చేటంత చెవులు అని ఏనుగు చెవులను అంటుంటాం.. కానీ ఈ బుజ్జి మేక పిల్ల చెవులు చేటల్లా లేకున్నా.. చాంతాడంత పొడుగు మాత్రం ఉన్నాయి. ఎంతంటే.. ఈ మేక పిల్ల పుట్టినప్పుడు దానికంటే దాని చెవులే ఎక్కువ పొడవున్నాయట. పాకిస్తాన్‌లోని కరాచీలో ఓ రైతు ఇంట్లో జన్మించిన దీనికి ‘సింబా’అని పేరుపెట్టారు. ఏకంగా 19 అంగుళాల పొడవున్న చెవులతో ఈ మేక పిల్ల త్వరలోనే గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కబోతోందని దాని యజమాని మహమ్మద్ హాసన్ చెప్తున్నాడు.
చింత చిగురుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..
దాని ఫొటోలను సోషల్‌మీడియాలో పెడుతూ సంబరపడిపోతున్నాడు. సాధారణంగా నుబియన్ జాతికి చెందిన మేకల చెవులు పొడుగ్గా ఉంటాయని.. కానీ ‘సింబా’చెవులు మాత్రం మరీ ఎక్కువ పొడవున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఈ మేక పిల్లలో జన్యు మార్పిడిగానీ, ఏదైనా జెనెటిక్ సమస్యగానీ దీనికి కారణం కావొచ్చని అంటున్నారు.
అది ఎర్రటి రంగేసిన ఆకర్షణీయమైన వంటకమా? అయితే డేంజరే!
Comments
Please login to add a commentAdd a comment