
మాలీవుడ్ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన విభిన్న కథా చిత్రం సోలో. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ రుద్ర, శివ, శేఖర్, త్రిలోక్ లు గా నాలుగు భిన్నమైన పాత్రల్లో కనిపించాడు. మాలీవుడ్ లో మంచి సక్సెస్‌సాధించిన ఈసినిమాను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. దుల్కర్ సరసన ధన్సిక, నేహ శర్మ, శ్రుతి హరిహరన్‌లు హీరోయిన్ లుగా నటించారు.
ఈ సినిమాను తెలుగులో వెంకట సాయి ప్రియాన్సి క్రియేషన్స్ బ్యానర్ పై మాస్టర్ వెంకట్ సాయి విశాల్ సమర్పణలో గాజుల వెంకటేష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పనులు శర వేగంగా జరుపుకుంటూ త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. బెజోయ్ నంబియార్ దర్శకత‍్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు గౌతమ్ కశ్యప్, ఉమర్జి అనురాధలు తెలుగు వర్షన్ మాటలు అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment