
ఖయ్యూం,అథియా
రెండు ప్రేమ జంటలు తమ ప్రేమ ప్రమాదంలో పడిన ప్పుడు కాపాడుకునేందుకు ఎలా ముందుకు సాగారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘డేంజర్ లవ్ స్టోరీ’. ఖయ్యూం (అలీ తమ్ముడు), మధులగ్నదాస్, గౌరవ్, అథియా హీరో హీరోయిన్లుగా శేఖర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కింది. లక్ష్మీకనక వర్షిణి క్రియేషన్స్ పతాకంపై అవధూత గోపాలరావు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 26న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ప్రెస్‌మీట్‌లో సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ– ‘‘భిన్నమైన టైటిల్ ఇది.
వైవిధ్యభరితమైన కథాంశంతో నేటి ప్రేక్షకులను అలరింపజేసేలా రూపొందించిన ఇలాంటి చిత్రాలు విజయవంతం కావాలి’’ అన్నారు. ‘‘ఇలాంటి చిన్న సినిమాలు బతికినపుడే పరిశ్రమ కళకళలాడుతూ ఉంటుంది’’ అన్నారు నటి కవిత. ‘‘హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించాం. గోవా, కొల్హాపూర్, నిజామాబాద్ తదితర లొకేషన్లలో షూటింగ్ చేశాం’’ అని అవధూత గోపాలరావు అన్నారు. ‘‘ఊహించని మలుపులతో ఆసక్తికర కథాంశంతో సాగే చిత్రమిది. ఇప్పటి వరకు ఎన్నో ప్రేమకథలు వచ్చినప్పటికీ ఇది భిన్నంగా ఉంటుంది. సస్పెన్స్, హారర్‌తో పాటు మంచి వినోదం ఉంటుంది’’ అని శేఖర్ చంద్ర చెప్పారు. గౌరవ్, అథియా, నటుడు డా.సకారం, నైజాం డిస్ట్రిబ్యూటర్ రాజేందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment