అద్భుతమైన గ్రాఫిక్స్‌తో రానున్న 'మహాబలి'.. | Duniya Vijay Mahabali Ready To Release In Telugu | Sakshi
Sakshi News home page

Mahabali Movie: 'మహాబలి'గా రానున్న కన్నడ సూపర్‌ హిట్‌ చిత్రం..

Published Mon, Jul 11 2022 9:10 PM | Last Updated on Mon, Jul 11 2022 9:16 PM

Duniya Vijay Mahabali Ready To Release In Telugu - Sakshi

Mahabali Ready To Release In Telugu: ప్రముఖ కన్నడ హీరో దునియా విజయ్ హీరోగా డా. భారతి, కల్యాణి రాజు హీరోయిన్స్ గా కన్నడంలో రూపొందిన చిత్రం 'జయమ్మన మగ'.  ఈ చిత్రానికి రవికిరణ్ వికాస్ దర్శకత్వం వహించారు. ఇటీవలే రిలీజై సూపర్ డూపర్  హిట్ అయిన ఈ చిత్రం రూ. 35 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సెన్సేషన్ సృష్టించింది. ఈ చిత్రాన్ని శ్రీ జె.వి. ప్రొడక్షన్స్ పతాకంపై  ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత మార్డురి వెంకటరావు 'మహాబలి' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. 

నిర్మాత మార్డురి వెంకట్రావు మాట్లాడుతూ "100 పర్సెంట్ యాక్షన్ అండ్ లవ్ తో పాటు అద్భుతమైన గ్రాఫిక్స్ విజువల్ వండర్ గా కన్నడంలో రూపొందిన 'జయమ్మన మగ' చిత్రం సెన్సేషనల్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని మా శ్రీ జె. వి. ప్రొడక్షన్స్ బ్యానర్ లో 'మహాబలి' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాం. హార్రర్ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. శ్రీ జె.వి. ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఇది మరొక సూపర్ హిట్ చిత్రంగా నిలుస్తుందని బలంగా నమ్ముతున్నాను.  ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్య ఐదు పాటలు చాలా డిఫరెంట్ గా కంపోజ్ చేసాడు. అలాగే రీ రికార్డింగ్ అద్భుతంగా చేసాడు. దర్శకుడు రవికిరణ్ టేకింగ్, దునియా పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి హై లైట్ గా నిలిచాయి. భారతీబాబు మాటలు, పాటలు అద్భుతంగా రాసారు. త్వరలో ఆడియో రిలీజ్ చేసి అదే నెలలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని తెలిపారు. 

చదవండి: 'ఆర్‌ఆర్‌ఆర్‌'పై పోర్న్‌ స్టార్‌ ట్వీట్‌.. నెట్టింట జోరుగా చర్చ
నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్‌
ధనుష్‌ కోసం ఇండియా వస్తున్న హాలీవుడ్‌ దర్శకులు..


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement