
విభిన్నమైన కాన్సెప్ట్‌తో సినీ ఆడియెన్స్‌ను అలరిస్తోంది ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. స్టోరీ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తూనే సూపర్ హిట్ చిత్రాలను తెలుగులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే పలు హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేసిన ఆహా తాజాగా మరో సినిమాను తీసుకురానుంది.
Gultoo Movie Telugu Trailer: విభిన్నమైన కాన్సెప్ట్‌తో సినీ ఆడియెన్స్‌ను అలరిస్తోంది ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. స్టోరీ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తూనే సూపర్ హిట్ చిత్రాలను తెలుగులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే పలు హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేసిన ఆహా తాజాగా మరో సినిమాను తీసుకురానుంది. కన్నడలో సూపర్ హిట్ అందుకున్న సైబర్ క్రైమ్ థ్రిల్లర్ 'గుళ్టు' త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
కన్నడ యువ నటుడు జనార్దన్ చిక్కన్న ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఆహా వేదికగా జులై 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఆహా బృందం 'గుళ్టు' మూవీ ట్రైలర్‌ను బుధవారం (జులై 6) విడుదల చేసింది. 'ఆకలి కడుపులకు ఆశలెక్కువ. విశాలంగా పెరిగే మనసు, రోజు రోజుకీ పరిస్థితులకు లొంగిపోయి, కనీసం చిన్న చిన్న ఆశలకు కూడా చోటు లేనంతగా ముడుచుకుపోతుంది' అంటూ ప్రారంభమైన ఈ మూవీ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ఈ సినిమాకు ప్రధాన పాత్రలో నటించిన జనార్దన్ కథ, దర్శకత్వం వహించారు.