Simba
-
మేక చెవులు ‘కేక’.. చేటంత వెడల్పు, 19 ఇంచుల పొడవు.. వీడియో వైరల్
చేటంత చెవులు అని ఏనుగు చెవులను అంటుంటాం.. కానీ ఈ బుజ్జి మేక పిల్ల చెవులు చేటల్లా లేకున్నా.. చాంతాడంత పొడుగు మాత్రం ఉన్నాయి. ఎంతంటే.. ఈ మేక పిల్ల పుట్టినప్పుడు దానికంటే దాని చెవులే ఎక్కువ పొడవున్నాయట. పాకిస్తాన్‌లోని కరాచీలో ఓ రైతు ఇంట్లో జన్మించిన దీనికి ‘సింబా’అని పేరుపెట్టారు. ఏకంగా 19 అంగుళాల పొడవున్న చెవులతో ఈ మేక పిల్ల త్వరలోనే గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కబోతోందని దాని యజమాని మహమ్మద్ హాసన్ చెప్తున్నాడు. చింత చిగురుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. దాని ఫొటోలను సోషల్‌మీడియాలో పెడుతూ సంబరపడిపోతున్నాడు. సాధారణంగా నుబియన్ జాతికి చెందిన మేకల చెవులు పొడుగ్గా ఉంటాయని.. కానీ ‘సింబా’చెవులు మాత్రం మరీ ఎక్కువ పొడవున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఈ మేక పిల్లలో జన్యు మార్పిడిగానీ, ఏదైనా జెనెటిక్ సమస్యగానీ దీనికి కారణం కావొచ్చని అంటున్నారు. అది ఎర్రటి రంగేసిన ఆకర్షణీయమైన వంటకమా? అయితే డేంజరే! -
జీ5లో అలరించే ఈ పోలీస్ సినిమాలు, సిరీస్‌లు చూశారా !
Top 6 Police Oriented Movies And Web Series In Zee5: తాము ఆరాధించే హీరోలను వివిధ గెటప్పుల్లో, విభిన్నమైన పాత్రల్లో చూడాలనుకుంటారు అభిమానులు. ఫ్యాన్స్‌కు కోరికలకు అనుగుణంగానే డిఫరెంట్ పాత్రల్లో నటించి మెప్పిస్తారు కథానాయకులు. ఫ్యాక్షనిస్టులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రభుత్వ అధికారులుగా, పోలీసులుగా నటించి మంచి ఆదరణ పొందారు. కథానాయకులు పోలీసులుగా నటించిన అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం సరికొత్త కాన్సెప్ట్స్, జోనర్స్‌తో ఎంటర్టైన్ చేసేందుకు రెడీగా ఉంటున్నాయి ఓటీటీలు. వాటిలో జీ5 ఒకటి. ఇటీవలే 80+ సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందిస్తున్నట్లుగా ప్రకటించింది. తాజాగా జీ5 ఓటీటీలో అందుబాటులో ఉన్న పోలీస్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లను ప్రేక్షకుల కోసం ప్రకటించింది. మరీ ఆ కాప్ సిరీస్‌లు, సినిమాలు ఏంటో చూద్దామా ! which cop makes your heart pop? 😍 pic.twitter.com/XE2OKhUvHJ — ZEE5 (@ZEE5India) May 24, 2022 చదవండి: సూపర్ థ్రిల్ ఇచ్చే 'జీ5' థ్రిల్లర్ మూవీస్ ఇవే.. -
ఆస్ట్రేలియాలో సింబా
థియేటర్స్‌లోకి ‘సింబా’ తిరిగొస్తున్నాడు. కానీ ఇండియాలో కాదు. రణ్వీర్ సింగ్, సారా అలీఖాన్ హీరో హీరోయిన్లుగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సింబా’ (2018). తెలుగులో ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘టెంపర్’ చిత్రానికి ‘సింబా’ హిందీ రీమేక్. ఈ చిత్రానికి ప్రేక్షకల నుంచి మంచి స్పందన లభించింది. మంచి వసూళ్లను కూడా రాబట్టింది. తాజాగా ‘సింబా’ రీ–రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ఆస్ట్రేలియా, ఫిజీలలో వచ్చే నెల 2న విడుదలవుతోంది. ‘‘బ్లాక్‌బస్టర్ రిటర్న్స్. ‘సింబా’ ఆస్ట్రేలియా, ఫిజీలోని థియేటర్స్‌లో విడుదల కానుంది’’ అని పేర్కొన్నారు రణ్వీర్ సింగ్. ఆస్ట్రేలియా, ఫిజీ ప్రాంతాల్లో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో అక్కడ థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. దీంతో అక్కడ ఎంటర్టైన్మెంట్ రంగం మళ్లీ ట్రాక్‌లో పడేందుకు సన్నాహాలు మొదలైనట్లు తెలుస్తోంది. -
నా పేరు సింబా
డిస్నీ సినిమాలను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లవరకూ అందరూ ఎంజాయ్ చేస్తారు. డిస్నీ సినిమాల్లో స్పెషల్‌గా నిలిచే చిత్రం ‘లయన్ కింగ్’. తండ్రి సింహం (ముఫాసా) చనిపోవడంతో తన రాజ్యాన్ని లయన్ కింగ్ (సింబా) ఎలా చూసుకుంది? అనే కథ ఆధారంగా ఈ యానిమేషన్ మూవీ 1994లో తెరకెక్కింది. తాజాగా ఈ చిత్రానికి కొత్త వెర్షన్‌ను తీసుకొస్తోంది డిస్నీ సంస్థ. ఈ సినిమాను ఇండియాలో పలు ప్రాంతీయ భాషల్లో డబ్ చేస్తున్నారు. తెలుగులో ముఫాసా పాత్రకు జగపతిబాబు, టిమోన్ అండ్ పుంబా పాత్రలకు అలీ, బ్రహ్మానందం డబ్బింగ్ చెప్పారు. తాజాగా సింబా పాత్రకు నాని డబ్బింగ్ చెప్పడం విశేషం. ‘‘ఈ ఏడాది నన్ను తండ్రి పాత్రలో (‘జెర్సీ’ సినిమా) చూశారు. ఇప్పుడు కొడుకు పాత్రలో వినిపించబోతున్నాను. ఈ జూలై నాకో కొత్త పేరు రాబోతోంది. అదే సింబా’’ అని ట్వీటర్లో పేర్కొన్నారు నాని. -
సింహానికి నాని డబ్బింగ్
ఈ జనరేషన్ హీరో యాక్టింగ్‌తో పాటు డబ్బింగ్ చెప్పేందుకు కూడా ఓకే చెపుతున్నారు. ముఖ్యంగా తెలుగులోకి డబ్ అవుతున్న బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలలోని ప్రధాన పాత్రలకు టాలీవుడ్ టాప్ హీరోలు గాత్రదానం చేస్తున్నారు. అవెంజర్స్‌లో ఓ పాత్రకు రానా డబ్బింగ్ చెప్పగా.. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లాదిన్ సినిమాలోని రెండు ప్రధాన పాత్రలకు వెంకటేష్, వరుణ్ తేజ్ మాట సాయం చేశారు. తాజాగా లిస్ట్‌లోకి మరో యంగ్ హీరో జాయిన్ అవుతున్నాడు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ది లయన్ కింగ్ సినిమాలోని సింబా పాత్రకు నేచురల్ స్టార్ నాని డబ్బింగ్ చెపుతున్నాడు. డిస్నీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరో పాత్రకు నాని డబ్బింగ్ చెపుతుండటంతో సినిమాకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడుతుందని భావిస్తున్నారు. సింబా పాత్రకు బాలీవుడ్ లో షారూఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెపుతుండటం విశేషం. ఈసినిమాలో మరో కీలక పాత్ర ముసాఫాకు తెలుగు వర్షన్‌కు జగపతి బాబు,హిందీ వర్షన్‌కు షారూఖ్‌లు గాత్రదానం చేస్తున్నారు. సినిమాలోని ఇతర కీలక పాత్రలు పుంబాకు బ్రహ్మానందం, టీమోన్కు అలీ, ముఫార్కు రవిశంకర్‌లు డబ్బింగ్ చెపుతున్నారు. కార్టూన్ నెట్‌వర్క్‌లో సీరియల్‌గా వచ్చిన లయన్ కింగ్‌ను 90లో డిస్నీ సంస్థ 2డీ యానిమేషన్ మూవీగా రూపొందించింది. ఇప్పుడు అదే సంస్థ 3డీ యానిమేటెడ్ టెక్నాలజీ సాయంతో మరింత రియలిస్టిక్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా జూలై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. This year You have seen me as a father And now You are going to see me as a son This July I have a new name SIMBA 🦁 pic.twitter.com/MOpIkaUxMl — Nani (@NameisNani) 29 June 2019 -
యంగ్ బాద్షా
‘‘నేను డబ్బు వెనక కాదు, ప్రేమ వెనక పరిగెడతాను’ అంటాడు ‘సింబా’ సినిమాలో రణ్వీర్ సింగ్. విశేషం ఏంటంటే బాలీవుడ్లో ప్రస్తుతం డబ్బంతా ఆయన సినిమాల చుట్టే తిరుగుతోంది. ఒక్క ఏడాదిలో రణ్వీర్ సింగ్ సినిమాలు చేసిన బిజినెసే అందుకు ఉదాహరణ. ఆయన నటించిన ‘పద్మావత్, గల్లీ బాయ్, సింబా’ సినిమాలు గత ఏడాది రిలీజయ్యాయి. ఈ మూడు సినిమాలు దాదాపు 800 కోట్లు బిజినెస్ చేయడం విశేషం. ‘‘సినిమా నిర్మాణం రిస్క్. దర్శకుడు, నటీనటులను నిర్మాతలు నమ్ముతారు. ఓ హీరోగా ఆ నమ్మకాన్ని నా సినిమాలు నిలబెట్టడం చాలా సంతోషం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి నా సినిమాలు తమ వంతు సహాయపడటం సంతృప్తిగా ఉంది’’ అన్నారు రణ్వీర్. యంగ్ హీరోలు ఇలా వరుస సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించడం ఇండస్ట్రీకి మంచి పరిణామం. ఇప్పుడు బాలీవుడ్ పరిశీలకులు రణ్వీర్ను బాలీవుడ్ యుంగ్ బాద్షా అంటున్నారు. -
అందరి ముందు ముద్దు పెట్టుకున్నాడు
-
అందరి ముందు ముద్దు పెట్టేశాడు!
బాలీవుడ్లో గతేడాది తమ పెళ్లితో నిత్యం వార్తల్లో నిలిచారు దీప్‌వీర్ జంట. రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకునేల వివాహాన్ని మీడియా ఏ రేంజ్లో కవరేజ్ చేసిందో తెలిసిందే. ఈ జంట బయట ఎక్కడైనా కనిపిస్తే.. మీడియా కళ్లన్నీ వాళ్లవైపే తిరుగుతాయి. తాజాగా రణ్వీర్, దీపికాను ముద్దు పెట్టిన వీడియో తెగ వైరల్ అవుతోంది. డిన్నర్ చేసి రెస్టారెంట్లోంచి బయటకు వస్తున్న ఈ జంటను కెమెరాలు బంధించేశాయి. దీపికా వేసుకున్న దుస్తులపై ఉన్న మరకను ప్రేమతో తుడుస్తున్న రణ్వీర్.. అటుపై దీపికాను అందరి ముందు ముద్దు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. రణ్వీర్ తాజాగా ‘సింబా’తో బ్లాక్బస్టర్హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. -
ఒకరు ఎక్కువ.. ఇంకొకరు తక్కువే కదా!
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఇటీవలే విడుదలైన ‘సింబా’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ ఎనర్జిక్ స్టార్.. ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ ‘గల్లీ బాయ్’ ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు. జోయా అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌వీర్‌కు జోడీగా అలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే. మేరీ గల్లీ, రూట్స్‌లాంటి హిట్ ర్యాప్ సాంగ్స్ సృష్టికర్త అయిన ఇండియన్ ర్యాపర్ డివైన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ప్రేమికుల రోజు(ఫిబ్రవరి 14)న విడుదల కానుంది. కాగా గల్లీ బాయ్ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా రణ్వీర్, అలియా సరదాగా మీడియాతో ముచ్చటించారు. ఇందులో భాగంగా... ‘మీ కో- స్టార్లు రణ్‌బీర్ కపూర్, రణ్వీర్ సింగ్‌లలో ఎవరికి ఎక్కువ మార్కులు ఇస్తారు అని విలేకరులు ప్రశ్నించగా... ‘ఇద్దరూ గొప్ప నటులే. అంతేకాదు మానవత్వమున్న మంచి మనుషులు కూడా. తేడా ఏంటంటే రణ్‌బీర్‌తో నేను నటించింది బ్రహ్మాస్త్రలో.. రణ్వీర్తో గల్లీబాయ్‌లో’ అంటూ అలియా చమత్కరించింది. వెంటనే మైక్ అందుకున్న రణ్వీర్.. ‘నిజాలు చెప్పాలి.. ఇద్దరిలో ఒకరు తక్కువ(తాను).. మరొకరు ఎక్కువ(రణ్‌బీర్) ఎక్కువ కదా’ అంటూ ఆమెను ఆటపట్టించాడు. ఇక అలియా, రణ్‌బీర్ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. గల్లీ బాయ్ ట్రైలర్ -
‘నీ ఆశీర్వాదం వల్లే సినిమా హిట్టయ్యింది’
రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘సింబా’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ప్రస్తుతం 200 కోట్ల రూపాయల క్లబ్ వైపు దూసుకుపోతుంది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో రూ. 200 కోట్ల క్లబ్లో చేరిన చిత్రాల్లో ‘సింబా’ మూడవదిగా నిలిచింది. సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా నిర్మాత కరణ్ జోహర్ ముంబైలోని తన ఇంటిలో సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. దీనికి రణ్వీర్ సింగ్, దర్శకుడు రోహిత్ శెట్టి, నటి దీపికా పదుకోణ్‌తో పాటు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్, సారా అలీ ఖాన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోను కరణ్ జోహర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో దీపికా కరణ్ జోహర్, రోహిత్ శెట్టి, తన భర్త రణ్వీర్ సింగ్‌ను ఆశీర్వదిస్తున్నట్లుగా ఉన్నారు. దీనికి కరణ్ జోహర్ ‘రాణి పద్మావతి ఆశీర్వాదంతో మా సినిమా సూపర్‌హిట్ అయ్యింద’నే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫోటోని అభిమానులు తెగ లైక్ చేస్తున్నారు. #Simmba refuses to slow down... Packs a solid punch in Weekend 2... Nears ₹ 200 cr mark... Emerges THIRD HIGHEST GROSSER of 2018, after #Sanju and #Padmaavat... [Week 2] Fri 9.02 cr, Sat 13.32 cr, Sun 17.49 cr. Total: ₹ 190.64 cr. India biz. — taran adarsh (@taran_adarsh) January 7, 2019 -
‘నా జీవితంలో అజయ్ స్థానం ప్రత్యేకం’
అజయ్ దేవగణ్‌కు నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉందంటున్నాడు దర్శకుడు రోహిత్ శెట్టి. పక్కా ఎంటర్టైన్మెంట్ చిత్రాలు తెరకెక్కించడంలో బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు రోహిత్ శెట్టి. ఈ మధ్యే రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా రూపొందిన ‘సింబా’ చిత్రం విడుదలై విజయవంతంగా దూసుకుపోతుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.100 కోట్లు రాబట్టిన ఈ సినిమా రూ.200 కోట్ల వసూళ్లవైపు పరుగుతీస్తోంది. బాలీవుడ్లో వరుసగా రూ.100 కోట్లు రాబట్టిన ఎనిమిది సినిమాలు తీసిన దర్శకుడిగా రోహిత్ చరిత్ర సృష్టించారు. అయితే సింబా సినిమాలో హీరో అజయ్ దేవగణ్ అతిథి పాత్రలో కనిపించారు. ఈ విషయం గురించి రోహిత్ మాట్లాడుతూ.. ‘నా జీవితంలో అజయ్‌కు చాలా ముఖ్యమైన స్థానం ఉంది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఆయన నాకు చాలా సాయం చేశారు. ఈ రోజు నేనిలా ఉన్ననాంటే అదంతా అజయ్ వల్లనే’ అంటూ చెప్పుకొచ్చారు. అలానే ‘ప్రస్తుతం పరిశ్రమలో నేను చాలామందితో కలిసి పని చేశాను. వారంతా నాకు స్నేహితులు. కానీ అజయ్ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకం. ఆయన మంచి నటుడు, స్టార్ అని ఇలా చెప్పడం లేదు. అజయ్ నాకు అన్నయ్యలాంటి వారు.. దాన్ని ఎవరూ మార్చలేరు’ అన్నారు. అలానే రణ్వీర్ తనకు తమ్ముడులాంటి వారంటూ చెప్పుకొచ్చారు రోహిత్ శెట్టి. -
రూ.200కోట్ల దిశగా ‘సింబా’
పూరి జగన్నాద్ మార్క్ మ్యానరిజం.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన టెంపర్ టాలీవుడ్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక అప్పటి నుంచి ఈ చిత్రాన్ని పలు భాషల్లో తెరకెక్కించాలని బాలీవుడ్, కోలీవుడ్ ప్రయత్నించాయి. కోలీవుడ్‌లో విశాల్ ‘అయోగ్య’ గా తెరకెక్కిస్తుండగా.. బాలీవుడ్లో రణవీర్‌సింగ్ ‘సింబా’ గా రీమేక్ చేశారు. ఈ చిత్రం గతవారం విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. అయితే ఎన్టీఆర్ నటనకు, రణవీర్ నటకు పోలిక లేకున్నా.. సినిమా మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే వందకోట్లు, ఏడు రోజుల్లోనే 150కోట్లను కొల్లగొట్టింది. ఇక ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలేవీ విడుదల కాలేదు. అయితే ఇదే జోరును కొనసాగిస్తే.. ‘సింబా’ 200కోట్లను దాటేసి.. 250కోట్లను వసూళ్లు చేసే అవకాశంఉందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సారా అలీఖాన్ హీరోయిన్గా నటించారు. #Simmba benchmarks... Crossed ₹ 50 cr: Day 3 ₹ 100 cr: Day 5 ₹ 150 cr: Day 7 With no major release today, #Simmba is sure to dominate the marketplace... ₹ 200 cr mark is definitely within reach... Can even touch ₹ 250 cr, depending on how it trends from next week [11 Jan]. — taran adarsh (@taran_adarsh) 4 January 2019 -
ఇన్నాళ్లు ఈ విషయం సీక్రెట్‌గా ఉంచాం..!
దాదాపు ఆరేళ్లపాటు లవ్‌బర్డ్స్‌గా చక్కర్లు కొట్టిన దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్ ఈ ఏడాది నవంబర్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని లోక్కోమాలో నవంబర్ 14, 15 తేదీల్లో దీప్‌వీర్‌ల వివాహం జరిగింది. అయితే తమ రిలేషన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు దీపిక. తనకు, రణ్‌వీర్‌కు నాలుగేళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగిందని చెప్పారు దీపిక. కానీ ఇన్ని రోజులు ఈ విషయం గురించి రహస్యంగా ఉంచామన్నారు. ఫిలింఫేర్ మ్యాగజైన్ ఫోటో షూట్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిక ఈ విషయాలను వెల్లడించారు. ‘నాలుగేళ్ల క్రితమే మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలనిపించింది.. కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం’ అన్నారు. ఇక సినిమాల విషయానికోస్తే శుక్రవారం రణ్వీర్ నటించిన ‘సింబా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇప్పటికే పాజిటీవ్ టాక్ వచ్చింది. మరోపక్క దీపిక ‘చపాక్’ అనే చిత్రంలో నటించబోతున్నారు. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితాధారంగా ఈ బయోపిక్‌ను మేఘనా గుల్జార్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో దీపిక లక్ష్మి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దీపిక నిర్మాతగా మారనున్నారు. -
కన్ను కొట్టలేక...
‘సింబా’ సినిమా షూటింగ్ లొకేషన్ అది. కెమెరా లెన్స్‌ను అటూ ఇటూ మారుస్తున్నారు కెమెరామేన్. ఓ షాట్ కోసం టీమ్ అంతా కష్టపడుతున్నారు. ఎందుకంటే సారా అలీఖాన్ మాత్రం టేక్స్ మీద టేక్స్ తీసుకుంటున్నారు. ‘సింబా’ టీమ్ ఇంతలా ట్రై చేస్తున్న ఆ సీన్ ఏంటీ అనుకుంటున్నారా? ఏం లేదండీ బాబు. సారా అలీఖాన్ కన్ను కొట్టే సీన్. ఈ సినిమాలో ‘ఆంఖే మారే’ అనే సాంగ్ ఉంది. ఈ సాంగ్‌లో హీరోయిన్ కుడికన్ను కొట్టే ఓ సీన్ ఉందట. ఈ సీన్ కోసం సారా కష్టపడ్డారట. కానీ ఏం లాభం ఎడిట్‌లో అది పోయిందట. సారాకు కన్ను కొట్టడం రాదని ‘సింబా’ మూవీ దర్శకుడు రోహిత్ శెట్టి ఓ సందర్భంలో పేర్కొన్నారు. రణ్వీర్ సింగ్, సారా అలీఖాన్ జంటగా నటించిన ‘సింబా’ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. తెలుగు హిట్ ‘టెంపర్’ చిత్రానికి ఇది హిందీ రీమేక్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. -
ట్రైలర్: ‘టెంపర్’ చూపించిన రణ్వీర్ సింగ్
తెలుగులో ఎన్టీఆర్ .. పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'టెంపర్' అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమాను తమిళంలోనూ .. హిందీలోను రీమేక్ చేస్తున్నారు. తమిళంలో విశాల్ హీరోగా ‘అయోగ్య’పేరుతో వస్తుండగా.. బాలీవుడ్లో రణ్వీర్ సింగ్ హీరోగా ‘సింబా’ టైటిల్‌తో రీమేక్ చేశారు. బాలీవుడ్లో రణ్వీర్ సరసన సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు సారా అలీ ఖాన్ నటిస్తోంది. ఈ సినిమాను ‘చెన్నై ఎక్స్ ప్రెస్ ఫేమ్’ దర్శకుడు రోహిత్ శెట్టి హిందీలో రీమేక్ చేశాడు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టుగా ‘సింబా’ మూవీని దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కిచినట్టు కనిపిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ అజయ్ దేవగన్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైంది. అంతేకాకుండా అజయ్ దేవగన్ అతిథి పాత్రలో మెరవనున్నాడు. ఇక బాలీవుడ్లో మూర్తి క్యారెక్టర్లో అశుతోష్ రాణా నటిస్తుండగా, విలన్‌గా సోనూసూద్ ఒదిగిపోయాడు. ఈ చిత్ర ట్రైలర్‌ను చూస్తుంటే తెలుగు టెంపర్ క్లైమాక్స్‌ను మాత్రమే మార్చకుండా.. మిగతాదంతా బాలీవుడ్‌కు తగ్గట్టుగా చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక పెళ్లి తర్వాత వస్తున్న సినిమా కావడంతో రణ్వీర్, దీపికా పదుకొనేతో పాటు వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
సింబా స్టార్ట్
ముంబై టెంపర్‌ను హైదరాబాద్‌లో మొదలుపెట్టారు హీరో రణ్వీర్ సింగ్. ఇందుకోసం ఆల్మోస్ట్ టు మంత్స్ ఇక్కడే పాగా వేస్తారు. ‘గోల్మాల్ అండ్ సింగమ్ ఫ్రాంచైజీ, చెన్నై ఎక్స్‌ప్రెస్’ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రోహిత్‌శెట్టి నేతృత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సింబా’. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై రోహిత్ శెట్టి, కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘టెంపర్’ చిత్రానికి హిందీ రీమేక్ ఇది. సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది. రెండు నెలల పాటు కంటిన్యూస్‌గా ఇక్కడే షూటింగ్ ప్లాన్ చేశారట. ఇందులో అజయ్ దేవగన్ గెస్ట్ రోల్ చేస్తారని బీటౌన్ ఖబర్. ‘సింబా’ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ చిత్రబృందం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. -
మాధవన్ అవుట్.. సోనూసూద్ ఇన్
సాక్షి, ముంబై : రణవీర్‌సింగ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న టెంపర్ రీమేక్ ‘ సింబా’ కోసం మరో నటుడి ఎంపిక పూర్తయ్యింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన సోనూసూద్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించబోతున్నాడు. ‘ నేను సింబాలో పోషించబోయే పాత్ర గురించి చెప్పను. కానీ అదొ ఛాలెజింగ్ రోల్. నా గత చిత్రాల కంటే విభిన్నంగా ఆ పాత్ర ఉంటుంది. సినిమా విడుదలయ్యాక ప్రతి ఒక్కరు ఆ పాత్ర గురించే మాట్లాడుకుంటారు’ అని సోనూసూద్ ప్రకటించారు. కాగా, మొదటగా ఈ పాత్ర కోసం తమిళ నటుడు మాధవన్‌ను ఎంపిక చేశారు. అయితే భుజానికి గాయం కావటంతో ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోగా.. ఆ అవకాశం సోనూసూద్‌కు దక్కింది. రోహిత్ శెట్టి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సింబా ను కరణ్‌జోహార్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రణ్వీర్ సరసన కథానాయికగా సైఫ్ అలీఖాన్ కూతురు సారా నటించనుంది. మే నుంచి ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ మొదలుకానుంది. పద్మావత్ సక్సెస్‌తో జోరుమీదున్న రణ్‌వీర్‌సింగ్, మాస్ మసాలా చిత్రాలకు పెట్టింది పేరైన రోహిత్ శెట్టి, భారీ స్థాయి సినిమాలను నిర్మించే కరణ్ జోహర్.. ఈ ముగ్గురి కలయికలో వస్తున్న ‘ సింబా’ పై భారీ అంచనాలు ఉన్నాయి. Hey folks .. So I am a huge crazy fan of Rohit Shetty and his films. As is my son. It breaks both our hearts that I’m not able to be a part of this film because of my injury. I’m well on my way to recovery but this is a huge opportunity and excitement lost.🙈🙈 https://t.co/9YJBctaCJI — Ranganathan Madhavan (@ActorMadhavan) 25 March 2018 -
రణ్‌వీర్‌కు టెంపర్ వచ్చింది
ఎప్పుడు అల్లరి చేస్తూ హూషారుగా కనిపించే రణ్వీర్ సింగ్‌కు అసలు టెంపర్ ఎందుకు వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది అనుకుంటున్నారా? అయనకు వచ్చింది నిజమైన టెంపర్ కాదండోయ్. సినిమా పరంగా వచ్చిన టెంపర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘టెంపర్’ రీమేక్‌లో రణ్వీర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘సింబా’ అనే టైటిల్‌ని ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్‌ను గురువారం రిలీజ్ చేశారు. ఎప్పుడూ నిజాయితీ గల పోలీసు పాత్రలనే చూపించిన దర్శకుడు రోహిత్ శెట్టి ఈసారి టక్కరి పోలీస్ పాత్రను మనకు చూపించబోతున్నారు. ఇందులో హీరోయిన్గా కాజల్ పేరు పరిశీలనలో ఉంది. ఈ సినిమా కోసం తొలిసారి రోహిత్ శెట్టి, కరణ్ జోహార్ చేతులు కలుపబోతున్నారు. వీళ్ళిద్దరు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ 18న సినిమా విడుదల కానుంది. -
భరత్‌కు అండగా ఉంటా
నటుడు భరత్‌కు అండగా ఉంటానని నటుడు, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ అన్నారు. భరత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సింబ. సినీరమ స్టూడియోస్ శవనేశ్వరన్, యశోద పిక్చర్స్ గోల్డ్ మనోజ్ నిర్మిస్తున్న ఇందులో భాను మెహ్రా, స్వాతి దీక్షిత్ కథానాయికలుగా నటించారు. నటుడు ప్రేమ్‌జీ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ద్వారా అరవింద్ శ్రీధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం స్థానిక సత్యం థియేటర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విశాల్, దర్శకుడు మిష్కన్, వెంకట్‌ప్రభు, జయంరవి, ఉదయ, స్నేహా, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. చిత్ర ఆడియోను విశాల్ ఆవిష్కరించగా వెంకట్‌ప్రభు, ప్రసన్న, స్నేహ తొలి సీడీ అందుకున్నారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ భరత్ తనకు మంచి మిత్రుడన్నారు. కోలీవుడ్‌లో విజయ్ తరువాత అంత మంచి డ్యాన్సర్ భరత్ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి చిన్న టైటిల్ సమస్య వచ్చినప్పుడు నడిగర్ సంఘం తరఫున తాము అండగా నిలిచామని తెలిపారు. ఇకపై కూడా నటుడు భరత్‌కు అండగా ఉంటానని అన్నారు. సింబ చిత్రం ఒక కొత్త ప్రయోగం అని పేర్కొన్నారు. ఇది మంచి విజయం సాధించి భరత్‌తో పాటు చిత్ర యూనిట్ అందరికీ మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉందన్నారు. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మంచి బాణీలను అందించారని, ఆయనతో కలిసి చిత్రం చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ముందుగా భరత్ భార్య, సంగీత దర్శకుడి భార్య, దర్శకుడి తల్లి, నిర్మాతల కుటుంబ సభ్యులు మహిళా దినోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేయడం విశేషం.