Kalabhairava
-
వారు లేకపోయుంటే ఇది జరిగేదే కాదు: కాలభైరవ పోస్ట్‌పై ఫైర్
మంచి ట్యూన్ పడితే పాట దానంతటదే వస్తుంది. కానీ ఆ పాట అందరికీ అర్థమవుతూనే ప్రజల మనసులో చోటు సంపాదించుకోవాలంటే మంచి లిరిక్స్ ఉండాలి. ఈ పాటకు ప్రాణం పోయాలంటే దీన్ని అద్భుతంగా పాడే సింగర్స్ కావాలి. తెరపై మెరుగ్గా కనిపించాలంటే స్టేజీ దద్దరిల్లేలా స్టెప్పులేసే డ్యాన్సర్లు కావాలి. ఇవన్నీ నాటు నాటు పాటకు సరిగ్గా సరిపోయాయి. కీరవాణి సంగీతం, చంద్రబోస్ లిరిక్స్.. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ గాత్రం.. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ.. తారక్, చరణ్ డ్యాన్స్ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి కాబట్టే అందరికీ తెగ నచ్చేసింది. ఆస్కార్ సైతం మన ఒడిలో వచ్చి చేరింది. బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరీలో అకాడమీ అవార్డు సాధించడంపై తాజాగా సింగర్ కాలభైరవ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. 'RRRకు ఆస్కార్ రావడం, అంత పెద్ద వేదికపై లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వడం.. నాకెంతో సంతోషంగా ఉంది. నేను ఆ వేదికపై పాడానంటే అందుకు డైరెక్టర్ రాజమౌళి, నాన్న(కీరవాణి), కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్, కార్తికేయ అన్న, అమ్మ, పెద్దమ్మ.. వీళ్లంతా ముఖ్య కారణం. వీళ్ల కృషి వల్లే ఆ పాట ప్రపంచం నలుమూలలకూ వెళ్లి అందరితో స్టెప్పులేయించింది. వారు లేకుంటే ఈ అందమైన అనుభూతి పొందే అవకాశం నాకు దక్కేదే కాదు. ఆర్ఆర్ఆర్లో పాలు పంచుకునే ఛాన్స్ ఇచ్చినందుకు నేను అదృష్టవంతుడిని' అని రాసుకొచ్చాడు కాలభైరవ. అందరికీ క్రెడిట్ ఇచ్చావు కానీ హీరోలు ఏం చేశారు? అంటే నీ ఫ్యామిలీ మాత్రమే గొప్పనా? తారక్, చరణ్ డ్యాన్స్ లేకపోయుంటే ఆ పాట అంతదూరం వెళ్లేదే కాదు అని కామెంట్లు పెడుతున్నారు. దీంతో కాలభైవర తన పోస్ట్‌పై వివరణ ఇచ్చాడు. 'తారక్, చరణ్ అన్నల వల్లే నాటు నాటు పాట ఇంత సక్సెస్ అయిందన్న విషయంలో ఎటువంటి అనుమానం లేదు. నేను కేవలం అకాడమీ వేదికపై పాడటానికి సహకరించినవారి గురించి మాత్రమే ప్రత్యేకంగా ప్రస్తావించాను తప్ప అంతకుమించేమీ లేదు. కానీ ఇది మీకు వేరేలా అర్థమైంది. ఇది తప్పుగా వెళ్లినందుకు నన్ను క్షమించండి' అని ట్వీట్ చేశాడు. I have no doubt Tarak anna and Charan anna are the reason for the success of naatu naatu and RRR itself. I was ONLY talking about who all helped me get my opportunity for the academy stage performance. Nothing else. I can see that it was conveyed wrongly and for that, I… https://t.co/Je17ZDqthj — Kaala Bhairava (@kaalabhairava7) March 17, 2023 -
ఆస్కార్ లైవ్‌లో నాటునాటు పాట.. అగ్గిరాజేసుడే ఇగ!
మరికొద్ది రోజుల్లో ప్రపంచమే ఎదురు చూస్తున్న ఆస్కార్ సినీ వేడుక జరుగబోతోంది. ఈసారి అందరి దృష్టి ఆర్ఆర్ఆర్ మీదే ఉంది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, రివార్డులతో మోత మోగించిన ఈ మూవీ ఆస్కార్‌ను ఎగరేసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ నుంచి నాటునాటు పాట బెస్ట్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్ అయిన విషయం తెలిసిందే! తాజాగా ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్ చెప్పింది ఆస్కార్ టీమ్. ఈ నెల 12న జరగబోయే 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో సింగర్లు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ నాటు నాటు పాటను లైవ్‌లో పాడనున్నట్లు తెలిపింది. ఈ విషయం తెలిసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంకేముంది... మన సింగర్లు స్టేజీపై అగ్గిరాజేయడం ఖాయం. వీరి పాటకు అక్కడున్నవాళ్లకు ఊపు రావడమూ తథ్యం. అంత పెద్ద వేదికపై పాడటం, అది కూడా తెలుగు పాట కావడం గర్వించదగ్గ విషయం. ఈ విషయంపై రాహుల్ సిప్లిగంజ్ స్పందిస్తూ.. 'ఆస్కార్ వేదికపై లైవ్ పర్ఫామెన్స్.. కచ్చితంగా ఇవి నా జీవితంలో మర్చిపోలేని క్షణాలుగా మిగిలిపోతాయి' అని సంతోషం వ్యక్తం చేశాడు. Rahul Sipligunj and Kaala Bhairava. “Naatu Naatu." LIVE at the 95th Oscars. Tune into ABC to watch the Oscars LIVE on Sunday, March 12th at 8e/5p! #Oscars95 pic.twitter.com/8FC7gJQbJs — The Academy (@TheAcademy) February 28, 2023 This is going to be unforgettable moment in my life🔥🔥😎 https://t.co/Me1sCKSMxY — Rahul Sipligunj (@Rahulsipligunj) February 28, 2023 చదవండి: మా నాన్న కంటే నా భార్యకే ఎక్కువగా భయపడతా: మంచు విష్ణు -
ఆయనతో పని చేయాలన్నది నా కల
‘‘స్టూడెంట్ నెం 1’ నుంచి తారక్‌తో (జూనియర్ ఎన్టీఆర్) మా అనుబంధం కొనసాగుతోంది. అందుకే ‘తెల్లవారితే గురువారం’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో భావోద్వేగంతో మాట్లాడారు.. ఎప్పటికైనా ఆయన సినిమాకి సంగీతం అందించాలన్నది నా కల’’ అని సంగీత దర్శకుడు కాలభైరవ అన్నారు. కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహా కోడూరి హీరోగా, చిత్రా శుక్లా, మిషా నారంగ్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. కీరవాణి మొదటి కుమారుడు కాలభైరవ సంగీతదర్శకుడు. మణికాంత్ దర్శకత్వం వహించారు. సాయి కొర్రపాటి సమర్పణలో రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించిన ఈ సినిమా రేపు (శనివారం) రిలీజవుతోంది. కాలభైరవ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పటి నుంచి నాకు సంగీతం అంటే, తమ్ముడికి నటనంటే ఇష్టం. అందుకే బాల నటుడిగా ‘యమదొంగ, విక్రమార్కుడు, మర్యాద రామన్న, ఈగ’ వంటి చిత్రాల్లో నటించాడు. నటనలో శిక్షణ తీసుకున్నాడు. సంగీత దర్శకుడిగా నేను, హీరోగా సింహా ఒకే సినిమాతో (‘మత్తు వదలరా’) పరిచయమవుతామని ఊహించలేదు. తన రెండో సినిమాకి (‘తెల్లవారితే గురువారం’) కూడా నేనే సంగీతం అందిస్తాననుకోలేదు. సింహా నటించనున్న మూడో చిత్రానికి కూడా నేనే మ్యూజిక్ డైరెక్టర్. ఒక్క రాత్రిలో జరిగే కథే ‘తెల్లవారితే గురువారం’. మణికాంత్ వినోదాత్మకంగా తెరకెక్కించాడు. ప్రస్తుతం ‘లక్ష్య, గుర్తుందా శీతాకాలం, కార్తికేయ 2’ సినిమాలు చేస్తున్నాను. అలాగే నివేదా పేతురాజ్ నటిస్తున్న ఓ వెబ్ మూవీకి కూడా సంగీతం అందిస్తున్నాను. వీటితో పాటు మరో రెండు సినిమాలున్నాయి’’ అన్నారు. -
ఉనకోటిలో 30 అడుగుల కాలభైరవ విగ్రహం
నేల మీది కైలాసం ఉనకోటి... కోటికి ఒకటి తక్కువ. ఇది లెక్క మాత్రమే కాదు. ఓ ప్రదేశం కూడా. హిమాలయ శ్రేణుల పాదాల చెంత ఉంది. త్రిపుర రాష్ట్రంలో అందమైన పర్యాటక ప్రదేశమిది. త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తల నగరానికి 178 కి.మీ.ల దూరంలో ‘కైలాస్‌హర’ అనే పట్టణానికి దగ్గరగా ఉంది ఉనకోటి. జనారణ్యానికి దూరంగా వెళ్లే కొద్దీ చెట్లు చేమలు నిండిన పచ్చటి కొండలు బారులుతీరి ఉంటాయి. పచ్చదనం లోపించిన కొండరాయిలో అందమైన రూపాలు కనువిందు చేస్తాయి. విఘ్నేశ్వరుడు, ఈశ్వరుడు, దుర్గాదేవి, గంగ, ఇతర కైలాసగణమంతా కొలువుదీరినట్లు ఉంటుంది. ఇంతటి భారీ శిల్పాలను ఎప్పుడు చెక్కారో, ఎవరు చెక్కారో, ఎలా చెక్కారో? అన్నింటినీ చూడలేం... ఇక్కడి శివుడి పేరు ఉనకోటేశ్వర కాలభైరవ విగ్రహం 30 అడుగుల ఎత్తు ఉంటుంది. శివుడికి రెండు వైపులా సింహవాహనం మీద దుర్గాదేవి, గంగామాత శిల్పాలుంటాయి. నేలలో కూరుకుపోయిన నంది విగ్రహం, మౌనముద్రలో గణేశుడు, ఇంకా పేరు తెలియన అనేక శిల్పాలు కొన్ని ఎకరాల విస్తీర్ణంలో పరుచుకుని ఉన్నాయి. ప్రధానమైన వాటిని చూడడంతోనే శక్తి తగ్గిపోతుంది. కొన్ని శిల్పాలను సమీప గ్రామాల వాళ్లు ఇళ్లకు పట్టుకుపోగా మిగిలిన వాటి కోసం ఇండియన్ ఆర్కియాలజీ సర్వే నోటిస్ బోర్డు పెట్టింది. ఇంకా విగ్రహాలున్నయోమోనని అడవిని గాలిస్తోంది. ఇది హెరిటేజ్ సైట్. భవిష్యత్తులో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ల ప్రామాణిక పట్టికలో చేరి తీరుతుంది. ప్రపంచం గుర్తించేలోపే ఉనకోటిని చూసేశామంటే... ‘వరల్ట్ హెరిటేజ్ సైట్’ అనే ట్యాగ్‌లైన్ చేరిన రోజు ‘ఎప్పుడో చూసేశాం’ అని మన భుజాన్ని మనమే చరుచుకోవచ్చు. ఎవరు చెక్కారంటే... ‘కల్లు కుమ్హార్’ అనే గిరిజన శిల్పకారుడు ఈ శిల్పాలను చెక్కినట్లు స్థానికులు చెబుతారు. అతడు పార్వతి భక్తుడని, కైలాసాన్ని కళ్లకు కట్టడానికే ఈ శిల్పాలను చెక్కాడని చెబుతారు. క్రీ.శ 16వ శతాబ్దంలో కాలాపహాడ్ అనే మొఘలు గవర్నర్ భువనేశ్వర్‌లోని శివుడిని, ఉనకోటికి సమీపంలో ఉన్న తుంగేశ్వర శివుడిని ధ్వంసం చేసినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ప్రదేశం మీద దాడిచేయడానికి అతడు చేసిన ప్రయత్నం కుదరక వదిలేసినట్లు చెబుతారు. ఇక్కడ ఏటా ఏప్రిల్ మాసంలో జరిగే ‘అశోకాష్టమి మేళా’లో వేలాదిగా భక్తులు పాల్గొంటారు. సమీప విమానాశ్రయం అగర్తలలో ఉంది. రైల్వేస్టేషన్ కుమార్‌ఘాట్‌లో ఉంది. కుమార్‌ఘాట్‌కు ఉనకోటి 20 కి.మీ.ల దూరాన ఉంది. జనపథ కథనం ఒకానొకప్పుడు శివుడితోపాటు కోటిమంది కైలాసగణం కాశీయాత్రకు బయలుదేరింది. ఆ ప్రయాణంలో ఈ ప్రదేశానికి వచ్చేసరికి సంజెచీకట్లు అలముకున్నాయి. ప్రయాణం కష్టమైంది. దాంతో ఆ రాత్రికి ఈ అడవిలోనే విశ్రమించారంతా. తెల్లవారక ముందే నిద్రలేచి ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టాలని, ఆలస్యమైతే రాళ్లలా మారిపోతారని, నిద్రకుపక్రమించే ముందు శివుడు అందరినీ హెచ్చరిస్తాడు. చెప్పిన సమయానికి శివుడు తప్ప మరెవరూ నిద్రలేవలేకపోవడంతో మిగిలిన వారంతా శిలలుగా మారిపోయారు. కోటి మంది బృందంలో శివుడు మినహా మిగిలిన వారంతా శిలలు కావడంతో ఈ ప్రదేశానికి ‘ఉనకోటి’ అనే పేరు వాడుకలోకి వచ్చింది– అని స్థానికులు ఆసక్తికరమైన కథనం చెబుతారు. ఆ కథనం ప్రకారమైతే అక్కడ శివుడి శిల్పం ఉండకూడదు, కానీ ఇక్కడ శివుడి శిల్పం కూడా ఉంటుంది. పైగా దేశంలోకే అత్యంత పెద్ద శివుడి శిల్పం ఇదేనని కూడా చెబుతారు. వాస్తవాల అన్వేషణకు పోకుండా ఆ శిల్పాల నైపుణ్యాన్ని ఆస్వాదిస్తే ఈ టూర్ మధురానుభూతిగా మిగులుతుంది. -
శివుని భయంకరమైన రూపమే ఈ అవతారం
న్యూఢిల్లీ: కాల భైరవ జయంతిని శివుని భక్తులు పవిత్రమైన రోజుగా భావిస్తారు. కాల భైరవ జయంతిని నేడు అన్ని ప్రాంతాలలో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం మార్గశిర (హిందూ క్యాలెండర్ కార్తీక మాసం తర్వాత నెల) కృష్ణ పక్షంలో కాల భైరవ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. కాలభైరవుడు శివుని భయంకరమైన రూపం. ఈ జయంతిని కాల భైరవ అష్టమి అని కూడా పిలుస్తారు. కాల భైరవుని ఆరాధించడం ద్వారా ధైర్యం, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. సాధారణ నైవేద్యాలతో సులభంగా సంతోషించే శివుడి రూపమే కాల భైరవ అవతారం. భైరవుడు కుక్క మీద కూర్చున్నందున, భక్తులు కుక్కలకు ప్రసాదాన్ని తినిపిస్తారు. హల్వా పూరీని నైవేద్యంగా సమర్పిస్తారు. శనివారాన్ని ఈయన పర్వ దినంగా భావించి కొలుస్తారు. జయంతి నిర్వహించే సమయం అష్టమి తిథి ప్రారంభం: ఈ రోజు సాయంత్రం 6:47 నిమిషాలు అష్టమి తిథి ముగింపు: రేపు సాయంత్రం 5:17 నిమిషాలు కాల భైరవుని ప్రాముఖ్యత కాల భైరవునికి హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం, శివుని ఈ రూపం భయాన్ని దూరం చేస్తుంది. దురాశ, కోపం, కామాన్ని జయించవచ్చని భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం దేవతలు, అసురుల మధ్య జరిగిన యుద్ధంలో రాక్షస వినాశనం కొరకు శివుడు కాల భైరవున్ని సృష్టించాడు. తరువాత అష్ట భైరవులు సృష్టించబడ్డారు. వీరు భయంకరమైన రూపం కలిగిన అష్టా మాత్రికలను వివాహం చేసుకున్నారు. ఈ అష్ట భైరవులు, అష్టా మాత్రికల నుంచి 64 మంది భైరవులు, 64 యోగినిలు సృష్టించబడ్డారు. ఒకప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు గొప్పవారో నిరూపించడానికి చర్చించారని, చర్చ మధ్యలో బ్రహ్మ.. శివుడిని విభేదించడంతో అతని కోపంతో కాల భైరవుడు జన్మించాడని ఒక నమ్మకం. భారత్‌లో ప్రసిద్ధ కాల భైరవ మందిరాలు ►కాల భైరవ ఆలయాలు సాధారణంగా దేశంలోని శక్తిపీఠాలు, జ్యోతిర్లింగ దేవాలయాల చుట్టూ కనిపిస్తాయి. ►షిప్రా నది ఒడ్డున ఉన్న ఉజ్జయిని కాల భైరవ ఆలయం ప్రత్యేకమైనది. భక్తులు దేవతకు మద్యం ఆర్పిస్తారు. ►వారణాసిలోని కాల భైరవ మందిరాన్ని వారణాసి యొక్క కొత్వాల్ అని నమ్ముతారు, ఇది తప్పక చూడవలసిన ప్రదేశాలలో ఒకటి. ►కాలభైరవేశ్వర కర్ణాటకలోని ఒక పురాతన ఆలయం, దీనిని ఆదిచుంచనగిరి కొండలలోని కాలభైరవేశ్వర క్షేత్ర పాలక అని పిలుస్తారు. ►ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాలోని అజైకాపాడ భైరవ ఆలయం ఒడిశాలోని ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి ►తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని కలభైరవర్ ఆలయం కాల భైరవ రూపానికి అంకితం చేయబడింది. ►రాజస్థాన్‌లో జుంజూన్ జిల్లాలోని చోముఖ భైరవ ఆలయం శైవుల ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి. ►మధ్యప్రదేశ్‌లోని అడెగావ్లోని శ్రీ కాల భైరవనాథ్ స్వామి ఆలయం దేశ నలుమూలల నుంచే కాకుండా నేపాల్‌తో సహా దేశాలు సందర్శించే పవిత్ర ప్రదేశం. ►భారతదేశంలోని కాల భైరవ దేవాలయాలు సాధారణ శివాలయాలకు భిన్నంగా ఉంటాయి. నైవేద్యాలు కూడా ప్రత్యేకమైనవి. -
‘కాలభైరవ’ కేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, కర్నూలు: సంచలన కేసును ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. పూల దండ ఆధారంగా కూపీ లాగి దుండగుడిని కటకటాల వెనక్కి పంపారు. పోలీస్ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. ఆళ్లగడ్డ మండలం చిన్నకందుకూరు గ్రామ పొలిమేరలోని కాలభైరవ స్వామి ఆలయంలో మూలవిరాట్ అంగ భాగాన్ని దొంగలించినట్లు ఈ నెల 19వ తేదీన పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసుకొని.. చిన్నకందుకూరుకు వెళ్లి పూజారులను, ఆలయ కమిటీ సభ్యులను విచారించారు. నేరం జరిగిన రోజు గుడి వాకిలికి పూలదండ వేసినట్లు గమనించారు. దానిని ఎవరు తయారు చేశారో ఆళ్లగడ్డ, చుట్టుపక్కల గ్రామాల్లో ఆరా తీశారు. ఎర్రగుంట్ల గ్రామంలో పూల వ్యాపారి దగ్గర గోస్పాడు మండలం ఒంటివెలగల గ్రామానికి చెందిన రాజశేఖర్ కొనుగోలు చేసినట్లు బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. సంతానం కలుగుతుందని... వివాహమై పదేళ్లయినా సత్తనపల్లి రాజశేఖర్‌కు సంతానం కలగలేదు. చిన్నకందుకూరు సమీపంలోని కాలభైరవస్వామి అంగ భాగానికి పూజలు చేస్తే ఫలితం ఉంటుందని స్థానికులు సూచించారు. దీంతో ప్రతి అమావాస్యకు గుడికి వెళ్లి పూజలు చేసి అక్కడే నిద్రించేవాడు. ఇలా రెండు సంవత్సరాలు గడిచినా సంతానం కలగలేదు. మూలవిరాట్ అంగభాగాన్ని కొద్దిగా తీసుకొచ్చి, ఇంట్లో పెట్టుకుని పూజలు చేస్తే ఫలితం ఉంటుందని కొంతమంది సలహా ఇచ్చారు. దీంతో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు రాజశేఖర్..నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని సోమవారం కర్నూలులో ఎస్పీ ఫక్కీరప్ప ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆలయాల్లో జరిగే ఘటనలకు రాజకీయ రంగు పులమొద్దన్నారు. ప్రార్థనా మందిరాలతో పాటు అన్ని ఆలయాల వద్ద సీసీ కెమెరాలను, రక్షణ దళాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కేసును ఛేదించిన ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు, రూరల్ సీఐ సుదర్శన్ ప్రసాద్, ఎస్ఐ వరప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, హోంగార్డు శ్రీనివాసులును అభినందించి ప్రశంస పత్రాలను అందజేశారు. -
కంటెంట్ ఈజ్ కింగ్
కీరవాణి తనయులు శ్రీసింహా హీరోగా, కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమైన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ రానా దర్శకత్వంలో చెర్రీ (చిరంజీవి), హేమలత నిర్మించారు. డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో ప్రదర్శితం అవుతోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘కంటెంట్ ఈజ్ కింగ్’ ప్రెస్మీట్లో నటుడు అడివి శేష్, దర్శకులు వివేక్ ఆత్రేయ, స్వరూప్ అతిథులుగా పాల్గొన్నారు. శ్రీసింహా మాట్లాడుతూ – ‘‘మా సినిమాకి ఇంత మంచి స్పందన వస్తుందని ఊహించలేదు. ఈ ప్రోత్సాహంతో ఇంకా మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాం. 2020ని సక్సెస్‌ఫుల్‌గా ప్రారంభించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘కీరవాణిగారబ్బాయి అనే టెన్షన్ నా మైండ్‌లో లేదు. పాటలు ఉన్నాయా? లేదా అని ఆలోచించలేదు. కథకి కావాల్సింది చేశాం. ఇదంతా మా టీమ్ విజయం’’ అన్నారు కాలభైరవ. ‘‘ఏ సినిమాకైనా కంటెంట్ ఈజ్ కింగ్. మా సినిమాకి మౌత్ పబ్లిసిటీ హెల్ప్ అయింది. అందరికీ పేరు రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు రితేష్ రానా. ‘‘రొటీన్‌కు భిన్నంగా ఉండటంతో మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. ఈ సక్సెస్‌కి ఆనందమే కాదు గర్వంగానూ ఉంది. సినిమా కాన్సెప్ట్ బావుంటే చిన్నా పెద్దా తేడా ఉండదు. ప్రేక్షకులు ఆదరిస్తారు’’ అన్నారు చెర్రీ. ‘‘పెట్టినదానికి రెండింతల లాభం వస్తే బ్లాక్‌బస్టర్ సినిమా అంటారు. మా సినిమా బ్లాక్‌బస్టర్. టీమ్ బాగా కష్టపడ్డారు. బడ్జెట్ అదుపులో ఉండేలా చూసుకు న్నారు. ఇది వాళ్ల సక్సెస్’’ అన్నారు రవిశంకర్. -
సక్సెస్‌మీట్ అంటే సినిమా ఫ్లాప్
‘‘మత్తు వదలరా’ సినిమా గురించి మంచి టాక్స్ వినిపిస్తున్నాయి.. స్పందన బాగుందా చెర్రీ(నిర్మాత చిరంజీవిని ఉద్దేశించి). ఏంటీ.. ఇది సక్సెస్మీటా? కాదు కాదా? ఎందుకంటే టాలీవుడ్ సినిమా డిక్షనరీ వేరే ఉంది.. బాబుగారూ అంటే హీరో.. సక్సెస్ మీట్ అంటే సినిమా ఫ్లాప్ అయిందని అర్థం(నవ్వుతూ)’’ అని సంగీత దర్శకుడు కీరవాణి అన్నారు. ఆయన తనయులు శ్రీసింహా హీరోగా, కాలభైరవ సంగీత దర్శకునిగా పరిచయమైన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ రానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టై¯Œ మెంట్ పతాకాలపై చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో కీరవాణి మాట్లాడుతూ– ‘‘2000సంవత్సరం కెరీర్ పరంగా నాకు చాలా బ్యాడ్‌టైమ్.. డబ్బుల పరంగానూ బ్యాడ్‌టైమే. ఆ రోజుల్లో నేను బాధ్యత తీసుకోవాల్సినటువంటి కుటుంబీకులు దాదాపు 30మంది ఉన్నారు. ఓ సందర్భంలో సింగపూర్ వెళ్లడం గురించి ఇంట్లో చర్చ వచ్చింది.. అక్కడికి వెళ్లేంత డబ్బులు మనవద్ద లేవని నేను అంటుంటే.. ‘నేను తీసుకెళతాను’ అన్నాడు కాలభైరవ.. అప్పుడు వాడికి నాలుగేళ్లు’.. ఇప్పటి వరకూ నన్ను తీసుకెళ్లేంత రెమ్యూనరేషన్ వాడికి రాలేదు కానీ, ‘మత్తు వదలరా’ తో వచ్చిందనుకుంటున్నా(నవ్వుతూ).. మంచి సినిమా తీసిన యూనిట్‌కి అభినందనలు’’ అన్నారు. చిరంజీవి మాట్లాడుతూ– ‘‘మత్తు వదలరా’ కథని రితేష్ రానా చెప్పినప్పుడు అదృష్టం వెతుక్కుంటూ వచ్చిందనిపించింది. మా సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తుండటంతో ఇప్పుడు ప్రమోషన్స్ పెంచాం’’ అన్నారు. ‘‘రితేష్ రానా చెప్పిన కథ విన్నాక సినిమా చేయం అనే అవకాశమే లేదు.. అంత బాగుంది’’ అన్నారు మైత్రీ మూవీస్ నిర్మాత రవిశంకర్. ‘‘షకలక’ శంకర్‌తో వినోద సన్నివేశాలు చిత్రీకరించాం.. కానీ, ఆ కామెడీ ట్రాక్ కథని ముందుకు తీసుకెళ్లదు అనిపించి పెట్టలేదు’’ అన్నారు రితేష్ రానా. ‘‘నటుడిగా నాకు రోల్ మోడల్ అంటూ ఎవరూ లేరు. అందరి సినిమాలూ చూస్తా’’ అన్నారు శ్రీ సింహా. ‘‘నాన్న(కీరవాణి), బాబాయ్(రాజమౌళి) గార్లు చెప్పకపోయినా వారి వల్లే మాకు ఈ అవకాశం వచ్చిందనుకుంటున్నాం’’ అన్నారు కాలభైరవ. నటుడు నరేశ్ అగస్త్య, కెమెరామెన్ సురేశ్ సారంగం పాల్గొన్నారు. -
‘మత్తు వదలరా’ మూవీ రివ్యూ
చిత్రం: మత్తు వదలరా జానర్: సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ నటీనటులు: శ్రీసింహా, వెన్నెల కిశోర్, సత్య, అగస్త్య, బ్రహ్మాజీ సంగీతం: కాలభైరవ దర్శకత్వం: రితేష్ రానా బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత డైరెక్టర్, సంగీత దర్శకుడు, సింగర్, రచయిత, నిర్మాత, లైన్ ప్రొడ్యూసర్, కాస్టూమ్ డిజైనర్ ఇలా ఆ కుటుంబంలో ఓ సినిమాకు ప్రధానమైన టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు. కానీ ఒక్క హీరో తప్ప. ఇక ఇప్పుడు ఈ లోటు కూడా తీరబోతుంది. హీరో లేడనే లోటును భర్తీ చేయడానికి ఆకాశమంత ఆ కుటుంబం నుంచి కూడా ఓ వారసుడు వచ్చేశాడు. దిగ్గజ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి చిన్న తనయుడు శ్రీసింహా హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ రానా దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా బుధవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లతో చిత్రంపై భారీ అంచనాలే నమోదయ్యాయి. ఇక దాదాపు అందరు కొత్తవాళ్లతో ప్రయోగాత్మకంగా నిర్మించిన చిత్రం ఆడియన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుంది? అందరి అంచనాలను ఈ చిత్రం అందుకుందా? రాజమౌళి కుటుంబం నుంచి వచ్చిన నయా హీరో, మ్యూజిక్ డైరెక్టర్‌ను ప్రేక్షకులు ఆదరించారా? అనేది రివ్యూలో చూద్దాం. కథ: బాబు మోహన్ (శ్రీసింహా), ఏసుదాస్ (సత్య), అభి (అగస్త్య)లు రూమ్మేట్స్. బాబు, ఏసుదాస్‌లు డెలీవరీ బాయ్స్‌గా పనిచేస్తూ చాలిచాలని జీతంతో కాలం వెల్లదీస్తుంటారు. అయితే జీతం, జీవితంపై అసహనం చెందిన బాబుకు ఏసుదాస్ ఓ ఉచిత సలహా ఇస్తాడు. ఆ సలహా పాటించిన బాబు అనుకోని చిక్కుల్లో పడతాడు. ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఈ కేసు నుంచి బయటపడటానికి, హత్యచేసింది ఎవరో తెలుసుకోవడానికి బాబు చేసిన ప్రయత్నమే సినిమా కథ. అయితే ఈ కథలో రాజు (వెన్నెల కిశోర్), కానిస్టేబుల్ బెనర్జీ (బ్రహ్మాజీ), మైరా, తేజస్వి (అజయ్)లు ఎందుకు ఎంటర్ అవుతారు? అసలు ఆ హత్య ఎవరు చేశారు? ఏసుదాస్ ఇచ్చిన ఆ ఉచిత సలహా ఏంటి? మూవీ టైటిల్‌తో కథకు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నటీనటులు: రాజమౌళి కుటుంబం నుంచి వచ్చిన వారసుడు శ్రీసింహా తన తొలి సినిమాతోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. భయం, కోపం, ప్రస్టేషన్స్, ఆనందం ఇలా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో హీరో పలికించాల్సిన అన్ని భావాలను అవలీలగా పలకించాడు. ఇక ఈ సినిమాతో టాలీవుడ్‌కు నటనపరంగా మరో హీరో దొరికినట్లే. ఇక సత్య కామెడీ టైమింగ్ థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. ఏ సమయంలో కూడా సత్య కామెడీ చికాకు తెప్పించదు. సినిమాకు సత్య కామెడీ మరింత బూస్టప్‌గా నిలిచింది. వెన్నెల కిశోర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో ఎవరూ ఊహించని వినూత్న పాత్ర పోషించిన వెన్నెల కిశోర్ తన అనుభవంతో అవలీలగా నటించాడు. అగస్త్య, తదితర నటులు తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు కలుగదు జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! ప్రస్తుతం ఈ పద్య భావాన్ని మ్యూజిక్డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణి పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒకే చిత్రంతో తన ఇద్దరు కుమారులు టాలీవుడ్ అరంగేట్రం చేసి ఆకట్టుకున్నారు. మెప్పించారు. ప్రశంసలు అందుకుంటున్నారు. దీంతో కీరవాణి కుటుంబం డబుల్ హ్యాపీ అని చెప్పవచ్చు. నటుడిగా శ్రీసింహా, మ్యూజిక్ డైరెక్టర్‌గా కాల భైరవలు తమ తొలి సినిమాతో రాజమౌళి కుటుంబానికి ఎలాంటి మచ్చ తీసుకరాలేదు. వీరిద్దరితో ఆ కుటంబం కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం కథ, కథనం. ఈ రెండు విషయాల్లో చిత్ర యూనిట్ ముఖ్యంగా దర్శకుడు ఎక్కడా తడబడలేదు. తెర మీద ఆట ప్రారంభమైన 15 నిమిషాల్లోనే సినిమా నేరుగా అసలు కథలోకి ప్రవేశిస్తుంది. సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ ఈ మూడు అంశాలను ప్రధానంగా తీసుకుని కథ ఎక్కడా డీవియేట్ కాకుండా డైరెక్టర్ జాగ్రత్తలు తీసుకున్నాడు. నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే ఉత్సాహం, ఆసక్తి సగటు ప్రేక్షకుడికి కలిగించడంతో పాటు ఆరోగ్యకరమైన కామెడీ అందించడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. కమర్షియల్ హంగుల జోలికి పోకుండా కథానుగుణంగా సినిమాను ముందుకు నడింపించాడుదర్శకుడు రితేష్ రానా. క్లైమాక్స్ వరకు కూడా సస్పెన్స్‌ను రివీల్ కాదు. అంతేకాకుండా ఎవరి ఊహకందని కామెడీ క్లైమాక్స్‌తో సినిమా ముగుస్తుంది. సంగీతదర్శకుడిగా మరో అవతారం ఎత్తిన సింగర్ కాల భైరవ తన తొలి సినిమాలోనే తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశాడు. ఈ మూవీకి మరో మేజర్ ప్లస్ పాయింట్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్. సినిమాలో వచ్చే ప్రతీ సిచ్యూవేషన్‌కు తగ్గట్టు వినూత్న రీతిలో కొత్త బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించాడు ఈ యువ సంగీత దర్శకుడు. ముఖ్యంగా కామెడీగా వచ్చే కొన్ని సౌండ్స్ కేక అని చెప్పాలి. ఇక దర్శకుడు ఆలోచనలను తెరమీద దృశ్యరూపంలో ఎలాంటి గందరగోళం లేకుండా చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు సినిమాటోగ్రఫర్. విజువలైషన్స్ కూడా చాలా కొత్తగా వండర్‌గా అనిపిస్తుంది. ఎడిటింగ్, నిర్మాణవిలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే కొత్తదనం కోరుకునే వారికి ఈ సినిమా సూపర్బ్‌గా నచ్చుతుంది. వినూత్న కథలను, కొత్త కాన్సెప్ట్‌లను ఎల్లప్పుడూ ఎంకరేజ్ చేసే తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి. ఫైనల్‌గా కొత్త వాళ్లు.. కొత్త ప్రయత్నం.. కొత్తగా, గ‘మ్మత్తు’గా ఉంది. ప్లస్ పాయింట్స్: శ్రీసింహా నటన సత్య కామెడీ కాల భైరవ మ్యూజిక్ కథనం సినిమాలో కొత్తదనం మైనస్ పాయింట్స్: కమర్షియల్, మాస్ ఎలిమెంట్స్ లేకపోవడం - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
కాలభైరవం భజే
ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అసలు బ్రహ్మము ఎవరనే సందేహం వచ్చింది. ఆ సందేహం తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి సద్యోజాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ అనే ఐదు ముఖాలు ఉంటాయి. ఈ ఐదు ముఖాలతో ఋషుల వంక చూస్తూ అన్నాడు ‘బ్రహ్మం ఎవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మాన్ని కదా’ అన్నాడు. అపుడు బ్రహ్మ వినకుండా వితండ వాదన చేయడంతో ఈశ్వరుడి భృకుటి నుంచి ఒక వింతకాంతి బయల్దేరి, చూస్తుండగానే ఒక నల్లని, భయంకర దిగంబర రూపాన్ని సంతరించుకుంది. ఆ ఆకారమే కాలభైరవుడు. శివుడి ఆజ్ఞమేరకు భైరవుడు బ్రహ్మ అయిదవ తలను గోటితో గిల్లేశాడు. దాంతో బ్రహ్మలోని తామస గుణం నశించి, ‘ఈశ్వరా, నేను చేసిన పొరపాటు మన్నించి నన్ను కాపాడు’ అన్నాడు. శంకరుడు శాంతించాడు. అయితే బ్రహ్మ తల గిల్లేసిన కాలభైరవుని చేతినుంచి ఎంత యత్నించినా ఆ తల ఊడిపడక పోవడంతో విష్ణువు కాలభైరవునితో ‘‘కాలభైరవా! నీవు బ్రహ్మ తలను తెంపినందున నీకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. నీవు కాశీనగరానికి వెళ్లి, అక్కడి విశ్వనాథుని సేవించు’’ అని చెప్పాడు. ఈ మేరకు కాశీకి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యాపాతకం తొలగిపోగా, బ్రహ్మకపాలాన్నీ కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మకపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే.. నేటి కాశీక్షేత్రంలోని ‘కపాల మోక్షతీర్థం’. కాశీలో కాలభైరవుడు విశ్వనాథుడిని భక్తితో పూజించి తరించాడు. శివుడు అతని భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్చాడు. ‘‘కాలభైరవా! ఎవరు నీ గురించి వింటారో, శివాలయానికి వచ్చినపుడు ఎవరు నీ ముందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపాన్ని తీసేసే శక్తిని నేను నీకు ఇస్తున్నాను కాబట్టి నిన్ను ‘అమర్దకుడు’ అని పిలుస్తారు. నిన్ను కాశీక్షేత్రానికి అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు’’ అని చెప్పాడు. అందుకే మనను కాశీక్షేత్రంలోని అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక ‘అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపాలను దగ్ధం చేశావు కాలభైరవా’ అని ఇంటికి రాగానే కృతజ్ఞతాపూర్వకంగా కాలభైరవ పూజ చేసి ఇకనుంచి మంచి పనులు చేస్తాను, అని అన్నసంతర్పణ చేయడం ఆనవాయితీ. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదం తీసుకోవాలి. ఇహలోకమునందు ఇప్పటివరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింప చేస్తాడు. అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసాదేవి ఆలయానికి వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ‘ఒకసారి ఒంగోండి’ అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవ యాతన అని ఆ కర్ర ఠప్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయి. ఈ విధంగా ఆనాడు పరమేశ్వరుడు కాల భైరవుడికి ఇన్ని వరాలను గుప్పించాడు. ఆ మూర్తే ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలో కాలభైరవ స్వరూపంతో ఉంటాడు. ఆయన భక్తుల పాలిట కొంగుబంగారం. ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనపడతాడు. ‘మేము కాశీ వెళ్ళాము.. మాకు ఇంట ఏ భయమూ లేదు’ అని చెప్పడానికి ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు. ఇన్ని రూపాలుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది. ఎవరు ఈ కాలభైరవ స్వరూపం గురించి వింటున్నారో భక్తితో ప్రణమిల్లుతున్నారో ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. వాళ్ళు శత్రుబాధ, పిశాచ బాధ లేకుండా ఎప్పుడూ సంతోషంగా, సుఖంగా ఉంటారు. -
కీరవాణి తనయుల సిన్మా.. ఎన్టీఆర్ ట్వీట్!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ‘మత్తు వదలరా’సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహా కోడూరి హీరోగా పరిచయమవుతుండగా.. ఆయన పెద్ద కొడుకు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్.. క్లాప్ ఎంటర్టైన్మెంట్తో కలిసి ఈ సినిమాను తెరకెక్కించింది. ‘సమయం అమాంతం గడిచిపోతోంది. నా తమ్ముళ్లు పెరిగిపెద్దవారయ్యారు. సింహా కోడూరి హీరోగా, కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న 'మత్తు వదలరా' చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మొదటి సినిమాతోనే వీరు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. టీమ్‌కు గుడ్‌లక్" అంటూ ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో పలు పేపర్ కటింగ్స్ మీద శ్రీ సింహా కోడూరి పడుకొని ఉన్నాడు. అతని టీష్టర్ మీద చిత్ర యూనిట్ వివరాలు ఉన్నాయి. ‘మత్తు వదలరా’ చిత్రం ప్రీ లుక్ కొన్నిరోజుల కిందట విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్, చిరంజీవి సినిమాల స్టిల్స్‌తోపాటు.. ‘కస్టమర్ ఈజ్ గాడ్.. గాడ్ ఈజ్ గ్రేట్’ అనే కొటేషన్ ఉంది. నూతన దర్శకుడు రితేష్ రానా డైరెక్టర్లో వినూత్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. -
ఒకే పేరుతో రెండు సినిమాలు!
ఇటీవల కాలంలో సినీరంగంలో టైటిల్ వార్ తరచూ తెర మీదకు వస్తుంది. ఒక సంస్థ రిజిస్టర్ చేసుకున్న టైటిల్‌తో మరో సంస్థ సినిమాను ప్రారంభించటం, లేదా పోస్టర్లు, టీజర్ లాంటివి రిలీజ్ చేయటం వివాదాస్పదమయ్యింది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న అర్జున్ సురవరం సినిమాకు ముందుగా ముద్ర అనే టైటిల్‌ను నిర్ణయించినా వివాదం కావటంతో టైటిల్ మార్చి ప్రమోషన్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి వివాదమే మరొకటి తెర మీదకు వచ్చింది. ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. రాజమౌళి తనయుడు కార్తీకేయ నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ఆకాశవాణి. ఈ సినిమాతో అశ్విన్ గంగరాజు దర్శకుడిగా, కీరవాణి తనయుడు కాళభైరవ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అయితే దాదాపు ఇదే టైటిల్‌తో మరో సినిమా కూడా రెడీ అవుతుంది. సతీష్ బత్తుల దర్శకత్వంలో ఆకాశవాణి పేరుతో మరో సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాకు విశాఖపట్టణ కేంద్రం అనే ట్యాగ్ లైన్‌ను జోడించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌కు సంబంధించి ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మరి ఈ రెండు సినిమాలు అదే టైటిల్లతో ప్రేక్షకుల ముందుకు వస్తాయా..? లేక ఎవరైన టైటిల్ మార్చుకుంటారా..? చూడాలి. -
ఒక్కొక్కడ్ని కాదు షేర్‌ఖాన్...
పంచ్ శాస్త్ర ఎప్పుడూ గంభీరంగా కనిపించే భైరవకోన ఆరోజు భావోద్వేగాలకు సంబంధించిన అనేక కోణాలతో వెలిగిపోతోంది. భయం, నిర్భయం, ఆగ్రహం, ఆరాటం, పోరాటం... వీరత్వం, రణతంత్రం... ఒకే సమయంలో అనేక రకాల అనుభూతులు ఆకాశంలో కారు మేఘాలై సంచరిస్తున్నాయి. దట్టంగా దుమ్ములేస్తుంది. చెవులు పిక్కటిల్లేలా గుర్రపు డెక్కల శబ్దం వినిపిస్తుంది. షేర్‌ఖాన్ వస్తున్నాడు. పేరులోనే కాదు ధైర్యంలోనూ అతడు షేరే. ‘నేను యుద్ధానికి పిలుపునిస్తే... ప్రతిఘటించ కుండానే రాజ్యం అప్పగించి పారిపోయిన రాజులు ఉన్నారు. నేను యుద్ధరంగంలోకి దిగితే... పోరాడకుండానే పారిపోయిన సైనికులు ఉన్నారు’ అని తనను తాను పరిచయం చేసుకునే షేర్‌ఖాన్ ఉదయ్గఢ్ను జయించడానికి, అదే రాజ్యానికి చెందిన రణదేవ బిల్లాను తొత్తుగా మార్చుకొని వస్తున్నాడు. రణదేవ బిల్లాకు రాజ్యం కాదు పిల్ల కావాలి. షేర్ఖాన్కి రాజ్యం కావాలి. ‘‘యువరాణిని విడిపిస్తానని మాటిచ్చా. దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్లో పెట్టి నా కాళ్లకు సలాం కొట్టు... పో... నిన్ను ప్రాణాలతో వదిలేస్తా’’ గర్జించాడు షేర్‌ఖాన్. ‘అలాగే మహారాజా’ అనే భయమేదీ వినిపించలేదు. భయాన్ని భయపెట్టే మాటొకటి కాలభైరవుడి నోటి నుంచి దూసుకొచ్చింది... ‘‘నేను నీకు మాటిస్తున్నాను షేర్‌ఖాన్. ఆ రాజద్రోహిని నాకు అప్పజెప్పు. నిన్నూ నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలిపెడతా’’ ఈ మాటకు తోక తొక్కిన తాచులా లేచాడు షేర్‌ఖాన్. ‘‘నాకు ప్రాణభిక్షపెడతావా? ఖుదా హు మై.. నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కళ్లలో నిజం ఉంటే నా మనుషుల్ని వందమందిని పంపిస్తా. నీ ఒంటి మీద చేయిపడకుండా ఆపు. ఈ రాజ్యాన్ని ఆ రాణిని నీకు అప్పగిస్తా’’ అని ఆఫర్ ఇచ్చాడు షేర్‌ఖాన్. ‘‘వెన్ను చూపని వీరుల్ని ఎన్నుకొని మరీ పంపించు షేర్‌ఖాన్’’ అని ధైర్యంగా బదులిచ్చాడు కాలభైరవ. ‘‘వాళ్లను చూస్తేనే నువ్వు సగం ఛస్తావురా’’ బెదిరింపు ఖడ్గం విసిరాడు షేర్‌ఖాన్. దాన్ని వేలిగోరుతో దూరంగా నెట్టి ‘‘ఎక్కువైనా ఫరవాలేదు. లెక్క తక్కువ కాకుండా చూసుకో’’ సవాలుకు సవాలు విసిరాడు కాలభైరవ. ‘‘ఆ వందలో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడిపోయినట్లే’’ కవ్వించాడు షేర్‌ఖాన్. ‘‘ఒక్కొక్కడిని కాదు షేర్‌ఖాన్ వందమందిని ఒకేసారి పంపించు’’ కాలభైరవుడి దమ్ముకు, ధైర్యానికి భైరవకోన నలుదిక్కులు ప్రతిధ్వనించాయి. ఒక్కడు కాదు... నిజంగానే వందమంది ఒకేసారి కాలభైరవుడి మీది వచ్చారు. మాటల్లో పొగరు మాత్రమే కాదు... చేతల్లో దమ్ము కూడా ఉందని నిరూపిస్తున్నాడు భైరవ. షురూ... ఒక్కటి... పది... ఇరవై మూడు... కుత్తుకలు తెగిపడుతున్నాయి. ‘పిచ్చేసే మారు’’ అరుస్తున్నాడు షేర్. ఇరవై తొమ్మిది... ముప్పై.. నిమిషాల వ్యవధిలోనే కౌంట్ పూర్తయింది. వంద శిరస్సులు... ఒక్క యోధుడికి వందనం చెబుతున్నాయి ‘‘చాలా షేర్‌ఖాన్... ఇంకో వందిమందిని పంపిస్తావా?’’ భైరవుడు అడుగుతున్నాడు. ఆ ఎర్రటి నేలపై షేర్‌ఖాన్ తెల్లటి ముఖం వేశాడు. ఒక్క చిత్రం వెయ్యి పదాలను చెబుతుంది అంటారు. ‘మగధీరా’ సినిమాలో ‘ఒక్కొక్కడిని కాదు షేర్‌ఖాన్... డైలాగులో మాత్రం ఒక్కో పదం రోమాలు నిక్కబొడుచుకునేలా వందల చిత్రాలను చూపించి పంచ్శాస్త్ర పవర్ ఏమిటో రుజువు చేసింది. సినిమా: మగధీర డైలాగ్: ఒక్కొక్కడిని కాదు షేర్‌ఖాన్