Rahul Sipligunj, Kaala Bhairava to perform 'Naatu Naatu' at Oscars 2023 - Sakshi
Sakshi News home page

Natu Natu Song: ఆస్కార్‌ వేదికపై లైవ్‌లో పాడనున్న రాహుల్‌, కాలభైరవ

Published Wed, Mar 1 2023 1:11 PM | Last Updated on Wed, Mar 1 2023 2:14 PM

Rahul Sipligunj And Kala Bhairava Live Performance Natu Natu Song At Oscars 2023 - Sakshi

మన సింగర్లు స్టేజీపై అగ్గిరాజేయడం ఖాయం. వీరి పాటకు అక్కడున్నవాళ్లకు ఊపు రావడమూ తథ్యం. అంత పెద్ద వేదికపై పాడటం, అది కూడా తెలుగు పాట కావడం గర్వించదగ్గ విషయం

మరికొద్ది రోజుల్లో ప్రపంచమే ఎదురు చూస్తున్న ఆస్కార్‌ సినీ వేడుక జరుగబోతోంది. ఈసారి అందరి దృష్టి ఆర్‌ఆర్‌ఆర్‌ మీదే ఉంది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, రివార్డులతో మోత మోగించిన ఈ మూవీ ఆస్కార్‌ను ఎగరేసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి నాటునాటు పాట బెస్ట్‌ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్‌ అయిన విషయం తెలిసిందే! తాజాగా ఫ్యాన్స్‌కు  మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆస్కార్‌ టీమ్‌. 

ఈ నెల 12న జరగబోయే 95వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో సింగర్లు రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ నాటు నాటు పాటను లైవ్‌లో పాడనున్నట్లు తెలిపింది. ఈ విషయం తెలిసి అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇంకేముంది... మన సింగర్లు స్టేజీపై అగ్గిరాజేయడం ఖాయం. వీరి పాటకు అక్కడున్నవాళ్లకు ఊపు రావడమూ తథ్యం. అంత పెద్ద వేదికపై పాడటం, అది కూడా తెలుగు పాట కావడం గర్వించదగ్గ విషయం. ఈ విషయంపై రాహుల్‌ సిప్లిగంజ్‌ స్పందిస్తూ.. 'ఆస్కార్‌ వేదికపై లైవ్‌ పర్ఫామెన్స్‌.. కచ్చితంగా ఇవి నా జీవితంలో మర్చిపోలేని క్షణాలుగా మిగిలిపోతాయి' అని సంతోషం వ్యక్తం చేశాడు.

చదవండి: మా నాన్న కంటే నా భార్యకే ఎక్కువగా భయపడతా: మంచు విష్ణు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement