Telugu dubbing
-
కాలనీలో థ్రిల్
అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం ‘డీమాంటీ కాలనీ 2’. అజయ్ ఆర్. జ్ఞానముత్తు దర్శకత్వంలో విజయ సుబ్రహ్మణ్యన్, ఆర్సీ రాజ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న తమిళంలో రిలీజైంది. ఈ సినిమాని రాజ్ వర్మ ఎంటర్టైన్మెంట్–శ్రీ బాలాజీ ఫిలింస్ తెలుగులో ఈ నెల 23న విడుదల చేస్తున్నాయి. ‘‘హారర్ థ్రిల్లర్‌గా ‘డీమాంటీ కాలనీ 2’ చిత్రం రూపొందింది. ‘తంగలాన్’ వంటి పెద్ద సినిమాతో పాటు విడుదలైన మా ‘డీమాంటీ కాలనీ 2’ కూడా ప్రేక్షకాదరణ పొందుతోంది. తెలుగులోనూ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మేకర్స్. -
నాన్న మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ హీరోగా 'సత్య'
'నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. ఈ సినిమా చేసినందుకు సంతోషంగా ఉంది. అందరూ చాలా బాగా చేశారు. సత్య సినిమా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఇది నా మొదటి సినిమా, మొదటి హీరో, మొదటి హీరోయిన్, మొదటి ప్రొడ్యూసర్.. నా అనుభవం నుంచి తీసిన కథ ఇది' అని డైరక్టర్ వాలి మోహన్ దాస్ చెప్పారు. గురువారం నాడు సత్య సినిమా టీజర్‌తో పాటు ఒక పాట రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సతీష్ మాట్లాడుతూ.. విక్రమ్ "నాన్న" మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా, లోకేష్ కనగరాజ్ 'నగరం' మూవీలో ఓ పాత్రలో హమరేష్ నటించాడు. అప్పుడు హమరేష్లో ఉన్న ప్యాషన్ నాకు అర్ధం కాలేదు. పోను పోను తను పెట్టే ఎఫర్ట్ అర్ధమై.. గోపురం ప్రొడక్షన్స్ బ్యానర్లో రంగోలి పేరుతో ఈ సినిమా స్టార్ట్ చేశాం. తమిళంలో ఈ మూవీ పెద్ద సక్సెస్ అయ్యింది.. తెలుగులోనూ ఆదరిస్తారనుకుంటున్నాం అన్నారు. హీరో హమరేష్ మాట్లాడుతూ.. రంగోలి అనే తమిళ్ సినిమాని తెలుగులో సత్యగా మీ ముందుకు తీసుకువస్తున్నాము. చెన్నైలో రిలీజ్ అయ్యే ప్రతి తెలుగు సినిమా థియేటర్ లో చూసే వాడిని.. ఈ తెలుగు స్టేజ్ కు ఉన్న పవర్ నాకు తెలుసు. నాన్న శ్రీశైలం, అమ్మ చెన్నై కావడంతో నాకు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలు రెండు కళ్ళతో సమానం అన్నారు. చదవండి: ఆ సీన్ చేయనని ఏడ్చేసిన హీరోయిన్.. విలన్‌గా అది తప్పదన్న నటుడు -
అందుకే డబ్ చేశాం
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘లవ్ టుడే’. ఇవాన హీరోయిన్గా, రవీనా కీలక పాత్రలో నటించారు. ఈ నెల 4న తమిళంలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమాను అదే టైటిల్‌తో ‘దిల్’ రాజు తెలుగులో ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ‘లవ్ టుడే’ ఆడియో, ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, నటి రాధికా శరత్‌కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాగా విడుదలైన ‘లవ్ టుడే’ యాభై కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. తమిళ ట్రైలర్ చూసి రీమేక్ ఆలోచన వచ్చింది. కానీ మ్యాజిక్ మిస్సవుతుందేమోనని తెలుగులో డబ్ చేశాం’’ అన్నారు. ‘‘తమిళంలోలానే ఈ చిత్రం తెలుగులోనూ పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు ప్రదీప్. -
అద్భుతమైన గ్రాఫిక్స్‌తో రానున్న 'మహాబలి'..
Mahabali Ready To Release In Telugu: ప్రముఖ కన్నడ హీరో దునియా విజయ్ హీరోగా డా. భారతి, కల్యాణి రాజు హీరోయిన్స్ గా కన్నడంలో రూపొందిన చిత్రం 'జయమ్మన మగ'. ఈ చిత్రానికి రవికిరణ్ వికాస్ దర్శకత్వం వహించారు. ఇటీవలే రిలీజై సూపర్ డూపర్ హిట్ అయిన ఈ చిత్రం రూ. 35 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సెన్సేషన్ సృష్టించింది. ఈ చిత్రాన్ని శ్రీ జె.వి. ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత మార్డురి వెంకటరావు 'మహాబలి' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. నిర్మాత మార్డురి వెంకట్రావు మాట్లాడుతూ "100 పర్సెంట్ యాక్షన్ అండ్ లవ్ తో పాటు అద్భుతమైన గ్రాఫిక్స్ విజువల్ వండర్ గా కన్నడంలో రూపొందిన 'జయమ్మన మగ' చిత్రం సెన్సేషనల్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని మా శ్రీ జె. వి. ప్రొడక్షన్స్ బ్యానర్ లో 'మహాబలి' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాం. హార్రర్ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. శ్రీ జె.వి. ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఇది మరొక సూపర్ హిట్ చిత్రంగా నిలుస్తుందని బలంగా నమ్ముతున్నాను. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్య ఐదు పాటలు చాలా డిఫరెంట్ గా కంపోజ్ చేసాడు. అలాగే రీ రికార్డింగ్ అద్భుతంగా చేసాడు. దర్శకుడు రవికిరణ్ టేకింగ్, దునియా పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి హై లైట్ గా నిలిచాయి. భారతీబాబు మాటలు, పాటలు అద్భుతంగా రాసారు. త్వరలో ఆడియో రిలీజ్ చేసి అదే నెలలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని తెలిపారు. చదవండి: 'ఆర్ఆర్ఆర్'పై పోర్న్ స్టార్ ట్వీట్.. నెట్టింట జోరుగా చర్చ నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్ ధనుష్ కోసం ఇండియా వస్తున్న హాలీవుడ్ దర్శకులు.. -
తొలిసారిగా తెలుగులో డబ్బింగ్ చెప్పిన పిశాచి
పిశాచి తెలుగు డబ్బింగ్ చెప్పడం ఏంటి అనుకుంటున్నారా? అదేం లేదండీ, పిశాచి 2 సినిమా కోసం నటి ఆండ్రియా తొలిసారి తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటిగా, గాయనిగా సత్తా చాటుతున్న బోల్డ్ బ్యూటీ ఆండ్రియా బహుభాషా నటి కూడా! ఆండ్రియాలో మంచి కవయిత్రి కూడా ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం పిశాచి 2 చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మిష్కిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాక్‌ఫోర్ట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై టి.మురుగానందం నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న పిశాచి 2 చిత్రం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రంలో ఆండ్రియా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుననారు. తమిళం, మలయాళం సరే తెలుగులోనూ తానే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందుకోసం ఆమె ట్యూటర్‌ను నియమించుకుని తెలుగు వాచకం నేర్చుకుని డబ్బింగ్ చెబుతున్నారు. అలా పిశాచి చిత్రం కోసం ఆండ్రియా చెప్పిన డైలాగ్ నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడి నుంచి ఎవరూ ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదు. తాను డబ్బింగ్ చెబుతున్న వీడియోను ఆండ్రియా సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అందులో ఫస్ట్ టైం తెలుగులో డబ్బింగ్ చెబుతున్నాను అంటూ ఎగ్జైటింగ్‌తో కూడిన ఆనందంతో పేర్కొన్నారు. ఆండ్రియా కృష్టిని నెటిజన్లు అభినందించకుండా ఉండలేకపోతున్నారు. View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) చదవండి: ‘విక్రమ్’ మేకింగ్ వీడియో చూశారా?.. డైరెక్టర్ ఫోకస్‌కు నెటిజన్లు ఫిదా! పక్కనోడి లైఫ్ నీకెందుకు?: ట్రోలర్స్‌కు నటుడి స్ట్రాంగ్ కౌంటర్ -
'ఆహా' అనిపించేలా సైబర్ క్రైమ్ థ్రిల్లర్ 'గుళ్టు'.. ఆసక్తిగా ట్రైలర్
Gultoo Movie Telugu Trailer: విభిన్నమైన కాన్సెప్ట్‌తో సినీ ఆడియెన్స్‌ను అలరిస్తోంది ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. స్టోరీ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తూనే సూపర్ హిట్ చిత్రాలను తెలుగులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే పలు హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేసిన ఆహా తాజాగా మరో సినిమాను తీసుకురానుంది. కన్నడలో సూపర్ హిట్ అందుకున్న సైబర్ క్రైమ్ థ్రిల్లర్ 'గుళ్టు' త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ యువ నటుడు జనార్దన్ చిక్కన్న ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఆహా వేదికగా జులై 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఆహా బృందం 'గుళ్టు' మూవీ ట్రైలర్‌ను బుధవారం (జులై 6) విడుదల చేసింది. 'ఆకలి కడుపులకు ఆశలెక్కువ. విశాలంగా పెరిగే మనసు, రోజు రోజుకీ పరిస్థితులకు లొంగిపోయి, కనీసం చిన్న చిన్న ఆశలకు కూడా చోటు లేనంతగా ముడుచుకుపోతుంది' అంటూ ప్రారంభమైన ఈ మూవీ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ఈ సినిమాకు ప్రధాన పాత్రలో నటించిన జనార్దన్ కథ, దర్శకత్వం వహించారు. -
ఓటీటీలతో పని లేదు.. బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇలా చూడండి !
కరోనా కల్లోలం ఇంకా తగ్గలేదు. మొన్నటివరకు రెస్ట్ తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో పంజా విసురుతోంది మహామ్మారి. దీని ప్రభావం సినీ వర్గాలపై మళ్లీ పడింది. పండుగ వేళ సందడి చేద్దామనుకున్న పెద్ద సినిమాలకు, వాటిని వీక్షిద్దామనుకున్న ప్రేక్షకులకు తీవ్ర నిరాశే కలిగింది. ఇంకా కొవిడ్ కల్లోలం ఎక్కువైతే థియేటర్లు మూసే అవకాశం లేకపోలేదు. అయితే థియేటర్లు మూత పడితే సినీ అభిమానులకు, ఆడియెన్స్‌కు ఉండే ఏకైక మార్గం ఓటీటీలు. చిన్న, పెద్ద, పర భాష అంటూ తేడా లేకుండా చూసేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంది. ఓటీటీల్లో చూడాలంటే వాటిని కచ్చితంగా సబ్‌స్క్రైబ్ చేసుకోని తీరాలి. లేకుంటే చూడలేం. (చదవండి: కిక్కెక్కించే ఐదు కొరియన్ వెబ్ సిరీస్ ఇవే..) ఓటీటీలకు డబ్బు చెల్లించి చూడలేని సినీ వీక్షకుల కోసం ఎలాంటి ఖర్చు లేని దారి ఒకటి ఉంది. అదేంటంటే యూట్యూబ్. హా.. యూట్యూబే. అయితే యూట్యూబ్‌లో ఏ సినిమాలు ఉన్నాయి ఏంటీ అని మీకు తెలియకపోవచ్చు. అలాంటి వారికోసమే మా ఈ స్టోరీ. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను తెలుగులోనే చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈసారికి యూట్యూబ్‌లో లభించే సౌత్ ఇండియన్ తెలుగు డబ్బింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ మీకోసం. ఓ లుక్కేసీ ఆనదించండి మరి ! 1. ఆక్రందన (తీవ్రం-మలయాళం) 2. రక్షకుడు (ధామ్ ధూమ్-తమిళం) 3. ఎన్‌హెచ్-4 4. పెన్సిల్ 5. సంఘర్షణ (చదవండి: ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో అలరించే సినిమాలు..) -
తెలుగు పాఠాలు
‘మా మాటలు మేమే మాట్లాడుకుంటాం’ అని పరభాషా తారలు తెలుగు సినిమాలు చేసినప్పుడు తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. తెలుగులో ఫుల్ బిజీగా సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్‌సింగ్, రాశీ ఖన్నా వంటి ఉత్తరాది భామలు అప్పుడప్పుడూ తమ పాత్రలకు డబ్బింగ్ చెబుతున్నారు. అయితే ఓ పది సినిమాలు చేశాక వాళ్లు ఈ ప్రయత్నం చేశారు. కానీ ఆలియా భట్ మాత్రం తెలుగులో చేస్తున్న తొలి సినిమాకే తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నారట. ఎన్టీఆర్, రామ్‌చరణŠ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ టైమ్‌లో ఈ సినిమా నుండి ఆలియా తప్పుకున్నారనే వార్తలు షికారు చేశాయి. కానీ ఆలియా తప్పుకోలేదు. సీత పాత్ర కోసం ప్రిపేర్ అవుతున్నారు. తెలుగు నేర్చుకోవటం కోసం కోచ్‌ను కూడా పెట్టుకున్నారని టాక్. డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకుంటున్నారట. సోమవారం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ మళ్లీ మొదలైన విషయం తెలిసిందే. నవంబర్ నుంచి ఈ సినిమా చిత్రీకరణలో ఆలియా పాల్గొంటారని సమాచారం. -
చెల్లెలి కోసం...
డిస్నీ సంస్థ నుంచి వస్తున్న తాజా హాలీవుడ్ యానిమేషన్ చిత్రం ‘ఫ్రోజెన్ 2’. భారతదేశంలోని ప్రాంతీయ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ప్రాంతీయ భాషల్లో ఆయా ప్రాంతానికి చెందిన స్టార్స్‌తో ఈ సినిమాలోని పాత్రలకు డబ్బింగ్ చెప్పించి సినిమాను ప్రమోట్ చేస్తోంది డిస్నీ సంస్థ. అన్నా, ఎల్సా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ల చుట్టూ ‘ఫ్రోజెన్ 2’ కథ తిరుగుతుంది. అన్నా, ఎల్సా పాత్రలకు హిందీలో ప్రియాంకా చోప్రా, పరిణీతీ చోప్రా డబ్బింగ్ చెప్పారు. తెలుగులో చెల్లెలి పాత్ర ఎల్సాకు నిత్యా మీనన్ డబ్బింగ్ చెప్పారు. నిత్యా మాట్లాడుతూ – ‘‘ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పడం సంతోషంగా అనిపించింది. ఈ సినిమా స్క్రిప్ట్ నాకు చాలా నచ్చింది. అమ్మాయిలకు సంబంధించి ఈ సినిమాలో మంచి సందేశం ఉంది. డిస్నీ సంస్థతో పని చేయడం కల నెరవేరినట్టుంది’’ అన్నారు. ‘ఫ్రోజన్ 2’ ఈ నెల 22న విడుదల కానుంది. కేరళలో పుట్టి పెరిగిన నిత్యా మీనన్ తెలుగు మాట్లాడగలరు. ‘అలా మొదలైంది, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, 24’ సినిమాల్లో పాటలు కూడా పాడారామె. అలాగే తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటారు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాకి అయితే తన పాత్రతో పాటు మరో హీరోయిన్ ఇషా తల్వార్ పాత్రకు కూడా నిత్యా మీననే డబ్బింగ్ చెప్పడం విశేషం. -
బ్రహ్మీ @ పుంబా అలీ @ టీమోన్
డిస్నీ ఇండియా వారు తాజాగా విడుదల చేస్తున్న చిత్రం ‘లయన్ కింగ్’. డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన సింహం పేరు సింబ. ఈ ‘లయన్ కింగ్’ కథకి సింబనే హీరో. టీమోన్ అనే ముంగిస, పుంబా అనే అడివి పంది కూడా ‘లయన్ కింగ్’ కథలో ముఖ్య పాత్రలు. ప్రపంచంలోని అన్ని ముఖ్యభాషల్లో జూలై 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ‘లయన్ కింగ్’ లో కీలక పాత్ర అయిన ముసాఫాకు బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు. ముసాఫా తనయుడు, సినిమాకు హీరో అయిన సింబాకు షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు వెర్షన్లో పుంబా పాత్రకు బ్రహ్మానందం, టీమోన్ పాత్రకు అలీ డబ్బింగ్ చెప్పడం విశేషం. ‘లయన్ కింగ్’ చిత్రం తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదలకి సిద్ధమవుతోంది. -
రాజా నరసింహా
మమ్ముట్టి, జై, మహిమా నంబియర్ కీలక పాత్రల్లో మలయాళంలో తెరకెక్కిన చిత్రం ‘మధురరాజా’. ఈ చిత్రాన్ని ‘రాజా నరసింహా’ పేరుతో జై చెన్నకేశవ పిక్చర్స్ పతాకంపై సాధుశేఖర్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘మన్యంపులి’తో ఘన విజయం అందుకున్న వైశాక్ దర్శకత్వం వహించిన చిత్రమిది. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ఏప్రిల్‌లో విడుదలైన ఈ సినిమా దాదాపు వంద కోట్లు వసూళ్లు రాబట్టింది. ‘యాత్ర’ వంటి సూపర్‌హిట్ సినిమా తర్వాత తెలుగులో వస్తున్న మమ్ముట్టి చిత్రమిది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలైలో సినిమా విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. సాధు శేఖర్ మాట్లాడుతూ– ‘‘మలయాళంలో భారీ విజయం సాధించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. చక్కని సందేశం ఉంది. మమ్ముట్టి, జై పాత్రలు ఆకట్టుకుంటాయి. ప్రతినాయకుడిగా జగపతిబాబు పాత్ర మరోస్థాయిలో ఉంటుంది. సన్నీ లియోన్ ప్రత్యేక గీతం యువతను ఉర్రూతలూగిస్తుంది. గోపీ సుందర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నూల అశోక్, నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకష్ణ. -
తెలుగు రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘సోలో’
మాలీవుడ్ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన విభిన్న కథా చిత్రం సోలో. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ రుద్ర, శివ, శేఖర్, త్రిలోక్ లు గా నాలుగు భిన్నమైన పాత్రల్లో కనిపించాడు. మాలీవుడ్ లో మంచి సక్సెస్సాధించిన ఈసినిమాను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. దుల్కర్ సరసన ధన్సిక, నేహ శర్మ, శ్రుతి హరిహరన్‌లు హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమాను తెలుగులో వెంకట సాయి ప్రియాన్సి క్రియేషన్స్ బ్యానర్ పై మాస్టర్ వెంకట్ సాయి విశాల్ సమర్పణలో గాజుల వెంకటేష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పనులు శర వేగంగా జరుపుకుంటూ త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. బెజోయ్ నంబియార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు గౌతమ్ కశ్యప్, ఉమర్జి అనురాధలు తెలుగు వర్షన్ మాటలు అందిస్తున్నారు. -
ఒక్కసారి కమిట్ అయితే...
... నా మాట నేనే వినను అని ‘పోకిరి’లో మహేశ్‌బాబు చెప్పిన డైలాగ్‌ని అంత ఈజీగా మరచిపోలేం. రకుల్ ప్రీత్‌సింగ్ మాటలు వింటుంటే.. ఈ డైలాగ్‌ని కొంచెం రివర్శ్ చేయొచ్చేమో. ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేను కచ్చితంగా వింటా’ అన్నట్లుగా ఆమె చెప్పిన మాటలు ఉన్నాయి. ఇంతకీ రకుల్ ఏమన్నారంటే?... ‘నాన్నకు ప్రేమతో’లో ఈ బ్యూటీ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు కదా. ఆ తర్వాత సరైనోడు, ధృవ, విన్నర్, రారండోయ్ వేడక చూద్దాం, జయ జానకి నాయక, స్పైడర్ సినిమాలు చేశారు. కానీ డబ్బింగ్ చెప్పుకోలేదు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆమె తీసుకున్న నిర్ణయాల్లో ఇక నుంచి తెలుగులో తాను చేసే క్యారెక్టర్లకు సొంత గొంతు వినిపించాలనే డెసిషన్ ఒకటి. ‘‘నేను తెలుగు బాగా మాట్లాడతా. ఎంత బాగా అంటే నా మాతృభాష పంజాబీకన్నా బాగా మాట్లాడుతున్నా. అందుకే ‘నాన్నకు ప్రేమతో’లో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. ఈ 2018లో చేసే సినిమాలన్నింటికీ అలానే చేయాలని కమిట్ అయ్యా’’ అన్నారు రకుల్. మంచిది. మంచి నిర్ణయమే. ఎంత బాగా యాక్ట్ చేసినా సొంత గొంతు వినిపిస్తే ఆ తృప్తే వేరు. ‘కంప్లీట్ ఆర్టిస్ట్’ అని కూడా అనిపించుకోవచ్చు. -
పంజాబీ పిల్ల... తెలుగు డబ్బింగ్
రకుల్ ప్రీత్‌సింగ్... ఇవాళ తెలుగు సినీ పరిశ్రమలోని నవ యువ కథానాయికల్లో మొదటి వరుసలో ఉన్న గ్లామర్ గర్ల్. తెలుగు తెరకు వచ్చిన గడచిన ఆరేళ్ళలో తొమ్మిది సినిమాల్లో నటించిన హ్యాపెనింగ్ హీరోయిన్. ఈ పంజాబీ అమ్మాయి బయట చక్కగా తెలుగు మాట్లాడతారు. తెలుగు నటీనటులే తెలుగు సరిగ్గా మాట్లాడలేక పోతున్న ఈ రోజుల్లో ఆమె తెలుగు మాట్లాడడం వింటే ముచ్చటేస్తుంది. విషయం ఏమిటంటే, రకుల్ ఇప్పుడు సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకోనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో చిన్న ఎన్టీయార్ నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో కథానాయిక అయిన రకుల్ అలా వాచికాభినయం కూడా ప్రదర్శించనున్నారు. ‘‘ ‘నువ్వు డబ్బింగ్ చెప్పగలవు’ అంటూ దర్శకుడు సుకుమార్ నన్ను ఎప్పటి నుంచో ప్రోత్సహిస్తున్నారు. గత వారం ఈ సినిమాలో కొన్ని సీన్లకు టెస్ట్ డబ్బింగ్ చెప్పాను. అందరూ నా గొంతు బాగుందన్నారు’’ అని రకుల్ చెప్పుకొచ్చారు. అయితే, బయట ఎంత బాగా మాట్లాడినా, డబ్బింగ్ చెప్పడం వేరు కాబట్టి, కొంత టెన్షన్ ఫీలవుతున్నట్లు ఆమే ఒప్పుకుంటున్నారు. తెర మీది సన్నివేశంలోని భావోద్వేగాలకు తగ్గట్లుగా మాట్లాడుతూ, ఉచ్చారణ సరిగ్గా ఉండేలా చూసుకోవడం కష్టమని ఒప్పుకుంటూనే అందుకు కావాల్సిన జాగ్రత్తలన్నీ రకుల్ తీసుకుంటున్నారట. గమ్మత్తేమిటంటే, రకుల్ ఇంతవరకూ ఎవరి దగ్గరా పద్ధతి ప్రకారం తెలుగు నేర్చుకోలేదు. చుట్టూ ఉన్న వాళ్ళందరినీ తనతో కేవలం తెలుగులోనే మాట్లాడ మని మొదట్లోనే చెప్పేశారు. వాళ్ళు మాట్లాడుతున్నది వింటూ, వాళ్ళతో మాట్లాడుతూనే భాష నేర్చేసుకు న్నారు. ‘‘ఆ కష్టం ఇప్పుడు ఫలించింది’’ అని ఈ మిస్ ఇండియా పోటీ ఫైనలిస్ట్ చెప్పుకొచ్చారు. నటిగా ఇంతదాన్ని చేసిన తెలుగు ప్రేక్షకులకూ, పరిశ్రమకూ ఇలా తెలుగులో మాట్లాడుతూ ఋణం తీర్చుకుంటు న్నట్లు రకుల్ భావిస్తున్నారు. ‘నాన్నకు ప్రేమతో’లో లండన్‌లో ఎన్నారైగా కనిపించనున్న రకుల్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తయారవుతున్న సినిమాలో అల్లు అర్జున్ పక్కన ‘అచ్చమైన తెలుగమ్మాయి’ పాత్ర పోషిస్తున్నారు. మొత్తానికి, వేషం... వేషానికి తగ్గ మాటతో తెలుగు నేలతో తన బంధాన్ని ఈ పంజాబీ పిల్ల గట్టిపరుచుకుంటున్నట్లున్నారు. ఆల్ ది బెస్ట్ రకుల్. -
1... 2... 3... 4
ఆ రోజు చక్కగా ముస్తాబై కృతీ సనన్ షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టారు. అది తెలుగు సినిమా షూటింగ్ కాబట్టి, అన్నీ తెలుగు మాటలే. కృతికి ఏమీ అర్థం కాలేదు. డైలాగ్ పేపర్లో ఉన్న సంభాషణలు చెబుతూ, నటించాలి. నోరు తిరగలేదు. దాంతో, ‘1, 2, 3, 4’ అని అంకెలు చెబుతూ నటించమంటూ యూనిట్ సభ్యులు సలహా ఇచ్చారు. కృతి అలానే చేసి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. తెలుగులో చేసిన తొలి చిత్రం ‘1.. నేనొక్కడినే’ సమయంలో కూడా ఇలా ‘అంకెలే నాకు సంభాషణలు’ అని కృతి చెప్పారు. కానీ, ఇప్పుడు అంకెలు చెప్పడం మానేశానని కృతీ సనన్ అంటూ -‘‘ఇలా అంకెలు చెప్పడం వల్ల డబ్బింగ్లో లిప్ సింక్ కాదనే విషయం అర్థమైంది. అందుకే, డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి ఇబ్బంది లేకుండా నేను నటిస్తున్నప్పుడే తెలుగు సంభాషణలు పలికితే బాగుంటుందనుకున్నా. అప్పటి నుంచీ ఆ సంభాషణలను కష్టపడి బట్టీపట్టి చెబుతున్నా. దాంతో డబ్బింగ్ కరెక్ట్‌గా కుదురుతోంది. అలాగే, ఆ సంభాషణలకు అర్థం తెలుసుకోవడం వల్ల, అందుకు తగ్గ హవభావాలు కనబరచగలుగుతున్నా. త్వరలో తెలుగు మాట్లాడడానికి ప్రయత్నిస్తా’’ అన్నారు. -
కమల్‌హాసన్ తెలుగు అభిమానులకు శుభవార్త!
చెన్నై: ప్రముఖ నటుడు, నిర్మాత కమల్‌హాసన్ తెలుగు అభిమానులకు శుభవార్త. తెలుగు సినిమాలో తొలిసారిగా ఆయన తన గొంతు వినిపించబోతున్నారు. ఉత్తమ విలన్ తమిళ సినిమా తెలుగు వెర్షన్‌కు ఆయనే డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా మే 1వ తేదీ శుక్రవారం విడుదల కానున్న విషయం తెలిసిందే. సాధారణంగా కమల్‌హాసన్ నటించిన చిత్రాలు తెలుగులోకి డబ్ చేస్తే ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ఇస్తారు. '' ఉత్తమ విలన్ తెలుగు వెర్షన్‌కు కమల్ హాసన్ సర్ డబ్బింగ్ చెప్పారు. మొట్టమొదటిసారి తెలుగులో డబ్బింగ్ చెబుతున్నందున, ఈ విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. డబ్బింగ్ పూర్తి అయిన తరువాత, నచ్చక ఆయన రెండవసారి డబ్బింగ్ చెప్పారు'' అని సినిమా యూనిట్ వర్గాలు తెలిపాయి. రమేష్ అరవింద్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో కమల్‌హాసన్ 8వ శతాబ్ధపు థియేటర్ కళాకారుడిగా, నేటి సూపర్ స్టార్‌గా నటించారు. -
గణితశాస్త్ర స్నేహితుడు
సంక్షిప్తంగా... శ్రీనివాస రామానుజన్ త్రీ ఇడియెట్స్ ఆధారంగా వచ్చిన తెలుగు డబ్బింగ్ చిత్రం ‘స్నేహితుడు’లో పంచభట్ల సారంగపాణి అనే కుర్రాడు ఉంటాడు. బ్రిలియెంట్! బట్టీ పట్టడు. బుర్రకు పట్టించుకుంటాడు. పుస్తకాల్లోని ఈ సిద్ధాంతాలు, నిర్వచనాలు చదువును తేలికపరచాలి కానీ విద్యార్థుల్ని జడిపించి భారంగా నడిపించకూడదంటాడు! స్టూడెంటుగా సరిగ్గా అలాంటి వాడే శ్రీనివాస రామానుజన్. చిన్నప్పుడు వాళ్ల ఇల్లు కుంభకోణంలోని సారంగపాణి వీధిలో ఉండేది. పెంకుటింట్లో నివాసం. ఇప్పుడది రామానుజన్ మ్యూజియం. రామానుజన్ తల్లి గుడిలో పాటలు పాడేవారు. తండ్రి చీరల దుకాణంలో గుమస్తా. రామానుజానికి ఆయన దగ్గర చనువు లేదు. అందుకే అస్తమానం తల్లి చుట్టూ తిరిగేవాడు. ఆవిడే అన్నీ నేర్పేవారు. మంచీమర్యాద, పూజాపునస్కారం. ఇవన్నీ ఉండేవి కానీ సరైన తిండే ఉండేది కాదు. పేదరికం. పదేళ్ల వయసుకే రామానుజానికి తమిళం, ఆంగ్లం, గణితం, భూగోళశాస్త్రం పరిచయం అయ్యాయి. అయితే అతడు పూర్తిగా గణితం మాయలో పడిపోయింది మాత్రం ప్రాథమికోన్నత పాఠశాలలో. శ్రీనివాస రామానుజన్ తమిళనాడులోని ఈరోడ్‌లో 1887లో జన్మించారు. పద్నాలుగవ యేట గణితంలో అతడికి ఆసక్తి మొదలైంది. పాశ్చాత్య గణిత పండితులు యూలర్, జార్జి షూబ్రిడ్జ్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు కొత్త గణిత లోకాలకు శ్రీనివాసన్ కోసం దారులు పరిచాయి. అలా రామానుజన్ తనకు తానుగా 6,165 గణిత సూత్రాలను కనుక్కున్నారు. అతడికి వచ్చే సందేహాలను తీర్చే పుస్తకాలు అందుబాటులో లేకపోవడమే అతడి గణితప్రావీణ్యానికి కారణం అయింది! త్రికోణమితులు, బీజగణిత శ్రేణుల విశ్లేషణలో రామానుజన్ అన్ని పరిమితులను దాటుకుని ముందుకు వెళ్లారు. వివాహం అయ్యాక (1909) కూడా రామానుజన్ చిన్నా చితక ఉద్యోగాలు చూస్తూనే, గణితశాస్త్ర పరిశోధనలను కొనసాగించారు. ఆ క్రమంలోనే 1914లో కేంబ్రిడ్జ్ వెళ్లారు. భిన్నాలు, రేఖాగణిత సూత్రాల విశ్లేషణలకు తనను తను ఒక రఫ్బుక్గా మార్చుకుని గణితంలో ముప్ఫై రెండు పరిశోధనా పత్రాలు సమర్పించారు! ‘‘ఆయన ప్రతిభను కనుక ప్రపంచం మరి కాస్త ముందుగా గుర్తించినట్లయితే ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతుడైన గణిత మేధావిగా రామానుజన్ చరిత్రలో నిలిచిపోయేవారు’’ అని ఆంగ్ల గణితశాస్త్ర వేత్త జి.హెచ్.హార్డీ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. 1918లో రామానుజన్ కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజ్‌లో, రాయల్ సొసైటీలో ఫెలోషెప్కి ఎంపికయ్యారు. ఆ తర్వాతి ఏడాది ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. ఇండియా తిరిగి వచ్చేశారు. ముప్ఫై రెండేళ్ల వయసులో 1920 ఏప్రిల్ 26న ఆయన మరణించారు. రామానుజన్ ప్రతిపాదించిన కొన్ని అంశాలు ఇప్పటికీ పరిష్కారం కానట్లే, అంత చిన్న వయసులో దేవుడు ఆయన్ని తీసుకెళ్లడం గణితశాస్త్ర ప్రేమికులు ఎప్పటికీ జీర్ణించుకోలేని విధి వైపరీత్యం. రామానుజన్ శుద్ధ శాకాహారి. లండన్‌లో ఉన్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మాంసాహారం తప్ప సరైన శాకాహార భోజనం దొరక్క రామానుజన్ పౌష్టికాహార లోపానికి గురయ్యారు. అదే ఆయన మరణానికి కారణమైంది. రామానుజన్ 125వ జన్మదినం సందర్భంగా భారత ప్రభుత్వం డిసెంబర్ 22ను ‘నేషనల్ మేథమెటిక్స్ డే’గా ప్రకటించడం ద్వారా ఆయన కృషిని, పరిశోధనలను గౌరవించుకుంది.