సింహానికి నాని డబ్బింగ్‌ | Hero Nani Dubs For Simba in The Lion King | Sakshi
Sakshi News home page

సింహానికి నాని డబ్బింగ్‌

Jun 29 2019 12:54 PM | Updated on Jun 29 2019 12:56 PM

Hero Nani Dubs For Simba in The Lion King - Sakshi

ఈ జనరేషన్‌ హీరో యాక్టింగ్‌తో పాటు డబ్బింగ్‌ చెప్పేందుకు కూడా ఓకే చెపుతున్నారు. ముఖ్యంగా తెలుగులోకి డబ్ అవుతున్న బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలలోని ప్రధాన పాత్రలకు టాలీవుడ్‌ టాప్‌ హీరోలు గాత్రదానం చేస్తున్నారు. అవెంజర్స్‌లో ఓ పాత్రకు రానా డబ్బింగ్ చెప్పగా.. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లాదిన్ సినిమాలోని రెండు ప్రధాన పాత్రలకు వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ మాట సాయం చేశారు.

తాజాగా లిస్ట్‌లోకి మరో యంగ్ హీరో జాయిన్ అవుతున్నాడు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ది లయన్‌ కింగ్ సినిమాలోని సింబా పాత్రకు నేచురల్‌ స్టార్‌ నాని డబ్బింగ్‌ చెపుతున్నాడు. డిస్నీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరో పాత్రకు నాని డబ్బింగ్ చెపుతుండటంతో సినిమాకు తెలుగులో మంచి క్రేజ్‌ ఏర్పడుతుందని భావిస్తున్నారు.

సింబా పాత్రకు బాలీవుడ్ లో షారూఖ్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ డబ్బింగ్‌ చెపుతుండటం విశేషం. ఈసినిమాలో మరో కీలక పాత్ర ముసాఫాకు తెలుగు వర్షన్‌కు జగపతి బాబు,హిందీ వర్షన్‌కు షారూఖ్‌లు గాత్రదానం చేస్తున్నారు. సినిమాలోని ఇతర కీలక పాత్రలు పుంబాకు బ్రహ్మానందం, టీమోన్‌కు అలీ, ముఫార్కు రవిశంకర్‌లు డబ్బింగ్‌ చెపుతున్నారు.

కార్టూన్‌ నెట్వర్క్‌లో సీరియల్‌గా వచ్చిన లయన్‌ కింగ్‌ను 90లో డిస్నీ సంస్థ 2డీ యానిమేషన్‌ మూవీగా రూపొందించింది. ఇప్పుడు అదే సంస్థ 3డీ యానిమేటెడ్‌ టెక్నాలజీ సాయంతో మరింత రియలిస్టిక్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా జూలై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement