CD release
-
చిన్న సినిమాలను ప్రోత్సహించాలి
‘‘సినిమా తీసే వరకే పెద్దది, చిన్నది అని నిర్మాత అనుకుంటాడు. హిట్ అయ్యాక ఏదైనా ఒకటే. చిన్న సినిమాలను ప్రోత్సహించాలనే ఈ వేడుకకు వచ్చా’’ అని నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. ఖయ్యూం, గౌరవ్ హీరోలుగా, మధులగ్నదాస్, అధియ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘డేంజర్ లవ్ స్టోరీ’. శేఖర్ చంద్ర దర్శకత్వంలో అవధూత లక్ష్మీ సమర్పణలో లక్ష్మీ కనకవర్షిణి క్రియేషన్స్‌పై అవధూత గోపాల్‌రావు నిర్మించారు. భానుప్రసాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని సి.కల్యాణ్ విడుదల చేసి, ప్రతాని రామకృష్ణ గౌడ్, సాయివెంకట్లకు అందించారు. ‘‘20 ఏళ్లుగా పలు సినిమాల్లో నటించిన అనుభవంతో ఈ సినిమా నిర్మించా. మా అబ్బాయి గౌరవ్ ఈ చిత్రంలో ఓ హీరోగా నటించాడు. ఆగస్టులో సినిమా రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు గోపాల్‌రావు. -
ఒక హీరో.. నాలుగు కథలు
దుల్కర్ సల్మాన్ హీరోగా బిజోయ్ నంబియార్ దర్శకత్వంలో మలయాళం, తమిళం భాషల్లో రూపొందిన చిత్రం ‘సోలో’ బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించింది. నేహా శర్మ, ధన్సిక కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో నాజర్, సుహాసిని కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని నిర్మాత గాజుల వెంకటేశ్ ‘అతడే’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకలో సీడీని నిర్మాత రాజ్‌కందుకూరి విడుదల చేసి, డాక్టర్ గౌతమ్ కశ్యప్, నిర్మాత వెంకటేశ్‌కు అందించారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘4 వినూత్న కథలు ఈ సినిమాలో ఉంటాయి. అన్ని షేడ్స్‌లోనూ హీరో బాగా నటించారు. మూవీ చూస్తుంటే డబ్బింగ్ అనే ఫీలింగ్ కలగదు’’ అన్నారు. ‘‘ఎంతో ఇష్టపడి తీసుకున్న ఈ సినిమా తెలుగులో కూడా హిట్టవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు వెంకటేశ్. మాటల రచయిత గౌతమ్ కశ్యప్, లిరిక్ రైటర్ పూర్ణాచారి పాల్గొన్నారు. -
ఓటమి భయంతో బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నాడో..
దొడ్డబళ్లాపురం: మాగడి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి బాలకృష్ణ తనకు సంబంధించిన సీడీ ఏదో విడుదల చేస్తానని బెదిరిస్తున్నాడని, బహుశా అది నా మొదటి సినిమా జాగ్వార్ సీడీనే అయ్యుంటుందని కుమారస్వామి కుమారుడు నిఖిల్‌గౌడ ఎద్దేవా చేసాడు. శుక్రవారం మాగడి పట్టణంలో రోడ్‌షో నిర్వహించి జేడీఎస్ అభ్యర్థి ఎ మంజుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసిన నిఖిల్ ఈ సందర్భంగా బాలకృష్ణ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ప్రసంగించారు. తాను సీడీలు విడుదల చేసేంత గొప్ప పనులు ఏం చేయలేదన్నారు. ఓటమి భయంతో బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలీడంలేదన్నారు. అందుకే జేడీఎస్ అభ్యర్థి క్రమ సంఖ్యలను మార్పు చేసి తప్పుడు పప్రచారం చేస్తూ ఓటర్లను తప్పుదారి పట్టించాలని చూస్తున్నాడని, ఓటర్లు ఓటు వేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. ఇందుకు సంబంధించి క్రిమినల్ కేసు నమోదు చేస్తామని చెప్పారు. -
మనమూ ముడుపులిచ్చాం కదా!
► బీజేపీ నేత యడ్యూరప్ప, కేంద్ర మంత్రి అనంత్ సంభాషణ! ► సీడీ విడుదల చేసిన కర్ణాటక మంత్రులు సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన విపక్షమైన బీజేపీ మధ్య ఎత్తుకు పైఎత్తులతో రాజకీ యం జోరుగా సాగుతోంది. సీఎం సిద్ధరామయ్య పదవిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పెద్దలకు రూ. వెయ్యికోట్ల ముడుపులిచ్చాడని, ఆ డైరీ ఈడీ వద్ద ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ఆరోపించడం, ఆయనపై పరువునష్టం దావావేస్తానని సీఎం ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మంత్రులు బసవరాజ రాయ రెడ్డి, ఎంబీ పాటిల్, రమేష్‌కుమార్ సోమవారం విధానసౌధలో ఒక చేశారు. యడ్యూరప్ప, కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌లు ఆదివారం బెంగళూరు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. అందులో సిద్ధరామయ్యపై ఆరోపణలు చేసి భలే ఇరికించారని అనం త్.. యడ్యూరప్పతో అంటారు. మీరు, నేను కూడా పార్టీ పెద్దలకు ముడుపులు ఇచ్చాం కదా.. అని అనంత్‌కుమార్ మళ్లీ అంటారు. యడ్యూరప్ప స్పందిస్తూ ఎంత ఇచ్చినా ఎవరైనా డైరీలో రాస్తారా? అని సమాధానం ఇస్తారు. ఈ సంభాషణపై సుప్రీంకోర్టు జడ్జితో దర్యాప్తు చేయించాల ని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. సీడీ విషయంపై అనంత్‌కుమార్, యడ్యూరప్ప స్పందిస్తూ.. తాము మాట్లాడిన పూర్తి మాటలను కాకుండా అక్కడొక పదం, ఇక్కడొక పదం తీసి సీడీని రూపొందించారని ఆరోపించారు. -
పాటను దృశ్యంతో చూపడం అభినందనీయం
ప్రముఖ సాహితీవేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజమహేంద్రవరం రూరల్ : మాట కంటే పాట మధురమైనది, ఆ పాటను దృశ్యంతో చూపడం అభినందనీయమని ప్రముఖ సాహితీ వేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. శనివారం బొమ్మూరులోని తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్యపీఠంలో ‘పుష్కరాలు వచ్చెనమ్మ కృష్ణవేణికి’ ప్రత్యేక గీతం సీడీని ఆయన ఆవిష్కరించారు. కడప జిల్లాకు చెందిన గండ్లూరినారాయణరావు గేయరచన చేయగా, ఇరిగేషన్ ఉద్యోగి జివి.రమణ, సురేఖామూర్తి నేపథ్యగానం అందించారు. ఈసందర్బంగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ కృష్ణాపుష్కరాలకు సంబంధించిన ఈ పాట పిల్లలకు విజ్ఞానదాయకంగా ఉంటుందన్నారు. పాటతోపాటు కృష్ణానది విశిష్టతను తెలిపే దృశ్యాలను కూడా సీడీలో పొందుపరచడం అభినందనీయం అన్నారు. అనంతరం నేపథ్య గాయకుడు జివి.రమణను అభినందించారు. డాక్టర్ యార్లగడ్డను జీవీరమణ శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సాహిత్యపీఠం పీఠాధిపతి డాక్టర్ ఎండ్లూరి సుధాకర్, ప్రముఖ సేవకులు పట్టపగలు వెంకట్రావు, సీనియర్ పాత్రికేయులు సన్నిధానం శాస్త్రి, ఎస్ బ్యాంక్ మేనేజర్ ఘంటసాల శ్యామలకుమారి తదితరులు పాల్గొన్నారు.