నగరం మధ్య నుంచే ప్రవహిస్తున్న నదులు
గతంలో హాన్‌లో మురుగు కలవడంతో దుర్గంధం.. మూసీలో కలుస్తున్న వ్యర్థాలు
హాన్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుతో పూర్వ వైభవం సాధించిన ఆ నది
ఆ ప్రాజెక్టు స్ఫూర్తితోనే మూసీ పునరుజ్జీవానికి ప్రణాళికలు రచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
(సియోల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) అధిక పట్టణీకరణ, కాలుష్యం కారణంగా ఏదైనా నది ప్రాభవం కోల్పోతే దాని పునరుజ్జీవం ఆ ప్రాంత ఆర్థికాభివృద్ధిలో భాగమే. దక్షిణ కొరియా వేగవంతమైన ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్న హాన్ నదే అందుకు ఉదాహరణ. వరదల నియంత్రణతోపాటు పర్యావరణ సమతౌల్యతను కాపా డుతూ వినోద, పర్యాటక కేంద్రంగా పట్టణ నదులను ఎలా అభివృద్ధి చేయవచ్చో హాన్ నది నిరూపిస్తోంది.
మూసీ నది ని పునరుద్ధరించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందు లో భాగంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని హాన్ నదిని అధ్యయనం కోసం ఎంపిక చేసుకుంది. రెండు నదుల మధ్య చాలా పోలికలు ఉండటమే అందుకు కారణం.
విజయవంతమైన హాన్ రివర్ ఫ్రంట్ అభివృద్ధి..
సియోల్‌లో స్థిరమైన పట్టణాభివృద్ధికి విజయవంతమైన నమూనాగా హాన్ రివర్ ఫ్రంట్ నిలుస్తోంది. సియోల్ నగర సామాజిక, సాంస్కృతిక రంగాలను హాన్ నది ప్రతిబింబిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నీటి నాణ్యతను మెరు గుపరచడంతోపాటు నది ఒడ్డునున్న పర్యావరణ వ్యవస్థ లను పునరుద్ధరించారు. ఫలితంగా సియోల్‌లో ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గాలి నాణ్యత మెరుగుపడింది.
జీవ వైవిధ్యం పునరుద్ధరణ సైతం జరిగింది. హాన్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు విజయం అంత సులువుగా జరగలేదు. స్థిరమైన పట్టణ ప్రణాళిక, నది నిర్వహణ కోసం భారీ ఎత్తున అక్కడి ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది. పాలకుల చిత్తశుద్ధి, సుస్థిరతతో నది సుందరీకరణతోపాటు ప్రజా వినోద కేంద్రంగా హాన్ గణనీయమైన అభివృద్ధిని సాధించింది. హాన్ నదిని సియోల్ నగరంలో వరద నీటి నియంత్రణ, నీటి నిర్వహణ కోసం కూడా వినియోగిస్తున్నారు.
మూసీ పునరుజ్జీవం అనివార్యమే..
సహజ వనరుల సంరక్షణతోపాటు హైదరాబాద్‌లో పట్టణ పునరుద్ధరణ, పర్యావరణ పునరావాసానికి మూసీ పునరుజ్జీ వం అనివార్యమే. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగ రాల దాహార్తిని తీర్చిన మూసీ.. కాలక్రమేణా మురికి కూపంగా మారిపోయింది. గృహ, పారిశ్రామిక వ్యర్థాలు కలవడంతోపాటు ఆక్రమణలకు సైతం గురైంది. ఫలితంగా మూసీ చుట్టూ ఉన్న సాంస్కృతిక, వారసత్వ సంపద నాటి ప్రాభ వాన్ని, ప్రాముఖ్యతను కోల్పోయింది. మూసీ పునరుద్ధరణ, పునరుజ్జీవం కోసం గతంలో ప్రతిపాదనలు సిద్ధమైనా కార్యరూపం మాత్రం దాల్చలేదు.
మూసీ–హాన్ నదుల మధ్య భౌగోళిక సారూప్యతలు ఇవీ..
హాన్
» దక్షిణ కొరియా ఉత్తర భాగంలోని తైబెక్ సన్‌మేక్ పర్వతాల్లో పుట్టిన హాన్ నది.. గాంగ్వాన్, జియోంగ్లీ, ఉత్తర చుంగ్‌చియాంగ్ ప్రావిన్సుల ద్వారా సియోల్ నగరంలోకి ప్రవేశిస్తుంది. ఈ నగరంలో సుమారు 40 కి.మీ. మేర ప్రవహిస్తూ పశ్చిమాన ఉన్న ‘ఎల్లో సీ’లో కలుస్తుంది.
» దీని మొత్తం పొడవు 514 కి.మీ.కాగా సియోల్ నగరంలో 40 కి.మీ. మేర ప్రవహిస్తుంది.
మూసీ
» వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ గుండా హైదరాబాద్‌లోకి ప్రవేశిస్తుంది. పాత, కొత్త నగరాలను రెండుగా విభజిస్తూ పురా నాపూల్, డబీర్‌పురా, అంబర్‌పేట,
చాదర్ ఘాట్, ఉప్పల్ మీదుగా నగరం నడిబొడ్డు నుంచి మిర్యాల గూడ సమీపంలోని వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.
» మూసీ నది మొత్తం పొడవు 240 కి.మీ. కాగా హైదరాబాద్‌లో 57.5 కి.మీ. మేర ప్రవహిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment