overflow of the Musi River on Jiyaguda 100ft road, the route is temporarily closed and traffic is diverted. @JtCPTrfHyd pic.twitter.com/nPofNIOVx8 — Hyderabad Traffic Police (@HYDTP) July 26, 2022 ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో, వాహనదారులను అలర్ట్ చేస్తూ వేరే రూట్స్‌లో వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉండగా.. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ 12 గేట్లు, ఉస్మాన్ సాగర్ 8 గేట్లు ఎత్తారు. ఈ క్రమంలో మూసీలోకి వరద పోటెత్తింది. హియామత్ సాగర్ ORR సర్వీస్ రోడ్డు బ్రిడ్జి మధ్యలో చిక్కుకున్న యువకుడిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు. ప్రవహిస్తున్న వాగుల నుండి వాహనాలు తీసుకెళ్లడం, నడుచుకుంటూ దాటకండి. pic.twitter.com/e3NCPyVvUT — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) July 26, 2022 ఇది కూడా చదవండి: వానల ఎఫెక్ట్: తెలంగాణలోని ఆ జిల్లాలో స్కూల్స్ బంద్ -
మళ్లీ ఉగ్రరూపం దాల్చిన మూసీ నది
సాక్షి, హైదరాబాద్ : నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మూసీ నది మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఛాదర్ ఘాట్ బ్రిడ్జితో సహా పక్కకు ఉన్న బస్తీలను మూసీ ముంచేసింది. 50కి పైగా పేదల ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. చదర్ఘాట్ నుండి మలక్‌పేట్, దిల్సుఖ్ నగర్ ప్రధాన రోడ్ బంద్ అయింది. ఆ పక్కనే ఉన్న బస్తీలు మొత్తం నీట మునిగిపోయాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నాయకులు, జీహెచ్ఎంసీ అధికారులు ఎవరూ వచ్చి తమని చూడలేదంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిండుకుండలా హిమాయత్ సాగర్ హిమాయత్ సాగర్ జల కళను సంతరించుకుంది. రాత్రి కురిసిన వర్షానికి నిండుకుండను తలపిస్తోంది. దీంతో అధికారులు 5 అడుగుల మేర 12 గేట్లను ఎత్తి వేశారు. ఇక గండి పేటకు సైతం భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. చెరువు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఏ క్షణమైన గేట్లు తెరిచే అవకాశం ఉంది. పాతబస్తీ అతలాకుతలం నిన్న సాయంత్రం మళ్లీ వర్షం దంచికొట్టడంతో మరోసారి పాతబస్తీ అతలాకుతలమైంది. గుర్రం చెరువు వరద నీరు పాతబస్తీని ముంచెత్తెంది. మళ్లీ కాలనీలు నీటమునగడంతో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు తయారైంది పరిస్థితి. హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో మూసీనది ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అనవసరంగా రోడ్లపైకి రాకండి : సీపీ ‘‘రాత్రి కురిసిన వర్షానికి పాత బస్తీలో చాలా ప్రదేశాల్లో వరద నీరు చేరింది. దీంతో వెంటనే స్థానిక పోలీసులను అలర్ట్ చేశాము. వరదల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించాము. పాత బస్తీలోని ఫలక్నామా బిడ్జ్‌పైన ఆరు అడుగుల గొయ్యి పడింది. దీంతో మొత్తం ట్రాఫిక్ డైవర్సన్ చేశాము. జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో వరద ప్రాంతాల్లో ఉన్నవారిని రెస్క్యూ చేస్తున్నాం. అనవసరంగా ఎవరూ కూడా రోడ్లపైకి వాహనాలు తీసుకొని రాకండి. ఇంకా మూడు రోజులు పాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కోరుతున్నా’’మని సీపీ అంజనీ కుమార్ అన్నారు. -
మూసీ ఆక్రమణలను అడ్డుకోండి
సాక్షి, హైదరాబాద్: పుప్పాలగూడ చెరువులో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు, పుప్పాలగూడలోని శంకర్‌నగర్ సమీపంలో అయిదారేళ్లుగా మూసీ నదిని పూడ్చివేయడాన్ని వెంటనే అడ్డుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక కార్యకర్త డాక్టర్ లుబ్నా సార్వవత్ రాసిన లేఖను పిల్‌గా పరిగణించిన హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రెండు చోట్లా ఆక్రమణలను అడ్డుకోవాలని, ఇప్పటికే ఆక్రమణలు ఉంటే వాటిని తొలగించాలని, నిర్మాణాలు జరుగుతూ ఉంటే వెంటనే వాటిని నిలిపివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో కోర్టుకు సహాయకారిగా న్యాయవాది కె.పవన్‌కుమార్‌ను హైకోర్టు నియమించింది. చెరువును హోండా అండ్ హేరేజస్ పూడ్చేయడంతో హెచ్ఎండీఏ రికార్డులో లేకుండా పోయిందని, చెరువును తిరిగి తవ్వేలా సరస్సుల పరిరక్షణ కమిటీకి, వాల్టా అధికారులకు ఉత్తర్వులు ఇవ్వాలని సార్వవత్ లేఖలో కోరారు. శంకర్‌నగర్‌లో మూసీని ఆరేళ్లుగా పూడ్చివేసి ఆక్రమణలకు పాల్పడుతున్నా అధికారులు పట్టిం చుకోవడం లేదని, ఆక్రమణల తొలగింపునకు మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు ఉత్తర్వులివ్వాలని కూడా కోరారు. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ కోరడంతో విచారణ జూన్ 24కి వాయిదా పడింది. కాగా, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారం లోని కట్టమైసమ్మ చెరువు ఆక్రమణల నివారణకు తీసుకున్న చర్యలను తెలపాలని హెచ్ఎం డీఏ, జీహెచ్ఎంసీలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. చెరువు నీటి పరీవాహక ప్రాం తంలో బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారని ఎస్.మల్లేశ్వరరావు దాఖలు చేసిన పిల్ పై విచారణ జూన్ 24కి వాయిదా పడింది. -
మూసీ ప్రక్షాళనకు ముహూర్తం ఇదే..!
సాక్షి, హైదరాబాద్: మూసీ నది ప్రక్షాళన కసరత్తు మొదలైంది. మురికి మొత్తం వదిలించాలని జాతీయ నది పరిరక్షణ పథకం డైరెక్టర్ జనరల్ రాజీవ్ రంజన్ మిశ్రా సూచించారు. బుధవారం జలమండలి ప్రధాన కార్యాలయంలో అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యా రు. మూసీ ప్రక్షాళనకు పరీవాహక ప్రాంతంలో మురుగు శుద్ధిచేసే కేంద్రాలు, మురుగునీటిని ఎస్టీపీలకు మళ్లించేందుకు భారీ ట్రంక్ సీవర్, సబ్‌మెయిన్స్, లేటరల్ మెయిన్స్ పైప్ లైన్లు ఏర్పాటు చేయడం, సుందరీకరణ పనులు చేపట్టడం, ఎస్టీపీలు, ఈటీపీల నిర్వహణ తదితర పథకాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇందుకోసం రూ. 13,479 కోట్ల అంచనాతో జలమండలి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనలను అధికారులు మిశ్రాకు నివేదించారు. వీటి సాధ్యాసాధ్యాలపై ఆయన అంశాలవారీగా చర్చించారు. మంజీరా క్యాచ్మెంట్ ఏరియా పరిధిలోకి వచ్చే నక్క వాగు సమూల ప్రక్షాళనకు రూ.2,404 కోట్లతో సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ పైనా చర్చించారు. ఈ భారీ ప్రక్షాళన పథకాలకు ఎన్‌ఆర్‌సీడీ (జాతీయ నదీ పరిరక్షణ, అభివృద్ధి) పథకం కింద ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. ఇదే అంశంపై గురువారం మంత్రి కేటీఆర్ తోనూ సమావేశం కానున్నట్లు తెలిసింది. -
మూసీని కలుషితం చేశారు: లక్ష్మణ్
లంగర్‌హౌస్: సమైక్య రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు మూసీని కలుషితం చేశారని దూషించి, ఇప్పుడు రాష్ట్రం సాధించాక వారి వద్ద నుంచి ముడుపుల ప్రవాహాన్ని తెచ్చుకుంటూ ప్రజల ప్రాణాలతో సీఎం కేసీఆర్ చెలగాటాలాడుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ‘నమామి మూసీ’ ఉద్యమంలో భాగంగా లంగర్‌హౌస్ త్రివేణి సంగమాన్ని ఆయన సోమవారం తిలకించారు. వికారాబాద్ అనంతగిరి కొండల నుంచి తెచ్చి న ముచికుందా జలాన్ని త్రివేణి సంగమంలో వదిలి పూజలు చేశారు. ‘మూసీని, ప్రజల ఆరోగ్యాలను కాపాడుకుందాం’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. కోరితే 70 శాతం నిధులు ఇస్తాం.... ఈ సందర్భంగా ఆలయం ముందు రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. సబర్మతితో పాటు, గంగా నదిని పూర్తిగా శుద్ధి చేసిన ఘనత ప్రధాని మోదీది అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కోరితే మూసీ ప్రక్షాళన, హుస్సేన్ సాగర్ శుద్ధి కోసం 70 శాతం నిధులను కేంద్రం భరించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, చింతల రాంచంద్రారెడ్డి, డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు. -
కాలుష్యంతో వ్యాధుల ముప్పు
సాక్షి, హైదరాబాద్: ‘పరిసరాల పరిశుభ్రత, మూసీ ప్రక్షాళలనతోనే జల, వాయుకాలుష్యం సహా డెంగీ, మలేరియా దోమల నియంత్రణ సాధ్యం. ప్రజారోగ్యానికి హానికరంగా మారిన మూసీని ఎంత త్వరగా ప్రక్షాళన చేస్తే అంత మంచిది. లేదంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’అని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హెచ్చరించారు. ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ ఆధ్వర్యం లో ‘హెల్త్ హైదరాబాద్’పేరుతో ఆదివారం స్టాఫ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీలో కరుణా గోపాల్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. నగరంలో రోజురోజుకూ పెరుగుతోన్న జల, వాయు కాలుష్యం ప్రజారోగ్యానికి పెద్ద ముప్పుగా పరిణమించిందన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మూసీని ప్రక్షాళన చేయడం ద్వారా డెంగీ, మలేరియా వ్యాధులకు కారణమవుతున్న దోమలను నియంత్రించవచ్చని చెప్పారు. శారీరక శ్రమను అలవర్చుకోవడం, సహజ ఆహారం తీసుకోవడం ద్వారా రోగాల బారీ నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. పాఠశాలల్లో ఆటస్థలాలను ఏర్పాటు చేయడం, పిల్లలకు ఆడుకునే అవకాశం ఇవ్వడం ద్వారా అధిక బరువు ముప్పు నుంచి పిల్లలను కాపాడవచ్చని పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడం వల్ల అనేక మంది చిన్న వయసులోనే పెద్ద జబ్బుల బారిన పడుతున్నారని తెలిపారు. వైద్య ఖర్చులు బాధిత కుటుంబాలనే కాదు ప్రభుత్వాలను కూడా సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయని చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు శరీరానికి అవసరమైన వ్యాయామం అందించడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చని ఆయన సూచించారు. -
మూసీలో బోల్తా పడిన ట్రాక్టర్
-
మూసీలో ఘోర ప్రమాదం.. 15మంది మృతి
సాక్షి, యాదాద్రి : పేద కుటుంబాల్లో పెనువిషాదం అలుముకుంది. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద కూలీలను మృత్యువు కబళించింది. యాదాద్రి జిల్లాలో ఆదివారం ఘోరప్రమాదం చోటుచేసుకుంది. మహిళా కూలీలతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి మూసీ కాలువలో బోల్తా పడింది. వలిగొండ సమీపంలోని లక్ష్మాపురంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 15మంది మహిళా కూలీలు మృతి చెందారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 30మంది మహిళా కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో 14మంది పెద్దవాళ్ళు, ఒక చిన్న పిల్లవాడు ఉన్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడికి చేరుకున్న మృతుల బంధువులు విలపించిన తీరు వర్ణణాతీతం. మృతులంతా వేములకొండ గ్రామానికి చెందినవారు. వీరిలో తల్లీకొడుకు, తల్లీకూతురులు కూడా ఉన్నారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని మృతుల బంధువులు భావిస్తున్నారు. పత్తి విత్తనాలు నాటడానికి వెళ్తున్న సమయంలో ఈ ఘోరం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. మృతుల వివరాలు.. కడింగుల లక్ష్మీ, లక్ష్మి కూతురు అనూష, ఇంజమురి లక్ష్మమ్మ, ఇంజమురి శంకరమ్మ, అంబల రాములమ్మ, చుంచు నర్మదా, కందల భాగ్యమ్మ, ఏనుగుల మాధవి, జడిగి మరమ్మ ,పంజల భాగ్యమ్మ, బిసు కవిత, బంధారపు స్వరూప,గానే బోయిన అండలు, అరూర్ మణెమ్మ, ఆంధ్రా ప్రాంతానికి చెందిన తల్లీ కొడుకులు ఉన్నట్లుగా గుర్తించారు. యాదాద్రి ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. యాదాద్రి జిల్లా ట్రాక్టర్ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతేకాక ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వలిగొండ ప్రమాదంపై గట్టు శ్రీకాంత్ రెడ్డి దిగ్ర్భాంతి.. వలిగొండ ట్రాక్టర్ ప్రమాదంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. అంతేకాక క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గట్టు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రమాదంపై మంత్రి జగదీష్ రెడ్డి దిగ్భాంత్రి వలికొండ ట్రాక్టర్ ప్రమాదంపై మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బోనగిరి- యాదాద్రి జిల్లాల అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, డీసీపీలతో ఫోన్లో సమీక్షించారు. అంతేకాక సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డిని మంత్రి ఆదేశించారు. ఈ విధమైన సంఘటన దురదృష్టకరమని మంత్రి అన్నారు. క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. -
శిథిలావస్థలో వారధి
దామరచర్ల(మిర్యాలగూడ) : అధికారుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల అలసత్వం ప్రయాణికుల పాలిట శాపంగా మారుతోంది. నల్లగొండ– సూర్యాపేట జిల్లాల మధ్య గల మూసీ నదిపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. దామరచర్ల మండల కేంద్రం సమీపంలో మూసీ నదిపై 2001లో రూ.2కోట్లతో నిర్మించిన వంతెన కూలే దశకు చేరింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కలుపుతూ ఉన్న ఈ వంతెన ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడింది. దామరచర్ల నుంచి పారిశ్రామిక ప్రాంతాలైన మేళ్లచెర్వు, దక్కన్ సిమెంట్స్ కర్మాగారం,హుజూర్నగర్, ప్రముఖ పుణ్యక్షేత్రాలు మట్టపల్లి, జాన్‌పహాడ్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఈ వంతెన గుండానే రాకపోకలు సాగిస్తున్నారు.పారిశ్రామికీకరణ ప్రాంతం కావడంతో ఈ వంతెనపై నిత్యం వందలాది వాహనాలు సిమెంట్, ఇతర లోడ్లతో వెళ్తుంటాయి. పిల్లర్లు కూలి..చువ్వలు తేలి.. మూసీ నదిపై ఉన్న వంతెనపై పలుచోట్ల సైడ్ పిల్లర్లు కూలిపోవడంతో వాహనాలు నదిలో పడే ప్రమాదం నెలకొంది. దీంతో పాటు వంతెనపై పలు చోట్ల పగుళ్లు ఏర్పడి చువ్వలు తేలాయి. దీంతో ఎప్పుడు ఏప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి ఈ పరిస్థితి ఉన్నా అధికారులు ఎవరూ పట్టించు కోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
కేసీఆర్ ఫ్రంట్.. మూసి నది!
సాక్షి, హైదరాబాద్: సీపీఎం మహాసభల్లో రాజకీయ తీర్మానం గురించి చర్చించినట్టు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలు నగరంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీతారాం ఏచూరి గురువారం విలేకరులతో మాట్లాడారు. రెండు నెలల కిందటే రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించామని, కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు వచ్చాయని ఏచూరి తెలిపారు. రాజకీయ తీర్మానంపై అందరి అభిప్రాయాలను స్వీకరించామని తెలిపారు. పార్టీ సభ్యుడు ఎవరైనా తమ ప్రతిపాదన ఇవ్వవచ్చునని, ప్రతిపాదనలపై చర్చలు జరుగుతాయని తెలిపారు. గతంలో పార్టీ పరంగా జరిగిన లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు. జస్టిస్ లోయ మృతిపై సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరమని చెప్పారు. ఈ కేసును ఉన్నత ధర్మాసనం సమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీలో సీక్రేట్ బ్యాలెట్‌కు ఆస్కారం లేదని, ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో అవగాహన ఒప్పందం ఉండబోదని ఆయన తెలిపారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే అంశంపై కూడా మహాసభల్లో చర్చ జరుగుతోందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన అంశాలు, ప్రత్యేక హోదా విషయంలో పార్టీ సమావేశాల్లో కచ్చితంగా తీర్మానం ఉంటుందని తెలిపారు. జాతీయ ప్రత్యామ్యాయ ఫ్రంట్లలో చేరే ఆలోచన లేదని పేర్కొంటూ.. కేసీఆర్ ఫ్రంట్‌ను ఏచూరి మూసీ నదితో పోల్చారు. -
మూసీపై ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధానికి జీవనాడిగా భాసిల్లుతున్న చారిత్రక మూసీ నదిపై ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించేందుకు వీలుగా సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. నగరంలో మూసీ ప్రవహిస్తున్న బాపూఘాట్–నల్లచెరువు(ఉప్పల్) మార్గంలో 40 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాలని, నదికి ఇరువైపులా తీరైన రహదారులను అభివృద్ధి చేయాలని సూచించారు. గురువారం సైఫాబాద్‌లోని మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో నది సుందరీకరణ, నగరంలో ఇతర చెరువుల పరిరక్షణపై ఆయా విభాగాల అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షించారు. డ్రోన్ కెమెరాలతో సర్వే.. మూసీ నది మొత్తాన్ని డ్రోన్ కెమెరాలు, ఇతర అత్యాధునిక టెక్నాలజీతో సర్వే చేయాలని, ఇందుకయ్యే ఖర్చు, సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని కేటీఆర్ ఆదేశించారు. మూసీ నది వెంట ప్రస్తుతం ఉన్న రోడ్లకు అనుబంధంగా రూపకల్పన చేస్తున్న బ్రిడ్జీల డిజైన్లు, నిర్మాణం నగర చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టేలా ఉండాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు లోపలున్న చెరువులను దీర్ఘకాల ప్రణాళికలు సిద్ధం చేసి దశలవారీగా అభివృద్ధి చేస్తామని, ఈ వర్షాకాలం నాటికి 50 చెరువుల అభివృద్ధికి లక్ష్యం నిర్దేశించినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే 20 చెరువుల అభివృద్ధి, సుందరీకరణ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. దుర్గంచెరువు సుందరీకరణ శరవేగంగా సాగుతోందన్నారు. చెరువులు కబ్జా కాకుండా చూసేందుకు కలెక్టర్లతో మాట్లాడాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. మూసీ దుస్థితి ఇదీ.. వికారాబాద్ జిల్లా అనంతగిరి మూసీ జన్మస్థానం. అక్కడి నుంచి సుమారు 90 కిలోమీటర్ల మేర ప్రవహించి బాపూఘాట్ వద్ద హైదరాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఇక్కడి నుంచి నగర శివార్లలోని ప్రతాపసింగారం వరకు సుమారు 44 కిలోమీటర్ల మార్గంలో ప్రవహిస్తోంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక వాడల నుంచి 1,400 మిలియన్ లీటర్ల మురుగునీరు నిత్యం నదిలోకి ప్రవేశిస్తోంది. దీంతో నదిలో రసాయన కాలుష్యం పెరుగుతోంది. కాగా మూసీలోకి చేరుతున్న వ్యర్థజలాలను నాగోల్, నల్లచెరువు, అత్తాపూర్, అంబర్‌పేట్‌లోని జలమండలి మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో 700 మిలియన్ లీటర్లను శుద్ధిచేసి మళ్లీ నదిలోకి వదిలిపెడుతోంది. ఇందుకు ఏటా రూ.10 కోట్లు వెచ్చిస్తోంది. మిగతా 700 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసేందుకు పది చోట్ల నూతనంగా మురుగునీటిశుద్ధి కేంద్రాలు, రెండుచోట్ల రీసైక్లింగ్ యూనిట్లు నిర్మించాలని జలమండలి రూ.1,200 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రక్షాళన పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో జాతీయ స్థాయిలో కాలుష్యకారక నదుల్లో మూసీ నాలుగో స్థానంలో నిలవడం నది దుస్థితికి అద్దం పడుతోంది. మూసీ ప్రక్షాళన కాగితాలకే పరిమితం.. మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ఏళ్లుగా కాగితాలకే పరిమితమవడంతో ఘన, ద్రవ, రసాయన వ్యర్థాల చేరికతో నది కాలుష్య కాసారమవుతోంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రక్షాళనకు బాలారిష్టాలు తప్పడంలేదు. గుజరాత్‌లోని సబర్మతి నది తరహాలో మూసీని ప్రక్షాళన చేయాలన్న రాష్ట్ర సర్కారు సంకల్పం బాగానే ఉన్నా.. ఆచరణలో అడుగు ముందుకు పడటంలేదు. మూసీ తీరప్రాంత అభివృద్ధికి రూ.3 వేల కోట్ల అంచనా వ్యయం, సుందరీకరణకు రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో ప్రక్షాళన పనులు చేపట్టాల్సి ఉన్నా ఆచరణ మాత్రం శూన్యం. ఏడాది క్రితం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి చైర్మన్, సభ్యకార్యదర్శిని నియమించినా ఫలితం కనిపించడంలేదు. -
మూసీ గేట్లు ఎత్తివేత
నల్లగొండ: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నల్లగొండ జిల్లాలోని కేతపల్లి మండలం మూసి ప్రాజెక్టు నిండుకుండలామారింది. ప్రాజెక్టు నీటిమట్టం 645 అడుగులకు(గరిష్ట స్థాయికి) చేరడంతో పాటు ప్రాజెక్ట్‌లోకి ఇంకా ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతో రెండు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ రోజు ప్రాజెక్ట్ రెండు గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 1300 టీఎంసీల నీటిని కిందకు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో పెరిగితే గేట్లను మరో ఫీట్ ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్ట్ ఏఈ తెలిపారు. -
మూసీలో కొట్టుకుపోయిన 300 గొర్రెలు
మిర్యాలగూడ: నల్లగొండ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసి నది పొంగిపొర్లుతోంది. మిర్యాలగూడ మండలం ముల్కలకాలువ సమీపంలోని మూసి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇది గుర్తించని గొర్రెల కాపరి సోమవారం ఉదయం తన గొర్రెల మందతో వాగు దాటడానికి యత్నిస్తుండగా..300 గొర్రెలు నీటిలో కొట్టుకుపోయాయి. ఒక్క సారిగా వరద పెరగడంతో ఈ దుర్ఘటన జరిగింది. గొర్రెల గల్లంతు యజమాని కన్నీరుమున్నీరవుతున్నాడు. -
మూసీని పరిశీలించిన కేటీఆర్
హైదరాబాద్: చెప్పినట్లుగానే మంత్రి కేటీఆర్ మూసీనది ప్రక్షాళనపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఆయన మూసీనది మార్గాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మూసీనది ప్రక్షాళనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంబర్ పేటలో అధికారులు మంత్రి కేటీఆర్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.