baby goat
-
గొర్రెకు మేకపిల్ల జననం
దేవరుప్పుల: జనగామ జిల్లా దేవరుప్పుల మండలం గొల్లపల్లిలో కోనేటి సోమయ్యకు చెందిన గొర్రెకు మేకపిల్ల జన్మించింది. శనివారం జరిగిన ఈ వింతను చూసి పెంపకందారులు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన జనగామ–సూర్యాపేట రహదారి పక్కనే జరగడంతో బాటసారులు సైతం ఆసక్తిగా గమనించారు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయమై మండల పశువైద్యాధికారి సింధుప్రియ మాట్లాడుతూ ఒకే మందలో గొర్రెలు, మేకలు తిరిగినప్పుడు అనుహ్య సంపర్క ప్రక్రియతో ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయని పేర్కొన్నారు. -
మేక చెవులు ‘కేక’.. చేటంత వెడల్పు, 19 ఇంచుల పొడవు.. వీడియో వైరల్
చేటంత చెవులు అని ఏనుగు చెవులను అంటుంటాం.. కానీ ఈ బుజ్జి మేక పిల్ల చెవులు చేటల్లా లేకున్నా.. చాంతాడంత పొడుగు మాత్రం ఉన్నాయి. ఎంతంటే.. ఈ మేక పిల్ల పుట్టినప్పుడు దానికంటే దాని చెవులే ఎక్కువ పొడవున్నాయట. పాకిస్తాన్లోని కరాచీలో ఓ రైతు ఇంట్లో జన్మించిన దీనికి ‘సింబా’అని పేరుపెట్టారు. ఏకంగా 19 అంగుళాల పొడవున్న చెవులతో ఈ మేక పిల్ల త్వరలోనే గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కబోతోందని దాని యజమాని మహమ్మద్ హాసన్ చెప్తున్నాడు. చింత చిగురుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. దాని ఫొటోలను సోషల్మీడియాలో పెడుతూ సంబరపడిపోతున్నాడు. సాధారణంగా నుబియన్ జాతికి చెందిన మేకల చెవులు పొడుగ్గా ఉంటాయని.. కానీ ‘సింబా’చెవులు మాత్రం మరీ ఎక్కువ పొడవున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఈ మేక పిల్లలో జన్యు మార్పిడిగానీ, ఏదైనా జెనెటిక్ సమస్యగానీ దీనికి కారణం కావొచ్చని అంటున్నారు. అది ఎర్రటి రంగేసిన ఆకర్షణీయమైన వంటకమా? అయితే డేంజరే! -
ఆ మేకకు దివ్యశక్తులు ఉన్నాయట!
మధ్యప్రదేశ్లో రెండు నెలల వయసున్న మేకకు దివ్యశక్తులు ఉన్నాయంటూ దాన్ని అంతా పూజిస్తున్నారు. అక్కడ ఖర్గోన్ జిల్లాలోని బిరోతి గ్రామంలోని ఈ మేక నెల రోజుల వయసు ఉన్నప్పటి నుంచే పాలివ్వడం మొదలుపెట్టింది. ఆ మేకపిల్ల తన తల్లి వద్ద పాలు తాగడంతో పాటు.. అది కూడా పాలిస్తోంది. లక్షల్లో ఒకదానికి మాత్రమే ఇలాంటి లక్షణాలుంటాయని, దీనికి ఏదో దివ్యశక్తులు ఉండటం వల్లే ఇలా చేస్తోందని భావించి స్థానికులంతా ఆ మేకపిల్లను పూజించడం మొదలుపెట్టారు. తాను పెంచుకుంటున్న మేకపిల్ల ఇంత ఫేమస్ కావడంతో దాని యజమాని సఖీ బాయ్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. కానీ.. హార్మోన్ల ప్రభావం వల్ల అరుదుగా కొన్ని మేకల్లో ఇలా జరుగుతుందని, ఇందులో దివ్యశక్తులు ఏమీ లేవని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. అయినా జనం మాత్రం దాన్ని పూజించడం మానలేదు.