![Ranveer Singh Movie Simmba Will Release In Australia - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/29/Simmba.jpg.webp?itok=jSWZZs9S)
థియేటర్స్‌లోకి ‘సింబా’ తిరిగొస్తున్నాడు. కానీ ఇండియాలో కాదు. రణ్‌వీర్ సింగ్, సారా అలీఖాన్ హీరో హీరోయిన్లుగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సింబా’ (2018). తెలుగులో ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘టెంపర్’ చిత్రానికి ‘సింబా’ హిందీ రీమేక్. ఈ చిత్రానికి ప్రేక్షకల నుంచి మంచి స్పందన లభించింది. మంచి వసూళ్లను కూడా రాబట్టింది. తాజాగా ‘సింబా’ రీ–రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ఆస్ట్రేలియా, ఫిజీలలో వచ్చే నెల 2న విడుదలవుతోంది. ‘‘బ్లాక్‌బస్టర్ రిటర్న్స్. ‘సింబా’ ఆస్ట్రేలియా, ఫిజీలోని థియేటర్స్‌లో విడుదల కానుంది’’ అని పేర్కొన్నారు రణ్‌వీర్ సింగ్. ఆస్ట్రేలియా, ఫిజీ ప్రాంతాల్లో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో అక్కడ థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. దీంతో అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ రంగం మళ్లీ ట్రాక్‌లో పడేందుకు సన్నాహాలు మొదలైనట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment