‘‘ఇది వరకు చూసిన ‘చోటాభీమ్’ చిత్రాలకు, ఇప్పడు వస్తున్న ‘చోటా బీమ్: కుంగ్‌ఫూ ధమకా’కి తేడా ఏంటంటే ‘ఎక్స్‌పీరియన్స్’. పాత సినిమాలన్నీ 2డీలో షూట్ చేశాం. లేటేస్ట్ చిత్రాన్ని స్టీరియోస్కోపిక్ 3డీలో షూట్ చేశాం. మునుపటి సినిమాల కంటే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం’’ అన్నారు ‘చోటా భీమ్’ సృష్టికర్త రాజీవ్ చిలక. యానిమేషన్ క్యారెక్టర్ చోటా భీమ్ ముఖ్య పాత్రలో రాజీవ్ చిలక తెరకెక్కించిన తాజా చిత్రం ‘చోటా భీమ్: కుంగ్‌ఫు ధమాకా’. ఈ చిత్రం మే 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజీవ్ మాట్లాడుతూ – ‘‘చోటా భీమ్’, అతని గ్యాంగ్ కలసి చైనా వెళ్లి, అక్కడ కుంగ్‌ఫూ కాంపిటీషన్‌లో పాల్గొంటారు. ఈ ప్రాసెస్‌లో ఏం జరుగుతుంది అన్నదే సినిమా కథ.
పిల్లలు ఎంజాయ్ చేసే యాక్షన్, కామెడీ ఇందులో ఉంటాయి. చైనీస్ ఫుడ్‌ని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ ఫుడ్ ఐటమ్స్‌కు సంబంధించి ఓ సాంగ్ ఉంది. పంజాబీ గాయకుడు దలేర్ మెహందీతో ఓ ప్రమోషనల్ సాంగ్ షూట్ చేశాం. సినిమా లాస్ట్‌లో వచ్చే ఈ సాంగ్‌లో సినిమాలోని క్యారెక్టర్స్‌తో పాటు దలేర్ పాడుతూ, డ్యాన్స్ చేస్తారు. మన ఫ్రెండ్‌కి ఏదైనా కష్టం ఎదురైతే మనం నిలబడాలి. మన సైజ్ కాదు.. మన సంకల్పం ముఖ్యం అనే సందేశం ఈ సినిమాలో ఉంటుంది. 3డీ సినిమాకు చాలా ఫోకస్ కావాలి. ఈ సినిమాను ఐదేళ్లుగా షూట్ చేస్తున్నాం. ఏదో రోజు చోటాభీమ్ ఆస్కార్‌కు వెళ్తాడు అనే నమ్మకం ఉంది, తీసుకువెళ్లడానికి మా సామర్థ్యం మించి పని చేస్తాం’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment