sheep
-
పాలు స్వచ్ఛంగా ఉన్నాయా?
ఆధునిక జీవితంలో పాలు తాగడం మంచిదని అనేకులు భావిస్తారు. ఆ మేరకు నిత్యం పాల అవసరం పెరిగింది. పాల నుంచి తయారు చేసే ఉత్పత్తుల పరిమాణం, వైవిధ్యం కూడా పెరిగింది. అందుకే కొందరికే పాలు అందుతున్నాయి. పాలు, మజ్జిగ విరివిగా దొరికే పల్లెలలో ఉదయం 8 దాటితే పాలు ఉండటం లేదు. మరోవైపు పాల ఉత్పత్తి ఖర్చు పెరుగుతున్నది. సహజ పశువుల మేత తగ్గుతున్నది. పశువులు మేసే గడ్డి మైదానాలు దాదాపు లేనట్లే! పశువులకు కావాల్సిన నీరు, నీడ సహజంగా దొరికే పరిస్థితులు లేవు. ఇంకొక వైపు పాల నాణ్యత మీద అనుమానాలు పెరుగుతున్నాయి. పాడి పశువులు కాలుష్యపు నీళ్ళలో పెరిగిన గడ్డి మేస్తే, ఆ గడ్డి నుంచి కలుషితాలు వాటి శరీరంలోకి చేరి, పాల ద్వారా మనుష్యులకు చేరతాయి.పాల కథ –1 పశువులు స్వేచ్ఛగా తిరగగలిగే ప్రదేశాలు దాదాపుగా లేవు. చెట్లు, కమ్యునిటీ స్థలాలు తగ్గినాయి. గుట్టలు కూడా ప్రైవేటు పరం అవుతున్నాయి. దానివల్ల పాడి పశువుల సంఖ్య తగ్గిపోతున్నది. పశు పోషకుల సంఖ్య తగ్గుతున్నది. పాడి పశువులను పోషించే జ్ఞానం, నైపుణ్యం తగ్గుతున్నది. వరి, జొన్న, మక్క లాంటి పంటల నుండి వచ్చే మేత కూడా లేదు. చొప్ప, ఎండు గడ్డి వంటివి రైతులు పొలంలోనే కాలబెడుతున్నారు. పశు గ్రాసం ప్రత్యేకంగా పండించాల్సి వస్తున్నది. పశు పోషకులకు భూమి లేదు. ఉన్నా ఆ భూమి ఇతర ఉపయోగాలకు వాడటం వల్ల పశుగ్రాసం మీద శ్రద్ధ లేదు. వ్యవసాయ భూమి ఉన్నవాళ్ళు పశు వులను పోషించడం లేదు. ఆ యా పంటలకు రసాయనాలు పిచికారీ చేయడం వల్ల పశువులు తినలేవు. తిన్నా అనారోగ్యం పాలు కావచ్చు. చనిపోవచ్చు కూడా. జన్యుమార్పిడి బీటీ ప్రత్తి చేలలో తిరిగిన పశు వులు, గొర్రెలకు చర్మవ్యాధులు వచ్చినాయి. ఆకులు తిన్న గొర్రెలు చనిపోయినాయి. దరిమిలా, పాశ్చాత్య దేశాల మాదిరి ‘స్టాల్ అని మల్స్’ పరిస్థితికి చేరుకుంటున్నాము. పెద్ద డెయిరీలతో కాలుష్యంపాడి పశువులను ఒకే దగ్గర కట్టేసి, పాలు పిండి అమ్మే వ్యాపార వ్యవస్థను డెయిరీ అని పిలుస్తారు. చైనా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో డెయిరీగా పిలిచే పశు పాలు, మాంసం ఉత్పత్తి కేంద్రాలు చాల పెద్దవి. వాటిని ఫ్యాక్టరీ ఫామ్స్ అంటారు. ప్రపంచంలో అతి పెద్ద 10 ఫ్యాక్టరీ ఫామ్స్‌లో పై రెండు చైనాలో ఉన్నాయి. తరువాత 8 ఆస్ట్రేలియాలో ఉన్నాయి. అతి పెద్ద చైనా ఫామ్‌లో లక్ష ఆవులు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఒక ఫ్యాక్టరీ ఫామ్‌లో కేవలం యాభై మంది 55 వేల పశువులను నిర్వహిస్తారు. ఇటువంటి ఫ్యాక్టరీ డెయిరీలు ప్రపంచ పర్యావరణానికి అతి పెద్ద ముప్పుగా పరిణమించాయి. వీటి నుంచి వచ్చే రసాయన, కాలుష్య జలాల వలన నీటి వనరులు కలు షితం అవుతున్నాయి. క్రిమి–కలుపు సంహారకాలు, హార్మోన్లు,యాంటీ బయాటిక్స్, ఫాస్ఫేట్ అధికంగా ఉండే ఎరువులు, బ్యాక్టీ రియా–సోకిన ఎరువులు దీనికి కారణం.అమెరికాలో 2022 నాటికి పాతిక వేల డైరీ ఫామ్‌లు ఉన్నాయి. 10,000 మంది డెయిరీ రైతులు ఉన్నారు. 27 దేశాల యూరోపియన్ యూనియన్ కూటమిలో పాడి రైతుల సంఖ్య 1.34 లక్షలు. ఇక్కడ అత్యధికంగా పాడి ఆవులను పోషించే దేశాలు జర్మనీ, ఫ్రాన్ ్స, నెద ర్లాండ్స్. భారతదేశంలో పది పశువులు లేదా అంతకంటే తక్కువ ఉన్న డెయిరీ ఫామ్‌లు 7.5 కోట్లు. భారత్‌లోనే చాలావరకు డెయిరీ ఫామ్‌లు చిన్న–స్థాయి, కుటుంబ యాజమాన్యంతో నడిచేవి.అంత పెద్ద డెయిరీ ఫామ్‌లు భారతదేశంలో లేకున్నా పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. ప్రపంచం మొత్తంలో 24% వాటాను అందిస్తున్న ఈ ఉత్పత్తి దాదాపు 21 కోట్ల టన్నులు. అధిక పాల దిగుబడికి పేరుగాంచిన భారతదేశంలో బర్రెల జనాభా ఎక్కువ. అయినా పాడి పరిశ్రమ సంక్షోభంలో ఉన్నది. ప్రాథమిక పాడి రైతు లకు గిట్టుబాటు ధర రాని పరిస్థితులున్నాయి.పాలు ఇచ్చే పశువులు బర్రెలు, ఆవులు. ఇవి ఎక్కువగా భారత దేశంలో వాడతారు. పాలు ఇంకా వివిధ రకాలుగా తీసుకోవడం జరుగుతుంది. గాడిద పాలు, మేక పాలు శ్రేష్ఠమైనవి అని భావించే వారు ఉన్నారు. బెంగళూరులో ఒక కుటుంబం గాడిదతో పాటు ఇంటింటికి తిరుగుతూ లీటర్ రూ.500లకు అమ్ముతున్న వైనం చూశాం. మొక్కలు, పండ్ల నుంచి వచ్చే పాలు కూడా ఈ మధ్య ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అమెరికాలో ఇబ్బడిముబ్బడిగా పండించే సోయా నుంచి తీసే పాలు అనేక ఆహార పదార్థాలలో వాడుతున్నారు. అయితే పశువుల నుంచి పాలను సేకరించడం హింసగా భావించే వారు ఉన్నారు. పశువుల పాలు పడనివారు మొక్కల పాలను ఆశ్ర యిస్తున్నారు. ఇటీవల మొక్కల నుంచి తీసుకునే పాల వ్యాపారం విపరీతంగా పెరిగింది. 2019లో మొక్కల పాల మార్కెట్ విలువ 12 బిలియన్ డాలర్లు దాటిందని అంచనా.పశువు ఒక యంత్రమా?తరతరాల నుంచి పాలు సేకరించి జీవించే యాదవులు, ఇంకా ఇతర వృత్తుల వారు ఉన్నారు. పశువులకు రోగాలు రాకుండా చూసుకునే జ్ఞానం, నైపుణ్యం వీరికి సంప్రదాయంగా ఉండింది. వీరు చేసే వ్యాపారంలో పాడి పశువులను ప్రేమగా చూసుకోవడం కీలకం.అందినంత పిండుకునే తత్వం లేదు. లేగ దూడను తల్లి నుంచి వేరు చేయరు. ఫలితంగా, పాలు నిత్యం ఒకే పరిమాణంలో ఉండేవి కావు. ఉండవు కూడా. పాలు ప్రకృతి ఉత్పత్తి. ఒక మర యంత్రం నుంచి వచ్చినట్లు రోజు ఒకే పరిమాణంలో రావాలని లేదు.పశువులకు ఇవ్వాల్సిన గ్రాసం, దాణా, ఇతర నిర్వహణ ఖర్చులు పెరిగాయి. రాను రాను ఒక కుటుంబం ఆధారపడే పాడి పశువుల జీవ నోపాధి సమస్యలలో పడింది. ప్రభుత్వాలు పాడి పశువుల కొనుగోలుకు కొన్ని పథకాలు పెట్టాయి తప్పితే, పశు గ్రాసం కొరకు కావాల్సిన భూమి, పశు వుల నివాసానికి భూమి వగైరా వాటి మీద దృష్టి లేదు.పాశ్చ్యాత్య దేశాలు పాడి పశువును ఒక యంత్రంగా మార్చాయి. పాల ఉత్పత్తి పెంచడానికి ‘హైబ్రిడ్’ అవును తెచ్చారు. అది సరి పోలేదని ఆవుల పొదుగును రెండింతలు, మూడింతలు పెంచారు. ఆ పొడుగులతో అవి నడవలేక యాతన పడుతున్నా పట్టించుకోలేదు. దాణాలో మార్పులతో పాల ఉత్పత్తి పెరుగుతుందని భావించి అందులో మార్పులు చేస్తూనే ఉన్నారు. గడ్డి తినే ఆవులకు లేగ దూడల మాంసం తినిపించినందుకు బ్రిటన్‌లో పూర్వం ‘మ్యాడ్ కౌ’ వ్యాధి వచ్చి అనేక ఆవులు చనిపోయినాయి. పశువుల శరీరాన్ని ఒక పరిశోధన కేంద్రంగా మార్చేశారు. అనుచిత ఆహారం ఇవ్వడం వల్ల పశువులకు వ్యాధులు వస్తున్నాయి. అపాన వాయువు ఎక్కువ అవుతున్నది. ఇది పర్యావరణానికి హాని కలిగిస్తు న్నది అని చెప్పి, ఇప్పుడు పాడి పశువులలో ‘జన్యుమార్పిడి’ ప్రయ త్నాలు కూడా చేస్తున్నారు. ఈ రకమైన పరిశోధన మానవుల నైతిక తను ప్రశ్నిస్తున్నది. జన్యుమార్పిడి పాడి పశువుల ద్వారా ఔషధాలను ఉత్పత్తి చేయడం, పాల దిగుబడిని పెంచడం, వ్యాధులను నిరోధించాలని పరిశోధనలు చేస్తున్నారు. కొమ్ములు రాని జన్యు మార్పిడి పాడి పశువుల గురించిన పరిశోధన చేస్తున్నారు. కొమ్ములు ఉంటే ఇతర పశువులను, యజమానులను పొడుస్తున్నాయని ఈ రక మైన పరిశోధనలు చేస్తున్నారు. మేలు జాతి పశువుల కొరకు అవలంబిస్తున్న కృత్రిమ గర్భధారణ పద్ధతి కూడా ఫలించడం లేదు. ఫలించక పోగా, మేలు స్థానిక పశు జాతులను కలుషితం చేస్తున్నారు. పాల ద్వారా విషాలుపాడి పశువులు కాలుష్యపు నీళ్ళలో పెరిగిన గడ్డి మేస్తే, ఆ గడ్డి నుంచి కలుషితాలు వాటి శరీరంలోకి చేరి, పాల ద్వారా మనుష్యులకు చేరతాయి. కొన్ని రకాల గడ్డి భార లోహాలను నేల తీసుకుంటుంది. ఆ గడ్డి ద్వార సీసం, ఇంకా ఇతర ప్రమాదకర భార లోహాలు పాలు తాగే వారికి చేరుతున్నాయి. పాడి పశువులకు ఇచ్చే దాణా ద్వారా కూడా మనుషులు తమను తామే కలుషితం చేసుకుంటున్నారు. పడేసిన చికెన్ బిరియాని, బ్రెడ్డు ముక్కలు వగైరా బర్రెలకు, ఆవులకు పెడుతున్నారు. పాడి పశువులకు ఇచ్చే ఆహారాన్ని బట్టి పాలు ఉంటాయని పశువుల యజమానులకు తెలుసు. వినియోగదారులకు తెలియదు. తెలిసినా ఏమి చేయలేక మిన్నకుంటారు. సహజ గ్రాసం తినని పశువు పాలలో పోషకాలు ఉండే అవకాశం తక్కువ. పాలలో తగ్గిపోతున్న పోషకాల మీద మన దేశంలో పరిశోధనలు లేవు. చెయ్యాలి.డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
ఓ గొర్రె... 45 కిలోమీటర్లు!
గాండ్లపెంట: పట్టుమని రూ.10 వేలు విలువ కూడా చేయని గొర్రెను అపహరించి ఓ కుటుంబం చిక్కుల్లో పడింది. ఆద్యంతం సినీ ఫక్కీలో జరిగిన ఈ అపహరణలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వివరాలు...కోలారు జిల్లా నుంచి వస్తూ..కర్ణాటకలోని కోలారు జిల్లా రాయపాడు గ్రామానికి చెందిన తిమ్మప్ప,... తన కుమారుడు రాజేష్, కుమార్తె ఆశతో కారులో సోమవారం తిమ్మమ్మ మర్రిమాను సందర్శనకు బయలుదేరారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మీదుగా తిమ్మమ్మ మర్రిమానుకు ఉన్న అడ్డదారిలో ప్రయాణిస్తున్న వారు.. మార్గ మధ్యంలో తంబళ్లపల్లి మండలం ఎద్దులోళ్లకోట గ్రామం వద్ద రోడ్డు పక్కన విడిది చేసిన గొర్రెల మంద నుంచి ఓ గొర్రెను అపహరించి కారులో వేసుకున్నారు. విషయాన్ని గమనించిన కాపరి వెంటనే కేకలు వేయడంతో కారును ఆపకుండా ముందుకెళ్లిపోయారు.45 కిలోమీటర్ల ఛేజింగ్..గొర్రెల కాపరి కేకలు విన్న చుట్టుపక్కల కొందరు యువకులు వెంటనే అప్రమత్తమై ద్విచక్ర వాహనాల్లో కారును వెంబడించారు. ఈ క్రమంలోనే కారు వెళుతున్న మార్గంలో రెక్కమాను, గాండ్లపెంటలో తనకు తెలిసిన జీవాల వ్యాపారులకు బాధిత కాపరి ఫోన్ చేసి విషయం తెలపడంతో వారు ఆయా ప్రాంతాల్లో కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కారును ఆపకుండా తిమ్మప్ప ముందుకు దూసుకెళ్లాడు. దీంతో దాదాపు 45 కిలోమీటర్ల మేర ఛేజింగ్ జరిగింది. చివరకు వ్యాపారుల నుంచి సమాచారం అందుకున్న గాండ్లపెంట పోలీసులు సైతం కారును ఆపే ప్రయత్నం చేయగా అక్కడ కూడా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ రోడ్డుకు అడ్డంగా నిలిపిన వాటర్ ట్యాంక్‌ను ఢీకొన్నారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం తంబళ్లపల్లి పోలీసులకు అప్పగించారు. అపహరించిన గొర్రెతో పాటు కారునూ స్వాధీనం చేశారు. నిందితులను అడ్డుకుని అదుపులోకి తీసుకోవడంలో చొరవ చూపిన కదిరి రూరల్ సీఐ నాగేంద్ర, ఎస్ఐ కృష్ణవేణిని స్థానికులు అభినందించారు. -
జీవాలు తగ్గినయ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గొర్రెలు, మేకల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 2019తో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 32 శాతం జీవాలు తగ్గినట్టు సామాజిక, ఆర్థిక సర్వే–2024 గణాంకాలు చెబుతున్నాయి. ఈ గణాంకాల ప్రకారం.. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా 1,90,81,605 గొర్రెలు, 49,06,465 మేకలు కలిపి మొత్తం 2,39,88,070 జీవాలుండేవి. కానీ ఐదేళ్ల తర్వాత గణన చేపడితే ఆ సంఖ్య 1.62 కోట్లకు తగ్గిపోయిందని (32.40%) సర్వే వెల్లడించింది. రాష్ట్రంలోని 1,75,115 కుటుంబాల వద్ద ప్రస్తుతం 1,24,14,299 గొర్రెలు, 38,02,609 మేకలు కలిపి 1,62,16,908 జీవాలున్నాయని తెలిపింది.వరంగల్‌లో 5 లక్షలు గాయబ్జిల్లాల వారీగా పరిశీలిస్తే మేడ్చల్ జిల్లాలో అత్యధిక శాతం జీవాలు తగ్గాయని ఆర్థిక సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక్కడ గొర్రెలు, మేకలు కలిపి 2019లో 1.89 లక్షలు ఉంటే 2014కు వచ్చేసరికి ఆ సంఖ్య 74 వేలకు తగ్గిపోయింది. వరంగల్‌లో అత్యధికంగా ఐదేళ్లలో ఐదు లక్షల వరకు జీవాలు మాయమయ్యాయి. 2019లో వరంగల్ జిల్లాలో 8.3 లక్షలున్న జీవాలు 2024కు వచ్చేసరికి 3.33 లక్షలకు తగ్గిపోయాయి.అదే విధంగా సంగారెడ్డిలో 3.50 లక్షలు, మెదక్‌లో 3.9 లక్షలు, నిజామాబాద్‌లో 4.2 లక్షలు, సిద్దిపేటలో 4.5 లక్షలు.. ఇలా పెద్ద సంఖ్యలో జీవాలు తగ్గిపోయా యని గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు కారణాలేవైనా ఇంత పెద్ద సంఖ్యలో జీవాల తగ్గుదల మంచిది కాదని, ఆయా జిల్లాల్లో త్వరలోనే మాంసం సంక్షోభం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పశుసంవర్ధక అధికారులు చెబుతున్నారు. గత ఐదేళ్లలో వనపర్తి, గద్వాల, మంచిర్యాల, నల్లగొండ జిల్లాల్లో కొంతమేర జీవాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది.గొర్రెలు కావాలి మహాప్రభోవాస్తవానికి 2017లో సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. దాదాపు రూ.5వేల కోట్లకు పైగా వెచ్చించి 3.5 లక్షల మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేసింది. దీంతో అటు జీవాల సంఖ్యలోనూ, మాంసం ఉత్పత్తిలోనూ తెలంగాణలో భారీ వృద్ధి కనిపించింది. ఆ గొర్రెలు ఇప్పుడు ఏమయ్యాయన్నది ఆసక్తి కలిగిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ఈ గొర్రెల పథకంలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఇలావుండగా రెండోవిడత గొర్రెల పంపిణీ కోసం రాష్ట్రంలోని సుమారు 3 లక్షల మంది గొర్రెల కాపరులు ఎదురుచూస్తున్నారు. 85 వేలకు పైగా లబ్ధిదారులు ఇప్పటికే డీడీలు తీశారు. వారికి సంబంధించిన రూ.430 కోట్లు ఇంకా కలెక్టర్ల ఖాతాల్లోనే మూలుగుతున్నాయి. మరో 2.20 లక్షలకు పైగా లబ్ధిదారులు డీడీలు తీయాల్సి ఉంది. -
తెలంగాణలో గొర్రెల స్కాం.. విచారణలో ఏసీబీ దూకుడు
సాక్షి,హైదరాబాద్ : గొర్రెల స్కాం దర్యాప్తులో ఏసీబీ దూకుడు పెంచింది. గొర్రెల పంపిణీపై వివరాలు కావాలని తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్యకు లేఖ రాసింది. ఆ లేఖలో లబ్దిదారులు, అమ్మకం దారుడి వివరాలు, బ్యాంక్ అకౌంట్లు, డేటా ఆఫ్ గ్రౌండింగ్,ట్రాన్స్ పోర్ట్, ఇన్ వాయిస్‌లతో కూడా డేటా కావాలని ఆదేశించింది.ఇప్పటికే గొర్రెల స్కాంపై ఈడీ కేసు నమోదు చేసింది. స్కీంకు సంబంధించిన సమగ్ర నివేదిక కావాలని కోరింది. అయితే ఇప్పటివరకు ఈడీకి నివేదిక అందలేదని తెలుస్తోంది.ఈడీ,ఏసీబీ లేఖలతో తలలు పట్టుకోవడం అధికారుల వంతైంది. దర్యాప్తు సంస్థల ఆదేశాలతో అధికారులు గొర్రెల స్కాంకు సంబంధించి వివరాల్ని సేకరించేందుకు సిద్ధమయ్యారు. ఆయా జిల్లాల వారీగా కలెక్టర్లకు లేఖలు రాస్తున్నారు. రూ.1000 కోట్ల అక్రమాలు జరిగినట్టురాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పంపిణీలో రూ.1000 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. గొర్రెల పంపిణీలో భాగంగా మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు.. తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది. -
గొర్రెల స్కామ్ లో అరెస్టులు..
-
మందలో నాకే పే........ద్ద కొమ్ములు
దొర్నిపాడు: వర్షాలు కురుస్తుండటంతో పొలాల్లో ఖరీఫ్ పనులకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన గొర్రెకాపరులు స్వగ్రామాలకు తమ మందలతో తిరుగు పయనమయ్యారు. డబ్ల్యూ.గోవిందిన్నె, చాకరాజువేముల గ్రామాల నుంచి మందలు వెళ్తుండగా అందులో ఓ పొట్టేలు ‘మా మందలో నాకే పే....ద్ద కొమ్ములు ఉన్నాయి’ అనేలా గంభీరంగా కనిపించింది. నిజమేనా అని కాపరిని ఆరా తీయగా ‘అవును ఒక్కో కొమ్ము అడుగున్నర పొడవు ఉంది. మిగతా వాటికి ఉన్నప్పటికీ దీనంత పొడవు లేవు. సంతానోత్పత్తి కోసం ఇలాంటి పొట్టేళ్లు పెంచుతున్నాం. ఊళ్లలో నుంచి వెళ్తున్నప్పుడు ప్రజలు ఈ పొట్టేలును వింతగా చూస్తుంటారు’ అని కాపరి తెలిపాడు. -
గొర్రెల కేసులో మరో ఇద్దరు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: గొర్రెల కొనుగోలు పథకం నిధుల గోల్మాల్ కుంభకోణంలో ఏసీబీ అధికారులు మరో ఇద్దరు పశుసంవర్ధకశాఖ అధికారులను అరెస్టు చేశారు. పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ డా.అంజిలప్ప, పశుసంవర్థక శాఖ రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ డా.పి.కృష్ణయ్యను అరెస్టు చేసినట్టు ఏసీబీ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. గొర్రెలు కొనకుండానే ఈ ఇద్దరు అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కలిసి గొర్రెలు విక్రయించిన రైతులు అంటూ నకిలీ రైతుల పేరిట ధ్రువపత్రాలను కలెక్టర్లకు సమర్పించినట్టు వెల్లడించారు. ఇలా నకిలీ రైతులకు కలెక్టర్ల నుంచి డబ్బులు కూడా మంజూరు చేయించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇద్దరు నిందితులను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చినట్టు పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో ఇప్పటికే ఆరుగురు అధికారులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతా అడ్డగోలు వ్యవహారమే.. అరెస్టయిన ఇద్దరు అధికారులు అంజిలప్ప, పి.కృష్ణయ్య గొర్రెల కొనుగోలుకు సంబంధించిన నిబంధనలను పూర్తిగా తుంగలోతొక్కి ప్రైవేటు వ్యక్తుల చేతికి కొనుగోలు వ్యవహారాన్ని అప్పగించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. గొర్రెల కొనుగోలుకు వెళ్లిన అధికారులు, అసిస్టెంట్ డైరెక్టర్లు సైతం ప్రైవేటు వ్యక్తులు చెప్పినట్టు వినాలని సదరు అధికారులు ఆదేశించినట్టు గుర్తించారు. గొర్రెలు విక్రయించేది ఎవరు అన్నది చూడకుండానే ప్రైవేటు వ్యక్తులు చెప్పినట్టుగా గొర్రెలను కొనడం, ప్రభుత్వ అధికారులు నింపాల్సిన ధ్రువపత్రాలను సైతం ప్రైవేటు వ్యక్తులే నింపడం, గొర్రెలను కొనుగోలు చేయకుండానే నకిలీ పత్రాలు సృష్టించి వాటిని పశుసంవర్థకశాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం..ఇలా నిందితులిద్దరు అడ్డగోలుగా వ్యవహరించినట్టు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. మొత్తం రూ.2.10 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టడంలో ఈ ఇద్దరు అధికారులది కీలకపాత్ర అని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలిపారు. -
TS: గొర్రెల పంపిణీ స్కాం.. పరారీలో కీలక నిందితులు
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ స్కాంలో ఇద్దరు కీలక నిందితులు విదేశాలకు పరారైనట్లు అధికారులు గుర్తించారు. విదేశాలకు పారిపోయిన నిందితులు ఫిర్యాదు దారులను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులను ఏసీబీ అరెస్టు చేసింది. ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్, ఒక డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్లను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. రవి, ఆదిత్య కేశవ సాయి, రఘుపతి రెడ్డి, సంగు గణేష్‌లను ఏసీబీ అరెస్ట్ చేసింది. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు తెరిచిన పశుసంవర్ధన శాఖ అధికారులు.. 2.10 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను మళ్లించారు. రికార్డుల పరిశీలన, బాధితుల నుంచి వివరాలు సేకరించి ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. బినామీల పేర్లతో నిధులను దారి మళ్లించారనే ఆధారాలను సేకరించారు. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్ల పాత్రలపైనా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయన ఇటీవల కాగ్ కూడా తన నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
TS: గొర్రెల స్కాం కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: గొర్రెల స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గొర్రెల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులను ఏసీబీ అరెస్టు చేసింది. ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్, ఒక డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్లను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. రవి, ఆదిత్య కేశవ సాయి, రఘుపతి రెడ్డి, సంగు గణేష్‌లను ఏసీబీ అరెస్ట్ చేసింది. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు తెరిచిన పశుసంవర్ధన శాఖ అధికారులు.. 2.10 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను మళ్లించారు. రికార్డుల పరిశీలన, బాధితుల నుంచి వివరాలు సేకరించి ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. బినామీల పేర్లతో నిధులను దారి మళ్లించారనే ఆధారాలను సేకరించారు. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్ల పాత్రలపైనా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయన ఇటీవల కాగ్ కూడా తన నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
గొర్రెకు మేకపిల్ల జననం
దేవరుప్పుల: జనగామ జిల్లా దేవరుప్పుల మండలం గొల్లపల్లిలో కోనేటి సోమయ్యకు చెందిన గొర్రెకు మేకపిల్ల జన్మించింది. శనివారం జరిగిన ఈ వింతను చూసి పెంపకందారులు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన జనగామ–సూర్యాపేట రహదారి పక్కనే జరగడంతో బాటసారులు సైతం ఆసక్తిగా గమనించారు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయమై మండల పశువైద్యాధికారి సింధుప్రియ మాట్లాడుతూ ఒకే మందలో గొర్రెలు, మేకలు తిరిగినప్పుడు అనుహ్య సంపర్క ప్రక్రియతో ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయని పేర్కొన్నారు. -
వ్యాధి ఏదైనా.. ఒక్క గొర్రెతోనే మొదలు
అనంతపురం అగ్రికల్చర్: ఏ వ్యాధి ప్రబలినా తొలుత ఒక గొర్రెతోనే మొదలవుతుందని, సకాలంలో దానిని గుర్తించి పశు వైద్యున్ని సంప్రదించడం ద్వారా తగిన జాగ్రత్తలతో వ్యాధి విస్తరించకుండా జీవాలను కాపాడుకోవచ్చని పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ వై.సుబ్రహ్మణ్యం, పశువ్యాధి నిర్ధారణ కేంద్రం (ఏడీడీఎల్) ఏడీ డాక్టర్ ఎన్.రామచంద్ర అన్నారు. ఇటీవల కురిసిన తేలికపాటి వర్షాలు, పెరిగిన గాలులు, మారిన వాతావరణ పరిస్థితులకు జీవాల్లో ప్రమాదకరమైన నీలినాలుక వ్యాధి (బ్లూటంగ్), మూతిపుండ్లవ్యాధి, కాలిపుండ్లవ్యాధి (ఫుట్రాట్) సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వీటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ► నీలి నాలుక (బ్లూటంగ్), మూతి పుండ్ల వ్యాధి సోకితే జ్వరం, మూతి వాపు, పెదవులు దద్దరించడం, నోటి లోపల పుండ్లు, ముక్కులో చీమిడి, కాళ్లు కుంటు, ఒంట్లో నీరు చేరి పారుకోవడం, మేత మేయకపోవడం, ఈసుకుపోవడం (అబార్షన్)తో పాటు 30 శాతం వరకూ మరణాలు సంభవిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వ్యాధి సోకిన గొర్రెను వేరు చేసి పశువైద్యున్ని సంప్రదించి సరైన చికిత్స చేయించాలి. సాయంత్రం పూట గొర్రెల మందలో వేపాకు పొగ వేయడం, అపుడప్పుడు బ్లూట్యాక్స్ లేదా టెక్కిల్ మందుతో పిచికారీ చేస్తుండాలి. పొడి ప్రాంతాల్లోనే మేపునకు తీసుకెళ్లాలి. ఈ ఏడాది ఇప్పటి వరకూ బ్లూటంగ్కు సంబంధించి 15.18 లక్షల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. ► కాలిగిట్టల మధ్య చీము చేరడం, చెడు వాసన రావడం లాంటి లక్షణాలు కనిపిస్తే కాలిపుండ్లవ్యాధిగా గుర్తించాలి. బురద ప్రాంతాల్లో జీవాలను మేపకూడదు. నట్టల నివారణ మందులు తాగించాలి. కాపర్లూ ఈ సూచనలు పాటించండి.. వ్యాధి వల్ల చనిపోయిన జీవాల కళేబరాలను అమ్మకూడదు, తినకూడదు. ఊరికి దూరంగా గుంత తవ్వి సున్నం చల్లి పాతిపెట్టాలి. కొన్ని జీవాలు చనిపోయే వరకూ ఆరోగ్యంగా ఉన్నట్లుగానే మొండిగా మేత మేస్తూ ఉంటూ ఉన్నఫలంగా మరణిస్తాయి. పై లక్షణాలు కనిపించిన వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు, అమ్మకూడదు. జీవాలకు ఎప్పుడూ పారే నీళ్లు, బోరు నీళ్లు తాగించాలి. నిల్వ ఉన్న నీటిని ఎలాంటి పరిస్థితుల్లోనూ తాపరాదు. జబ్బు బారిన పడిన ఒక గొర్రెను సకాలంలో గుర్తించకపోతే మిగిలిన గొర్రెలకూ విస్తరించే ప్రమాదముంది. జబ్బు బారిన పడి మృతిచెందిన గొర్రె లేదా దాని పేడ, ఇతర అవయవాలు సేకరించి వెంటనే పశువైద్యున్ని సంప్రదించాలి. -
నచ్చితే తీస్కో..! లేదంటే మూస్కో..!! గొర్రెల పంపిణీలో ‘గోల్మాల్’..
ఆదిలాబాద్: గొల్ల, కుర్మలు, యాదవుల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం జిల్లాలో క్షేత్ర స్థాయిలో ఆశించిన ఫలితాలు అందించడంలో విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కొక్క యూనిట్ ధర రూ.1.75లక్షలు ధర నిర్ణయించిన ప్రభుత్వం తన వాట కింద రూ.1,31,250 చెల్లించగా, లబ్ధిదారుడు రూ.43,750 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 20 గొర్రెలు, ఒక పొటెలు కొనుగోలుకు రూ.1.50 లక్షలు పోగా, మిగిలిన రూ. 25వేలతో గొర్రెల తరలింపు మందులు కొనుగోలు, ఇన్సురెన్స్ కోసం నిధులు కేటాయించడం జరిగింది. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రభుత్వం రెండో విడత పంపిణీకి శ్రీకారం చుట్టింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 3597 మంది లబ్ధిదారులు డీడీలు కట్టారు. ఒక్కొక్క లబ్ధిదారుడు రూ.43,750 చొప్పున మొత్తం రూ.15.73 కోట్ల డీడీలు చెల్లించారు. దాదాపు సంవత్సర కాలంగా ఎదురుచూడగా ఈ ఏడాది జూలైలో యూనిట్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవీ విధివిధానాలు... మొదటి విడత గొర్రెల పంపిణీలో రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల అక్రమాలు జరిగినట్లు తేలడంతో ప్రభుత్వం పంపిణీ విధివిధానాలను మరింత కఠినతరం చేసింది. గొర్రెల ఎంపికలో మండల పశువైద్యాధికారుల పాత్రను తగ్గించి జిల్లా , రాష్ట్ర స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. దీనికోసం జిల్లా పశువైద్యాధికారి పర్యవేక్షణలో జిల్లా అధికారి, రాష్ట్ర స్థాయి అధికారితో కూడిన టీంను సిద్ధం చేశారు. లబ్ధిదారులు అధికారులతో కలిసి స్వయంగా గొర్రెల విక్రయించే వారి వద్దకు వెళ్లి కొనుగోలు చేసేలా, కొనుగోలు సమయంలో ప్రత్యేకమైన ట్యాబ్‌ల్లో ఆన్లైన్లో తమ ఇష్టపూర్వకంగా గొర్రెలను ఎంపిక చేసుకున్నట్లు వాయిస్ మెసెజ్ అప్లోడ్ చేసేలా నిబంధనలు చేర్చారు. 447 యూనిట్ల పంపిణీ... ఈ ఏడాది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో జిల్లా వ్యాప్తంగా రూ.7.80 కోట్లతో మొత్తం 447 యూనిట్లు (9387 గొర్లు) పంపిణీ చేశారు. మొత్తం 3597 మంది డీడీ కట్టగా, ఇప్పటి వరకు కేవలం 447 మందికే గొర్లు పంపిణీ చేశారు. ఇంకా 3150మందికి గొర్లు రావాల్సి ఉంది. వీరంత సంవత్సర కాలంగా ఒక్కొక్కరు రూ. 43,750 చొప్పున డీడీలు చెల్లించారు. ఎన్నికల కోడ్ వస్తుందని సర్వత్రా చర్చలు నడుస్తుండటంతో తాము కట్టిన డబ్బులు అయిన తిరిగి వస్తే చాలు అన్న పంథాలో లబ్ధిదారులు ఉన్నారు. దీంతో కొంత మంది అధికారులు, నాయకులు వీరి నిస్సహాయతను సొమ్ము చేసుకుంటున్నారు. నచ్చితే తీస్కో.. లేదంటే మూస్కో.. గొర్రెల పంపిణీలో అక్రమాలను నివారించడానికి ప్రభుత్వం కఠినమైన విధివిధానాలను రూపొందించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆగడం లేదు. పక్క రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కోదాడ మండలం నుంచి మాత్రమే గొర్రెలు కొనుగోలు చేస్తున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. కోదాడ మండలంలోని నాలుగు గ్రామాల్లో గొర్రెల లభ్యత ఉండగా లబ్ధిదారులను అక్కడికే పంపించి గొర్రెలను తీసుకునేలా బలవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ అప్పటికే అనారోగ్యంతో ఉన్నవి, చెవికి ట్యాగ్ గాయాలతో ఉన్న (పలుమార్లు ఏమార్చి ఇన్ష్యూరెన్స్ చేయబడినవి) గొర్లను కట్టబెడుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. మా దృష్టికి రాలేదు.. జిల్లాలో గొర్రెల పంపిణీలో ఎలాంటి అక్రమాలు మా దృష్టికి రాలేదు. నిబంధనల ప్రకారం, లబ్ధిదారులు స్వయంగా వెళ్లి గొర్రెలు తెచ్చుకుంటున్నారు. గొర్రెల రవాణా కోసం వినియోగించే వాహనాలకు సైతం జీపీఎస్ ట్రాకింగ్ అమర్చడం జరిగింది. లబ్ధిదారుల గ్రామాలకు గొర్రెలు చేరిన తరువాత కూడా ఫొటోలు ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైన అక్రమాలు జరిగినట్లు మా దృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. –కిషన్, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి కట్టింది రూ.43వేలు.. ఇచ్చేది రూ.90వేలే... లబ్ధిదారులు గొర్రెలను ఎంపిక చేసుకున్న తరువాత అధికారులు జీపీఎస్ ట్యాగ్ ఉన్న ఐచర్ వాహనాల్లో, ఒక్కొక్క వాహనంలో ఆరు యూనిట్ల చొప్పున గొర్రెలను లబ్ధిదారుల గ్రామాలకు తరలిస్తున్నారు. అక్కడ సర్పంచ్, గొల్లకుర్మ కమిటీ అధ్యక్షుడు, లబ్ధిదారుడు, స్థానిక పశువైద్యాధికారి సమక్షంలో ఐచర్ ఫొటోలు, గొర్రెల ఫొటోలు తీసీ ఆన్లైన్లో పెడుతున్నారు. అనంతరం రెండు, మూడు రోజుల్లో గొర్రెలు అమ్మిన వ్యక్తి బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం ఒక్కొక్క యూనిట్‌కు రూ.1.50లక్షలు జమ చేయడం జరుగుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ అసలు కథ ఇక్కడే ప్రారంభం అవుతుంది. ముందుగానే కుదుర్చుకున్న డీల్ ప్రకారం తన ఖాతాల్లో డబ్బులు పడగానే సదరు గొర్రెలు అమ్మిన వ్యక్తి ఒక లారీతో ఆయా గ్రామాలకు వచ్చి లబ్ధిదారులకు యూనిట్‌కు రూ.90వేలు చెల్లించి తాను ఇచ్చిన గొర్రెలను మరల లారీలో ఎక్కించుకొని వెళ్లిపోతాడు. లబ్ధిదారులే అమ్ముకుంటున్నారని వారిని బద్నాం చేసే పనులు అధికారులు చేస్తున్నప్పటికీ అధికారులు, నాయకుల అండదండలతోనే ఇదంతా జరుగుతుందని లబ్ధిదారుల వాదన. -
గొర్రెల రాజు.. కోట్లు ఇచ్చినా ఆ పని మాత్రం చేయడట!
చాలాకాలం కిందట సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. బహుశా పాకిస్తాన్ నుంచి అనుకుంటా.. తనను దూరం చేయొద్దంటూ ఓ మూగజీవి తన ఓనర్‌ను బతిమాలినట్లు ఉన్న వీడియో నెట్లో ట్రెండ్ అయ్యింది. అయితే.. కుటుంబం గడవడానికి ఆ యజమానిని దానిని అమ్మేయక తప్పలేదు. కానీ, ఇక్కడో గొర్రెల ఓనర్ మాత్రం అలా కాదు. కోటి రూపాయలు ఇచ్చినా కూడా తన మందలోని ఆ గొర్రెను మాత్రం అమ్మేయడంట. రాజస్థాన్ చురూ జిల్లాలో ఏడాది వయసున్న ఓ గొర్రె పిల్ల.. ఏకంగా కోటి రూపాయలకు పైగా రేటు పలుకుతోంది. అలాగని అదేం భారీ సైజులో లేదు. కానీ, దాని ఓనర్ రాజు సింగ్‌కు మాత్రం అది ఎంతో ప్రత్యేకమంట. అందుకే ఇంట్లోకి తెచ్చి మరీ పెంచుకుంటున్నాడు దానిని. కోటి కాదు కదా.. వందల కోట్లు ఇచ్చినా అమ్మేయడంట. అందుకు కారణం ఉంది. రాజు సింగ్‌ను స్థానికంగా గొర్రెల రాజు అని పిలుస్తారు. తన మందలోని గొర్రెలను వారాంతపు సంతలో అమ్మేస్తుంటాడతను. అయితే రాజు ఒకరోజు ఆ ప్రత్యేకమైన గొర్రె పొట్ట భాగంలో ఏదో అక్షరాల మాదిరి ఉండడం గమనించాడట. అది ఉర్దూ భాషగా కొందరు చెప్పడంతో.. తన ఊరిలోని ముస్లిం పెద్దలను సంప్రదించాడతను. అది 786 నెంబర్ అని.. తమ పవిత్రమైన నెంబర్ అని ముస్లిం పెద్దలు చెప్పడంతో రాజు సింగ్ దానిని అమ్మకూడదని నిర్ణయించుకున్నాడట. బక్రీద్ సందర్భంగా ఆ గొర్రెకు లక్షల నుంచి కోటి దాకా డిమాండ్ వెళ్లినా.. రాజు సింగ్ మాత్రం ఆ గొర్రెను అమ్మేయడానికి సిద్ధంగా లేడు. అల్లా ముస్లిం దేవుడు. కానీ, దేవుడి దయ తమ కుటుంబంపై ఉంటుందనే ఉద్దేశంతో ఆ గొర్రెను తన ఇంట్లోకి తెచ్చి మరీ పెంచుకుంటున్నాడు రాజు సింగ్. అంతేకాదు.. దానిని దానిమ్మలు, బొప్పాయిలు, మిల్లెట్లు పెట్టి అపరూపంగా చూసుకుంటున్నాడు. రిస్క్ రేటు ఎక్కువగా ఉండడంతో.. దానిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. అలా.. స్థానికంగా సెలబ్రిటీ గొర్రెగా మారిపోయిందది. ఇదీ చదవండి: ఒకే వేదికపై రెండు పెళ్లిళ్లు.. అంతలో షాక్ -
రెండు వేల గొర్రె తలలను ప్రసాదంగా ఉంచారట!
కుక్కలు, మేకలు, ఆవులు, గజెల్స్, ముంగిసలు మమ్మీలుగా ఉండటం గురించి వినలేదు కదా!. కానీ అమెరికా పురావస్తు శాస్త్రజ్ఞులు ఈజిప్టులో వాటిని కూడా మమ్మీలుగా ఉంచినట్లు గుర్తించారు. జంతువుల మమ్మీలను అమెరికా పురావస్తు బృందం దక్షిన ఈజిప్టులోని అబిడోస్ నుంచి వెలికితీసింది. అక్కడ దేవాలయాల వద్ద జంతువుల మమ్మీల సమాధులకు ప్రసిద్ధి. కీ.పూ 1304 నుంచి 1237 వరకు దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఫారో రామ్సేస్2 అనే రాజు ఈజిప్టుని పాలించాడట. దీంతో ఆయన మరణాంతరం ఆయనకో దేవాలయాన్ని కట్టారు. అయితే ఆయన మరణించిన వెయ్యేళ్లకు గుర్తుగా ఆయన ఆరాధనలో గొర్రె తలలను అర్పించేవారట. అంటే వేల గొర్రెలను శిరచ్ఛేదనం చేసి ఆయనకు నైవేద్యంగా పెట్టేవారని పురావస్తు శాఖ సుప్రీం కౌన్సిల్ మోస్తఫా వాజిరి తెలిపారు. క్రీ.పూర్వం 2374 నుంచి214 మధ్య కాలం రామ్సెస్ 2 ఆలయానికి సంబంధించిన కార్యకలాపాలు, నిర్మాణాలు గురించి తెలుస్తాయని వెల్లడించారు. అంతేగాదు ఈ ప్రదేశంలో మమ్మీగా చేయబడిన జంతు అవశేషాల తోపాటు దాదాపు 4 వేల ఏళ్లక్రితం నాటి ఐదు మీటర్ల మందం గోడలతో కూడిన ప్యాలెస్ అవశేషాలను కూడా కనుగొన్నారు. అక్కడ అనేక విగ్రహాలు, పురాతన చెట్ల అవశేషాలు, తోలు బట్టలు, బూట్లను గుర్తించారు. కైరో నదికి దక్షిణంగా నైలు నిదిపై దాదాపు 270 మైళ్ల దూరంలో ఈ అబిడోస్ ఉంది. ఇక్కడ సేటీ 1 వాటి శవపేటికల ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. కైరోలో ఎప్పుడూ ఇలాంటి కొత్తకొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తుండటం విశేషం. దాదాపు 105 మిలియన్ల మంది నివాసం ఉండే ఈజిప్టు ఆర్థిక సంక్షోబంలో చిక్కుకుంది. అంతేగాదు అక్కడ సుమారు 10 శాతం జీపీడీ పర్యాటకంపైనే ఆధారపడి ఉంది. పైగా ఇది సుమారు రెండు మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. అయితే కైరో కరోనా మహమ్మారికి ముందు సుమారు 13 మిలియనల మందిని లక్ష్యంగా చేసుకుంటే 2028 నాటికి సుమారు 30 మిలియన్ల మంది టార్గెట్‌గా పెట్టుకుని పర్యాటకాన్ని పునరుద్ధరించాలని భావిస్తోంది. (చదవండి: ఎదురెదురుగా రెండు విమానాలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం) -
ఎన్ని అడ్డంకులు ఎదురైన నీ అవ్వా తగ్గేదేలే.. కొండ మేకను వెంటాడి వేటాడిన చిరుత !
-
రైలు ఢీకొని 82 గొర్రెలు మృతి
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చినమెట్‌పల్లి సమీపంలోని రైల్వేట్రాక్ వద్ద ఆదివారం మధ్యాహ్నం గూడ్సు రైలు ఢీకొని 82 గొర్రె లు మృతి చెందాయి. కాపరి గొర్రెలను పట్టాలు దాటిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. సుమారు రూ.8 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు బాధితుడు లక్కం రాజం ఆవేదన వ్యక్తం చేశా డు. లక్కం రాజంను ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్ తెలిపారు. -
నీటి మడుగులో కాచుకున్న మొసలి.. రిస్కు చేసి గొర్రెను కాపాడి!
వనపర్తి: గొర్రెను నోట కరుచుకుని నీటిలోకి జారుకుంటున్న మొసలితో పోరాడి తీవ్రంగా గాయపడ్డాడొక కాపరి. మొసలి దాడి చేసిన గొర్రె చిన్న గాయంతో ప్రాణాలు దక్కించుకోగా.. దాన్ని కాపాడిన కాపరి ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రాంపురం శివారు ప్రాంతంలోని కృష్ణా నదిలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. పెబ్బేరు మండలం రాంపురం గ్రామానికి చెందిన కొరి రాములు, బీసన్నలకు చెందిన 300 గొర్రెలను మేత కోసం నెల రోజుల క్రితం కృష్ణానది మధ్యలో ఉన్న గుర్రంగడ్డ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ పొలాల్లో గొర్రెలను మేపుకొని కృష్ణా నదిలోని గుంతల్లో నిల్వ ఉన్న నీటిని తాగిస్తుండేవారు. ఎప్పట్లాగే శుక్రవారం సాయంత్రం వేళ గొర్రెలను నదిలో నీరున్న గుంతల వద్దకు తీసుకెళ్లారు. గుంపులోని ఒక గొర్రె నీటిని తాగేందుకు వెళ్లగా.. మడుగులోని మొసలి దానిపై దాడి చేసింది. గొర్రె అరుపులు విన్న కాపరి కొరి రాములు చేతిలోని కర్రతో మొసలిపై దాడి చేశాడు. దీంతో మొసలి గొర్రెను వదిలేసి కాపరిపై దాడి చేసి.. అతని రెండు చేతులు, కడుపు భాగంలో గాయపరిచింది. కాపరి చేతుల్ని నోట కరుచుకొని నీటిలోకి మొసలి లాక్కెళ్తుండగా.. రాములు అరుపులు విన్న సహచర కాపరి బీసన్న రాళ్లతో దానిపై దాడి చేశారు. దీంతో మొసలి రాములును వదిలి నీటిలోకి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన రాములును 108 అంబులెన్స్‌లో వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యానికి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం తన తండ్రి పరిస్థితి నిలకడగానే ఉందని రాములు కుమారుడు మల్లేశ్ తెలిపాడు. రాములు అధైర్యపడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని సహచర కాపరి బీసన్న తెలిపాడు. -
విచిత్రమైన కేసు: గొర్రెకు మూడేళ్లు జైలు శిక్ష!
మన దేశంలో ఎవరైన హత్యలు చేస్తే వారికి శిక్ష పడటానికి చాలా టైం పడుతుంది. ఆధారాలు, సాక్షాలు పక్కాగా ఉండి నేరం రుజువైతే గానీ నిందితుడికి శిక్ష పడదు. ఒకవేళ ప్రమాదవశాత్తు ఏ జంతువు దాడిలోనో మనిషి చనిపోతే పట్టించుకునే వాడే ఉండడు. మహా అయితే సదరు జంతువు యజమాని మంచివాడైతే నష్టపరిహారంగా ఎంతో కొంత ఇస్తేరేమో గానీ ఎక్కువ శాతం మంది తప్పించుకునేందుకే చూస్తారు. కానీ ఇక్కడొక ఆఫ్రికా దేశంలో ఒక జంతువు మనిషిని దాడి చేసి చంపినందుకు మూడేళ్లు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకెళ్తే...దక్షిణ సూడాన్‌లో రామ్ అనే గొర్రె 45 ఏళ్ల అదీయు చాపింగ్‌పై దాడి చేసింది. దీంతో ఆమె గాయాలపాలై మరణించింది. ఈ ఘటన రుంబెక్ ఈస్ట్‌లోని అకుయెల్ యోల్ అనే ప్రదేశంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు రామ్ అనే గొర్రెని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడమే కాకుండా కస్టమరీ కోర్టులో ప్రోడ్యూస్ చేశారు. ఈ మేరకు కోర్టు రామ్ అనే గొర్రె కి మూడేళ్లు జైలు శిక్ష విధిచింది. రామ్(గొర్రె) యజమాని డుయోని మాన్యాంగ్ బాధితురాలి కుటుంబానికి ఐదు ఆవులు అప్పగించాలని తీర్పు ఇచ్చింది. శిక్షలో భాగంగా రామ్(గొర్రె) లేక్స్ స్టేట్‌లోని సైనిక శిభిరంలో గడుపుతుందని తెలిపింది. అంతేకాదు శిక్ష ముగింపులో గొర్రెని యజమాని డుయోని కోల్పోయే అవకాశం కూడా ఉందని స్పష్టం చేసింది. అంటే దక్షిణ సూడాన్ చట్టాల ప్రకారం ఏదైన జంతువు దాడిలో వ్యక్తి చనిపోతే ఆ జంతువుని శిక్షా కాలం ముగింపులో బాధితుడు కుటుంబానికి పరిహారంగా ఇచ్చేస్తారు. ఈ మేరకు ఇరు వర్గాలు పోలీసులు సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు కూడా. ఇదిలా ఉండగా గొర్రెల దాడిలో వ్యక్తి మృతి చెందడం ఇదేం తొలిసారి కాదు. గతేడాది కూడా అమెరికాలో ఓ మహిళ పొలంలో గొర్రెల దాడికి గురై మరణించింది. (చదవండి: సౌదీ ఏవియేషన్ చరిత్రలో తొలిసారి..) -
మదనపల్లెలో దారుణం.. పొట్టేలు తల అనుకుని యువకుని తల..
సాక్షి, మదనపల్లె: పొట్టేలు అనుకుని యువకుని తల నరికిన ఘటన మండలంలో కలకలం రేపింది. వివరాలు.. మదనపల్లె మండలం వలసపల్లెలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి కనుమ పండుగను నిర్వహించారు. ఇందులో భాగంగా ఊరి పొలిమేరలో గ్రామదేవతకు జంతు బలి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తలారి లక్ష్మణ కుమారుడు తలారి సురేష్(35) పొట్టేలను పట్టుకుని ఉన్నాడు. మరో తలారి గంగన్న కుమారుడు చలపతి మద్యం మత్తులో పొట్టేలును నరకబోయి సురేష్ తల నరికేశాడు. తీవ్ర రక్తస్రావం అవడంతో బాధితుడిని స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఫాస్ట్‌ఫుడ్ లేదన్నాడని.. కత్తితో తెగబడ్డాడు) -
చిట్టమ్మ పెంచుకున్న పొట్టేలే.. ‘ఊపిరి’ తీసింది!
సాక్షి, ఎర్రవల్లిచౌరస్తా (అలంపూర్): పెంచుకున్న పొట్టేలే.. వెనక నుంచి బలంగా పొడవడంతో ఓ మహిళ చేపల చెరువులో పడి ఊపిరాడక మృతి చెందింది. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని యాక్తాపురంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు కథనం మేరకు... యాక్తాపురానికి చెందిన బోయ చిట్టెమ్మ (40), భర్త రాముడు గత ఆరు నెలల నుంచి మూడు పొట్టేళ్లను పెంచుతున్నారు. రోజులానే శనివారం కూడా పొట్టేళ్లను గ్రామం నుంచి తిమ్మాపురం గ్రామ సమీపంలోని తన పొలం దగ్గరికి మేపేందుకు చిట్టెమ్మ తీసుకెళ్లింది. పొలం దగ్గరున్న చేపల చెరువు కట్టపై పొట్టేళ్లు మేస్తుండగా అకస్మాత్తుగా ఓ పొట్టేలు వెనుక నుంచి బలంగా చిట్టెమ్మను ఢీకొట్టింది. దీంతో ఆమె ఒక్కసారిగా చెరువు నీటిలో పడిపోయింది. గమనించిన స్థానికులు నీటి నుంచి ఆమెను బయటికి తీయగా అప్పటికే మృతి చెందింది. ఇదిలాఉండగా, ఇదే పొట్టేలు 20 రోజుల క్రితం చిట్టెమ్మను, 10 రోజుల క్రితం భర్త రాముడిని పొడవడంతో గాయపడ్డారు. సరైన ధర వస్తే ఈ పొట్టేళ్లను విక్రయించాలని అనుకున్నా.. అంతలోనే యజమాని ప్రాణం తీసిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలికి భర్తతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. చదవండి: ('ప్రేమపెళ్లి.. జ్యోతుల నెహ్రూ నుంచి ప్రాణహాని ఉంది') -
షీప్ కాదు.. జపనీస్ పప్పీ
‘‘పత్తిపూల మెరుపు.. పట్టుకుచ్చులందం.. వెన్నెల పోతపోసుకున్న వెన్నముద్ద’’ ఈ ఫొటోలో తెల్లటి అందమైన గొర్రెను తలపిస్తున్నది ఓ బుజ్జి కుక్కపిల్ల. ఇది పూడిల్ జాతికి చెందిన జపనీస్ పప్పీ. మైదానంలో కుందేలులా గంతులేస్తున్న గోమా(కుక్కపిల్లపేరు)... ఇన్‌స్టాలో అందరి హృదయాలను గెలుచుకుంది. హెయిర్‌కట్‌కు ముందు.. హెయిర్ కట్ తరువాత... ప్రొఫెషనల్ మోడల్లా ఫొటోలకు పోజులిచ్చింది. -
మళ్లీ వచ్చావా.. జర ఆగు.. నీకు రెండు పంచ్లిస్తా!
ఎక్కడైనా ఎవరైనా కొట్లాటకు దిగితే కోడి పుంజుల్లా ఢీకొంటున్నారనో, పొట్టేళ్ల తరహాలో తలపడుతున్నారనో అనడం సర్వసాధారణం. ఇవి తలపడితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కాబట్టే మనుషుల కొట్లాటను వీటితో పోల్చుతూ ఉంటారు. పొట్టేళ్ల పందాలు ఏదైనా పండుగ వచ్చిన సందర్భంలోనే ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. పొట్టేళ్ల కొట్లాట అంటే జనానికి కూడా మహా సరదాగా ఉంటుంది. మరి పండుగలప్పుడే కాకుండా ఎక్కడైనా పొట్టేళ్లు తలపడటం మన కంటపడితే కాసేపి ఆగి చూసి ముచ్చటపడిపోతూ ఉంటాం. ఇలా విజయనగరం జిల్లా, కురుపాం ఏజెన్సీ లో రెండు పొట్టేళ్లు కొట్లాడుకోవడం కెమెరాకు చిక్కడమే కాదు.. వైరల్‌గా కూడా మారింది. ముందు ఒక పొట్టేళు.. మరొక పొట్టేళు డొంకల్లోకి తోసేస్తే, ఆ తర్వాత ఆ పొట్టేళు కూడా సమరానికి సై అంటుంది. ఈసారి తానేంటో చూపెడతా అనే విధంగా పైకి ఎగిరి మరీ తలతో రెండు పంచ్‌లు ఇస్తుంది. -
ఏడేళ్లలో 60 లక్షల మేర పెరిగిన పశు సంపద
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పశు సంపద ఏడేళ్ల కాలంలో 60 లక్షల మేర పెరిగినట్టు తెలంగాణ ఎట్ ఏ గ్లాన్స్–2021 నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 2012లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,66,96,109 పశువులు, గొర్రెలు, ఇతర మూగజీవాలు ఉండగా, 2019 నాటికి వాటి సంఖ్య 3,26,40,639కి చేరింది. ఆ తర్వాతి రెండేళ్లు కలిపితే ఈ సంఖ్య మూడున్నర కోట్లకు చేరుతుందని అంచనా. ఇందులో అత్యధికంగా గొర్రెలు 1.90 కోట్ల వరకు ఉన్నాయని ఈ నివేదికలో పేర్కొన్నారు. 2012లో 1.28 కోట్లుగా ఉన్న గొర్రెలు, 2019 నాటికి 1.90 కోట్లకు చేరాయి. ఆ తర్వాత మేకలు 49 లక్షల వరకు ఉన్నాయి. 2012లో వీటి సంఖ్య 45 లక్షలు కాగా, ఏడేళ్లలో మరో నాలుగు లక్షలు పెరిగి 49 లక్షలకు చేరాయి. ఇక పశువుల విషయానికి వస్తే పాలిచ్చే పశువులు 42 లక్షలు, ఎద్దులు, దున్నపోతులు కలిసి 42 లక్షలకు పైగా ఉన్నాయి. పందులు 2012లో 1.77 లక్షలు ఉండగా, 2019 నాటికి వాటి సంఖ్య 2.37 లక్షలకు చేరింది. కోళ్ల విషయానికి వస్తే ఏడున్నర లక్షల వరకు ఉత్పత్తి తగ్గింది. 2012లో 8.07 కోట్లకు పైగా కోళ్లు ఉత్పత్తి కాగా, 2019లో 7.99 కోట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యాయని నివేదిక తెలిపింది. రూ.6,21,746 కోట్ల డిపాజిట్లు రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు, రుణాల వివరాలను కూడా ఈ నివేదిక వెల్లడించింది. 2020–21 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్రంలోని అన్ని పబ్లిక్, ప్రైవేట్ రంగాల బ్యాంకులు, విదేశీ బ్యాంకుల్లో కలిపి రూ.6,21,746 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని పేర్కొంది. రూ.5,61,844 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపింది. ప్రతి బ్యాంకులో సగటున ఆరుగురు పనిచేస్తున్నారని వివరించింది. -
ఆంత్రాక్స్ వ్యాధి కలకలం: మటన్ కొంటున్నారా..? జర జాగ్రత్త!
సాక్షి, దుగ్గొండి(వరంగల్): గ్రామాలలో గొర్రెలు చనిపోతే వాటిని మాంసం కోసం విక్రయించడం చేయవద్దని వాటిని గొయ్యి తీసి పాతిపెట్టాలని అధికారులు తెలిపారు. చనిపోయిన గొర్రెల శరీరాన్ని ఓపెన్ చేసి మాంసాన్ని విక్రయించడం వల్ల బ్యాక్టీరియా మనుషులకు చేరి అనారోగ్యం పాలవుతారని తెలిపారు. వరంగల్ జిల్లా చాపలబండా గ్రామంలోని గొర్రెల మందలో ఆంత్రాక్స్ వ్యాధితో నాలుగు గొర్రెలు మృత్యువాతపడిన విషయం విధితమే. వరంగల్ చాపలబండలో ఆంత్రాక్స్ వ్యాధితో నాలుగు గొర్రెలు చనిపోయిన నేపథ్యంలో మాసం కొనేముందు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అంత్రాక్స్ వ్యాధి సోకిన మేకలు, గొర్రెల మాంసాన్ని తాకడం, తినడం, కొనడం చేయవద్దన్నారు. చదవండి: లీటర్ పెట్రోల్ రూ.112... భారీగా చార్జీలు పెంచేసిన జొమాటో, స్విగ్గీ, క్యాబ్స్! మేక/గొర్రెను కోసినప్పుడు వచ్చే రక్తం గడ్డకట్టకుండా ద్రవరూపంలో ఉంటే ఆంత్రాక్స్ సోకినట్లు గుర్తించాలన్నారు. అలాగే కనీసం 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో బాగా ఉడికించిన మాంసాన్నే తినాలని సూచించారు. చనిపోయి ఉన్న మూడు గొర్రెలను వెంటనే పాతిపెట్టాలన్నారు. అవి చనిపోయిన ప్రదేశంలో పడిన రక్తంపై ఎండు గడ్డివేసి మంట పెట్టాలని సూచించారు. అనంతరం బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నారు. అధైర్య పడవద్దని ఆంత్రాక్స్‌కు వ్యాక్సిన్ అందుబాటులో ఉందని తెలిపారు. అయితే ఆంత్రాక్స్‌తో చనిపోయిన గొర్రెలు ఉన్న మందను ఊరికి దూరంగా ఉంచాలన్నారు. కాపరులు గొర్రెలకు కొంత దూరంగా ఉండి మేపాలన్నారు. చదవండి: డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై ఊడిపడిన ఫ్యాన్.. హెల్మెట్ డాక్టర్స్! అజాగ్రత్తగా ఉంటే మనుషులకు సోకే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. గ్రామంలో మిగిలిన 1200 గొర్రెలకు వెంటనే వ్యాక్సినేషన్ ప్రారంభించాలని స్థానిక వైద్యాధికారి శారదకు సూచించారు. చాపలబండలో ఐదేళ్ల పాటు ప్రతి 9 నెలలకోసారి గొర్రెలు, మేకలకు ఆంత్రాక్స్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. గొర్రెలన్నింటిని కొన్ని రోజుల పాటు ఊరికి దూరంగా ఉంచి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
చేపలు, గొర్రెలతో ఉపాధి కల్పిస్తే ఉద్యోగం కాదా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో చేపలు, గొర్రెలు, బర్రెలు పంపిణీ చేస్తుంటే, ఆ కులవృత్తులను కించపరిచేలా కొందరు మూర్ఖులు విమర్శలు చేస్తున్నారని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ధ్వజమెత్తారు. చేపలు, గొర్రెలతో ఉపాధి కల్పిస్తే అది ఉద్యోగం కాదా? అని ప్రశ్నించారు. ఏ కులమైనా ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు ముఠా గోపాల్, రేగా కాంతారావు చేప పిల్లల పెంపకంపై అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ ఏడాది 4 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని, వీటి విలువ సుమారు రూ.5,600 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. -
పొట్టేలుతో గుంటక తోలిన రైతు
ఎమ్మిగనూరు రూరల్: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం వెంకటగిరిలో రైతు పింజరి రంజాన్ తన పత్తి పొలంలో పొట్టేలుతో గుంటక తోలాడు. రంజాన్ తనకు ఉన్న ఎకరం పొలంలో పత్తి పంటను సాగు చేస్తున్నాడు. వర్షాలు బాగా కురవడంతో పత్తి చేలో గడ్డిమొక్కలు పెరిగాయి. వీటిని తొలగించాలంటే ఎద్దులతో గుంటక తోలాలి. ఇందుకు రూ.1,000 తీసుకుంటారు. అంత సొమ్ము పెట్టలేని రైతు శనివారం తను పెంచుకుంటున్న పొట్టేలును అరకకు కట్టి గుంటక తోలాడు. పొట్టేలు ముందు కుమారుడు గడ్డి చూపిస్తూ వెళ్తుంటే.. ఆ ఆశతో అది గుంటక లాగుతుండటం పలువురిని ఆకట్టుకుంది. తాను పేద రైతునని, ఎద్దులు కొనే స్థోమత లేక ఇలా సాగు చేసుకుంటున్నానని రంజాన్ తెలిపాడు. -
ఈ రోజు వేలకొద్దీ గొర్రెలు పారిపోయాయి.. ఎందుకో తెలుసా?
సాక్షి,సెంట్రల్ డెస్క్: అదంతా కొండలు, గుట్టలతో కూడిన ప్రాంతం.. ఓ రోజు అర్ధరాత్రి.. పక్కనే ఏముందో కూడా కానరానంతగా చిమ్మచీకటి కమ్ముకుంది.. అంతా నిశ్శబ్దం.. కానీ ఒక్కసారిగా ఏదో అలజడి. ఓ మందలోని గొర్రెలన్నీ కంచెను విరగ్గొట్టుకుని మరీ బయటికి పరుగెత్తడం మొదలుపెట్టాయి. కొంత దూరంలో ఉన్న మరో మందలోనూ ఇది మొదలైంది. కాసేపటికే చుట్టూ ఉన్న ఊర్లలోనూ అదే పరిస్థితి.. పదులు, వందలు కాదు.. వేలకొద్దీ గొర్రెలు.. ఒకే సమయంలో ఉన్నట్టుండి పిచ్చిపట్టినట్టు వగరుస్తూ పరుగెత్తాయి. మందలు ఉన్న కంచెలపై నుంచి దూకి, కొన్నిచోట్ల కంచెలను విరగ్గొట్టుకుని పారిపోయాయి. మధ్యలో పంటలను, తోటలను అన్నింటినీ ధ్వంసం చేసేశాయి. గొర్రెల యజమానులు పొద్దున లేచిచూసే సరికి.. మందలన్నీ ఖాళీ. ఇదేమిటని వెతకడం మొదలుపెడితే.. కిలోమీటర్ల దూరంలో మైదానాలు, పొదల్లో చెల్లాచెదురుగా ఉన్నాయి. కొన్ని అప్పటికీ వగరుస్తూ, ఏదో భయం భయంగా ఉన్నట్టు కనిపించాయి. ఇంగ్లండ్‌లోని ఆక్స్ఫర్డ్షైర్ కౌంటీలో 1888 నవంబర్ 3న ఈ ఘటన జరిగింది. తర్వాత ఐదేళ్లకు 1893 డిసెంబర్ 4న మరోసారి ఇలాగే వేలకొద్దీ గొర్రెలు పారిపోయాయి. ఈ ఘటనలు జనంలో తీవ్ర భయాందోళన రేకెత్తించాయి. అసలు ఏం జరిగిందన్నది ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పటికీ తేలని మిస్టరీ.. నిజానికి గొర్రెలు చాలా పిరికి జంతువులు. ముందు ఏదైనా చిన్నగా అడ్డంగా ఉన్నా దాటకుండా ఆగిపోతాయి. అలాంటిది ఏకంగా కంచెలను విరగ్గొట్టి మరీ పరుగెత్తడం, ఒకేసారి వేలకొద్దీ గొర్రెలు పారిపోవడం పెద్ద మిస్టరీగా మారింది. ఆస్తులు, పంటలకు భారీగా నష్టం జరిగింది. చాలా మంది శాస్త్రవేత్తలు ఇదేమిటో తేల్చేద్దామని ప్రయత్నించారు. ఉరుములు, పిడుగులకు భయపడ్డాయని.. స్వల్ప స్థాయి భూకంపం వచ్చి ఉంటుందని.. అడవి జంతువులు దాడిచేసి ఉంటాయని.. ఎవరో కావాలని అలా చేసి ఉంటారని.. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో కారణం చెప్తూ వచ్చారు. కానీ ఇవేవీ ఆ ఘటనను సరిగా తేల్చలేకపోయాయి. ఎందుకంటే.. గొర్రెలు పరుగెత్తింది ఒకటీ రెండు చోట్ల నుంచి కాదు.. పదుల సంఖ్యలో గ్రామాల నుంచి.. సుమారు 500 కిలోమీటర్ల వైశాల్యంలో ఒకే సమయంలో వేలకొద్దీ గొర్రెలు పారిపోయాయి. ఆ రోజు ఉరుములు, మెరుపులు, తుపాను వంటివేమీ రాలేదు కూడా. నల్లటి మేఘం కమ్మేసి.. ఈ ఘటన గుట్టు తేల్చేందుకు ఎంతో మంది శాస్త్రవేత్తలు ప్రయత్నించినా ఇప్పటికీ ఏమీ తేల్చలేకపోయారు. అయితే ఈ ఘటనపై స్థానిక అధికారులు ప్రభుత్వానికి రాసిన ఓ లెటర్లో కాస్త ఆసక్తికర అంశం ఒకటి ఉంది. ఈ రెండు ఘటనలు జరిగినప్పుడు కూడా.. ఆకాశంలో పెద్ద నల్లటి మేఘం కనిపించింది. మెల్లగా ఆ ప్రాంతమంతా ఆవరించింది. పక్కనే ఎవరు ఉన్నారో కూడా తెలియనంతగా చిమ్మ చీకటి కమ్ముకుంది. కాసేపటికే గొర్రెలన్నీ పారిపోవడం మొదలైంది. దీన్ని ఆధారంగా చేసుకునీ శాస్త్రవేత్తలు ఓ ప్రతిపాదన చేశారు. అసలేమీ కనిపించని చీకటి కారణంగా.. తమనెవరో బంధించారని, ఏదో జరగబోతోందని గొర్రెలు భయపడ్డాయని, కొన్ని గొర్రెలు అటూఇటూ పరుగెత్తడంతో మిగతావీ బెదిరి పారిపోయి ఉంటాయని పేర్కొన్నారు. ఇదీ జస్ట్ ఓ అంచనా మాత్రమే. అసలేం జరిగిందన్నది ఇప్పటికీ మిస్టరీనే.. చదవండి: ఊపిరి ఉన్నంతవరకూ కేసీఆర్ వెంటే.. -
బర్త్‌డే నాడు గొర్రెలతో ధర్నా.. గవర్నర్ మనస్తాపం
కలకత్తా: పశ్చిమ బెంగాల్లో మళ్లీ వాతావరణం వేడెక్కింది. నారద స్టింగ్ ఆపరేషన్‌లో ఇద్దరు మంత్రులు ఓ ఎమ్మెల్యే, ఓ నాయకుడిని సీబీఐ అరెస్ట్ చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ తీరుపై తీరొక్క నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గురువారం ఆయన జన్మదినం రోజు కూడా నిరసన ప్రదర్శనలు చేయడంతో ఆయన మనస్తాపం చెందారు. తాజాగా గవర్నర్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ గుర్తు తెలియని వ్యక్తులు రాజ్‌భవన్ ఎదుట గొర్రెలతో నిరసన వ్యక్తం చేశారు. గొర్రెలను తీసుకొచ్చి రాజ్‌భవన్ ఉత్తర ద్వారం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. కొద్దిసేపు అనంతరం భద్రతా సిబ్బంది గొర్రెలను వెళ్లగొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను గవర్నర్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ ఘటనపై గవర్నర్ జగ్దీప్ ధన్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న, ఈరోజు పరిస్థితి ఆందోళనగా మారిందని గవర్నర్ తెలిపారు. కలకత్తా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం రెచ్చగట్టే చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. నిన్న ఒకరు గవర్నర్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే కూడా పోలీసులు ఏం చేయడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ లేఖ విడుదల చేశారు. And on this stance @KolkataPolice (laughable one) is that the man was keen to have photo with Raj Bhawan background. No action whatsoever taken. pic.twitter.com/95mmLGghSC — Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) May 19, 2021 State of law and order @MamataOfficial even at the main entry gate of Raj Bhawan worrisome with stance police @KolkataPolice leaving all to be desired. And all this when the area is subject to 144 CrPC prohibitory orders. Constrained to seek an update on it. pic.twitter.com/HIiD7bTf67 — Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) May 19, 2021 -
గొర్రెకు మసాజ్ చేస్తున్న పిల్లి
-
Viral Video: గొర్రెకు మసాజ్ చేస్తున్న పిల్లి
పిల్లి ఏం చేసినా క్యూట్‌గా ఉంటుందంటారు క్యాట్ లవర్స్. కానీ దొంగలా పాలు తాగి ఏమీ ఎరగనట్టు నటించే ఆ మూగజీవిని చూస్తే చిర్రెత్తిపోతారు మరికొందరు. అయితే ఇక్కడ మాత్రం ఓ పిల్లి ఎలాంటి దొంగ వేషాలు వేయకుండా ఓ గొర్రెకు మసాజ్ చేసి నిద్ర పుచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో గొర్రె , పిల్లి మంచి ఫ్రెండ్స్‌గా మారాయి. గొర్రె కింద పడుకుంటే పిల్లి దాని వీపు మీద ఎక్కింది. ఏదో పరుపుపై పడుకున్నట్లుగా హయిగా అక్కడే సెటిలైంది. అంతటితో ఆగకుండా అది గొర్రెకు మసాజ్ చేయడం మొదలు పెట్టింది. పిల్లి తన రెండు కాళ్లతో గొర్రెను పైకి కిందకు నొక్కుతుంటే అది హాయిగా పడుకుంది. నిండుగా ఉన్న గొర్రె బూరులో పిల్లి తల దూర్చి మరీ పడుకుంది. ఇంత జరుగుతున్నా గొర్రె మాత్రం ఎటూ కదలకుండా నిద్రలో మునిగిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'పిల్లి ఎంత బాగా మసాజ్ చేస్తుంది', 'గొర్రె అలసిపోయిందేమో.. కనీసం లేవడం లేదు', 'అది పిల్లి చేస్తున్న మసాజ్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లుంది', 'పిల్లి మాకు కూడా మసాజ్ చేస్తుందా..' అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. -
కుక్కల దాడిలో 40 గొర్రె, మేక పిల్లలు మృతి
నరసన్నపేట: కుక్కల దాడిలో 40 జీవాలు ప్రాణాలు కోల్పోయాయి. ఈ సంఘటన సత్యవరంలో శనివారం సాయంత్రం చోటుచేసుకోగా పాశిన నాగేష్కు చెందిన 30 గొర్రె, 10 మేక పిల్లలు మృతి చెందాయి. నాగేష్ తన ఇంటి ఆవరణలో పెద్ద గూడులో వీటిని ఉంచి ఇతర పనులపై కుటుంబ సభ్యులంతా బయటకు వెళ్లారు. ఆ సమయంలోనే కుక్కల మంద దాడి చేయడంతో జీవాలు చనిపోయాయి. లక్ష రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. చదవండి: కరోనా బారిన పడి డీఎస్పీ మృతి గుంటూరులో దారుణం: వృద్ధురాలిపై లైంగిక దాడి -
ఇదేం తలనొప్పి.. ఒక్కో పొట్టేలుకు ఒక్కో కానిస్టేబుల్ కాపలా
సాక్షి, బంజారాహిల్స్: అవి అసలే పోటీ పొట్టేళ్లు.. ఒక్కోదాని బరువు 60 కేజీల పైనే.. ఒక్కోసారి అవి ఆరడుగుల మనిషిని కూడా లేపి అవతల పారేస్తాయ్. ఇలాంటి పొట్టేళ్లతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హకీంపేట్‌లో శుక్రవారం అక్రమంగా పోటీలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు పొట్టేళ్లను అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ పొట్టేళ్లను అదుపుచేయడం మాత్రం పోలీసులకు తలనొప్పిగా మారింది. పొట్టేళ్లను పోలీస్ స్టేషన్‌లోనేమో పెట్టలేరు.. బండికి కట్టేసినా తెంచుకొని పోతాయి. ఈ నేపథ్యంలో అష్టకష్టాలు పడిన పోలీసులు ఎలాగోలా వీటిని స్టేషన్ వెనుక ఉన్న సిమెంటు బల్లలకు కట్టేసి ఒక్కో పొట్టేలు వద్ద ఒక్కో కానిస్టేబుల్‌ను కాపలా పెట్టారు. వీటిని వెటర్నరీ హాస్పిటల్లో అప్పగించేంత వరకు పోలీసులకు తలప్రాణం తోకలోకి వచ్చింది. అన్నట్లు ఇందులో ఒకదానిపేరు వీర్.. మరోదాని పేరు మాలిక్. 15 మంది నిర్వాహకులను అరెస్ట్ చేసి..వీరి వద్ద నుంచి 60 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
Reindeer: దుప్పి పాలు రుచి చూస్తారా!
పాలు అంటే మనకు సాధారణంగా గుర్తుకు వచ్చేది అవులు, గేదెలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో మేకపాలు, గొర్రె పాలు కూడా తాగుతారన్న విషయం మనకు తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాల్లో పాల కోసం దుప్పి (రైన్డీర్)ని పెంచుతారన్న విషయం మీకు తెలుసా? స్కాండినేవియా ప్రాంతంలో ఈ రైన్డీర్ పాలు వినియోగిస్తారు. అతి తక్కువ పరిమాణంలో లభించే ఈ పాలను పోషకాల ఘనిగా చెప్పవచ్చు. ఈ పాలలో 20 శాతం కొవ్వు 10 శాతం ప్రొటీన్లు ఉంటాయి. అయితే ఒక్కో రైన్డీర్ రోజుకి ఒకటి నుంచి రెండు కప్పుల పాలు మాత్రమే ఇస్తుంది. భౌగోళిక, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఏఏ జంతువుల పాలు వినియోగిస్తారో చూద్దాం.. ఒంటె (సోమాలియా, కెన్యా) ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే పాడి జంతువు ఒంటె. ఇవి సుమారు వారం రోజుల పాటు నీరు తాగకుండా జీవించగలవు. సోమాలియా, కెన్యాలు ప్రపంచంలో అత్యధికంగా ఒంటె పాలను ఉత్పత్తి చేస్తున్న దేశాలు. ఒంటెలు రోజుకు 5 నుండి 20 లీటర్ల పాలు ఇస్తాయి. ఆవు పాలతో పోల్చితే ఒంటె పాలు చిక్కగానూ, రుచిలో కాస్త ఉప్పగానూ ఉంటాయి. గేదె (ఇండియా, పాకిస్తాన్) ఇండియా, పాకిస్తాన్లలో పాల ఉత్పత్తికి ప్రధాన ఆధారం పాడి గేదెలు. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం పరిమాణంలో 80 శాతానికిపైగా గేదె పాలు ఈ రెండు దేశాల్లోనే ఉత్పత్తి అవుతున్నాయి. గేదెలు ఆవుల కన్నా ఎక్కువ పాల దిగుబడిని ఇస్తాయి. భారత్‌లో గుజరాత్‌లోని సూరత్ చుట్టు పక్కల ప్రాంతాల్లో గేదె పాలతో తయారుచేసే ‘సూర్తి పనీర్’ అనే మృదువైన జున్ను (చీజ్)కు విశేషమైన గుర్తింపుఉంది. సాహివాల్ (ఇండియా, పాకిస్తాన్) ఇండియా, పాకిస్తాన్లలో ప్రధానంగా కనిపించే మరో పాడి ఆవు సాహివాల్. ఇది పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రం సాహివాల్ జిల్లా పరిసర ప్రాంతాల్లో వృద్ధి చెందిన దేశవాళీ ఆవు. మన దేశంలో ఉత్తర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ దేశీ జాతి ఆవులు కనిపిస్తాయి. వీటిలో రోజుకు 10 నుంచి 15 లీటర్ల పాల దిగుబడి సామర్థ్యం ఉంది. పాలలో వెన్న 5 నుంచి 10 శాతం వరకు ఉంటుంది. గుర్రం (మంగోలియా) గుర్రాలను ఎందుకు వినియోగిస్తారో అందరికీ తెలుసు. కానీ గుర్రం పాల గురించి చాలా మందికి తెలీదు. మంగోలియాలో గుర్రాలను వ్యవసాయంతోపాటు పాల ఉత్పత్తికి వాడుతున్నారు. ఇక్కడ గుర్రపు పాలను 24 నుంచి 48 గంటలపాటు పులియబెట్టి, చిలకడం ద్వారా కౌమిస్ (లేదా ఐరాగ్) అనే పానీయాన్ని తయారు చేస్తారు. పుల్లగా ఉండే ఈ పానీయంలో 2 శాతం ఆల్కహాల్ ఉండటం విశేషం. యాక్ (జడల బర్రె) / (టిబెట్) యాక్ (జడల బర్రె) హిమాలయ ప్రాంతానికి చెందిన పాడి జంతువు. వీటి నుండి పాలతోపాటు ఉన్ని, మాంసం ఉత్పత్తి చేస్తున్నారు. చలికాలంలో కంటే వేసవిలో ఎక్కువ పాల దిగుబడి సామర్థ్యం కలిగి ఉండటం వీటి ప్రత్యేకత. ఆవు పాలతో పోల్చితే జడల బర్రె పాలలో కొవ్వులు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. వీటి పాలతో వెన్న, వివిధ రకాల చీజ్‌లను తయారు చేస్తారు. మేక (ఫ్రాన్స్) ఫ్రాన్స్‌లో మేక పాలు విరివిగా వినియోగిస్తున్నారు. ఇక్కడ మేక పాలను రకరకాల చీజ్ల తయారీలో ఉపయోగిస్తారు. సహజసిద్ధంగా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉండటం వల్ల మేక పాలను చర్మ సంరక్షణకు, సౌందర్య సాధనాల (కాస్మొటిక్స్) తయారీకి వినియోగిస్తున్నారు. మేక పాలలో కంటి చూపుకు మేలు చేసే ఎ–విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. రైన్డీర్ (పలవల దుప్పి)/ (ఫిన్‌ల్యాండ్) రైన్డీర్ పాలు చాలా అరుదుగా లభిస్తాయి. స్కాండినేవియా భూభాగంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రైన్డీర్లు సంచరిస్తున్నాయి. ఇవి రోజుకు ఒకటి నుంచి రెండు కప్పుల పాలు మాత్రమే ఇస్తాయి. ఈ పాలలో 20 శాతం కొవ్వు పదార్థం ఉండటంతో చిక్కదనంతో పాటు రుచిగా ఉంటాయి. ఫిన్‌ల్యాండ్‌లో రైన్డీర్ పాలను ‘లేపజువస్టో’ అనే జున్ను తయారీకి వాడతారు. గొర్రె (గ్రీస్) గొర్రె పాలకు గ్రీస్ ప్రసిద్ధి చెందింది. ఆవు పాలతో పోల్చితే గొర్రె పాలలో కొవ్వు శాతం ఎక్కువ. అందువల్ల ఇవి చీజ్ తయారీకి అత్యుత్తమైనవి. గ్రీస్‌లో గొర్రె పాలతో ఎన్నో వెరైటీల చీజ్‌లను తయారు చేస్తున్నప్పటికీ ‘ఫెటా చీజ్’ అనే వెరైటీని ఇక్కడ ఎక్కువ మంది ఇష్టపడతారు. గొర్రె పాలలో అధికంగా ఉండే కాల్షియం మన దంతాలను, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మూస్ (రష్యా, స్వీడన్) ప్రపంచ వ్యాప్తంగా చాలా అరుదుగా లభిస్తున్న మూస్ పాలను రష్యా, స్వీడన్ దేశాలలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. మూస్ రోజుకు 1 నుండి 6 లీటర్ల పాలను ఇస్తుంది. మూస్ పాలతో తయారయ్యే చీజ్ (మూస్ చీజ్) ప్రపంచంలో అత్యంత ఖరీదైన చీజ్‌గా గుర్తింపు పొందింది. ప్రపంచంలో మూస్ చీజ్‌ను తయారు చేస్తున్న ఏకైక కేంద్రం (మూస్ హౌస్) స్వీడన్‌లోని బ్జుర్హోమ్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ మూడు వెరైటీలతో మూస్ చీజ్‌లను తయారు చేస్తున్నారు. గాడిద పాలు గాడిద పాలు మంచి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ కలిగిఉన్నట్లు ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) ప్రకటించింది. రోగ నిరోధక శక్తిని పెంచే మెడిసినల్ వ్యాల్యూస్ కూడా గాడిద పాలలో ఉన్నాయి. విటమిన్లు, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెండ్లు పుష్కలంగా ఉంటాయి. గాడిద పాలు స్నానానికి ఉపయోగిస్తే చర్మం మృదువుగా మారుతుందని, చర్మ సంరక్షణ కలుగుతుందని శాస్త్రీయంగా నిరూపించడం జరిగింది. క్రీస్తు పూర్వం ఈజిప్టు రాణి క్లియో పాత్ర తన బ్యూటీని కాపాడుకోవడానికి గాడిద పాలతోనే స్నానం చేసేదట. ఇప్పటికీ అందానికి కేరాఫ్ అడ్రస్‌గా ఆమెనే చెబుతారు. -
ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న గొర్రె, స్పెషల్ ఏంటంటే..
ఇదేదో గొంగలి కప్పుకున్న గొర్రె కాదు.. ఐదేళ్లుగా షేవింగ్ చేయని గొర్రె.. ఈ మధ్యే ఆస్ట్రేలియాలోని అడవుల్లో కనిపించింది. కళ్లు మీదకు కూడా ఉన్ని వచ్చేసి.. దారి సరిగా కనపడక.. అంత భారాన్ని మోయలేక నీరసించిన దీన్ని లక్కీగా కొందరు పర్యాటకులు చూసి అధికారులకు సమాచారమిచ్చారు.. వారు వచ్చి.. ఈ గొర్రెను చూసి ఆశ్చర్యపోయారు. మామూలుగా గొర్రెలకు ఉన్ని తీయడానికి కొన్ని నిమిషాల టైం పడితే.. దీనికి గంట పట్టిందట.. అది ఎంత బరువుందో తెలుసా? 35 కిలోలు. ఇది ఒకప్పుడు ఏదో గొర్రెల ఫాంలో ఉన్నదేనని.. తప్పిపోయి అడవికి చేరి ఉంటుందని చెబుతున్నారు.. కొన్ని రోజులు ఇలాగే ఉండి ఉంటే.. నీరసించి.. చచ్చి ఉండేదట.. మొత్తమ్మీద గ్రహాంతర జీవిలా కనిపిస్తూ.. ఈ గొర్రె ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. -
గొర్రె, పొట్టేలుకు కల్యాణం: ఎందుకంటే?
‘కల్యాణం చూతము రారండి.. మా ఊళ్లో గొర్రె, పొట్టేలు కల్యాణం చూతము రారండి’ అంటూ అంగరంగ వైభవంగా జీవాలకు పెళ్లి బాజాలు మోగించారు. సంప్రదాయం ఉట్టిపడేలా వధూవరులుగా గొర్రె, పొట్టేలును సుందరంగా అలంకరించారు. తొలుత దొడ్డి గంగమ్మకు విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేక ప్రమిదలను వెలిగించి గౌరమ్మను ఆరాధించారు. అనంతరం గ్రామ హితం కోరుతూ శాస్త్రోక్తంగా జీవాలకు వివాహం జరిపించారు. సాక్షి, కేవీపల్లె(చిత్తూరు): మండలంలోని గ్యారంపల్లె పంచాయతీ కురవపల్లెలో ఆదివారం రాత్రి గొర్రె, పొట్టేలు కల్యాణం నిర్వహించారు. ఏటా సంక్రాంతి అనంతరం రెండు రోజులకు జీవాలకు వివాహం జరిపించడం ఆనవాయితీ. ఇలా చేయడం ద్వారా పంట పొలాలను చీడపీడల నుంచి, గొర్రెలను అంటు వ్యాధుల నుంచి గౌరమ్మ కాపాడుతుందని గ్రామస్తుల విశ్వాసం. వరుడి వైపు కిరణ్‌కుమార్, వధువు వైపు దామోదర్ కుటుంబసభ్యులు నిలిచి పెళ్లి తంతును వైభవంగా జరిపించాయి. పెద్దసంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. పురాతన ఆచారం తాతల కాలం నుంచి గొర్రె, పొట్టేలుకు పెళ్లి చేయడం ఆచారంగా వస్తోంది. గ్రామానికి మంచి జరగాలని, మూగ జీవాలను కాపాడాలని గౌరమ్మ పూజలు చేయడం ఆనవాయితీ. ఈ ఆచారంతో అంతా మంచే జరుగుతోంది. – కంబళ్ల రెడ్డెప్ప, గౌడు, కురవపల్లె పుణ్యకార్యంగా భావిస్తున్నాం పెద్దల కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని మేము కొనసాగించడం పుణ్యకార్యంగా భావిస్తున్నాం. గొర్రె, పొట్టేలుకు వివాహం చేయడం మా గ్రామంలో పెద్ద పండుగ. గౌరమ్మ అనుగ్రహంతో ఈ ఆచారాన్ని ఏటా సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నాం. – చామంచుల శ్రీరాములు, పినపెద్ద, కురవపల్లె -
టర్కీ వీధుల్లో అనుకోని అతిథుల హల్చల్
ఇస్తాంబుల్ : టర్కీలో నెవ్షేహిర్ ప్రాంతం అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం. ప్రజలంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఆ సమయంలో రోడ్డు మీదకు వచ్చిన ఒక గ్యాంగ్ హల్చల్ చేసింది. రోడ్డుపై ఉన్నవారిని భయపెట్టే విధంగా చర్యలకు పూనుకుంది. మనుషుల మీదకు పరిగెత్తడం.. తమకు అడ్డు వచ్చినవారిపై బౌతికదాడికి దిగడం చేశారు. దాదాపు అరగంట పాటు ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఇదంతా ఎవరైనా గుర్తు తెలియని అగంతకులు చేశారనుకుంటే మాత్రం పొరబడ్డట్టే. మరీ రోడ్డుపై హల్చల్ చేసిన ఆ గ్యాంగ్ ఎవరో తెలుసా.. ఒక గొర్రె, మేక, మరో మూడు గొర్రె పిల్లలు. అవును మీరు విన్నది నిజం.. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు గానీ.. ఆ గుంపుకు గొర్రె నాయకత్వం వహించగా.. మేక, గొర్రె పిల్లలు దానిని అనుసరించాయి. వీటి ప్రవర్తనతో రోడ్డుపై వెళ్తున్న పాదాచారులను పరుగులు పెట్టించాయి. వాటిని ఆపుదామని భావించినకొందరిని తమ తలలో గుద్దడానికి ప్రయత్నించి నానా హంగామా చేశాయి. అయితే ఈ ఘటన జరిగి మూడు రోజులవుతుంది. దీనిని వీడియో తీసిన నెవ్షెహిర్ మున్సిపాలిటీ అధికారులు ట్విటర్లో షేర్ చేసింది. షేర్ చేసిన కాసేపటికే 2.7 మిలియన్ వ్యూస్ రాగా.. వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. (చదవండి : సోదరిని పుట్టింటికి తీసుకెళ్లడానికి హెలికాప్టర్లో..) 1 koyun,1 keçi, 3 kuzu tarafından esir alınmış bulunmaktayız.... pic.twitter.com/hZWmMMj9U8 — Nevşehir Belediyesi (@nevsehir_bel) December 14, 2020 -
ఈ గొర్రె ధర రూ. 70 లక్షలు
పుణే: సాధారంగా ఒక గొర్రె కొనుగోలు ధర మహా అయితే రూ.5 నుంచి రూ. 10 వేల మధ్యలో ఉంటుంది. కానీ, మాడ్గల్ జాతి గొర్రె అందుకు భిన్నం అని నిరూపించింది. అది చాలా అరుదైన గొర్రె జాతి, దాని మాంసానికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. తాజాగా మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఓ వ్యక్తి రూ.70 లక్షలు పెట్టి మాడ్గాల్ జాతి గొర్రెను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చాడు. కానీ, దాని అమ్మకానికి యజమాని ఒప్పుకోలేదు. సాంగ్లీ జిల్లాలోని మాడ్గల్ గ్రామం ఈ జాతి గొర్రెలుకు చాలా ప్రసిద్ధి. ఆ గొర్రె యజమాని బాబు మెట్కారికి సాంగ్లీ జిల్లాలోని మాడ్గల్ గ్రామంలో సుమారు 200 గొర్రెలను కలిగి ఉన్నారు. కానీ, మాడ్గల్ జాతి గొర్రెను రూ.70 లక్షలకు కొనడానికి ఓ వ్యక్తి ముందుకొచ్చినప్పుడు తనకు చాలా ఆశ్చర్యం కలిగిందని తెలిపారు. కానీ, దాన్ని అమ్మడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నాడు. ఆ గొర్రె అసలు పేరు షార్జా అని కానీ, దానికి మోదీ అని నామకరణం చేశామని తెలిపారు. చదవండి: కృత్రిమ మేధ: మన నట్టిళ్లల్లోకి.. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటూ చాలా ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. అయితే మాడ్గల్ గొర్రె కూడా అన్ని మార్కెట్లలో తన డిమాండ్‌ను పెంచుకుంటుందని ఆ పేరు పెట్టినట్లు తెలిపారు. అదే విధంగా తన కుంటుంబానికి ఆ గొర్రె చాలా అదృష్టమని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమ్మబోనని చెప్పారు. సదరు వ్యక్తి దాన్ని కొనుగోలు చేయడానికి రూ.75 లక్షలు ఆఫర్ చేశారు. కానీ, తాను రూ. కోటీ 50 లక్షలకు మాత్రమే అమ్ముతానని చెప్పానని తెలిపారు. ఎందుకంటే ఓ గొర్రెను కొనుగోలు చేయడానికి రూ. కోటీ 50 లక్షలు ఖర్చుచేయరని భావించి అమాంతం దాని ధరను పెంచినట్లు తెలిపారు. ఆ గొర్రెను అమ్మడం ఇష్టం లేకనే దాని ధరను పెంచానని పేర్కొన్నారు. చదవండి: ఒక్కో బొమ్మకు ఒక్కో అమ్మాయి పేరు -
ఈ గొర్రె రేటెంతో తెలిస్తే షాక్ అవుతారు
ఈడిన్‌బర్గ్ : ఈ గొర్రె రేటు ఎంతో తెలిస్తే మనం నిజంగా నోరెళ్ల బెడతాము. ఓ గొర్రె ఇంత ఖరీదా? అని కచ్చితంగా అనుకుంటాం. గురువారం స్కాట్లాండ్, లనార్క్‌లో జరిగిన స్కాటిష్ లైవ్‌స్టాక్ వేలంలో డబుల్ డైమండ్ అనే గొర్రె ఏకంగా 3.5 కోట్ల రూపాయల ధర (£3,65,000) పలికింది. దీంతో ప్రపంచంలో అత్యంత ఖరీదైన గొర్రెగా పేరు సంపాదించింది. అంతకు ముందు 2,31,000 స్టెర్లింగ్ పౌండ్లపై ఉన్న రికార్డును డైమండ్ బ్రేక్ చేసింది. డైమండ్ తర్వాతి స్థానంలో 68 వేల స్టెర్లింగ్ పౌండ్లతో హెక్సెల్ డ్జాంగో అనే గొర్రె నిలిచింది. ( ఆ ఏనుగులకు గంజాయి.. ఎందుకంటే?..) చెషైర్, స్టాక్‌పోర్టుకు చెందిన ప్రముఖ బ్రీడర్ చార్లీ బోడెన్‌కు చెందిన గొర్రెలలో డైమండ్ ఒకటి. టెక్సెల్ జాతికి చెందిన ఈ గొర్రెలు నెదర్లాండ్‌లోని టెక్సెల్ ప్రాంతానికి చెందినవి. యూకేలో వీటిని మాంసం కోసం ఎక్కువగా బ్రీడింగ్ చేస్తూ ఉంటారు. మామూలుగా ఈ గొర్రెలు 100 స్టెర్లింగ్ పౌండుల ధర పలుకుతుంటాయి. అధిక నాణ్యత కలిగిన గొర్రెలను మాత్రమే బీడింగ్ కోసం ఉపయోగిస్తుంటారు. -
వాజ్‌పేయి చాణక్యం.. చైనాకు గుణపాఠం
న్యూఢిల్లీ: ఇరుగుపొరుగుతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం చైనాకు షరామామూలే అనే సంగతి చెప్పడానికి ఇదో చక్కని ఉదాహరణ. అది 1965. ఇండో సినో యుద్ధం తర్వాత పరిస్థితులు ఇంకా గంభీరంగానే ఉన్నాయి. డ్రాగన్ పదే పదే ఇండియాపై అక్కసు వెళ్లగక్కతూనే ఉంది. ఓ వైపు సంప్రదింపులంటూనే భారత జవాన్లు చైనాలోకి చొరబడ్డారని పేర్కొంది. (అమ్మకానికి చే గువేరా ఇల్లు) సిక్కిం సరిహద్దు దాటి తమ దేశానికి చెందిన వ్యక్తుల నుంచి 800 గొర్రెలు, 59 జడల బర్రెలను భారత సైన్యం దొంగిలించిందని ఆరోపించింది. ఇది సాకుగా చూపి మళ్లీ సైనిక చర్యకు దిగాలనేది డ్రాగన్ ఆలోచన. చైనా ఆరోపణను భారత్ కొట్టిపారేసింది. ఇరువర్గాల మధ్య కొన్నాళ్ల పాటు ఈ సమస్యపై లేఖల యుద్ధం జరిగింది. తమ గొర్రెలను, బర్రెలను తిరిగివ్వాలని లేకపోతే పరిస్థితులు దారుణంగా మారతాయని భారత్ ను డ్రాగన్ హెచ్చరించింది. చైనా కుటిల నీతిని అర్థం చేసుకున్న అప్పటి యువ ఎంపీ అటల్ బిహారీ వాజ్‌పేయి వినూత్న రీతిలో చైనాకు బుద్ధి చెప్పారు. (233 ఏళ్ల ఎంసీసీ చరిత్రలో..) దాదాపు ఎనిమిది వందల గొర్రెలను ఢిల్లీలోని చైనా ఎంబసీకి తోలుకెళ్లారు. వాటి మెడలో ‘మమ్మల్ని తినండి. కానీ, ప్రపంచాన్ని కాపాడండి’ అనే ప్లకార్డులు వేశారు. గొర్రెలు, బర్రెల పేరుతో ప్రపంచయుద్ధానికి చైనా తెరలేపుతోందని విమర్శించారు. వాజ్‌పేయి గొర్రెల నిరసనకు చైనా విస్తుపోయింది. తమ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయానికి ఘాటైన లేఖను పంపింది. గొర్రెల ఘటన వెనుక భారత ప్రభుత్వం ఉందని ఆరోపించింది. ఇందుకు తిరిగి లేఖ రాసిన భారత్.. అందులో నిర్మలమైన పదజాలాన్ని వాడుతూ ‘ఢిల్లీ వాసులు కొందరు 800 గొర్రెలను చైనా ఎంబసీలోకి తోలారు. ఇది ఊహించని విధంగా జరిగిన పరిణామం. నిరసన కూడా ప్రశాంతంగా జరిగింది’ అంటూ జవాబిచ్చింది. -
పది లక్షలకు ఓ గొర్రె పిల్ల
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ దేశంలో కుక్కల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. విదేశాల్లో కుక్కలతోపాటు పిల్లులను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. పిల్లలాగే అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. దేశ, విదేశాల్లో గొర్రెలను కూడా పెంచుకుంటారు. పెరిగి పెద్దదయ్యాక కోసుకొని దాని మాంసం ఆరగించేందుకే. అయితే నల్ల ముక్కు కలిగిన స్విడ్జర్లాండ్‌కు చెందిన ‘వలాయిస్’ జాతి గొర్రె పిల్లలను లండన్ లాంటి దేశాల్లో పెంపుడు కుక్కల వలె పెంచుకుంటారు. అందుకు కారణం ప్రపంచ గొర్రెల జాతుల్లోకెల్లా అవి అత్యంత అందంగా ఉండడమే. ఆ జాతికి చెందిన ఓ గొర్రె పిల్ల భారతీయ కరెన్సీలో ఆరున్నర లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు పలుకుతుంది. అంటే మామూలు గొర్రె పిల్లలకన్నా వాటి ధర దాదాపు 40 రెట్లు ఎక్కువ. ఈ జాతి గొర్రె పిల్లల నుంచి ఉన్ని ఎక్కువ రావడమే కాకుండా మాంసం కూడా బలే రుచిగా ఉంటుందట. ఇంగ్లండ్‌లోని ఉత్తర డెవాన్‌లో వారం క్రితం ఈ జాతికి చెందిన మూడు గొర్రె పిల్లలు ఫామ్‌లో జన్మించాయి. ఆ మూడు అతి ముచ్చటగా ఉండడంతో ఒక్కో గొర్రె పిల్లకు పది లక్షల రూపాయలు చెబుతున్నారు. ఇప్పుడు అక్కడ గొర్రెల అమ్మకానికి మంచి సీజన్. స్విడ్జర్లాండ్‌కు చెందిన ‘వలాయిస్’ గొర్రె జాతి పిల్లలను ఎప్పుడు ఇంగ్లండ్‌కు తీసుకొచ్చి ఆ జాతి బ్రీడ్‌ను రక్షిస్తునారు. ఏడేళ్ల క్రితమే విదేశాలకు గొర్రెల ఎగుమతిని స్విడ్జర్లాండ్ నిషేధించింది. క్రిస్ స్లీ, టామ్ హూపర్ అనే గొర్రెల పెంపకం దార్లు 2016లో వలాయిస్ జాతి గొర్రెల పిండాలను స్కాట్లాండ్ నుంచి తీసుకొచ్చి డెవాన్ ఫామ్‌లో పెంచుతున్నారు. డిమాండ్, సరఫరా బట్టి తాము ఈ గొర్రెల ధరను నిర్ణయించినట్లు గతంలో ఆర్థికవేత్తగా పనిచేసిన హూపర్ తెలిపారు. లండన్ మొత్తం మీద ఈ జాతి గొర్రెలు కొన్ని వేలల్లోనే ఉంటాయని, స్విడ్జర్లాండ్ ఎగుమితి నిషేధం కారణంగా ఈ జాతి గొర్రెలు ఎక్కువ కావాలన్నా దొరకవని ఆయన చెప్పారు. -
గొల్లలపాలెంలో వింత పెళ్లి..
గొర్రెలు, మేకల జంటల వివాహాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సామూహిక వివాహతంతుకి గొల్లలపాలెం వేదికయింది. ఆత్మీయులందరూ తరలివచ్చారు. కొత్త జంటల్ని ఆశీర్వదించారు. మీరు చదువుతున్నది నిజమే. ఇదొక సంప్రదాయం. రావికమతం(చోడవరం): మందల్లో ఉండే జంతువులు రోగాలపాలవకుండా.. సంతానాభివృద్ధి కోసం ఇలా పెళ్లిళ్లు జరిపిస్తామని చెబుతున్నారు యాదవులు. తమ పూరీ్వకులు పాటించిన ఆచారాన్నే తాము కొనసాగిస్తున్నామని వివరించారు. పెళ్లి ఇలా.. మందలో ఉండే గొర్రెపోతుతో గొర్రెలకు.. మేకపోతుతో మేకలకు పెళ్లి జరిపిస్తారు. ప్రతీ ఏటా కనుమ పండగ రోజున దీనికి ముహూర్తంగా నిర్ణయిస్తారు. పెళ్లిరోజు ఉదయాన్నే గ్రామంలోని వారు సమీపంలోని పుట్టవద్దకు చేరుకుంటారు. తమ మందల్లోని గొర్రెలు, మేకలకు పసుపురాసి బొట్టుపెడతారు. ధూపం కూడా వేస్తారు. ఆపై ‘మాంగళ్యధారణ’ చేస్తారు. అనంతరం గొర్రెలు, మేకల చెవుల చిగుర్లను కోసి పుట్టలో వేస్తారు. గురువారం కనుమ సందర్భంగా ఈ వేడుక నిర్వహించారు. ఇది తమ వంశాచారమని రైతులు పల్లా చినబాబు,దేముడుబాబు,గోపన్న చెప్పారు. -
22న సేంద్రియ పద్ధతిలో గొర్రెలు, మేకల పెంపకంపై శిక్షణ
సేంద్రియ పద్ధతిలో గొర్రెలు, మేకల పెంపకంపై గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో రైతులకు ఈ నెల 22(ఆదివారం)న శిక్షణ ఇవ్వనున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన నిపుణులు డా. జి. రాంబాబుతోపాటు గొర్రెలు, మేకల పెంపకంలో అనుభవజ్ఞులైన రైతులు శిక్షణ ఇస్తారన్నారు. ముందుగా పేర్లు నమోదు చేసుకోగోరే వారు సంప్రదించాల్సిన నంబర్లు: 970 538 3666, 0863–2286255 22న కాకినాడలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ శిక్షణ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై లోతైన అవగాహన కలిగించే లక్ష్యంతో సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్మెంట్(సేవ్) స్వచ్ఛంద సంస్థ ఈ నెల 22 (ఆదివారం)న కాకినాడ విద్యుత్‌నగర్‌లోని చల్లా ఫంక్షన్ హాల్ (వినాయకుడి గుడి ఎదుట)లో ఉ. 8.30 గం. నుంచి సా. 5.30 గం. వరకు రైతులకు శిక్షణ ఇవ్వనుంది. ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి? పెట్టుబడి, ఖర్చులు తగ్గించుకునే మార్గాలు, రైతులు పంట దిగుబడులను మొత్తం నేరుగా అమ్ముకోకుండా కొంత మోత్తాన్ని విలువ ఆధారిత ఉత్పత్తులగా మార్చి అమ్ముకోవడం, అధికాదాయం కోసం ప్రయత్నాలు, దేశీ విత్తనాల ఆవశ్యకత, దేశీ ఆవు విశిష్టత తదితర అంశాలపై సేవ్ సంస్థ వ్యవస్థాపకులు, ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరామ్ శిక్షణ ఇస్తారు. ప్రవేశ రుసుము: ఒక్కొక్కరికి రూ. వంద. ఆసక్తి గల రైతులు ముందుగా తమ పేర్లను ఫోన్ చేసి నమోదు చేసుకోవాలి.. వివరాలకు.. సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ సమాచార కేంద్రం: 04027654337, 86889 98047 94495 96039 మార్చిలో జాతీయ శాశ్వత వ్యవసాయ మహాసభ భూతాపోన్నతిని శాశ్వత వ్యవసాయ (పర్మాకల్చర్) పద్ధతుల్లో సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గాలపై రైతాంగంలో చైతన్యం తెచ్చే లక్ష్యంతో వచ్చే ఏడాది మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు జాతీయ శాశ్వత వ్యవసాయ మహాసభ జరగనుంది. తెలంగాణలోని జహీరాబాద్ దగ్గర్లోని బిడకన్నె గ్రామంలో అరణ్య పర్మాకల్చర్ అకాడమీలో ఈ మూడు రోజుల మహాసభ జరగనుందని అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ తెలిపింది. 20న ప్రకృతి సేద్య పద్ధతుల్లో కూరగాయల సాగుపై శిక్షణ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కూరగాయల సాగుపై కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లిలోని రామరాజు గారి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 20 (శుక్రవారం)న ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆం. ప్ర. శాఖ తరఫున రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. కూరగాయల సాగులో కొత్త పద్ధతులను అనుసరిస్తున్న సీనియర్ రైతులు అనుభవాలను పంచుకుంటారు. వివరాలకు.. 78934 56163 -
శీతాకాలంలో గొర్రెల, మేకల సంరక్షణ
పశువులకు శీతాకాలం ఒక గడ్డు కాలం. వీటి ఉత్పాదకత తగ్గకుండా చలి బారి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పెద్ద పొట్ట పశువులే కాకుండా, గొర్రెలు, మేకలు కూడా శీతాకాలం ప్రభావానికి లోనవుతాయి. మెలకువలు పాటించడం శ్రేయస్కరం. శీతాకాలంలో గొర్రెల యాజమాన్యం: 1. గొర్రెలకు తప్పనిసరిగా గృహవసతి ఉండాలి. కనీసం చెట్టు నీడనన్నా ఉంచాలి. ముఖ్యంగా రాత్రి వేళల్లో మంచు బారిన పడకుండా చూడాలి. 2. ఇటీవల ఉన్నిని కత్తిరించిన గొర్రెలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. చలి నుంచి రక్షణ ఇవ్వాలి. 3. అప్పుడే పుట్టిన గొర్రెపిల్లల మీద ఉన్న మాయ తాలూకు తడిని వెంటనే శుభ్రం చేయాలి. లేదంటే శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి ‘హైపోధర్మియ’ అనే పరిస్థితి ఏర్పడుతుంది. 4. ఈతకు వచ్చిన గొర్రెలను శ్రద్ధగా పర్యవేక్షించాలి. 5. రెండు నెలల వయస్సున్న గొర్రె పిల్లలు చలిని తట్టుకుంటాయి. కానీ షెడ్లలో తేమతో కూడిన వాతావరణం ఉన్నట్లయితే న్యూమోనియా ప్రబలే అవకాశముంది. 6. శీతాకాలంలో శరీర ఉష్ణాన్ని కాపాడుకునేందుకు శరీరంలో జీర్ణప్రక్రియ ద్వారా ఉత్పత్తి అయ్యే వేడిని గొర్రెలు బయటకు పంపవు. కాబట్టి శరీర ఉష్ణ నిర్వహణకు పీచు పదార్థం గల మేతను మేపాలి. 7. చూడి 15 వారాల సమయంలో సుమారు 2 కిలోల పచ్చిమేతను అందించాలి. జొన్న, మొక్కజొన్న, సజ్జ లాంటివన్నమాట. చివరి 4 వారాల చూడి దశలో వీటితోపాటుగా 500 గ్రాముల మొక్కజొన్న పిండిని ఇవ్వాలి. 8. గొర్రె ఈనిన తర్వాత 2.5 కిలోల పచ్చిమేతతోపాటుగా 15% ప్రొటీను గల సమీకృత దాణాను ఒక కిలో ఇవ్వాలి. 9. మంచి నీరు నిల్వ లేకుండా అవసరాన్ని బట్టి అందుబాటులో ఉంచాలి. మేకల యాజమాన్యం 1. మందమైన పొడవాటి వెంట్రుకలు చలి నుంచి కాపాడుతాయి. 2. పరిశుభ్రమైన వెచ్చటి గడ్డితో కూడుకున్న పక్కను ఏర్పాటు చేయాలి. 3. పెద్ద మేకలకు గృహవసతి లేకున్నా.. చిన్న పిల్లలకు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. 4. గొర్రెలకన్నా మేకలు ఎక్కువ పీచును జీర్ణం చేసుకోగలుగుతాయి. ఎక్కువ పీచు పదార్థాలు కలిగిన చెరకు పిప్పి, పొద్దుతిరుగుడు మొక్కలు, ఎండిన కంది కట్టె వంటి వాటిని మేపవచ్చు. 5. మేకల్లో ఈ సీజన్లో ఎక్కువగా పేలు కనబడతాయి. వాటి నుంచి రక్షణ అవసరం. 6. ఖనిజ లవణ ఇటుకలను షెడ్లలో గాని, చెట్లకు గాని వేలాడదీయాలి. – డా. ఎం.వి.ఎ.యన్. సూర్యనారాయణ (99485 90506), ప్రొఫెసర్ – అధిపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవ్‌స్టాక్ ఫామ్ కాంప్లెక్స్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి -
‘చిటుక’లో ముంచుకొచ్చే ముప్పు!
గొర్రెల్లో సీజను వారీగా, వయస్సు వారీగా కొన్ని వ్యాధులు బయల్పడుతుంటాయి. వాటికి సరిపడా యాజమాన్యముగానీ, చికిత్స గానీ, టీకా గానీ ఇవ్వకపోతే జీవాలు మృత్యువాత పడుతుంటాయి. తొలకరి వర్షాల్లో గొర్రెలకు సోకే ముఖ్యమైన వ్యాధి చిటుక రోగం. సాధారణంగా చాలా వ్యాధులకు టీకా వేయించినట్లయితే, అవి సోకకుండా ఉండే అవకాశముంది. కానీ, టీకా వేయించకుండా, వ్యాధి సోకిన తర్వాత, ఏ లక్షణాలు చూపుకుండా, వైద్యానికి సమయం ఇవ్వకుండా గొర్రెలు మృతి చెందేది ఒక చిటుక వ్యాధితో మాత్రమే. మంచి ఆరోగ్యంగా ఉండే జీవాలకు ఈ వ్యాధి సోకుతుంది. క్లాస్ట్రిడియమ్ పెర్‌ఫ్రిజన్స్ టైప్ డి అనే బ్యాక్టీరియా వలన సోకుతుంది. ఎక్కువగా స్టార్చ్ సంబంధిత మేతను తింటే ఈ వ్యాధి సోకుతుంది. తొలకరి వర్షాల తర్వాత మొలిచిన లేత గడ్డిని మేసినప్పుడు ఈ సూక్ష్మ క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి. వ్యాధి సోకిన తర్వాత ఏ లక్షణాలు చూపకుండా, చిటిక వేసే లోపే చనిపోతాయి. కాబట్టి చిటుక వ్యాధి అంటారు. కొన్ని ప్రాంతాల్లో నెత్తిపిడుగు వ్యాధి అని కూడా అంటారు. కొన్నిచోట్ల గడ్డి రోగం అని అంటారు. జీవాలు నీరసంగా ఉండటం, చనిపోయే ముందు గాలిలోకి ఎగిరి గిలగిలా కొట్టుకుంటాయి. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఎక్కువగా కనబడుతుంది. దీని కారక సూక్ష్మజీవి ‘ఎప్పిలాన్’ అనే విష పదార్థాన్ని జీవం శరీరంలోకి విడుదల చేస్తుంది. దీనివలన జీవాలు చనిపోతాయి. చిటుక వ్యాధి నివారణ ఇలా.. ► ఈ నెలలో అన్ని జీవాలకు టీకా వేయించాలి. ► తొలకరి వర్షాలకు మొలచి, వాడిపోయిన తేగ గడ్డిని గొర్రెలు మేసినట్లయితే ఈ వాధి సూక్ష్మ క్రిముల ద్వారా ప్రబలుతుంది. అందుచేత వాడిపోయి మళ్లీ మొలచిన గడ్డిని గొర్రెలు మేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ► మందలో ఒకటి, రెండు జీవాలకు వ్యాధి కనిపించినట్లయితే, మిగిలిన వాటికి టీకా వేయించాలి. వలస వెళ్లే జీవాల్లో ఎక్కువగా ఈ వ్యాధి కనపడుతుంది. – డా. ఎం. వి. ఎ. ఎన్. సూర్యనారాయణ (99485 90506), ప్రొఫెసర్ అండ్ హెడ్, పశుగణ క్షేత్ర సముదాయం, పశువైద్య కళాశాల, తిరుపతి -
మాంసం వినియోగంలో మనమే టాప్
సాక్షి, హైదరాబాద్: దేశంలో గొర్రెల సంఖ్య, మాంసం వినియోగంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. డిసెంబర్ 31తో ముగిసిన జాతీయ పశుగణనకు సంబంధించిన నివేదికలో పలు వివరాలు వెల్లడయ్యాయి. గొర్రెల సంఖ్యలో తెలంగాణ తర్వాత రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఏపీ, మహారాష్ట్ర నిలిచాయి. 2017 జూన్ నాటికి రాష్ట్రంలో ఉచిత గొర్రెల పథకం అమలు చేసే నాటికి గొర్రెల సంఖ్య కోటి మాత్రమే. ఆ పథకం కింద ప్రభుత్వం చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి 74 లక్షల గొర్రెలను గొల్లకుర్మలకు పంపిణీ చేసింది. వీటికి 55 లక్షల పిల్లలు పుట్టాయి. దీంతో రాష్ట్రంలో కొత్తగా 1.28 కోట్ల గొర్రెలు తయారయ్యాయి. వీటి విలువ రూ. 2,500 కోట్లు. గొర్రెల పంపి ణీ పథకంతో రాష్ట్రంలో రూ.2,500 కోట్ల అదనపు సంపద గ్రామాల్లో వచ్చి చేరింది. జాతీయ పశుగణన చేపట్టేనాటికి రాష్ట్రంలో 2.24 కోట్ల గొర్రెలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో అత్యధిక గొర్రెలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ఇప్పటివరకు దేశంలో అత్యధిక గొర్రెలు ఉన్న రాష్ట్రంగా రాజస్థాన్‌ను వెనక్కి నెట్టింది. పథకానికి రూ.5 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత గొర్రెల పథకం ఇతర రాష్ట్రాలనూ ఆకర్షిస్తోంది. పథకం కోసం ప్రభుత్వం రూ. 5 వేల కోట్లు కేటాయించింది. అందులో రూ.3 వేల కోట్లు జాతీయ సహకారాభివృద్ధి సంస్థ(ఎన్సీడీసీ) ద్వారా రుణం పొందింది. మరో 20 శాతం నిధులను కేంద్రం సబ్సిడీగా అందించింది. మిగిలిన సొమ్మును రైతులు తమ వాటాగా చెల్లించారు. ఒక్కొక్క యూనిట్ వ్యయం రూ.1.25 లక్షలు కాగా, ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ అంటే రూ. 93,750 ఇచ్చింది. లబ్ధిదారుడు మిగిలిన 25 శాతం అంటే రూ. 31,250 చెల్లించారు. పెరిగిన మాంసం ఉత్పత్తి... తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత గొర్రెల పంపిణీ పథకంతో రాష్ట్రంలో వాటి సంఖ్య పెరగడమే కాకుండా మాంసం ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. ఏడాది సగటున రాష్ట్రంలో 26,839 మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతోంది. మాంసం ఉత్పత్తిలో 15 శాతం వృద్ధి సాధించినట్లు అధికారులు వెల్లడించారు. 2017 జూన్‌కు ముందు రాష్ట్రానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి రోజుకు దాదాపు 500 నుంచి 600 లారీల గొర్రెలు దిగుమతి అవుతుండేవి. ప్రస్తుతం ఈ సంఖ్య 100కు పడిపోవడం గమనార్హం. గొర్రెల సంఖ్య పెరగడమే కాకుండా మాంసం వినియోగంలోనూ తెలంగాణ టాప్‌లో నిలిచింది. మాంసహారం తీసుకునేవారిలో సగటున ప్రతి వ్యకి ఏడాదికి 7.5 కిలోల మాంసం వినియోగిస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో 97 శాతం మంది మాంసాహారులే ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది. జాతీయ పోషకాహార సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఏడాదికి ఒక మనిషి 11 కిలోలు వినియోగించాల్సి ఉంది. తెలంగాణ 7.5 కిలోలతో మొదటిస్థానంలో ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ 7.2 కిలోలు, తమిళనాడు 6.5 కిలోలు, కర్ణాటక 6 కిలోలు, కేరళ 5.5 కిలోలు చొప్పున వినియోగిస్తున్నాయి. మాంసం అధికంగా వినియోగించే రాష్ట్రాల్లో మొదటి ఐదు స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాలే ఉండటం గమనార్హం. -
రెండు తలలతో గొర్రె పిల్ల జననం
సంతబొమ్మాళి : మండలంలోని వెంకటాపురం గ్రామంలో గొర్రెల కాపరి బెండి గడ్డెన్నకు చెందిన గొర్రె రెండు తలలు ఉన్న పిల్లకు సోమవారం జన్మనిచ్చింది. గొర్రె సాధారణ ఈతకు ప్రయత్నించినా విఫలం కావడంతో సంతబొమ్మాళి పశువుల ఆస్పత్రికి తరలించారు. పశువైద్యాధికారి కిరణ్‌కుమార్ శస్త్రచికిత్స చేసి రెండు తలలు, ఒకే మొండెంతో చనిపోయి ఉన్న గొర్రె పిల్లను బయటకు తీశారు. జన్యుపరమైన లోపం వల్ల పిండం ఏర్పడే దశలో అవయవాలు సక్రమంగా ఏర్పాటు కాలేదని, దీని కారణంగానే ఇటువంటి పిల్లలు జన్మిస్తాయని ఆయన తెలిపారు. -
గొర్రెకు వింత పశువు జననం
ఖానాపురం(నర్సంపేట) వరంగల్ : గొర్రెకు వింత పశువు జన్మించిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన భూషబోయిన ఐలుమల్లుకు గొర్రెల మంద ఉంది. ఇందులో ఒక గొర్రె బుధవారం ఉదయం ఇంటి వద్ద ఈనింది. దీంతో గొర్రె ఈనే క్రమంలో వింత ఆకారంలో ఉన్న పశువుకు జన్మనిచ్చింది. దీంతో ఐలుమల్లు ఆశ్చర్యానికి గురై చుట్టుపక్కల వారికి తెలియజేయగా స్థానికులు అధిక సంఖ్యలో వచ్చి చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. జన్మించిన కొద్ది సమయంలోనే వింత పశువు మృతిచెందింది. ఇదే విషయమై మండల పశువైద్యాధికారి శ్రీలక్ష్మిని వివరణ కోరగా జన్యుపరమైన లోపంతో అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని తెలిపారు. పుట్టిన పశువులో ఎదుగుదల లేకపోవడంతోనే అలా జన్మించిందని ‘సాక్షి’కి తెలిపారు. -
నిజామాబాద్ టు చిత్తూరు
బాలానగర్ : అక్రమంగా తరలిస్తున్న రాయితీ గొర్రెలను ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి రెండు లారీల్లో ప్రభుత్వం రాయితీపై అందించిన గొర్రెలను చౌకగా కొనుగోలు చేసి ఏపీలోని చిత్తూరు జిల్లా, తమిళనాడులోని పలు పట్టణాలకు తరలిస్తున్నారు. ఇలా రెండు లారీల్లో కొందరు 648 గొర్రెలను తరలిస్తుండగా రైతు అవగాహన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూమయ్య యాదవ్ ఇతర నాయకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో లారీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, బాలానగర్ పశువైద్య అధికారి రఘు విచారణ జరిపారు. లారీల్లో తరలిస్తున్న మొత్తం 648 గొర్రెల్లో 130 గొర్రెలను ప్రభుత్వం లబ్ధిదారులకు రాయితీపై అందించినవిగా గుర్తించినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఒక్కో గొర్రెను రూ.3,200 కొనుగోలుచేసి రూ.3,800 నుంచి నాలుగు వేల వరకు విక్రయిస్తారని విచారణలో తేలిందని ఆయన చెప్పారు. లారీలను స్వాధీనం చేసుకుని, గొర్రెలను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ వివరించారు. -
యువతిపై అత్యాచారం
అనంతపురం సెంట్రల్: ప్రియుడితో కలిసి షికారుకెళ్లిన ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన గురువారం ఆత్మకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసు వర్గాలు తెలిపిన మేరకు... హిందూపురానికి చెందిన ఓ యుతి అనంతపురంలో ఉంటూ చదువుకుంటోంది. చిన్ననాటి స్నేహితుడితో కలిసి ఆత్మకూరు మండలం పంపనూరు దేవాలయానికి గురువారం వెళ్లింది. దారి మధ్యలో ఆగి కబుర్లు చెప్పుకుంటుండగా ఇద్దరు యువకులు పోలీసులమంటూ అక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? పోలీసు స్టేషన్‌కు పదండంటూ బెదిరించారు. బెదిరిపోయిన ఆ యువతిని తమ బైక్‌లో ఓ వ్యక్తి ఎక్కించుకొని ఆత్మకూరు వైపు వెళ్లాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత చెట్లపొదల్లోకి తీసుకు పోయి అత్యాచారానికి పాల్పడ్డాడు. గురువారం రాత్రి బా«ధితులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం నిందితులను గుర్తించినట్లు తెలిసింది. సదరు నిందితులు గతంలో గొర్రెల దొంగలుగా తేలింది. అయితే బాధిత యువతి ఫిర్యాదు చేయడానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఏం చేయాలనే విషయంపై పోలీసు అధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారు. అత్యాచారం కేసు నమోదు చేయకపోయినా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. రౌడీషీట్ కూడా ఓపెన్ చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. -
గొర్రెలు మనుషులను గుర్తుపట్టగలవట
-
గొర్రెలకు కూడా తెలివితేటలు ఉన్నాయట
సాక్షి, న్యూఢిల్లీ : తెలివితేటలులేని వారిని, మంద బుద్ధిగల వారిని మనం సాధారణంగా గొర్రెలని విమర్శిస్తుంటాం. కానీ తెలివితేటలు గొర్రెలకు కూడా ఉంటాయట అవి మనుషులను గుర్తుపట్టగలవట. ముఖ్యంగా జీవితంలో ఎప్పుడూ చూడని సెలబ్రిటీలను మరింత చక్కగా గుర్తుపట్టగలవట. అదెలాగంటే ఫొటోలను చూడడం ద్వారట. మనుషులవి, సెలబ్రిటీల ఫొటోలను చూపించడం ద్వారా కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకులు గొర్రెల తెలివితేటలపై అధ్యయనం జరిపి ఈ విషయాన్ని నిరూపించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, సినీతారలు ఎమ్మా వాట్సన్, జేక్ గెల్లెన్హాల్, బ్రిటన్ న్యూస్ రీడర్ పిలోనా బ్రూస్ ఫొటోలను ఉపయోగించి యూనివర్శిటీ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. మరింత మెరుగ్గా జంతుసంరక్షణ చేయడం కోసం ఇలాంటి అధ్యయనాలు ఉపయోగపడడమే కాకుండా మనుషులకు వచ్చే హంటింగ్డాన్, పార్కిన్సన్స్ రోగాలతోపాటు స్కిజోఫ్రేనియా, ఆటిజమ్ లాంటి మానసిక రుగ్మలతలను అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు. మనుషులకు, గొర్రెలకున్న తేడాలను గుర్తుపడతాయా అన్న అంశానికి సంబంధించి 2001లోనే గొర్రెలపై పరిశోధనలు జరిగాయని, మనుషుల ఫొటోల నుంచి గొర్రెలను వేరుచేసి అవి గుర్తుపట్టడమే కాకుండా ఫొటోలో వ్యక్తమవుతున్న ఉద్విగ్న భావాలకు కూడా అవి స్పందిస్తాయని అప్పుడు పరిశోధకులు గుర్తించారన్నారు. అవి కేవలం ఫొటోలను మాత్రమే గుర్తించుకుంటాయా లేదా నిజంగా మనుషులను గుర్తిస్తాయా ? అన్న అంశాన్ని మరింత లోతుగా తెలుసుకోవడం కోసం తాజా అధ్యయనం జరిపినట్లు వారు చెప్పారు. అంతకుముందు చూపిన ఫొటోలు, ఎప్పుడు వాటికి చూపని ఫొటోలను వేలాడదీసి పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఫొటోల కింద వాటికి కొద్దిగా ఆహారాన్ని ఏర్పాటు చేశారు. గొర్రెలు తెల్సిన ఫొటోలవైపే వెళ్లి అక్కడ ఏర్పాటుచేసిన గ్రాసాన్ని తిన్నాయి. ఎన్నిసార్లు పంపించినా తెలియని ఫొటోలవైపు అవి వెళ్లలేదు. మొదట నేరుగా చూపించిన ఫొటోలను రెండోసారి చూపించినప్పుడు అవి 80 శాతం టైమ్‌లోనే గుర్తించాయని, అదే వేర్వేరు భంగిమల్లో తీసిన ఫొటోలను చూపించినప్పుడు వాటిని గుర్తించడానికి మొదటిసారి ఎక్కువ సమయం తీసుకోగా, రెండోసారి అందులో 90 శాతం సమయాన్ని తీసుకున్నాయని పరిశోధకులు వివరించారు. మానసిక రుగ్మలతో బాధపడుతున్న వారికి చికిత్స చేయడంలో గొర్రెలపై తాము నిర్వహించిన అధ్యయనాలు ఉపయోగపడతాయని తాము ఆశిస్తున్నట్లు వారు తెలిపారు. -
వింత జంతువుకు జన్మనిచ్చిన సబ్సిడీ గొర్రె ...
సాక్షి, మెదక్: రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చిన ఓ గొర్రె వింత జంతువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జంతువును చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి జనాలు తరలివచ్చారు. అంతటితో ఆగకుండా సెల్ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. కుల వృత్తులను ప్రోత్సహించాలనే ధ్యేయంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సబ్సిడీ గొర్రెల పథకంతొ గొర్రెల పంపిణీ చేసిన విషయం తెలిసిందే. -
వింత రూపంలో గొర్రె.!
చిట్యాల: వరంగల్ రూరల్ జిల్లా చిట్యాల మండలంలో ఓ వింత గొర్రెపిల్ల జన్మించింది. మండలంలోని నవాబుపేట శివారు శాంతినగర్‌లో ముసికె ఆగయ్యకు చెందిన మేకకు ఎనిమిది కాళ్లు, నాలుగు చెవులు, మూడు కళ్లుతో ఓ గొర్రెపిల్ల జన్మించింది. అయితే దీనికంటే ముందు మరో పిల్ల జన్మించినా దాని అవయవాలు అన్నీ సరిగా ఉన్నాయి. ఈ వింత గొర్రెపిల్లను ప్రజలు వచ్చి చూసి వెళ్తున్నారు. -
బా.. బా.. బ్లాక్ షీప్..
ఓసారి ఊహించుకోండి.. మీరో సినిమాకు వెళ్లారు.. నిడివి ఏకంగా 8 గంటలు.. చూద్దామంటే స్టోరీ ఉండదు.. డైలాగులు అసలే ఉండవు. అసలు నటించడానికి మనుషులే ఉండరు.. ఉండేవన్నీ గొర్రెలే.. బా.. బా.. బా.. అంటూ వాటి అరుపులే.. బా బా ల్యాండ్... ప్రపంచంలోనే అత్యంత డల్ మూవీ.. నిద్రలేమికి మందు.. నిద్రమాత్ర కంటే పవర్ఫుల్.. ఈ విషయాన్ని సదరు చిత్ర నిర్మాతలే ప్రచారం చేసుకుంటున్నారు. పైగా.. సినిమా అంతా స్లోమోషన్.. గొర్రెలు అలా స్లోగా తిరుగుతూ.. గడ్డి తింటూ.. కూర్చుంటూ.. పడుకుంటూ ఉంటాయి. దీన్ని బ్రిటన్‌లోని ఎసెక్స్‌లో తీశారు. ‘ఇది ప్రపంచంలోనే అత్యంత డల్ మూవీ.. ప్రేక్షకులు కూడా అలాగే భావిస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడంతా నిరంతర ఒత్తిడి.. నిద్రలేని రాత్రులు.. చిట్టచివరికి మనకో చాన్స్ వచ్చింది.. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడానికి.. నిరంతరం పరుగులెడుతున్న మన మనసులను, బుర్రలను ప్రశాంతపరచడానికి.. కూర్చోండి.. ఆ గొర్రెలను అలా చూస్తూ ఉండండి’ అని చిత్ర నిర్మాత పీటర్ ఫ్రీడ్మన్ చెప్పారు. సెప్టెంబర్‌లో విడుదల కానున్న తమ చిత్రం బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టకపోవచ్చు గానీ.. దీనికంటూ ప్రత్యేకమైన ప్రేక్షకులు ఉంటారని తెలిపారు. 8 గంటలపాటు మంచి నిద్ర కోరుకునేవారికి ఈ సినిమా మంచి ఆప్షన్ అని అన్నారు. ఇంకో విషయం.. దీనికి సీక్వెల్ కూడా తీయాలని అనుకుంటున్నారు.. పైగా దాన్ని మొదటి భాగంతో పోలిస్తే.. మరింత డల్‌గా తీస్తారట.. నిడివి కూడా పెంచుతారట.. ఓ 24 గంటల సమయానికి..!! -
టీకాలతోనే చిటికె వ్యాధి నివారణ
– ఈనెల 25లోగా వినియోగించుకోవాలి – పశువ్యాధి నిర్ధారణ కేంద్రం ఏడీ పద్మావతి అనంతపురం అగ్రికల్చర్ : గొర్రెలకు సోకే ముచ్చువ్యాధి (చిటికె వ్యాధి)పై కాపర్లు అప్రమత్తం ఉండాలని స్థానిక పశువ్యాధి నిర్ధారణ కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ జి.పద్మావతి తెలిపారు. వర్షాకాలం ప్రారంభంలో కురిసే తొలకర్లకు మొలచిన లేత గడ్డిని తినడం వల్ల ఈ వ్యాధి సోకుతుందన్నారు. ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా జిల్లా అంతటా ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు ఉచితంగా టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడిక్కడ పశువైద్యాధికారులు, కాంపౌండర్లు, ఇతర పశుశాఖ సిబ్బందిని కలిసి జీవాలకు టీకాలు వేయించుకోవాలని సూచించారు. చిటికె వ్యాధి కారకం క్లాస్ట్రీడియం ఫర్ఫ్రింజస్ అనే బ్యాక్టీరియా ద్వారా చిటికె వ్యాధి సోకుతుంది. ఆవులు, మేకల్లో అరుదుగా కనిపించే ఈ వ్యాధి ఎక్కువగా గొర్రెలు, అందులోనూ ఆరోగ్యంగా బరువు కలిగిన గొర్రె పిల్లలపై ప్రభావం చూపిస్తుంది. ఈ వ్యాధి మే నెల నుంచి జూలై వరకు ఎక్కువగానూ ఆ తర్వాత అక్టోబర్, నవంబర్‌లో కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ప్రేవుల్లో గాలిలేని వాతావరణంలో అభివృద్ధి చెందిన సందర్భంలో వదలబడిన విష పదార్థాలు (టైప్–డీ) ఈ వ్యాధికి కారణం. తొలకరి వర్షాలకు పెరిగిన లేత గడ్డిని గొర్రెలు ఆశగా, అధికంగా తింటాయి. అందువల్ల ప్రేవుల్లో గాలి లేని వాతావరణం ఏర్పడటం వల్ల సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది వ్యాధిని కలిగిస్తాయి. వ్యాధి లక్షణాలు ఆరోగ్యంగా ఉన్నటువంటి జీవాలు పారుకుని వణుకుతూ మెడ పైకిలేపి అకస్మాత్తుగా చనిపోతాయి. లేదంటే జీవాలు గాలిలోకి ఎగిరి కిందపడి కాళ్ళు గిలగిల కొట్టుకుంటూ పళ్ళు కొరకుతూ వణుకుతూ బిగుసుకొని నిమిషాల్లో మృతి చెందుతాయి. అంటే ఎలాంటి రోగ లక్షణాలు కనపడకుండానే మృత్యువాతపడతాయి. చనిపోయే ముందు గొర్రెలు నీరసంగా ఉండటాన్ని మాత్రం గమనించవచ్చు. కొన్ని జీవాలు నోటినుండి చొంగ కారుస్తాయి. శ్వాస పీల్చే శాతం ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మలబద్ధకం, కడుపుబ్బరం ఉంటుంది. మేత మేయకుండా, నెమరు వేయకుండా తలలు వాల్చి, ముడుచుకొని ఒకే చోట నిలబడతాయి. ఉదయం సాయంత్రం వేళల్లో కొంత వరకు లక్షణాలు కనిపిస్తాయి. నివారణ చర్యలు పశువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏడాదికి రెండు సార్లు వేసే టీకాలను వినియోగించుకోవాలి. జీవాల జీర్ణకోశంలో సూక్ష్మజీవుల వ్యాప్తిని అరికట్టేందుకు టెట్రాసైక్లిన్, ఆంఫీసిలిన్, జెంటామైసిన్ వంటి మందులు, క్లోరిల్, ఎపిల్ వంటి ఇంజక్షన్లు పశు వైద్యుని పర్యవేక్షణలో వాడాలి. జీవాలను ఉదయం కొంత ఆలస్యంగా మేపుటకు తీసుకెళ్లడం, మధాహ్న సమయంలో కొంత సేపు విశ్రాంతిని ఇవ్వడం, సాయంత్రం త్వరగా తీసుకొని రావడం వల్ల జీర్ణాశయం కొంత ఖాళీగా ఉంచుట ద్వారా సూక్ష్మ జీవుల అభివృద్ధిని తగ్గించవచ్చు. తొలకరి వర్షాలకు పెరిగి వాడిపోయిన గడ్డిని మేపకూడదు. -
గొర్రెల బాధను తెలుసుకునేందుకు....
కాలిఫోర్నియా: మనుషుల్లో బాధను వ్యక్తం చేయడానికి హావభావాలతోపాటు మాటలు ఉంటాయి. మాటలురాని మూగ జంతువులు తాము అనుభవిస్తున్న బాధను ఎలా వ్యక్తం చేస్తాయి? వాటి అరుపులు, ముఖ హావాభావాల్లో వచ్చే తేడాను బట్టి వాటి బాధను అర్థం చేసుకోవచ్చు. ఇంతవరకు జరుగుతున్నది అదే. గొర్రెలాంటి మూగజీవుల ముఖాల భావాలను బట్టి వాటి శారీరక బాధను గుర్తించేందుకు కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు కృత్రిమ మేథస్సును సృష్టించారు. శారీరక బాధను అనుభవిస్తున్నప్పుడు గొర్రె కళ్లు చిన్నగా ముడుచుకుపోతాయి. చెక్కిళ్లు గట్టిగా బిగుసుకుంటాయి. చెవులు ముందుకు ముడుచుకుపోతాయి. పెదవులు కిందకు వచ్చి వెనక్కి బిగుసుకుంటాయి. ముక్కు రంధ్రాలు ‘వీ’ ఆకారంలోకి మారుతాయి. ఈ ఐదు మార్పుల ద్వారా వాటిని బాధను అర్థం చేసుకోవచ్చు. సాధారణ గొర్రె ముఖాలతో ఈ ఐదు రకాల మార్పులను పోల్చి వాటిని బాధను కృత్రిమ మేథస్సు గుర్తిస్తుంటుంది. బాధ తీవ్రతను కూడా తెలియజేయగలదు. కెమేరా ముందు గొర్రె ముఖాలున్నప్పుడు వాటి బాధను ఫొటోల ద్వారా ఏఐ గుర్తించవచ్చు. మరి పక్కకో, వెనక్కో ఉన్నప్పుడు ఎలా గుర్తించాలి? అదే అంశంపై ఇప్పుడు పరిశోధకులు దృష్టిని సారించారు. ఈ పరిశోధనల్లో కూడా విజయం సాధిస్తే గొర్రెల బాధను త్వరగా గుర్తించి వాటిని పశువైద్య శాలలకు తీసుకెళ్లడానికి వీలవుతుంది. -
విరుచుకుపడిన గాలివాన
షెడ్డు కూలి 309 గొర్రెలు మృతి కన్నీరుమున్నీరైన రైతులు గొల్లప్రోలు (పిఠాపురం) : గొర్రెల మందపై గాలివాన విరుచుకుపడడంతో వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న పెంపకందారులు జీవనోపాధి కోల్పోయారు. శుక్రవారం రాత్రి కురిసిన గాలివానకు దుర్గాడలో 309 గొర్రెలు మృతి చెందగా మరో 32 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. గాలివాన తీవ్రతకు గొర్రెలు, మేకల మంద గ్రామానికి చెందిన పూసల సత్తిరాజు పొలంలో నిర్మాణం చేపట్టిన పట్టు పురుగుల పెంపకం షెడ్డు నీడకు చేరాయి. గాలి తీవ్రత ఎక్కువ కావడంతో షెడ్డు ఒక్కసారిగా కుప్పకూలింది. షెడ్డు గోడలు, పైకప్పు దూలాలు గొర్రెలు, మేకలపై పడడంతో అవి చనిపోయాయి. ఈ ఘటనలో గొర్రెల రైతు కపిలేశ్వరపు పాపారావు, కాపరి ఉగ్గిరాల తమ్మియ్యకు గాయాలు కావడంతో చికిత్స కోసం గ్రామానికి తరలించారు. రాత్రివేళ ఈ సంఘటన జరగడంతో ఏమీ తెలియని పరిస్థితి నెలకొంది. మొదట వంద గొర్రెల వరకు మృతి చెందాయనుకున్నారు. తెల్లారిచూసేసరికి మృతి చెందిన గొర్రెల సంఖ్య 309కు చేరింది. దుర్ఘటన జరిగిన సమయంలో ఏడుగురు రైతులకు చెందిన 600 మేకలు, గొర్రెలు ఉన్నాయి. తాటిపర్తి శ్రీనుకు చెందిన 55, గారపాటి వీరబ్బాయికు చెందిన 75, గారపాటి సత్తిబాబుకు చెందిన 45, పల్లా గోవిందుకు చెందిన 34, తాటిపర్తి సత్తిరాజుకు చెందిన 30, కపిలేశ్వరపు పాపారావుకు చెందిన 30, తాటిపర్తి సూరిబాబుకు చెందిన 40 గొర్రెలు మృతి చెందాయి. వీటితో పాటు మరో 32 గొర్రెలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. పరిశీలించిన అధికారులు సంఘటనా స్థలాన్ని కాకినాడ ఆర్డీఓ ఎల్. రఘుబాబు, తహసీల్దార్ వై.జయ, పశుసంవర్ధక శాఖ డీడీ శ్రీనివాస్, ఏడీ డాక్టర్ దినకర్, పశువైద్యాధికారి డాక్టర్ ప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు మడికి ప్రసాద్, టీడీపీ నాయకులు ఎస్‌వీఎస్‌ఎ¯ŒS రవివర్మ, మండల టీడీపీ అధ్యక్షుడు బవిరిశెట్టి రాంబాబు, స్థానిక నాయకులు కొమ్మూరి కృష్ణ, తూము బాబు తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఆర్డీఓ రఘుబాబు మాట్లాడుతూ గొర్రెలకు ఇన్సూరె¯Œ్స చేయిస్తే బీమా పరిహారం అందుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టంపై ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. గొర్రెల పెంపకందారులకు ప్రభుత్వపరంగా పరిహారం అందించేందుకు కృషి చేస్తామన్నారు. కన్నీరు మున్నీరైన పెంపకందారులు తమ జీవనాధారం కోల్పోవడంతో గొర్రెల పెంపకందారులు కన్నీరుమున్నీరయ్యారు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న గొర్రెలు కళ్లెదుటే విలవిలా కొట్టుకుని మృత్యువాతపడ్డాయని గారపాటి వీరబ్బాయి, తాటిపర్తి సత్తిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తాము పెంచుకుంటున్న మొత్తం గొర్రెలు మృత్యువాత పడ్డాయన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. -
గొర్రెల కోసం 4 రాష్ట్రాలకు 14 బృందాలు
సాక్షి, హైదరాబాద్: గొర్రెల కాపరులకు 75 శాతం సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో పశుసంవర్థకశాఖ దీనిపై కసరత్తు ప్రారంభించింది. గొర్రె పిల్లలను ఎక్కడ సేకరించాలో సమాచారం తెలుసుకునేందుకు 14 బృందాలను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు పంపినట్లు ఆ శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. మొత్తం 84 లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ బృందాలు సమగ్రంగా అధ్యయనం చేసి కొనుగోలు అవకాశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాయి. రాష్ట్రంలో నెల్లూరు బ్రౌన్ రకం గొర్రెలు పెంచేందుకు ఆసక్తి చూపుతున్నందున ఆ రకం గొర్రెల కోసం అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. -
విత్తన పొట్టేళ్లతో రాజయోగం
గుమ్మఘట్ట : మేలుజాతి విత్తన పొట్టేళ్ల ఎంపికతో జీవాలతో రాజయోగం పొందవచ్చంటున్నారు.. గుమ్మఘట్ట పశువైద్యాధికారి నవీన్‌కుమార్ (9704316313). ముఖ్యంగా విత్తన పొట్టేళ్ల ఎంపికలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే అధిక ఆదాయాన్ని పొందవచ్చంటున్నారు. మేలుజాతి విత్తనపొట్టేలు..పోషణ.. వాటి ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన ఇలా వివరిస్తున్నారు. విత్తనం పొట్టేళ్లను బట్టి మంద అభివృద్ధికి 50 శాతం ఆధారపడి ఉంటాయి. అందుకే వీటిని మందకు సగంబలం అంటారు. ఒక సాధారణ ఆడ గొర్రె నుంచి ఏడాదిలో ఒకటి, రెండు కంటే ఎక్కువ పిల్లలు పొందలేం. అదే విత్తన పొట్టేలుతో ఏడాదికి 50 నుంచి 70 పిల్లలు జన్మించే అవకాశం ఉంటుంది. ఉపయోగాలివీ.. : బలిష్టమైన పొట్టేలు మందలో ఉంటే..జాతి లక్షణాలు కలిగిన పిల్లలు జన్మిస్తాయి. పుట్టిన పిల్లలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతిగొర్రె ఏడాదికి 2–3 కిలోల బరువు అధికంగా పెరుగుతుంది. తద్వారా జీవాల పెంపకం దారులు ఆర్థికంగా లాభపడుతారు. శ్రేష్టమైన పొట్టేలు జాతి లక్షణాలు.. : విత్తన పొట్టేలు శ్రేష్టమైన జాతి లక్షణాలు కలిగి జీవకళ ఉట్టిపడుతుండాలి. చురుగ్గా, బలిష్టంగా, మగతనం ఉట్టిపడేలా లైంగికాసక్తి కలిగి ఉండాలి. శరీరం దృఢంగా పుష్టిగా ఉండాలి. కళ్లు మెరుస్తుండాలి. కాళ్లు బలంగా, గిట్టలు చక్కగా ఉండాలి. ముఖభాగంపై వెంట్రుకలు ఉండకూడదు. పొట్టేళ్లను ఎంపికచేసుకునే విధానం.. : 2–4 ఏళ్ల వయసున్న పొట్టేళ్లను ఎంపిక చేసుకోవాలి. కవల పిల్లలు కనే సంతతి నుంచి పుట్టిన పొట్టేళ్లను ఎంచుకోవాలి. తమ ప్రాంతానికి అనువైన పొట్టేళ్లను ఎంపికచేసుకోవాలి. సాధారణంగా విత్తనం పొట్టేలు కోసం మందలో పుట్టిన మగజాతి పిల్లని విత్తనం పొట్టేలుగా జీవాల పెంపకం దారులు వినియోగిస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. సొంత రక్తసంబంధం నుంచి పుట్టిన పిల్లలు బలహీనంగా, అవిటిగా, సంతానోత్పత్తికి పనికి రాకుండా జన్యుపరమైన లోపాలు వస్తుంటాయి. కాబట్టి పొట్టేలును వేరే మంద నుంచి తెచ్చుకోవాలి. రెండేళ్ల వయసుదాటిన తర్వాత పోతును దాటేందుకు వినియోగించుకోవాలి. ప్రతి వంద జీవాలకు కనీసం నాలుగు పొట్టేళ్లకు తక్కువ కాకుండా మందలో ఉండేలా జాగ్రత్త వహించాలి. పొట్టేలను జీవాలు ఎదకు వచ్చే సీజన్లో మందతో కలిపి పంపిస్తే ఎదలోని జీవాలను దాటుతాయి. అలాగే ఎల్లప్పుడు మందలో ఉంచితే ఆడ గొర్రెలను ఆటపట్టిస్తూ మేపు సరిగ్గా తీసుకోనివ్వవు. చూడు జీవాలను పొడుస్తుంటాయి. యదలోని జీవాలను తరచూ దాటుతుండటం వల్ల వీర్యం వృథా అయి త్వరగా నీరసపడిపోయి లైంగికాశక్తిని కోల్పోతాయి. కాబట్టి పొట్టేలును విడిగా చూడటం మంచిది. విత్తన పొట్టేలుకు 5–6 ఏళ్ల వయసు మించి ఉండకూడదు. జత కలిపే సీజన్లో పొట్టేలుకు అదనంగా దాణా ఇవ్వాలి. మందలోని పొట్టేళ్లు పొట్లాడుకోకుండా గమనిస్తూ ఉండాలి. -
కుక్కల దాడిలో 15 గొర్రె పిల్లలు మృతి
కనగానపల్లి : మామిళ్ల పల్లి గ్రామంలో సోమవారం ఊర కుక్కలు దాడి చేసి 15 గొర్రె పిల్లలను చంపేశాయి. వీటి విలువ రూ. 30 వేల వరకు ఉంటుందని బాధితుడు గొర్రెల కాపరి నారాయణస్వామి తెలిపాడు. ఇన్ని జీవాలు ఒకేసారి మృతి చెందటంతో జీవనోపాధి కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. -
ఇలా చేస్తే బెట్ట నుంచి బయటకు..
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా బెట్ట పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్, రబీ సీజన్లలో సాగైన వివిధ పంటల్లో యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే బెట్ట నుంచి బయటపడగలమని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి.సహదేవరెడ్డి తెలిపారు. ఖరీఫ్‌లో వేసిన వేరుశనగ, కంది, పత్తి, రబీ సీజన్లో సాగైన వరి, పప్పుశనగ, వేరుశనగ, కర్భూజా, కళింగర పంటలతో పాటు జీవాలు, కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన ‘సాక్షి’కి బుధవారం తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... పంటల సమాచారం: + తొలగించిన వేరుశనగ కాయల్లో తేమ 8 నుంచి 9 శాతం వచ్చేలా ఎండబెట్టుకుని ప్లాస్టిక్ బ్యాగుల్లో నిల్వ చేసుకోవాలి. + అవకాశం ఉన్న ప్రాంతాల్లో కంది పంటకు నీటి తడులు ఇచ్చుకోవాలి. ప్రస్తుతం కందికి శనగపచ్చ పురుగు ఎక్కువగా ఆశించింది. 2 మి.లీ క్వినాల్ఫాస్ లేదా 1.5 గ్రాములు అసిఫేట్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. + ప్రత్తి పంటకు అక్కడక్కడ గులాబీరంగు పురుగు ఆశించింది. ఎకరాకు 4 నుంచి 6 ఫిరమోన్ ఏర్పాటు చేసుకోవాలి. గుబురుగా ఉన్న పూలను గమనించి తీసేయాలి. పురుగు ఉన్నట్లు గమనిస్తే 2 మి.లీ ప్రొఫినోఫాస్ లేదా 1.5 గ్రాములు లార్విన్ లేదా 2 మి.లీ క్లోరోఫైరిపాస్ ఇందులో ఏదో ఒక మందుకు 1 మి.లీ నువాన్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. + వరిలో సుడిదోమ ఆశించింది. 1.6 మి.లీ బుప్రోపెజిన్ లేదా 2 మి.లీ ఇతోఫెన్‌ప్రోక్స్ లేదా 1.5 గ్రాములు అసిఫేట్ లేదా 0.25 గ్రాములు ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.25 గ్రాములు ఎథిప్రోల్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. + నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో రబీ పంటగా వేరుశనగ డిసెంబర్ 15లోగా విత్తుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాములు మాంకోజెబ్ + 2 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 18 కిలోల యూరియా, 100 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్పేట్ (ఎస్ఎస్పీ) వేయాలి. నవంబర్ మొదటి వారంలో విత్తిన రైతులు గొర్రుతో అంతర కృషి చేసుకోవాలి. + అక్కడక్కడ వేసిన పప్పుశనగ పంట బెట్ట పరిస్థితులు ఏర్పడినందున అవకాశం ఉంటే 30 నుంచి 35 రోజుల పంటకు ఒక నీటి తడి ఇస్తే మేలు. అంతరకృషి చేసుకోవాలి. + దోస, కర్భూజాకు ఆశించిన బూడిద తెగులు నివారణకు 1 గ్రాము కార్బండిజమ్ లేదా 1 గ్రాము థయోపానెట్ మిథైల్ లేదా 1 మి.లీ కేరాతన్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ------------------------------------------------------------------- వాతావరణం ఈ నెల 27 వరకు వర్షం వచ్చే సూచనలు లేవు. వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 32 నుంచి 33 డిగ్రీలతో స్థిరంగా కొనసాగనుండగా, రాత్రి ఉష్ణోగ్రతలు 14 నుంచి 16 డిగ్రీలతో కాస్త తగ్గనున్నాయి. గాలిలో తేమ ఉదయం 68 నుంచి 80, మధ్యాహ్నం 40 నుంచి 50 శాతం మధ్య ఉండవచ్చు. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ----------------------------------------------------------- + రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గినందున కోళ్ల పెంపకందారులు ఇన్ప్రారెడ్ బల్బులు లేదా కృత్రిమ ఇంక్యుబెటర్లు ఏర్పాటు చేసుకోవాలి. గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. + ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో గొర్రెల్లో నీలినాలుక(బ్లూటంగ్) వ్యాధి సోకే అవకాశం ఉన్నందున ముందస్తుగా టీకాలు వేయించుకోవాలి. వ్యాధిన పడిన జీవాలకు గంజి, గ్లూకోజ్ తాపించాలి. నోటి పుండ్లను ఒక శాతం పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంలో శుభ్రం చేసి బోరో గ్లిజరిన్ పట్టించాలి. -
పొట్టేలు గాంభీర్యం
‘మేకపోతు గాంభీర్యం’గురించి వినే ఉంటారు. కానీ ఇక్కడ ఓ గొర్రెపోతు (పొట్టేలు) దర్పం చూశారా..! ఎంచక్కా బైక్‌పైకి ఎక్కింది. బండి డ్రైవ్ చేస్తున్నట్టుగా కాసేపు ఫోజిచ్చింది. కొద్దిసేపు స్థానికులను తన చేష్టలతో అలరించి.. బైక్ దిగిపోయింది. ఈ దృశ్యం బయ్యారం మండలంలోని బాలాజీపేటలో బుధవారం చోటుచేసుకుంది. - బయ్యారం -
మూసీలో కొట్టుకుపోయిన 300 గొర్రెలు
మిర్యాలగూడ: నల్లగొండ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసి నది పొంగిపొర్లుతోంది. మిర్యాలగూడ మండలం ముల్కలకాలువ సమీపంలోని మూసి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇది గుర్తించని గొర్రెల కాపరి సోమవారం ఉదయం తన గొర్రెల మందతో వాగు దాటడానికి యత్నిస్తుండగా..300 గొర్రెలు నీటిలో కొట్టుకుపోయాయి. ఒక్క సారిగా వరద పెరగడంతో ఈ దుర్ఘటన జరిగింది. గొర్రెల గల్లంతు యజమాని కన్నీరుమున్నీరవుతున్నాడు. -
రాంబుల్లెట్ గొర్రె కేరాఫ్ బొక్సంపల్లి
పెనుకొండ : మనం చూస్తున్న ఈ గొర్రె ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తరహా జాతికి చెందినది. దీనిపేరు రాంబుల్లెట్. పెనుకొండలోని బొక్సంపల్లి గ్రామంలోని కొండారెడ్డి ఇంట్లో ఈ తరహా గొర్రెలు 20 వరకు మనకు కనిపిస్తాయి. గతంలో హిందూపురం ప్రాంతంలో ఓ రైతు నుంచి ఈ రకం జాతి గొర్రెను తెచ్చి పెంపకం కొనసాగించగా నేడు 20 వరకు చేరుకున్నాయని ఆయన తెలిపారు. ఈనేపథ్యంలో తన వద్ద ఉన్న గొర్రెల్లో ఒక గొర్రెకు జ్వరం సోకడంతో రైతు దీనిని పిల్లతో సహా పెనుకొండ పశువైద్యశాల వద్దకు తీసుకువచ్చాడు. ఒంటి నిండా బొచ్చుతో నిండిఉన్న ఈ గొర్రెను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. -
వింతవ్యాధితో గొర్రెలు మృతి
వైద్యులకు కూడా అంతుచిక్కని వ్యాధితో 15 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం సురాజుపల్లె గ్రామపంచాయతీ కర్సుకుంటపల్లెలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నపుల్లమ్మ అనే కాపరికి చెందిన రూ.ఒకట్నిర లక్షల విలువైన 15 గొర్రెలు ఒక్కరోజులోనే వింతవ్యాధితో చనిపోయాయి. పోషకుల సమాచారంతో పశువైద్యాధికారి శ్రీధర్‌రెడ్డి గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. నోటికి సంబంధించిన వ్యాధి గొర్రెలకు సోకుతోందని, అయితే లక్షణాలను బట్టి అది కొత్త వ్యాధి అని ఆయన తెలిపారు. మృత గొర్రెల నుంచి నమూనాలు సేకరించి లేబొరేటరీకి పంపిస్తున్నట్లు తెలిపారు. ఫలితాలు అందిన అనంతరం వ్యాధి నిర్ధారణ అవుతుందని చెప్పారు. కాగా,ఈ గ్రామంలోని వారంతా గొర్రెల పెంపకాన్నే వృత్తిగా చేపట్టారు. సుమారు ఆరు వేల గొర్రెలను ఇక్కడ పోషించుకుంటున్నారు. -
హై'రా'నా
ఇన్నాళ్లు గజరాజులతో కష్టాలు పడుతున్న పలమనేరు, కుప్పం ప్రాంత వాసులకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చిపడింది. కౌండిన్య అడవిలో ఇటీవల నుంచి హైనాల దాటికి పలు మేకలు, గొర్రె పిల్లలు దూడలు మృత్యువాత పడుతున్నాయి. అడవికి ఆనుకుని పశువులను, మేకలను తోలుకెళ్లే కాపరులు ఆందోళన చెందుతున్నారు. నెలరోజులుగా ఈ ప్రాంతంలో దాదాపు 40 దాకా మేకలు, గొర్రెలు, దూడలను హైనాలు పొట్టనబెట్టుకున్నాయి. అయితే ఇది పులి పనే అని స్థానికులు వాపోతున్నారు. కాదు పులిలాగా చారలు కలిగిన హైనా అనే జంతువని అటవీశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. * మాయమవుతున్న మేకలు, గొర్రెలు * ఇది పులి పనేనని జనానికి గిలి * హైనా పులిని పోలి ఉంటుందంటున్న అటవీశాఖ * ఆందోళన చెందుతున్న పశువులు, మేకల కాపరులు పలమనేరు రూరల్: పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో అటవీ సమీప ప్రాంతవాసులు హైనా(దొమ్మలగొండి)తో హైరానా పడుతున్నారు. మేకలు, గొర్రెలు, పశువులను మేతకు తోలుకెళ్లాలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా పలమనేరు రేంజ్ పరిధిలోని నెల్లిపట్ల, బాపలనత్తం, వెగంవారిపల్లె, కడతట్లపల్లె, కుప్పనపల్లె, దేవదొడ్డి, కైగల్, కస్తూరినగరం, చింతమాకులపల్లె, పలమనేరు మండలంలోని కాలువపల్లె, మండీపేట కోటూరు, జగమర్ల తదితర అటవీ సమీప గ్రామాలకు చెందిన వారి జీవాలు అదృశ్యమవుతున్నాయి. సాయంత్రం మందలను గమనిస్తేగానీ విషయం బయటపడడం లేదు. దీంతో కాపరులు అడవిలోకి వెళ్లి పరిశీలిస్తే పశువుల కళేబరాలు దర్శనమిస్తున్నాయి. హైనాల బారినుంచి తమ జీవాలను కాపాడాలని జనం కోరుతున్నారు. బెరైడ్డిపల్లె, వీకోట మండలాల్లో ఇప్పటివరకు వీటి బారిన పడి మృతి చెందిన మేకలు, దూడల మృతదేహాలను అటవీశాఖ పరిశీలించి ఇది హైనాల పనేనని తేల్చారు. ఎందుకంటే పులి అయితే జంతువు మాంసం కూడా తినేస్తుందని హైనాలు గొంతును కొరికి కేవలం రక్తం, మెత్తని భాగాలను మాత్రమే తింటాయని చెబుతున్నారు. ఇవి పులి కంటే కాస్త తక్కువ ఎత్తు కలిగి, చారలు కలిగి ఉంటాయని, దూరం నుంచి చూస్తే పులిలాగానే కనిపిస్తుందని అధికారులు తెలిపారు. ఎక్కడైతే ఏనుగుల సంచారం ఉంటుందో ఆ అడవుల్లో పులులు ఉండవని చెబుతున్నారు. తమిళనాడు అడవుల నుంచి వచ్చినట్టున్నాయి కౌండిన్య అడవిలో హైనాల కారణంగా పలు దూడలు, గొర్రెలు, మేకలు మృత్యువాతపడుతున్న విషయం వాస్తవమే. మేం కూడా అడవిలో ట్రాకర్స్ ద్వారా వాచ్ చేయిస్తున్నాం. ప్రజలు పులి అనుకుంటున్నారు ఇది ఒట్టిమాటే. అయితే ఇది చూసేందుకు పులిలాగా చారలు కలిగి ఉంటుంది. గతంలో ఇక్కడ హైనాల సంతతి తక్కువగానే ఉండేది. ప్రస్తుతం సంచరిస్తున్న పెద్ద హైనాలు తమిళనాడు అడవి నుంచి వచ్చాయి. - శివన్న, ఎఫ్ఆర్వో, పలమనేరు ఫారెస్ట్ రేంజ్ అడవిలోకి వెళ్లాలంటే భయమేస్తోంది అడవికెళ్లిన పశువులు, దూడలు, మేకలు మాయమవుతున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలా లేదు. కొందరు మాత్రం పులి అయి ఉంటుందని చెబుతున్నారు. కానీ ఈ దెబ్బతో మేమంతా అడవిలోకి పశువులను కూడా తోలడం లేదు. - బాబునాయుడు, ఊసరపెంట, పలమనేరు -
తల చినదే జరిగినిదా..
మన పూర్వీకులు ‘గొర్రె తోక బెత్తెడు’ అన్నారు గాని.. దాని బుర్రలో ఎంత గుంజు ఉందో చెప్పలేదు. ఈ చిత్రంలో గొర్రె చేసిన పని చూస్తే దాని బుర్ర కూడా బెత్తెడుకు మించి ఉండదనిపిస్తుంది. తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలోని లలితానగర్‌లో ఒక గొర్రె మంచినీటి కోసం బిందెలో తల పెట్టింది. పాపం అందులో తల ఇరుక్కుపోవడంతో బయటకు తీసుకోలేక నానాపాట్లు పడింది. దీని అవస్థలు చూసి స్థానికులు శతవిధాలా ప్రయత్నించి ఎట్టకేలకు అతికష్టం మీద బిందెలోంచి గొర్రె తల బయటకు తీశారు. దీంతో తలచినిదా జరిగినిదా దైవం ఎందులకు అనుకుంటూ తిరుగుముఖం పట్టింది. - తణుకు -
పొట్టేలుపై పోలీసులకు ఫిర్యాదు
శత్రువుల్లా తలపడిన పొట్టేళ్లు ఓ పొట్టేలు మృతి మరో పొట్టేలుపై పోలీసులకు ఫిర్యాదు చిత్తూరు : రెండు పొట్టేళ్లు శత్రువుల్లా తలపడ్డాయి. కొమ్ములతో ఢీకొంటూ అమీతుమీ తేల్చుకున్నాయి. ఓ పొట్టేలు అక్కడిక్కడే చనిపోయింది. బాధితురాలు తన పొట్టేలును మరో పొట్టేలు చంపేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన గురువారం బి.కొత్తకోటలో చోటుచేసుకుంది. వివరాలు.. స్థానిక ఇందిరమ్మకాలనీకి చెందిన రవణమ్మ గొర్రెలు, పొట్టేళ్ల పెంపకంపై ఆధారపడి జీవిస్తోంది. గురువారం ఉదయం ఆమె గొర్రెలను మేపేందుకు సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లింది. ఇదే సమయంలో ఇందిరమ్మ కాలనీకే చెందిన మరో వ్యక్తి తన గొర్రెల మంద తో అక్కడికి వచ్చాడు. గొర్రెలను తన మంద సమీపానికి తీసుకురావద్దని, వస్తే పొట్టేళ్లు కలియబడతాయని రవణమ్మ చెప్పింది. ఇంతలో రెండు మందల్లోని రెండు పొట్టేళ్లు తలపడ్డాయి. కొమ్ములతో ఢీకొన్నాయి. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన రవణమ్మ పొట్టేలు అక్కడిక్కడే మృతి చెందింది. దీనిపై రవణమ్మ పోలీసులను ఆశ్రయించింది. -
అల్పక... పెళ్లి పెద్ద!
పెళ్లి తంతుకు ఉన్నన్ని ఆచారాలు దేనికీ లేవనే చెప్పాలి. ఒక్కో మతానికే కాదు ఒక్కో కుటుంబానికీ ఆచారాల్లో వ్యత్యాసం ఉంటుంది. అలాగే జపాన్ దేశంలోనూ వివాహ సమయంలో ఓ వింత ఆచారం ఉందట. అది అల్పక అనే జంతువును పెళ్లి పెద్దగా మార్చడం. అల్పక చూడటానికే కాదు పోలికల్లోనూ గొర్రెకు సమానంగా ఉంటుంది. వాటి ఉన్నితోనూ దుస్తులు నేస్తారు. అలాగే ఫ్యాషనబుల్ బ్యాగులు, చెప్పులు కూడా ఈ మధ్య తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ అల్పక గురించి ఎందుకంటారా? అదేనండి.. జపాన్‌లో జరిగే వివాహాలకు ఈ అల్పకకు దగ్గరి సంబంధం ఉంది. ఎవరి పెళ్లికైనా సరే సాక్షిగా అది తప్పకుండా ఉండాల్సిందేనట. అది వారి ఆచారం. ఇంతకూ అదెలా వచ్చిందంటే రెండు దశాబ్దాల కిందట తొచిగి ప్రాంతంలో ఎపినార్డ్ నాసు అనే హోటల్, దాని పక్కనే ఓ జూ ఉండేవట. అక్కడ పెళ్లిళ్లు చేసుకునే వధూవరులిద్దరూ ఫొటోలు దిగేందుకు అందంగా ఉంటుందని ఆ జూలో నుంచి అల్పకను తీసుకొచ్చేవారు. తర్వాత అది ఆచారంగా మారడంతో ప్రస్తుతం చర్చీల పక్కన జూ లేకున్నా ఎక్కడెక్కడి నుంచో అల్పకాలను పెళ్లిళ్లకు తీసుకొస్తున్నారట. కొన్ని చోట్ల వాటిని సప్లై చేసే బిజినెస్ కూడా బాగా నడుస్తోంది. గంటకు ఇంత అనే లెక్కన అల్పకాలను అద్దెకిస్తున్నారట. -
గోట్స్ థియరీ
హ్యూమర్ ప్లస్ నిజానికి మనుషులకి, గొర్రెలకీ పెద్దగా తేడా లేదు. ఈ విషయం అందరి కంటే టీవీ చానెల్స్ వారికి బాగా తెలుసు. ఒక రోజు మనుషులెవరూ దొరక్క ఒక గొర్రెని స్టూడియోకి తీసుకొచ్చి ఇంటర్వ్యూ మొదలుపెట్టారు. ‘‘గతంలో కూడా మేము చాలా గొర్రెలతో ఇంటర్వ్యూ చేశాం. అయితే అవి మనుషుల్లా మేకప్ చేసుకుని రావడం వల్ల మీరు గుర్తు పట్టలేకపోయారు. ఈసారి ఒరిజినల్ గొర్రెనే పిలిపించాం. ఇది మనుషులకంటే తెలివైన సమాధానాలే ఇస్తుందని నమ్ముతున్నాం’’ అని ప్రారంభించింది యాంకర్. ప్ర. ‘‘మేకలు మేమే అంటాయి. మీరెందుకు అలా అరవరు?’’ జ. ‘‘మే నెల అంటే మాకిష్టం లేదు. ఒకటే ఎండ’’ ప్ర. ‘‘మనుషులపై మీ అభిప్రాయం ఏమిటి?’’ జ. ‘‘గొర్రెలుగా మారాలంటే ఇంకాస్త ఎదగాలి’’ ప్ర. ‘‘ప్రజాస్వామ్యంపై మీ ఒపీనియన్?’’ జ. ‘‘అది హనుమంతుడి తోకలా ఉంటుందని నాయకులు చెబుతుంటారు కానీ అది వాస్తవానికి మా తోకంత ఉంటుంది. అధికారమనేది దుడ్డుకర్రలాంటిది. అది చేతిలో ఉంటే ఎవరో ఒకర్ని మోదాలనిపిస్తూ ఉంటుంది. ఇక మనుషులే ఏ ఒపీనియన్స్ లేకుండా జీవిస్తున్నప్పుడు గొర్రెల ఒపీనియన్స్‌ని గౌరవించడం మీ చానెళ్ల గొప్పదనాన్ని తెలియజేస్తుంది. ‘‘గొర్రె కసాయివాణ్ణి నమ్ముతుందని ఎందుకంటారు?’’ ‘‘నమ్మినా నమ్మకపోయినా వాడెలాగూ చంపలేడు. అవిశ్వాసంతో మరణించడం కంటే, విశ్వాసంతో మరణించడం శ్రేయస్కరం. ఓటేసినా, వేయకపోయినా ఎవరో ఒకరు గెలవడం తప్పనిసరి అయినట్టు, చచ్చేవాడి నమ్మకాలతో ఒరిగేదేమీ లేదు.’’ ‘‘మీరు ఫిలాసఫరా?’’ ‘‘కాదు ఫిలాసఫరర్’’ ‘‘మీకేమైనా థియరీస్ ఉన్నాయా?’’ ‘‘తోక ఉన్నప్పటికీ విప్పలేను, చెప్పలేను, దీన్ని టెయిల్స్ థియరీ అంటారు’’ ‘‘టెయిల్ ఉన్నప్పుడు హెడ్ కూడా ఉండాలిగా. ఆ థియరీ చెప్పండి’’ ‘‘ఆఫీసుల్లో అనేకమంది హెడ్స్ ఉన్నట్టు. ఈ హెడ్స్లా రకరకాల థియరీలు ఉంటాయి. హెడ్ మూవ్మెంట్ అంటే ఎదుటివాడు చెప్పేది అక్షరం అర్థం కాకపోయినా అన్నింటికి తల ఊపే థియరీ ఇది. వీళ్లకు నాలుగు కాలాల పాటు హెడ్ పదిలంగా ఉంటుంది. హెడ్ వెయిట్ థియరీ అంటే ప్రపంచమంతా మన తలలో నుంచే నడుస్తుందని నమ్మే థియరీ. లోకం బరువు మోసి మోసి వీళ్ల తలకాయ చైనా చార్జర్‌లా పేలిపోతుందని అనుకుంటూ ఉంటారు. అందరి తలరాత రాస్తున్నామని అనుకుంటారు కానీ తలకి నూనె తప్ప ఇంకేమీ రాయలేరు. హెడ్‌లెస్ థియరీ అని ఇంకొకటుంది. బయటికెళ్లాక తల ఉంటుందో లేదో తెలియని నాలాంటి వాళ్లు చెప్పే థియరీ ఇది’’ ‘‘థియరీస్ బావున్నాయి. ప్రాక్టికల్స్‌కి కూడా ఉన్నాయి?’’ ‘‘థియరీస్ మేం చెబుతాం. నాలాంటి వాళ్లని బిరియాని వండుకుని ప్రాక్టికల్స్ మీరు చేసుకుంటారు’’ ‘‘మనుషులకి గొర్రెలకి తేడా లేదని మా అభిప్రాయం’’ ‘‘గొర్రెలకి మనుషులకి తేడా లేదని నా అభిప్రాయం’’ ‘‘రెండు ఒకటేగా?’’ ‘‘ఒకలా కనిపించేవన్నీ ఒకటి కావు. ఉప్పు కప్పురంబు పద్యం తెలుసుగా. మీరు ప్రతీది మనుషులతో పోలుస్తారు. మేం గొర్రెలతో పోలుస్తాం. మనుషులు మారాలి అని మీరంటే, గొర్రెలు మారాలి అని మేమంటాం’’ ‘‘ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం’’ ‘‘పైసా ఖర్చు లేకుండా వాట్సప్‌లో ఎవరికి వాళ్లు లక్షల సందేశాలు ఇచ్చుకుంటుంటే గొర్రెలిచ్చే సందేశం ఎవడికి కావాలి? అయినా అడిగారు కాబట్టి ఇస్తున్నా. మీరు మనుషులైనా, గొర్రెలైనా కత్తికి దొరక్కుండా జీవించండి’’ ‘‘పొయెటిక్‌గా చెప్పారు’’ ‘‘కత్తి కంటే కవిత్వం డేంజర్’’ ‘‘మీ విలువైన అభిప్రాయాల్ని మాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి’’ ‘‘ఆ గుంజకి కట్టిన వాడు తాడు విప్పితే నా దారిన నేను పోతాను’’ - జి.ఆర్. మహర్షి -
టీడీపీ లేకుంటే కేసీఆర్ గొర్రెలు కాసుకునేవాడు..
కాకినాడ : నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని నీటి ఎద్దడి లేకుండా చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయటానికి నాలుగేళ్లు పడుతుందన్నారు. సముద్రంలోకి వెళ్తున్న వృథా నీటిని వాడుకునేందుకే పట్టిసీమ ప్రాజెక్ట్ చేపడుతున్నామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు కాకినాడలో జిల్లా పర్యాటక సర్క్యూట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ కాకినాడలో పెట్రోలియం యూనివర్శిటీ, రాజమండ్రిలో నర్సరీ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో దేశానికి ధాన్యాగారాలని ఆయన అన్నారు. నదుల అనుసంధానానికి టీడీపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కేంద్రాన్ని మధ్యవర్తిత్వం పెట్టుకుందామని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చెప్పామన్నారు. టీడీపీ లేకపోతే కేసీఆర్ సిద్ధిపేటలో గొర్రెలు కాసుకునేవారిని చంద్రబాబు వ్యాఖ్యానించారు. -
అల్పకా... అచ్చంగా మన గొర్రే!...
ప్లే టైమ్ అల్పకా ప్రధానంగా దక్షిణ అమెరికా దేశాల్లోనూ, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కనిపించే జంతువు. శీతల వాతావరణంలో పెరగడం వల్ల దాని రూపంలో మార్పు కనిపిస్తోంది. కానీ ఇది అచ్చం మన గొర్రెను పోలిన జంతువే. మన దగ్గర గొర్రెల ఉన్నికి, మాంసానికి గిరాకీ ఉన్నట్లే... చిలీ, ఈక్వెడార్, బొలీవియా, పెరూ వంటి దేశాల్లోనూ అల్పకాల మాంసానికి, ఉన్నికి డిమాండ్ ఎక్కువ. అక్కడి ప్రజలు దీన్ని పెంపుడు జంతువుగా, వాణిజ్య జంతువుగా పెంచుకొంటారు. వీటి ఉన్నితో స్వెటర్లు, టోపీలు, గ్లోవ్స్ చేస్తారు. పెరూ దేశంలో పెరిగే అల్పకా నుంచి 52 రంగుల ఉన్ని లభిస్తుంది. సహజరంగుల్లో లభించే ఉన్ని కాబట్టి, ఈ ఉన్నికి వస్త్ర పరిశ్రమలో డిమాండ్ ఎక్కువ. అల్పకాలు 48 నుంచి 84 కేజీల బరువు పెరుగుతాయి. జీవనశైలి, ఆహారం విషయంలోనూ అరుపులోనూ ఇవి గొర్రెలనే గుర్తు చేస్తాయి. వీటిల్లో పోతులు (మగవి) మన పొట్టేళ్లలాగానే పొడుస్తూ దాడికి దిగుతాయి. -
చిరుత దాడి : 15 గొర్రెలు మృతి
అనంతపురం: అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. చిట్టెపల్లి గ్రామంలో గొర్రెల మందపై సోమవారం చిరుత దాడి చేసింది. ఈ దాడిలో 15 గొర్రెలు మృతిచెందాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. -
చిరుత దాడి: గొర్రె మృతి
కర్నూలు : జిల్లాలోకి కొసిగి మండలంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. నేల కొసిగి గ్రామంలో గొర్రెల మందపై శనివారం అర్థరాత్రి చిరుత దాడి చేసింది. ఈ దాడిలో ఓ గొర్రె మృతి చెందింది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గ్రామస్తులు ఎవరికి వారు ఇళ్లకు తలపులు వేసుకుని ఇంట్లో కుర్చున్నారు. -
చిరుత దాడిలో.. 71 గొర్రెలు మృతి!
-
మేకలు బంధువుల ఇళ్లకు వెళ్లాయట!
రేగోడ్: పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు సర్కార్ ఇందిరాక్రాంతి పథం కింద అర్హులైన వారికి లక్షల రూపాయలు విడుదల చేసి మేకలు, బర్రెలను కొనుగోలు చేసుకోవాలని సూచిస్తే, అర్హులంతా తాము బర్రెలు, మేకలు కొనుగోలు చేశామని సర్కార్‌కు నివేదించారు. కానీ ఆడిటింగ్ అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లినప్పడు మాత్రం ఆ పశువులు కనిపించలేదు. పశువులు ఏమయ్యాయని ప్రశ్నిస్తే మా బంధువుల ఇళ్లకు వెళ్లాయనే సమాధానం చెప్పారని అధికారులు ప్రజాదర్బార్‌లో వివరించారు. శనివారం ఎంపీపీ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజాదర్బార్‌లో డీఆర్పీలు ఇలాంటి వింత కథలెన్నో వినిపించారు. 2009-10 సంవత్సరంలో వాటర్‌షెడ్ పథకంలో మంజూరైన రూ.6 కోట్లలో రూ.79 లక్షలు ఆయా పనులపై ఖర్చు చేయగా, ఈ పనులపై ఆడిట్ అధికారులు సర్వే చేసి గ్రామసభలు నిర్వహించారు. శనివారం స్థానిక ఎంపీపీ కార్యాలయ ఆవరణలో ఈజిఎస్ అడీషనల్ పీడీ అమరేశ్, జిల్లా విజిలెన్స్ అధికారి రాంరెడ్డి, పోగ్రాం మేనేజర్ వేణుగోపాల్‌రెడ్డి సమక్షంలో ఉదయం 11.30 గంటలకు నుంచి రాత్రి 8 వరకూ ఈ ప్రజాదర్బార్ కొనసాగింది. ఇందిరాక్రాంతి పథం ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులకు మేకలు, గొర్రెలు, బర్రెల కొనుగోళ్ల కోసం లక్షల రూపాయలు మంజూరు చేశారు. కానీ గొర్రెలు, బర్రెలు పొందిన వారి ఇళ్లవద్దకు వెళ్లగా, చాలా చోట్ల పశువులు కనిపించలేదని ఆడిట్ అధికారులు ప్రజా దర్బార్‌లో తెలిపారు. పశువులు ఎక్కడున్నాయంటూ ప్రశ్నించగా, తమ బంధువుల ఇంటి వద్ద ఉన్నాయని పశువులు పొందిన వారు తెలిపారన్నారు. ఈ తతంగం చూస్తుంటే పశువులను కొనుగోలు చేయకుండానే నిధులు మాత్రం తీసుకున్నారనే విషయం బహిర్గతమైనట్లు వారు వెల్లడించారు. ఇక రాళ్లకట్టలు, చెక్‌డ్యాంలు, కుంటల పనుల్లో అనేక అవకతవకలు జరిగినట్లు డీఆర్పీలు తెలిపారు. గతంలో ఉపాధిహామి పథకంలో చేపట్టిన పనులనే వాటర్‌షెడ్ పథకంలో చూపించినట్లు ప్రజాదర్బార్‌లో వెల్లడించారు. పలుచోట్ల పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ సునీత, జెడ్పీటీసీ రాంరెడ్డి, వాటర్‌షెడ్ పీఓ వీరన్న, ఈజీఎస్ ఏపీఓ జగన్ తదితరులు పాల్గొన్నారు. -
సెలబ్రటీ గొర్రె పొట్టేలు
-
జీవాలతో జీవానోపాధి
నిజామాబాద్ వ్యవసాయం:నిజామాబాద్ జిల్లాకేంద్రానికి చెందిన బైర సుభాష్ ఉన్నత చదువులు చదివారు. ఉపాధి కోసం హైదరబాద్‌తో పాటు వివిధ దేశాలకు వెళ్లారు. అలా సింగపూర్ వెళ్లినప్పుడు ఆయన ఓ గోట్ డెయిరీని చూశారు. బర్రెలు, ఆవుల డెయిరీల గురించే తెలిసిన ఆయన దాన్ని ఆసక్తిగా పరిశీలించారు. ఆ దేశంలో పాల కోసం మేకలను పెంచుతారు. అయితే మనదేశంలో మేకలు, గొర్రెల మాంసానికి మంచి డిమాండ్ ఉంటుందన్న విషయాన్ని గ్రహించారు. అలా సుభాష్ స్వదేశానికి తిరిగి వచ్చి నాలుగేళ్ల క్రితం డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామ శివారులో సుమారు 25ఎకరాల్లో గొర్రెలు, మేకల పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వాటికి కావల్సిన దాణాను సైతం స్వయంగా సమకూర్చుకుంటున్నారు. పెట్టుబడి గొర్రెల పెంపకం కేంద్రానికి కావల్సిన పెట్టుబడి, ఖర్చులు, ఆదాయం వివరాలను సుభాష్ వివరించారు. మొత్తం పెట్టుబడి రూ.12లక్షలు అవసరం ఉంటుంది. రూ.3లక్షలు పెడితే.. మిగితా రూ.9లక్షలు బ్యాంకు రుణం ఇస్తుంది. దీనికి రూ.రెండున్నర లక్షలు సబ్సిడీని జాతీయ పశుగణాభివృద్ధి సంస్థ(నేషనల్ లైవ్ స్టాక్మిషన్) ద్వారా వస్తుంది. ఏర్పాటు చేయడానికి స్థలం వంద ఆడ గొర్రెలు, ఐదు మగ గొర్రెలు(పొట్టేళ్లు) కలిపి ఒక యూనిట్ అంటారు. వీటికి మూడు ఎకరాల స్థలం కావాలి. ఇందులో రెండు ఎకరాల్లో గడ్డిజాతి పశుగ్రాసం, ఎకరంలో పప్పుజాతి పశుగ్రాసం పెంచాలి. ఖర్చు పెంపకం కేంద్రం నడపడానికి ఇద్దరు కార్మికులు అవసరం. వీరికి నెలకు రూ.6వేల చొప్పున ఇద్దరికి కలిపి రూ.12వేలు అవుతుంది. పశుగ్రాసం పెంపకం కోసం రూ.6వేలు, ఆరోగ్య సంబంధ టీకాలు, మందుల కోసం రూ.6వేలు, మిశ్రమ దాణా కోసం రూ.15వేలు. మొత్తం ఒక నెలకు రూ.39వేలు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన 8 నెలలకు మొత్తం రూ.3లక్షల 12వేలు ఖర్చు. లాభాలు పుట్టిన గొర్రె పిల్లలను 8 నెలలు పెంచాలి. ఈ 8 నెలల్లో దాదాపుగా 30 కిలోల బరువు పెరుగుతుంది. ఒక్కో కిలోకు రూ.250 చొప్పున 30కిలోలకు రూ.7500 వస్తాయి. వంద గొర్రెలను పెంచితే అందులో పదిశాతం మృతిచెందినా దాదాపు 81పిల్లలు ఉంటాయి. 8 నెలల తర్వాత అవి 30 కిలోల బరువు అవుతాయి. ఈలెక్కన 81 గొర్రెలకు 2,430 కిలోల మాంసం అవుతుంది. దీన్ని కిలో రూ. 250 చొప్పున విక్రయిస్తే రూ. 6లక్షల 7వేల 5వందలు వస్తాయి. ఇందులో నుంచి పెట్టుబడి రూ.3లక్షల 12వేలు తీసివేస్తే.. రూ.2లక్షల 95వేల 5వందలు మిగులుతాయి. ఇది 8 నెలల ఆదాయం. -
‘షేడ్‌నెట్’తో.. కాలం కలిసొస్తుంది!
భాస్కర్‌రెడ్డి సాధారణ పద్ధతిలో నారు పెంచితే... సాధారణ పద్ధతిలో పెంచే నారును పశువులు, గొర్రెలు, మేకలు మేసే ప్రమాదం ఉంటుంది. దీనికి రైతు కాపలా ఉండాల్సి వస్తుంది. ఏ తెగులు ఎలా వస్తుందో తెలుసుకోవడం కష్టం. మురుగు నీరు పారే వసతి (నీరు ఇంకిపోయే గుణం) నారుమడుల్లో ఉండకపోవడం వల్ల నారు కుళ్లు సోకే ప్రమాదం ఉంటుంది. విత్తనాలు దగ్గర దగ్గరగా వేయడం వల్ల నారు ఒత్తుగా పెరిగి బలంగా ఉండదు. దీన్ని పొలంలో నాటిటే మొక్కలు వంగిపోయి చనిపోతాయి. నారును బహిరంగ ప్రదేశాల్లో పెంచడం వల్ల తామర, పేనుబంక, తెల్లదోమ వంటి రసం పీల్చే పురుగు ఆశించి పాడవుతుంది. నారును పొలం నుంచి పీకినప్పుడు పీచువేర్లు తెగిపోయి వేర్లతో సహా మట్టి తక్కువగా ఉండడం లేదా పూర్తిగా లేక పోవడంవల్ల నాటిన తర్వాత మొక్కలు చనిపోయి పొలంలో ఖాళీలు ఏర్పడుతాయి. మళ్లీ మొక్కలు నాటినా అవి పెరిగే వరకు చాలా సమయం పడుతుంది. పొలంలో నాటడానికి 30 రోజులు ముందే విత్తనాలు సేకరించుకుని నారు పోసి కనీసం 26 నుంచి 40రోజుల వరకు నారు మడులను సంరక్షించాల్సిన వస్తుంది. మధ్యకాలంలో అనువైన వర్షాలు కురిసి అదును ఉన్నా నారు సాగు చేయడానికి పనికిరాదు. షేడ్‌నెట్ హౌస్‌తో ఉపయోగాలు.. నర్సరీలలో నారును ట్రేలలో పెంచుతారు. ముందుగా కొబ్బరి పీచులో విత్తనాలను పూడ్చడం వల్ల తగు మేర తేమ ఉండి మొలకశాతం పెరుగుతుంది. తద్వారా విత్తన మోతాదు తగ్గి ఖర్చు తగ్గుతుంది. నారును ప్లాస్టిక్ ట్రేలలో పెంచడం వల్ల వేర్లు సమృద్ధిగా పెరిగి పక్క మొక్కకు సంబంధం లేకుండా ఎదుగుతాయి. మొక్కలు ట్రేల నుంచి పెరిగినప్పుడు వేరు వ్యవస్థ దెబ్బతినకుండా కొబ్బరి పీచుతో సహా పూర్తిగా ఊడివస్తుంది. ఈ మొక్కలను పొలంలో నాటినప్పుడు చనిపోయే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కో ట్రే గుంత రెండున్నర సెంటీమీటర్లు ఉండటం వల్ల ప్రతి మొక్కకు నలువైపులా కావాల్సినంతా ఖాళీ ఉండి మొ క్కలు ధృడంగా పెరుగుతాయి. ఇలాంటి మొక్కలు పొలంలో నాటిన వెంటనే పెరుగుదల ప్రారంభం అవుతుంది. మొక్కలు షేడ్నెట్హౌస్లలో పెరగడం వల్ల తగినంత వెలుతురు, గాలి, తేమ ఉండి మొక్కల పెరుగుదలతో అన్ని సమంగా ఉండి ప్రధాన పొలంలో త్వరగా నాటుకునే అవకాశం ఉంటుంది. షేడ్ నెట్ హౌస్‌ల చుట్టూ తెల్లటి ఇన్సెక్ట్ నెట్ ఏర్పాటు చేయడం వల్ల తామర పురుగులు, పేనుబంక, తెల్లదోమ వంటి వైరస్ తెగుళ్ల వ్యాప్తికి సహాయపడే రసం పీల్చే పురుగులు ఆశించడానికి అవకాశం ఉండదు. ఫలితంగా నాణ్యమైన, ఆరోగ్యవంతమైన నారు లభిస్తుంది. ఈ షేడ్‌నెట్ మౌస్‌లలో పాముపొడ, చీడపీడలు నారు మొక్కలపై ఆశించే అవకాశం ఉండదు. పంట ఎప్పుడు సాగు చేసుకోవాలనుకున్నా నారు అప్పటికప్పుడు రెడీమేడ్‌గా అదును వచ్చిన వెంటనే సాగుకు అవకాశం ఉంటుంది. సాధారణ పద్ధతిలో ఖర్చు అధికం.. ఎకరం పొలంలో పంటసాగుకు ముందుగా నారు మళ్లు తయారు చేసుకోవాలి. ఎత్తుబెడ్లు ఏర్పాటు చేసుకోవాలి. ఫ్రూడాన్ గుళికలు, వేప పిండి చల్లి విత్తనాలు చల్లుకోవాలి. రెండుమూడు సార్లు మందు పిచికారీ చేయాలి. ఈ సాధారణ పద్ధతికి గాను పెట్టుబడి మొత్తం రూ. 5వేలు అవుతుంది. ఎకరం కూరగాయల సాగుకు 12వేల మొక్కలు కావాలి. అయినా అందులో ఎన్ని చనిపోతాయో చెప్పలేని పరిస్థితి. షేడ్నెట్లలో.. నారును ట్రేలలో పెంచుతారు. ఎలాంటి రోగ లక్షణాలు ఉండవు. అన్ని రకాల పిచికారీ మందులు వాడతారు. ఎకరం కూరగాయల సాగుకు 8వేల మొక్కలు సరిపోతాయి. ఏ మొక్కా చనిపోదు. నారు ఖర్చు మొక్కకు 30 పైసలు అయితే పెట్టుబడి రూ.2,400, నారు 40పైసలు అయితే పెట్టుబడి రూ. 3,200 అవుతుంది. సాధారణంతో పోల్చితే షేడ్నెట్హౌస్ల ద్వారా తక్కువ ఖర్చవుతుంది. -
చిరుత చిక్కింది
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 60 గొర్రెలను ఆ చిరుతలు పొట్టనపెట్టుకున్నాయి. గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేసాయి. ‘గండికోట’కు పర్యాటకులు బిక్కుబిక్కుమంటూవచ్చేవారు. అటవీ అధికారులు ఏర్పాటుచేసిన బోనులో మూడేళ్ల వయసున్న ఆడ చిరుత శుక్రవారం చిక్కింది. దీనికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి తిరుపతి జూకు తరలించారు. మరో మగ చిరుతను కూడా త్వరలో పట్టుకుంటామని డీఎఫ్ఓ శివశంకర్ రెడ్డి తెలిపారు. జమ్మలమడుగు: గండికోట గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్న చిరుత పులుల్లో ఒకటి బోనుకు చిక్కింది. నెలరోజుల నుంచి మండల పరిధిలోని ప్రజలకు ఈ చిరుత పులులు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 60 గొర్రెలను పొట్టనబెట్టుకున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా గండికోట పరిసర ప్రాంతాల్లో గ్రామస్తులకు ఇవి కనిపించేవి. దీంతో ఒంటరిగా తిరగాలంటే భయపడే స్థాయికి గ్రామస్తులు వచ్చారు. గండికోట పర్యాటక ప్రదేశం కావడంతో పర్యాటకులకు కూడా చిరుత భయం పట్టుకుంది. చిరుత పులులు సంచరిస్తున్నట్లు గ్రామస్తులు అటవీ అధికారులతో పాటు రెవెన్యూ, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చిరుత జాడలు కనిపించడం లేదని, ఏమైనా కనిపిస్తే ఫొటోలు తీయాలని గ్రామస్తులకు అటవీ సిబ్బంది సూచించారు. నాలుగురోజుల క్రితం పట్టపగలు గొర్రెల మందలోనుంచి గొర్రెను చిరుతపులి తీసుకుని పోతుండటంతో గొర్రెల కాపరి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశాడు. సమీపంలో ఆవుల మంద ఎక్కువగా ఉండటంతో ఒకేసారి ఆవులు పరుగెత్తాయి. దీంతో చిరుత భయపడి గొర్రెను వదిలేసి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని అధికారులకు తెలపడంతో బోను ఏర్పాటు చేశారు. బోనులో ప్రతి రోజు రాత్రి గొర్రె పిల్లలను కట్టేసి ఉంచుతూ వచ్చారు. శుక్రవారం తెల్లవారు జామున గొర్రెపిల్లను తినటానికి వచ్చిన చిరుత బోనులో చిక్కింది. చిరుత బోనులో చిక్కినట్లు తెలియడంతో దానిని చూడటానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు తరలివచ్చారు. తిరుపతికి తరలింపు.. మూడేళ్ల వయస్సు ఉన్న చిరుత బోనుకు చిక్కిన విషయాన్ని డీఎఫ్ఓ శివశంకర్‌రెడ్డి తిరుపతి అటవీ అధికారులకు తెలిపారు. చిరుతను తిరుపతి జూకు తరలించాలని వారు సూచించారు. జూ సిబ్బంది చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తిరుపతికి తరలించారు. ఏఎస్పీ వెంకట అప్పలనాయుడు, తహశీల్దార్ శ్రీనివాసన్, ఎంపీడీఓ మల్లయ్య, ఇఓపీఆర్‌డీ రామచంద్రారెడ్డి పరిస్థితులను సమీక్షించారు. పరిహారం చెల్లిస్తాం చిరుత పులుల దాడిలో గొర్రెలను కోల్పోయిన గొర్రెల కాపరులకు నష్టపరిహారం చెల్లిస్తామని డీఎఫ్ఓ శివశంకరరెడ్డి తెలిపారు. తమకు చెందిన 60 గొర్రెలను చిరుతపులులు చంపేశాయని గొర్రెలకాపరులు డీఎఫ్ఓ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ మాట్లాడుతూ ఎన్ని గొర్రెలు చనిపోయాయో విచారణ చేసి న్యాయం చేసే విధంగా ప్రభుత్వానికి నివేదికలు పంపుతామన్నారు. గండికోట పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్న ఆడ చిరుతను పట్టుకున్నామని, మగ చిరుతను కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. వన్యమృగాలను చంపకుండా వాటిని సంరక్షించుకోవలసిన బాధ్యత ఉందన్నారు. ఎవరైనా చంపితే ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 25లక్షల జరిమానా విధిస్తామన్నారు.