చెర్రీ, రితేష్ రానా, శ్రీసింహా, అడివి శేష్, అతుల్య, రవిశంకర్
కీరవాణి తనయులు శ్రీసింహా హీరోగా, కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమైన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ రానా దర్శకత్వంలో చెర్రీ (చిరంజీవి), హేమలత నిర్మించారు. డిసెంబర్‌లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో ప్రదర్శితం అవుతోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘కంటెంట్ ఈజ్ కింగ్’ ప్రెస్‌మీట్‌లో నటుడు అడివి శేష్, దర్శకులు వివేక్ ఆత్రేయ, స్వరూప్ అతిథులుగా పాల్గొన్నారు. శ్రీసింహా మాట్లాడుతూ – ‘‘మా సినిమాకి ఇంత మంచి స్పందన వస్తుందని ఊహించలేదు. ఈ ప్రోత్సాహంతో ఇంకా మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాం. 2020ని సక్సెస్‌ఫుల్‌గా ప్రారంభించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు.
‘‘కీరవాణిగారబ్బాయి అనే టెన్షన్ నా మైండ్‌లో లేదు. పాటలు ఉన్నాయా? లేదా అని ఆలోచించలేదు. కథకి కావాల్సింది చేశాం. ఇదంతా మా టీమ్ విజయం’’ అన్నారు కాలభైరవ. ‘‘ఏ సినిమాకైనా కంటెంట్ ఈజ్ కింగ్. మా సినిమాకి మౌత్ పబ్లిసిటీ హెల్ప్ అయింది. అందరికీ పేరు రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు రితేష్ రానా. ‘‘రొటీన్‌కు భిన్నంగా ఉండటంతో మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. ఈ సక్సెస్‌కి ఆనందమే కాదు గర్వంగానూ ఉంది. సినిమా కాన్సెప్ట్ బావుంటే చిన్నా పెద్దా తేడా ఉండదు. ప్రేక్షకులు ఆదరిస్తారు’’ అన్నారు చెర్రీ. ‘‘పెట్టినదానికి రెండింతల లాభం వస్తే బ్లాక్‌బస్టర్ సినిమా అంటారు. మా సినిమా బ్లాక్‌బస్టర్. టీమ్ బాగా కష్టపడ్డారు. బడ్జెట్ అదుపులో ఉండేలా చూసుకు న్నారు. ఇది వాళ్ల సక్సెస్’’ అన్నారు రవిశంకర్.
Comments
Please login to add a commentAdd a comment