బ్రహ్మీ @ పుంబా అలీ @ టీమోన్‌ | brahmanandam, ali telugu dubbing on the lion king | Sakshi
Sakshi News home page

బ్రహ్మీ @ పుంబా అలీ @ టీమోన్‌

Published Thu, Jun 20 2019 12:07 AM | Last Updated on Thu, Jun 20 2019 12:07 AM

brahmanandam, ali telugu dubbing on the lion king - Sakshi

బ్రహ్మానందం, అలీ

డిస్నీ ఇండియా వారు తాజాగా విడుదల చేస్తున్న చిత్రం ‘లయన్‌ కింగ్‌’. డిస్నీ కామిక్‌ పుస్తకాల్లో పుట్టిన సింహం పేరు సింబ. ఈ ‘లయన్‌ కింగ్‌’ కథకి సింబనే హీరో. టీమోన్‌ అనే ముంగిస, పుంబా అనే అడివి పంది కూడా ‘లయన్‌ కింగ్‌’ కథలో ముఖ్య పాత్రలు. ప్రపంచంలోని అన్ని ముఖ్యభాషల్లో జూలై 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

‘లయన్‌ కింగ్‌’ లో కీలక పాత్ర అయిన ముసాఫాకు బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌ డబ్బింగ్‌ చెప్పారు. ముసాఫా తనయుడు, సినిమాకు హీరో అయిన సింబాకు షారుక్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ డబ్బింగ్‌ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు వెర్షన్‌లో పుంబా పాత్రకు బ్రహ్మానందం, టీమోన్‌ పాత్రకు అలీ డబ్బింగ్‌ చెప్పడం విశేషం. ‘లయన్‌ కింగ్‌’ చిత్రం తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదలకి సిద్ధమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement