నల్లగొండ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసి నది పొంగిపొర్లుతోంది.
మూసీలో కొట్టుకుపోయిన 300 గొర్రెలు
Aug 29 2016 2:38 PM | Updated on Sep 4 2017 11:26 AM
మిర్యాలగూడ: నల్లగొండ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసి నది పొంగిపొర్లుతోంది. మిర్యాలగూడ మండలం ముల్కలకాలువ సమీపంలోని మూసి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇది గుర్తించని గొర్రెల కాపరి సోమవారం ఉదయం తన గొర్రెల మందతో వాగు దాటడానికి యత్నిస్తుండగా..300 గొర్రెలు నీటిలో కొట్టుకుపోయాయి. ఒక్క సారిగా వరద పెరగడంతో ఈ దుర్ఘటన జరిగింది. గొర్రెల గల్లంతు యజమాని కన్నీరుమున్నీరవుతున్నాడు.
Advertisement
Advertisement