చిన్న సినిమాలను ప్రోత్సహించాలి | Danger Love Story Audio Launch Movie Launch and Press Meet | Sakshi
Sakshi News home page

చిన్న సినిమాలను ప్రోత్సహించాలి

Jul 17 2018 12:33 AM | Updated on Jul 17 2018 12:33 AM

Danger Love Story Audio Launch Movie Launch and Press Meet - Sakshi

మధులగ్నదాస్, ఖయ్యూం

‘‘సినిమా తీసే వరకే పెద్దది, చిన్నది అని నిర్మాత అనుకుంటాడు. హిట్‌ అయ్యాక ఏదైనా ఒకటే. చిన్న సినిమాలను ప్రోత్సహించాలనే ఈ వేడుకకు వచ్చా’’ అని నిర్మాత సి. కల్యాణ్‌ అన్నారు. ఖయ్యూం, గౌరవ్‌ హీరోలుగా, మధులగ్నదాస్, అధియ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘డేంజర్‌ లవ్‌ స్టోరీ’.

శేఖర్‌ చంద్ర దర్శకత్వంలో అవధూత లక్ష్మీ సమర్పణలో లక్ష్మీ కనకవర్షిణి క్రియేషన్స్‌పై అవధూత గోపాల్‌రావు నిర్మించారు. భానుప్రసాద్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని సి.కల్యాణ్‌ విడుదల చేసి, ప్రతాని రామకృష్ణ గౌడ్, సాయివెంకట్‌లకు అందించారు. ‘‘20 ఏళ్లుగా పలు సినిమాల్లో నటించిన అనుభవంతో ఈ సినిమా నిర్మించా. మా అబ్బాయి గౌరవ్‌ ఈ చిత్రంలో ఓ హీరోగా నటించాడు. ఆగస్టులో సినిమా రిలీజ్‌ చేయనున్నాం’’ అన్నారు గోపాల్‌రావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement