గొర్రెకు మేకపిల్ల జననం  | GOAT IS BORN TO A SHEEP | Sakshi
Sakshi News home page

గొర్రెకు మేకపిల్ల జననం 

Published Sun, Dec 10 2023 4:37 AM | Last Updated on Sun, Dec 10 2023 4:37 AM

GOAT IS BORN TO A SHEEP - Sakshi

దేవరుప్పుల: జనగామ జిల్లా దేవరుప్పుల మండలం గొల్లపల్లిలో కోనేటి సోమయ్యకు చెందిన గొర్రెకు మేకపిల్ల జన్మించింది. శనివారం జరిగిన ఈ వింతను చూసి పెంపకందారులు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటన జనగామ–సూర్యాపేట రహదారి పక్కనే జరగడంతో బాటసారులు సైతం ఆసక్తిగా గమనించారు. దానిని వీడియో తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. ఈ విషయమై మండల పశువైద్యాధికారి సింధుప్రియ మాట్లాడుతూ ఒకే మందలో గొర్రెలు, మేకలు తిరిగినప్పుడు అనుహ్య సంపర్క ప్రక్రియతో ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement