కీరవాణి తనయుల సిన్మా.. ఎన్టీఆర్‌ ట్వీట్‌! | Junior NTR Releases Mathu Vadalara First Look | Sakshi
Sakshi News home page

కీరవాణి తనయుల సిన్మా.. ఎన్టీఆర్‌ ట్వీట్‌!

Published Wed, Oct 23 2019 1:02 PM | Last Updated on Wed, Oct 23 2019 1:19 PM

Junior NTR Releases Mathu Vadalara First Look - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ తాజాగా ‘మత్తు వదలరా’సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ద్వారా ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి చిన్న కొడుకు శ్రీసింహా కోడూరి హీరోగా పరిచయమవుతుండగా.. ఆయన పెద్ద కొడుకు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్..  క్లాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో క‌లిసి ఈ సినిమాను తెరకెక్కించింది.

‘సమయం అమాంతం గడిచిపోతోంది. నా తమ్ముళ్లు పెరిగిపెద్దవారయ్యారు. సింహా కోడూరి హీరోగా, కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న 'మత్తు వదలరా' చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మొదటి సినిమాతోనే వీరు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. టీమ్‌కు గుడ్‌లక్‌" అంటూ ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ప‌లు పేప‌ర్ క‌టింగ్స్ మీద శ్రీ సింహా కోడూరి ప‌డుకొని ఉన్నాడు. అతని టీష్టర్‌ మీద చిత్ర యూనిట్‌ వివరాలు ఉన్నాయి.

‘మ‌త్తు వ‌ద‌ల‌రా’  చిత్రం ప్రీ లుక్ కొన్నిరోజుల కిందట విడుద‌ల చేశారు. ఇందులో ఎన్టీఆర్, చిరంజీవి సినిమాల స్టిల్స్‌తోపాటు.. ‘కస్టమర్ ఈజ్ గాడ్.. గాడ్ ఈజ్ గ్రేట్’ అనే కొటేషన్ ఉంది. నూతన దర్శకుడు రితేష్ రానా డైరెక్టర్‌లో వినూత్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement