
నాని
డిస్నీ సినిమాలను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లవరకూ అందరూ ఎంజాయ్ చేస్తారు. డిస్నీ సినిమాల్లో స్పెషల్‌గా నిలిచే చిత్రం ‘లయన్ కింగ్’. తండ్రి సింహం (ముఫాసా) చనిపోవడంతో తన రాజ్యాన్ని లయన్ కింగ్ (సింబా) ఎలా చూసుకుంది? అనే కథ ఆధారంగా ఈ యానిమేషన్ మూవీ 1994లో తెరకెక్కింది. తాజాగా ఈ చిత్రానికి కొత్త వెర్షన్‌ను తీసుకొస్తోంది డిస్నీ సంస్థ.
ఈ సినిమాను ఇండియాలో పలు ప్రాంతీయ భాషల్లో డబ్ చేస్తున్నారు. తెలుగులో ముఫాసా పాత్రకు జగపతిబాబు, టిమోన్ అండ్ పుంబా పాత్రలకు అలీ, బ్రహ్మానందం డబ్బింగ్ చెప్పారు. తాజాగా సింబా పాత్రకు నాని డబ్బింగ్ చెప్పడం విశేషం. ‘‘ఈ ఏడాది నన్ను తండ్రి పాత్రలో (‘జెర్సీ’ సినిమా) చూశారు. ఇప్పుడు కొడుకు పాత్రలో వినిపించబోతున్నాను. ఈ జూలై నాకో కొత్త పేరు రాబోతోంది. అదే సింబా’’ అని ట్వీటర్‌లో పేర్కొన్నారు నాని.
Comments
Please login to add a commentAdd a comment