Animation movie
-
సినిమా తీసిన 5వ తరగతి విద్యార్థిని.. త్వరలోనే రిలీజ్!
అద్భుతాలకు నిలయం ఈ ఆధునిక కాలం. అదేవిధంగా ప్రతిభ ఏ ఒక్కరి సొత్తూ కాదు. అలా 5వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల విద్యార్థిని గూండాన్ చట్టి అనే యానిమేషన్ చిత్రాన్ని తెరకెక్కించింది. ఈ చిన్నారి పేరు పీకే అగస్త్యి. ఈ వయసులోనే తనకు కలిగిన ఆలోచనతో సినిమా తీస్తానని తన తండ్రి డాక్టర్ ఎస్కే.కార్తికేయన్‌కు చెప్పగా ఆయన ఈ వయసులో చిత్రం ఏమిటి, దర్శకత్వం ఏమిటి అని నిరాశపరచకుండా తన కూతురి ఆలోచనను గౌరవించి, ఆ చిన్నారిని ప్రోత్సహించారు. అలా ఆమె దర్శకత్వంలో నిర్మించిన చిత్రం గూండాన్ చట్టి. గ్రామీణ నేపథ్యంలో అగస్త్యి రూపొందించిన ఈ యానిమేషన్ చిత్రం పలువురు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలను అందుకుంటోంది. ఒక గ్రామంలోని ఇద్దరు స్నేహితులకు ఒకేసారి పుట్టిన పిల్లలు ఆ గ్రామంలో జరుగుతున్న అక్రమాలను ఎలా అరికట్టారు? అనే చక్కని సందేశానికి వినోదాన్ని చేర్చి జనరంజకంగా రూపొందించిన చిత్రం ఇది. అగస్త్యి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ చిత్రంలో 3 మంచి పాటలున్నాయి. ఒక విద్యార్థిని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రదర్శించే విధంగా నిర్మాత చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఇది విద్యార్థుల వికాసాన్ని పెంపొందించే చిత్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రానికి అమర్గీత్ సంగీతాన్ని అందించారు. కథనం, మాటలు, పాటలు, దర్శకత్వ సహకార బాధ్యతలను చిన్నతంబి నిర్వహించారు. కాగా గూండాన్ చట్టి చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. చదవండి: అమ్మ కోసం అన్ని వదిలేసి.. దుకాణం నడుపుతూ.. ఇప్పుడు స్టార్ హీరోలతో! -
చైనాలో డౌటే
ఇంటికొకరు సైన్యంలో చేరాలని చైనా చక్రవర్తి ప్రకటించాడు. ఒక ఇంట్లో జబ్బున పడి ఉన్న తండ్రి తరఫున ఆయన కూతురు మారువేషం వేసుకుని సైన్యంలో చేరింది! శత్రు సైన్యాలతో పోరాడి చైనాసైన్యం సత్తాను చాటింది. ఆమె పేరు హ్వా మ్యులన్. చైనా జానపద కథ ఇది. డిస్నీ వాళ్లు ఇరవై రెండేళ్ల క్రితమే ముల్యన్ పాత్రతో ఓ యానిమేషన్ సినిమా తీశారు. ఇప్పుడు ఆ పాత్ర పేరుతోనే ‘మ్యులన్’ అనే హాలీవుడ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. సిద్ధంగా అయితే ఉంది కానీ, చైనాలో విడుదలే డౌట్‌గా ఉంది. ఒకవేళ విడుదలైనా సుమారు 15 వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ సినిమా అంత పెద్ద మొత్తాన్ని వసూలు చేయగలదా అని నిర్మాతలు సంశయంలో పడ్డారు. కరోనా వైరస్ కారణంగా ‘మ్యులన్’ చిత్రానికి ఎదురైన అవరోధం ఇది. మార్చి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా చైనాలో 70 వేలకు పైగా థియేటర్లు ఇప్పటికే మూత పడ్డాయి. వైరస్ తగ్గుముఖం పట్టి పరిస్థితులు పూర్తిగా మెరుగైతే మార్చి 27 లోపు థియేటర్లన్నిటినీ తెరిచేందుకు అనుమతిస్తాం అని చైనా అంటోంది. అనుమతించినప్పటికీ ఎంతమంది ప్రేక్షకులు ధైర్యం చేసి థియేటర్లకు వస్తారన్న ఆందోళనలో నిర్మాతలు ఉన్నారు. ఆ రోజుకీ కరోనా ప్రభావం తగ్గకుండా ఉంటే ఈ చిత్రానికి చైనాలో భారీ నష్టం సంభవించవచ్చు. ఇందులో ఎవరైనా చేయగలిగిందేమీ లేదు. కరోనాపై పోరాడేందుకు మ్యులన్ లాంటి శక్తిమంతమైన యోధురాలైన ఔషధాన్ని ఎవరైనా సృష్టించాలి. -
కల నెరవేరింది
తమిళ ప్రఖ్యాత నవల ‘పొన్నియిన్ సెల్వన్’ని సినిమాగా తీసుకురావాలన్నది దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి యంజీఆర్ (యంజీ రామచంద్రన్) కల. ఈ నవలను సినిమాగా తీయాలని పలుమార్లు ప్రయత్నించినప్పటికీ కుదర్లేదు. ఇప్పుడు యంజీఆర్‌ను యానిమేషన్ రూపంలో ‘పొన్నియిన్ సెల్వన్’ రూపొందిస్తోంది చెన్నైకు సంబంధించిన శనీశ్వరన్ యానిమేషన్ స్టూడియో ఇంటర్నేషనల్. ఈ సంస్థే నిర్మాణాన్ని కూడా చూసుకుంటోంది. ‘వందియదేవన్: పొన్నియిన్ సెల్వన్ 1’ పేరుతో ఈ భారీ బడ్జెట్ యానిమేషన్ చిత్రాన్ని దర్శకుడు దవచెల్వాన్ తెరకెక్కిస్తున్నారు. నాలుగేళ్లుగా ఈ సినిమాపై వర్క్ చేస్తోందట ఈ యానిమేషన్ స్టూడియో. ఇటీవల యంజీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమాలో తొలి పాటను విడుదల చేశారు. విశేషం ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్గా జయలలిత పాత్ర ఉండబోతోందట. ఆమె పాత్ర కూడా యానిమేషన్లోనే ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సంగతి అలా ఉంచితే ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. -
ఎల్సా పాత్రతో నాకు పోలికలున్నాయి
‘‘ఫ్రోజెన్’ సినిమా చూసిన నా ఫ్రెండ్ ఒకామె ’ఆ సినిమా చూసినప్పుడు నువ్వే గుర్తొచ్చావు’ అని చెప్పింది. నాకూ ఎల్సా పాత్రకు పర్సనాలిటీ విషయంలో ఎక్కడో పోలికలున్నాయని సినిమా చూశాక అనిపించింది’’ అని నటి నిత్యామీనన్ అన్నారు. డిస్నీ సంస్థ అందిస్తున్న తాజా యానిమేషన్చిత్రం ‘ఫ్రోజెన్ 2’. ఎల్సా, అన్న అనే అక్కా చెల్లెళ్ల కథ ఇది. నవంబర్ 22న ఈ సినిమా తెలుగులో విడుదలకానుంది. తెలుగు వెర్షన్లో ఎల్సా పాత్రకు నిత్యామీనన్, ఎల్సా చిన్ననాటి పాత్రకు మహేశ్ బాబు కుమార్తె సితార డబ్బింగ్ చెప్పారు. ఈ సందర్భంగా నిత్యామీనన్ మాట్లాడుతూ– ‘‘ఎల్సా పాత్రతో చాలా కనెక్ట్ అయ్యాను. అందుకే.. ‘ఫ్రోజెన్ 2’లో ఎల్సాకు డబ్బింగ్ చెప్పమనగానే ఓకే అన్నాను. మరోసారి డబ్బింగ్ చెప్పమని అడిగినా చెబుతాను (నవ్వుతూ)’’ అన్నారు. ‘‘డబ్బింగ్ చెప్పడం చాలా సరదాగా అనిపించింది. నాన్న సర్ప్రైజ్గా ఫీలయ్యారు. నా ఫేవరెట్ కార్టూన్ పాత్ర ఎల్సానే’’ అని సితార అన్నారు. ‘‘సితారతో డబ్బింగ్ చెప్పించమని డిస్నీ శివప్రసాద్‌గారు మహేశ్‌ని, నన్ను కన్విన్స్ చేశారు. సితార ఎలా డబ్బింగ్ చెబుతుందో అనుకున్నాను.. బాగా చెప్పింది. 3 ఏళ్ల నుంచి ఎల్సా పాత్రకు తను పెద్ద ఫ్యాన్. సితారను సినిమాల్లోకి తీసుకురావాలని ఇదేం స్ట్రాటజీ కాదు. గౌతమ్, సితార కెరీర్‌ని ఇంకా ఏం ప్లాన్ చేయలేదు. వాళ్లు ఏం ఎంచుకున్నా సపోర్టివ్‌గా నిలబడతాం’’అన్నారు నమ్రతా శిరోద్కర్. ‘‘2013లో ‘ఫ్రోజెన్’ చిత్రం రిలీజ్ అయింది. యానిమేషన్ సినిమాల కలెక్షన్లలో టాప్‌గా నిలిచింది’’ అన్నారు డిస్నీ ప్రతినిధి విక్రమ్ దుగ్గల్. -
బుజ్జి బుజ్జి మాటలు
మహేశ్‌బాబు ముద్దుల కుమార్తె సితార సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. అయితే అది ఆన్‌స్క్రీన్ ఎంట్రీ కాదు ఆఫ్‌స్క్రీన్ ఎంట్రీ. తెరపై కనిపించే పాత్ర కాదు. వినిపించే పాత్ర. హాలీవుడ్ యానిమేషన్ మూవీ ‘ఫ్రోజెన్ 2’. అన్నా, ఎల్సా అనే అక్కాచెల్లెళ్ల కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ఎల్సా చిన్ననాటి పాత్రకు సితార డబ్బింగ్ చెప్పనున్నారు. తన బుజ్జిబిజ్జి మాటలతో ఎల్సా పాత్రకు డబ్బింగ్ చెబు తారట. ఎల్సా ఎంగేజ్ పాత్రకు నిత్యా మీనన్ డబ్బింగ్ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ నెల 22న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆల్రెడీ యూట్యూబ్‌లో ఓ చానెల్లో ఎప్పటికప్పుడు వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు సితార. మరి భవిష్యత్తులో సినిమాల్లోకి వచ్చే ఆసక్తి ఉందా? వేచి చూడాలి. -
నా పేరు సింబా
డిస్నీ సినిమాలను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లవరకూ అందరూ ఎంజాయ్ చేస్తారు. డిస్నీ సినిమాల్లో స్పెషల్‌గా నిలిచే చిత్రం ‘లయన్ కింగ్’. తండ్రి సింహం (ముఫాసా) చనిపోవడంతో తన రాజ్యాన్ని లయన్ కింగ్ (సింబా) ఎలా చూసుకుంది? అనే కథ ఆధారంగా ఈ యానిమేషన్ మూవీ 1994లో తెరకెక్కింది. తాజాగా ఈ చిత్రానికి కొత్త వెర్షన్‌ను తీసుకొస్తోంది డిస్నీ సంస్థ. ఈ సినిమాను ఇండియాలో పలు ప్రాంతీయ భాషల్లో డబ్ చేస్తున్నారు. తెలుగులో ముఫాసా పాత్రకు జగపతిబాబు, టిమోన్ అండ్ పుంబా పాత్రలకు అలీ, బ్రహ్మానందం డబ్బింగ్ చెప్పారు. తాజాగా సింబా పాత్రకు నాని డబ్బింగ్ చెప్పడం విశేషం. ‘‘ఈ ఏడాది నన్ను తండ్రి పాత్రలో (‘జెర్సీ’ సినిమా) చూశారు. ఇప్పుడు కొడుకు పాత్రలో వినిపించబోతున్నాను. ఈ జూలై నాకో కొత్త పేరు రాబోతోంది. అదే సింబా’’ అని ట్వీటర్లో పేర్కొన్నారు నాని. -
బ్రహ్మీ @ పుంబా అలీ @ టీమోన్
డిస్నీ ఇండియా వారు తాజాగా విడుదల చేస్తున్న చిత్రం ‘లయన్ కింగ్’. డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన సింహం పేరు సింబ. ఈ ‘లయన్ కింగ్’ కథకి సింబనే హీరో. టీమోన్ అనే ముంగిస, పుంబా అనే అడివి పంది కూడా ‘లయన్ కింగ్’ కథలో ముఖ్య పాత్రలు. ప్రపంచంలోని అన్ని ముఖ్యభాషల్లో జూలై 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ‘లయన్ కింగ్’ లో కీలక పాత్ర అయిన ముసాఫాకు బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు. ముసాఫా తనయుడు, సినిమాకు హీరో అయిన సింబాకు షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు వెర్షన్లో పుంబా పాత్రకు బ్రహ్మానందం, టీమోన్ పాత్రకు అలీ డబ్బింగ్ చెప్పడం విశేషం. ‘లయన్ కింగ్’ చిత్రం తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదలకి సిద్ధమవుతోంది. -
చోటా భీమ్‌ను ఆస్కార్‌కు తీసుకెళ్లాలి
‘‘ఇది వరకు చూసిన ‘చోటాభీమ్’ చిత్రాలకు, ఇప్పడు వస్తున్న ‘చోటా బీమ్: కుంగ్‌ఫూ ధమకా’కి తేడా ఏంటంటే ‘ఎక్స్పీరియన్స్’. పాత సినిమాలన్నీ 2డీలో షూట్ చేశాం. లేటేస్ట్ చిత్రాన్ని స్టీరియోస్కోపిక్ 3డీలో షూట్ చేశాం. మునుపటి సినిమాల కంటే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం’’ అన్నారు ‘చోటా భీమ్’ సృష్టికర్త రాజీవ్ చిలక. యానిమేషన్ క్యారెక్టర్ చోటా భీమ్ ముఖ్య పాత్రలో రాజీవ్ చిలక తెరకెక్కించిన తాజా చిత్రం ‘చోటా భీమ్: కుంగ్ఫు ధమాకా’. ఈ చిత్రం మే 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజీవ్ మాట్లాడుతూ – ‘‘చోటా భీమ్’, అతని గ్యాంగ్ కలసి చైనా వెళ్లి, అక్కడ కుంగ్‌ఫూ కాంపిటీషన్లో పాల్గొంటారు. ఈ ప్రాసెస్‌లో ఏం జరుగుతుంది అన్నదే సినిమా కథ. పిల్లలు ఎంజాయ్ చేసే యాక్షన్, కామెడీ ఇందులో ఉంటాయి. చైనీస్ ఫుడ్‌ని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ ఫుడ్ ఐటమ్స్‌కు సంబంధించి ఓ సాంగ్ ఉంది. పంజాబీ గాయకుడు దలేర్ మెహందీతో ఓ ప్రమోషనల్ సాంగ్ షూట్ చేశాం. సినిమా లాస్ట్‌లో వచ్చే ఈ సాంగ్‌లో సినిమాలోని క్యారెక్టర్స్‌తో పాటు దలేర్ పాడుతూ, డ్యాన్స్ చేస్తారు. మన ఫ్రెండ్‌కి ఏదైనా కష్టం ఎదురైతే మనం నిలబడాలి. మన సైజ్ కాదు.. మన సంకల్పం ముఖ్యం అనే సందేశం ఈ సినిమాలో ఉంటుంది. 3డీ సినిమాకు చాలా ఫోకస్ కావాలి. ఈ సినిమాను ఐదేళ్లుగా షూట్ చేస్తున్నాం. ఏదో రోజు చోటాభీమ్ ఆస్కార్‌కు వెళ్తాడు అనే నమ్మకం ఉంది, తీసుకువెళ్లడానికి మా సామర్థ్యం మించి పని చేస్తాం’’ అని అన్నారు. -
స్పైడర్ మ్యాన్ క్రియేటర్ ఇకలేరు
సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ సృష్టికర్త స్టీవ్ డిట్కో కన్నుమూశారు. ఆయన మృతి వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 90 ఏళ్ల డిట్కో న్యూయార్క్‌లోని తన ఇంట్లో జూన్ 29న విగత జీవిగా పడి ఉండటాన్ని పోలీసులు కనుగొన్నారు. అంతకు రెండురోజుల ముందే ఆయన ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఆయన మృతిపై గల కారణాలపై స్పష్టత లేదు. ఒంటరితనం భరించలేకే ఆయన సూసైడ్ చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. 1961లో మార్వెల్ కామిక్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ స్టాన్లీతో కలిసి డిట్కో.. స్పైడర్‌మ్యాన్ పాత్రను రూపొందించారు. ఆ క్రెడిట్ స్టాన్లీదే అయినా.. స్పైడర్‌మ్యాన్ కాస్టూమ్స్, వెబ్ షూటర్స్, డిజైన్ ఇలా అంతా డిట్కో ఆలోచనలోంచి పుట్టిందే. తొలుత కామిక్ రూపకంలో వచ్చిన స్పైడర్‌మ్యాన్ కు అనూహ్య స్పందన రావటంతో చిన్నచిన్న మార్పులు చేసి యానిమేటెడ్ సిరీస్‌గా మార్వెల్ కామిక్స్ రూపొందించింది. స్పైడర్మ్యాన్తోపాటు ఆ సిరీస్‌లోని విలన్ పాత్రలు గ్రీన్ గోబ్లిన్, డాక్టర్ అక్టోపస్, సాండ్‌మ్యాన్, ది లిజర్డ్ అన్నీ డిట్కో డిజైన్ చేశారు. వీటితోపాటు 1963లో డాక్టర్ స్ట్రేంజ్ పాత్రను ఆయన రూపొందించారు. అనంతరం సహచరుడు స్టాన్లీతో విభేదాల కారణంగా మార్వెల్ కామిక్స్‌కు గుడ్‌బై చెప్పిన డిట్కో.. డీసీ కామిక్స్, ఛార్ల్టోన్, మరికొన్ని ఇండిపెండెంట్ పబ్లిషర్స్‌తో పని చేశారు. తిరిగి 1979లో మార్వెల్‌కు తిరిగొచ్చిన ఆయ.. మెషీన్ మ్యాన్, మైక్రోనట్స్ లాంటి పాత్రలను రూపొందించారు. 1992లో స్క్విరిల్ గర్ల్ ఆయన రూపొందించిన చివరి పాత్ర. ఆయన మృతిపై హాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
ఆస్కార్‌పై కన్నేసిన అద్భుతం
లాస్ ఏంజిల్స్ : ఆస్కార్ బరిలో ఈసారి ఓ అద్భుత చిత్రం నిలిచింది. యానిమేషన్ చిత్రాల బరిలో నిలిచిన ‘లవింగ్ విన్సెట్’ అవార్డు దక్కించుకుంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఇది చిత్రం కాదు. పూర్తిగా చేత్తో గీసిన పెయిటింగ్‌లతో తెరకెక్కించింది. సుమారు 65,000 ఫ్రేమ్‌లు, ప్రపంచవ్యాప్తంగా 125 మంది పెయింటర్లు ఈ చిత్రం కోసం పని చేశారు. పోలాండ్లోని గ్దాన్స్క్ పట్టణంలో వీరంతా ఒకచోట చేరి ఈ చిత్రాన్ని రూపొందించారు. విన్సెంట్ వాన్ ఘో హత్య.. విచారణ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి డోరోటా కోబైలా, హూ వెల్చ్మన్లు దర్శకులు. నిజానికి కోబైలా.. 2008లో ఏడు నిమిషాలతో షార్ట్ ఫిలింగా దీనిని విడుదల చేశారు. తర్వాత దీనిని పూర్తి స్థాయి సినిమాగా రూపొందించాలన్న ఆలోచన వచ్చింది. పాత్రలకు డబ్బింగ్, మ్యూజిక్, ఎడిటింగ్ ఇలా... అన్ని హంగులతో ఈ చిత్రాన్ని 90 నిమిషాల నిడివితో నిర్మించి 2017లో విడుదల చేశారు. 5.5 మిలియన్ డాలర్ల ఖర్చుతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు 30.5 మిలియన్ డాలర్లను వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. బెర్లిన్‌లో జరిగిన 30వ యూరోపియన్ ఫిల్మ్ అవార్డుల వేడుకల్లో ఉత్తమ యానిమేషన్ చిత్రంగా ఇది అవార్డు దక్కించుకుంది. ఇక ఇప్పుడు అకాడమీ అవార్డుల రేసులో నిలవటంతో అందరి దృష్టిని ఆకర్షించింది. -
ఆస్కార్‌పై కన్నేసిన అద్భుతం
-
ఏబీసీడీ
- నట్టింట్లో పాఠాలు ఆదరణ చూరగొంటున్న ఈ- లర్నింగ్ - సీడీల ద్వారా ఇంట్లోనే - విద్యాబోధనఆసక్తి చూపుతున్న విద్యార్థులు న్యూస్‌లైన్, కర్నూలు(విద్య), ఆధునిక టెక్నాలజీ పుణ్యమా అని నట్టింట్లోకి పాఠాలు వచ్చేశాయి. రెండు దశాబ్దాల క్రితం బొమ్మరిల్లు, చందమామ, జాబిల్లి, బాలమిత్ర వంటి పుస్తకాల ద్వారా నీతి కథలను చదివే బాలలు నేడు ఆడియో, వీడియో రూపంలో వచ్చే సీడీ(కాంపాక్ట్ డిస్క్) ద్వారా తెలుసుకుంటున్నారు. ఈ సీడీల ద్వారా సినిమా రూపంలో పిల్లలకు తల్లిదండ్రులు నైతికవిలువలు, మానవత్వ విలువలు తెలియజేస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు విడిపోవడం, చిన్న కుటుంబాలు ఏర్పడుతున్న ఈ కాలంలో చిన్నపిల్లలకు సీడీల్లో లభ్యమయ్యే నీతికథలు సమాజంలో ఎలా బతకాలో నేర్పిస్తున్నాయి. వారిలో మానసిక స్థైర్యాన్ని అందించి ధైర్యానికి ఆజ్యం పోస్తున్నాయి. కేవలం నీతి కథలే గాకుండా ఎడ్యుకేషన్ సీడీలు సైతం విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పిల్లలకు తల్లిదండ్రులతో పాటు, కుటుంబసభ్యులు, పెద్దలు ఇలాంటి సీడీలను బహుమతులుగా అందజేసి విజ్ఞానాన్ని పంచుతున్నారు. జిల్లాలో డిపార్ట్మెంట్ స్టోర్లతో పాటు పలు పుస్తక, సీడీల విక్రయ కేంద్రాల్లో ఇలాంటి సీడీలు అమ్మకాలు జరుగుతున్నాయి. సీడీల్లో పురాణకథలు: ఒకప్పుడు పురాణకథల గురించి తెలుసుకోవాలంటే చిన్నారులకు బాలమిత్ర, బొమ్మరిల్లు, చందమామ, జాబిల్లి వంటి పుస్తకాలు చదివేవారు. పుస్తకాలను చదివే ఓపిక, తీరిక నేటి చిన్నారులకు లేకపోవడం, ఆ స్థానం టెలివిజన్లు ఆక్రమించాయి. ఇదే సమయంలో సీడీల ద్వారా నీతికథలను అందించేందుకు ఆయా కంపెనీలు ముందుకు వచ్చాయి. దృశ్య, శ్రవణ రూపంలో చిన్నారులకు అర్థమయ్యే రీతిలో రూపొందించిన కథలు చిన్నారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రామాయణ, మహాభారత కథలు చిన్నారులకు అర్థమయ్యే విధంగా ఉండటంతో వీటి డిమాండ్ బాగా పెరిగింది. పిల్లలకు కథలు చెప్పే ఓపిక, తీరిక లేని తల్లిదండ్రులు, పెద్దలు విజ్ఞాన, వినోదాలను అందించేందుకు ఇలాంటి సీడీలను కొని ఇస్తున్నారు. టీవీ, కంప్యూటర్లలో ఈ లర్నింగ్: ఆధునిక టెక్నాలజీ పుణ్యమా అని ప్రతి ఇంట్లో నేడు టెలివిజన్‌తో పాటు డీవీడీలు అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు కంప్యూటర్లూ కొనుగోలు చేస్తున్నారు. పురాణకథలు, కామిక్, ఎడ్యుకేషన్‌కు సంబంధించిన సీడీలను చిన్నారులు డీవీడీలు, కంప్యూటర్ల ద్వారా ప్లే చేస్తున్నారు. స్టేట్, సీబీఎస్ఈ సిలబస్ తరహాలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఎడ్యుకేషన్ సీడీలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. అవసరమైన పాఠ్యాంశాలను నేరుగా ఉపాధ్యాయుడు బోధించినట్లు ఈ-లర్నింగ్ ఉపయోగపడుతోంది. ఎడ్యుకేషన్‌తో పాటు యోగా, ధ్యానం, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం వంటి అంశాల సీడీలను సైతం పిల్లలకు తల్లిదండ్రులు కొనిస్తున్నారు. తరగతి గదిలో పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయుడు ముందురోజు ఇంటి వద్ద పుస్తకాలు తిరగేసి సిద్ధమై వస్తాడు. వాటిని తరగతి గదిలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చెప్పేందుకు ప్రయత్నిస్తాడు. ఇదే సమయంలో ప్రశ్న పూర్తి కాకముందే విద్యార్థి ఠకీమని సమాధానం చెప్పేస్తాడు. దీంతో అవాక్కవడం ఉపాధ్యాయుని వంతవుతోంది. ఇది మార్కెట్లలో లభించే ఎడ్యుకేషన్ సీడీల పుణ్యమేనని తెలుసుకుని, టెక్నాలజీకి అనుగుణంగా ఉపాధ్యాయులు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠ్యాంశాలు బాగా అర్థమవుతున్నాయి ఎడ్యుకేషన్ సీడీలతో తరగతి గదిలో చెప్పిన పాఠాలు బాగా అర్థమవుతున్నాయి. సైన్స్, మ్యాథ్స్, గ్రామర్ సీడీలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. వీటితో పాటు కామిక్స్, స్పోకెన్ ఇంగ్లీష్, చిత్రలేఖనం వంటి సీడీలు తెచ్చుకున్నాను. తీరిక వేళల్లో వీడియోగేమ్ సీడీలు నాకు ఎంతో ఉత్సాహాన్నిస్తున్నాయి. -ఎం. శ్రీనివాస్, చాణిక్యపురికాలని, కర్నూలు యానిమేషన్ మూవీలంటే ఇష్టం నాకు యానిమేషన్ మూవీలంటే ఇష్టం. ఇటీవల బాలకృష్ణుడు, ఆంజనేయుడు, వినాయకుడు వంటి దేవతలపై రూపొందించిన సీడీలు బాగా చూస్తాను. వీటితో పాటు అమ్మానాన్నలు మాకు చదువుకునేందుకు అవసరమైన సీడీలు సైతం కొనిస్తున్నారు. ఇవి సైతం నాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. -అఖిల, కర్నూలు -
అప్పుడు భయపడ్డాను
అందమే అసూయపడేంత అందాలను పుణికిపుచ్చుకున్న భామ అనుష్క అంటే అతిశయోక్తి కాదేమో. సుమారు దశాబ్ద కాలంగా దక్షిణాది సినీ ప్రేక్షకులను తన అందం, అభినయంతో దాసోహం చేసుకున్న ఈ జాణ తాజాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అందులో ఒక అంశం పాఠశాలలో లైంగిక పాఠాలను ప్రవేశపెట్టాలన్నది. అనుష్క మాట్లాడుతూ తాను బెంగుళూరులో చదువుకుంటున్నప్పుడు కళాశాలలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ప్రచారం జరిగేదన్నారు. అప్పుడు ఈ విషయం గురించి పట్టించుకునే దాన్ని కానన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను అంటుకోవడానికి వాళ్ల పక్కన కూర్చొని భోజనం చేయడానికి భయపడ్డానని అందుకు కారణం ఆ వ్యాధి తనకెక్కడ సోకుతుందోనన్న అనుమానమేనన్నారు. డాక్టర్ ప్రియ సర్కార్ పరిచయం తరువాత ఎయిడ్స్ వ్యాధి గురించి పూర్తిగా అవగాహన కలిగిందని చెప్పారు. అందువలనే పాఠశాల దశలోనే విద్యార్థులకు లైంగిక విద్యను బోధించాలని సూచించారు. తల్లిదండ్రులు ఈ విద్యను పిల్లలకు అభ్యసింపచేయాలని అన్నారు. సినిమాల వలనే లైంగిక దాడులు అధికమై ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు సంఖ్య పెరుగుతోందంటే మాత్రం తాను అంగీకరించనని స్పష్టం చేశారు. హెచ్ఐవీ బారిన పడటం అనేది వారి ప్రవర్తన బట్టి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎయిడ్స్ రోగులకు సంబంధించిన సినిమాలు రాకపోవడానికి కారణం ఏమిటంటే, ఈ ప్రశ్నకు తాను బదులివ్వలేనని దర్శక నిర్మాతలే సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. తాను నటిని మాత్రమేనని ఎయిడ్స్ అవగాహన చిత్రాల్లో నటించడానికి తాను సిద్ధం అని అనుష్క తెలిపారు. ఇటీవల ఎయిడ్స్ అవగాహన యానిమేషన్ చిత్ర విలేకరుల సమావేశంలో పాల్గొన్న అనుష్క ఈ విషయూలు వెల్లడించారు.