మనమూ ముడుపులిచ్చాం కదా! | Congress fires CD missile to counter BSY diary bomb | Sakshi
Sakshi News home page

మనమూ ముడుపులిచ్చాం కదా!

Published Tue, Feb 14 2017 1:32 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

మనమూ ముడుపులిచ్చాం కదా! - Sakshi

మనమూ ముడుపులిచ్చాం కదా!

► బీజేపీ నేత యడ్యూరప్ప, కేంద్ర మంత్రి అనంత్‌ సంభాషణ!
► సీడీ విడుదల చేసిన కర్ణాటక మంత్రులు

సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన విపక్షమైన బీజేపీ మధ్య ఎత్తుకు పైఎత్తులతో రాజకీ యం జోరుగా సాగుతోంది. సీఎం సిద్ధరామయ్య పదవిని కాపాడుకోవడానికి కాంగ్రెస్‌ పెద్దలకు రూ. వెయ్యికోట్ల ముడుపులిచ్చాడని, ఆ డైరీ ఈడీ వద్ద ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప ఆరోపించడం, ఆయనపై పరువునష్టం దావావేస్తానని సీఎం ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ మంత్రులు బసవరాజ రాయ రెడ్డి, ఎంబీ పాటిల్, రమేష్‌కుమార్‌ సోమవారం విధానసౌధలో ఒక   చేశారు.

యడ్యూరప్ప, కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌లు ఆదివారం బెంగళూరు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. అందులో సిద్ధరామయ్యపై ఆరోపణలు చేసి భలే ఇరికించారని అనం త్‌.. యడ్యూరప్పతో అంటారు. మీరు, నేను కూడా పార్టీ పెద్దలకు ముడుపులు ఇచ్చాం కదా.. అని అనంత్‌కుమార్‌ మళ్లీ అంటారు. యడ్యూరప్ప స్పందిస్తూ ఎంత ఇచ్చినా ఎవరైనా డైరీలో రాస్తారా? అని సమాధానం ఇస్తారు. ఈ సంభాషణపై సుప్రీంకోర్టు జడ్జితో దర్యాప్తు చేయించాల ని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. సీడీ విషయంపై అనంత్‌కుమార్, యడ్యూరప్ప స్పందిస్తూ.. తాము మాట్లాడిన పూర్తి మాటలను కాకుండా అక్కడొక పదం, ఇక్కడొక పదం తీసి సీడీని రూపొందించారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement