సాక్షి, హైదరాబాద్: మూసీ నది సుందరీక రణ, స్థిరమైన అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ’’రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుస్తుందా? అని ఎన్నికల వేళ మాట్లాడుకున్నారు, గెలిచి చూపించాం. ఇ ప్పుడు ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేస్తుందా? అని హేళనగా మాట్లాడుతున్నారు. మూ సీ పరీవాహక ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయబోతున్నాం’’ అని ఆయన వెల్లడించారు.
కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో గురువారం నగరంలో జరిగిన ఇన్‌ఫ్రా అండ్ రియల్ ఎస్టే ట్ సమ్మిట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి మాట్లాడారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓ ఆర్‌ఆర్‌ఆర్), రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) మధ్య 13 క్లస్టర్ల ఏర్పాటుతో ఆయా ప్రాంతాలలో సాంసృతిక వ్యాపారాలకు అవ కాశం ఉంటుందని వివరించారు. పీపీపీ విధా నంలో టౌన్‌షిప్‌ల నిర్మాణం చేపడతామని చెప్పారు.
ప్రభుత్వం అనేది.. కేవలం వ్యాపా రాన్ని సులభతరం చేసే ఒక వేదిక మాత్రమే నని, మౌలిక వసతుల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తల సహకారం అవసరమని ఆయన పునరుద్ఘాటించారు. మూడు దశాబ్దాలుగా స్థిరాస్తి రంగం పుంజుకుందని, సుస్థిరమైన విధానాలతో స్థిరాస్తి రంగంలో మరింత అభివృద్ధి కోసం కృషి చేస్తామని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనులను ఆపబోమని స్పష్టం చేశారు.
మూసీనదిలో పడవ రవాణా సదుపాయం: దాన కిషోర్
గ్రేటర్ హైదరాబాద్‌కు మూసీ నది చోదక శక్తికి మారనుందని హెచ్‌ఎండీఏ పిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ తెలిపారు. గ్రేటర్‌లో దాదాపు 55 కిలోమీటర్లు మేర ఉన్న మూసీ నది వెంట గోల్కొండ, సాలార్‌జంగ్ మ్యూజి యం, చార్మినార్, హైకోర్టు, ఉస్మానియా వంటి ఎన్నో వారసత్వ ప్రదేశాలు కొలువై ఉన్నాయని, అందుకే మూసీ రివర్ ఫ్రంట్ కోసం ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు.
మూసీ ప్రవాహంలో సగ భాగం మెట్రో, సగం భాగం రోడ్డు మార్గం ఉంటుందని, దీంతో పాటు మూసీలో పడవ రవాణా ప్రయాణ సదుపాయం వచ్చేలా పటిష్టమైన ప్రణాళికలుంటాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు పశ్చిమ ప్రాంతంలోనే కేంద్రీకృతమైన అభివృద్ధిని మూసీ రివర్ ఫ్రంట్‌తో నగరం నడిబొడ్డుకు తీసుకొస్తామని దాన కిషోర్ హామీ ఇచ్చారు. ఇందుకోసం మూసీ పరివాహం వెంట వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌లను నిర్మించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువతకు నైపుణ్యం పెంపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని దాన కిషోర్ తెలిపారు. ఇప్పటివరకు ఉన్న డిప్లమో కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు, వేతనాలు తక్కువ అని అందుకే ఈ కోర్సులను గ్రాడ్యుయేషన్ స్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment