ఒక హీరో.. నాలుగు కథలు | Athade Telugu Movie Audio Launch | Sakshi
Sakshi News home page

ఒక హీరో.. నాలుగు కథలు

Published Thu, Jun 14 2018 12:07 AM | Last Updated on Thu, Jun 14 2018 12:07 AM

Athade Telugu Movie Audio Launch - Sakshi

నేహా శర్మ, దుల్కర్‌ సల్మాన్‌

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా బిజోయ్‌ నంబియార్‌ దర్శకత్వంలో మలయాళం, తమిళం భాషల్లో రూపొందిన చిత్రం ‘సోలో’ బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ సాధించింది. నేహా శర్మ, ధన్సిక కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో నాజర్, సుహాసిని కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని నిర్మాత గాజుల వెంకటేశ్‌ ‘అతడే’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకలో సీడీని నిర్మాత రాజ్‌కందుకూరి విడుదల చేసి, డాక్టర్‌ గౌతమ్‌ కశ్యప్, నిర్మాత వెంకటేశ్‌కు అందించారు. రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ– ‘‘4 వినూత్న కథలు ఈ సినిమాలో ఉంటాయి. అన్ని షేడ్స్‌లోనూ హీరో బాగా నటించారు. మూవీ చూస్తుంటే డబ్బింగ్‌ అనే ఫీలింగ్‌ కలగదు’’ అన్నారు. ‘‘ఎంతో ఇష్టపడి తీసుకున్న ఈ సినిమా తెలుగులో కూడా హిట్టవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు వెంకటేశ్‌. మాటల రచయిత గౌతమ్‌ కశ్యప్, లిరిక్‌ రైటర్‌ పూర్ణాచారి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement