Madhulagnadas
-
చిన్న సినిమాలను ప్రోత్సహించాలి
‘‘సినిమా తీసే వరకే పెద్దది, చిన్నది అని నిర్మాత అనుకుంటాడు. హిట్ అయ్యాక ఏదైనా ఒకటే. చిన్న సినిమాలను ప్రోత్సహించాలనే ఈ వేడుకకు వచ్చా’’ అని నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. ఖయ్యూం, గౌరవ్ హీరోలుగా, మధులగ్నదాస్, అధియ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘డేంజర్ లవ్ స్టోరీ’. శేఖర్ చంద్ర దర్శకత్వంలో అవధూత లక్ష్మీ సమర్పణలో లక్ష్మీ కనకవర్షిణి క్రియేషన్స్‌పై అవధూత గోపాల్‌రావు నిర్మించారు. భానుప్రసాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని సి.కల్యాణ్ విడుదల చేసి, ప్రతాని రామకృష్ణ గౌడ్, సాయివెంకట్లకు అందించారు. ‘‘20 ఏళ్లుగా పలు సినిమాల్లో నటించిన అనుభవంతో ఈ సినిమా నిర్మించా. మా అబ్బాయి గౌరవ్ ఈ చిత్రంలో ఓ హీరోగా నటించాడు. ఆగస్టులో సినిమా రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు గోపాల్‌రావు. -
వినూత్న కథాంశంతో...
మధులగ్నదాస్, ఐశ్వర్య, సూర్యతేజ, రమణలాల్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘అందాల చందమామ’. కేయస్ మూర్తి దర్శకత్వంలో పీడీఆర్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వై. సునీల్ పాటలు స్వరపరిచారు. ఆడియో సీడీని చిన్ని చరణ్, ప్రచార చిత్రాన్ని మల్టీడైమన్షన్ వాసు ఆవిష్కరించారు. ఇది థ్రిల్లర్ మూవీ అనీ, సునీల్ స్వరపరచిన పాటలు హైలైట్‌గా నిలుస్తాయనీ దర్శకుడు తెలిపారు. ఓ వినూత్న కథాంశంతో రూపొందించిన ఈ చిత్రంలో అన్ని వర్గాలవారినీ ఆకటుకునే అంశాలున్నాయని నిర్మాత చెప్పారు. -
ఫ్యాషన్ ఫర్ ఏ కాజ్
సోషలైట్స్, డాక్టర్లు, వివిధ సంస్థల నిర్వాహకులు... మోడల్స్‌ను తలదన్నేలా ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేసి అదరగొట్టారు. అందాల తార వుధులగ్నాదాస్ షో స్టాపర్‌గా ప్రత్యక్షమై మైవురిపించింది. మోహన్ ఫౌండేషన్ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం సోమాజిగూడ హోటల్ కత్రియూలో నిర్వహించిన ‘ఫ్యాషన్ ఫర్ ఏ కాజ్’ సరికొత్త అనుభూతి పంచింది. యాంకర్ ఝాన్సీతో పాటు ఫౌండేషన్ నిర్వాహకులు సుమన, పల్లవికుమార్, డిజైనర్ ప్రత్యూష తదితరులు హంస నడకలతో అలరించారు.