న్యూఢిల్లీ: కాల భైరవ జయంతిని శివుని భక్తులు పవిత్రమైన రోజుగా భావిస్తారు. కాల భైరవ జయంతిని నేడు అన్ని ప్రాంతాలలో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం మార్గశిర (హిందూ క్యాలెండర్ కార్తీక మాసం తర్వాత నెల) కృష్ణ పక్షంలో కాల భైరవ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. కాలభైరవుడు శివుని భయంకరమైన రూపం. ఈ జయంతిని కాల భైరవ అష్టమి అని కూడా పిలుస్తారు. కాల భైరవుని ఆరాధించడం ద్వారా ధైర్యం, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. సాధారణ నైవేద్యాలతో సులభంగా సంతోషించే శివుడి రూపమే కాల భైరవ అవతారం. భైరవుడు కుక్క మీద కూర్చున్నందున, భక్తులు కుక్కలకు ప్రసాదాన్ని తినిపిస్తారు. హల్వా పూరీని నైవేద్యంగా సమర్పిస్తారు. శనివారాన్ని ఈయన పర్వ దినంగా భావించి కొలుస్తారు.
జయంతి నిర్వహించే సమయం
అష్టమి తిథి ప్రారంభం: ఈ రోజు సాయంత్రం 6:47 నిమిషాలు
అష్టమి తిథి ముగింపు: రేపు సాయంత్రం 5:17 నిమిషాలు
కాల భైరవుని ప్రాముఖ్యత
కాల భైరవునికి హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం, శివుని ఈ రూపం భయాన్ని దూరం చేస్తుంది. దురాశ, కోపం, కామాన్ని జయించవచ్చని భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం దేవతలు, అసురుల మధ్య జరిగిన యుద్ధంలో రాక్షస వినాశనం కొరకు శివుడు కాల భైరవున్ని సృష్టించాడు. తరువాత అష్ట భైరవులు సృష్టించబడ్డారు. వీరు భయంకరమైన రూపం కలిగిన అష్టా మాత్రికలను వివాహం చేసుకున్నారు. ఈ అష్ట భైరవులు, అష్టా మాత్రికల నుంచి 64 మంది భైరవులు, 64 యోగినిలు సృష్టించబడ్డారు. ఒకప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు గొప్పవారో నిరూపించడానికి చర్చించారని, చర్చ మధ్యలో బ్రహ్మ.. శివుడిని విభేదించడంతో అతని కోపంతో కాల భైరవుడు జన్మించాడని ఒక నమ్మకం.
భారత్‌లో ప్రసిద్ధ కాల భైరవ మందిరాలు
►కాల భైరవ ఆలయాలు సాధారణంగా దేశంలోని శక్తిపీఠాలు, జ్యోతిర్లింగ దేవాలయాల చుట్టూ కనిపిస్తాయి.
►షిప్రా నది ఒడ్డున ఉన్న ఉజ్జయిని కాల భైరవ ఆలయం ప్రత్యేకమైనది. భక్తులు దేవతకు మద్యం ఆర్పిస్తారు.
►వారణాసిలోని కాల భైరవ మందిరాన్ని వారణాసి యొక్క కొత్వాల్ అని నమ్ముతారు, ఇది తప్పక చూడవలసిన ప్రదేశాలలో ఒకటి.
►కాలభైరవేశ్వర కర్ణాటకలోని ఒక పురాతన ఆలయం, దీనిని ఆదిచుంచనగిరి కొండలలోని కాలభైరవేశ్వర క్షేత్ర పాలక అని పిలుస్తారు.
►ఒడిశాలోని జగత్సింగ్‌పూర్ జిల్లాలోని అజైకాపాడ భైరవ ఆలయం ఒడిశాలోని ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి
►తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని కలభైరవర్ ఆలయం కాల భైరవ రూపానికి అంకితం చేయబడింది.
►రాజస్థాన్‌లో జుంజూన్ జిల్లాలోని చోముఖ భైరవ ఆలయం శైవుల ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి.
►మధ్యప్రదేశ్‌లోని అడెగావ్‌లోని శ్రీ కాల భైరవనాథ్ స్వామి ఆలయం దేశ నలుమూలల నుంచే కాకుండా నేపాల్‌తో సహా దేశాలు సందర్శించే పవిత్ర ప్రదేశం.
►భారతదేశంలోని కాల భైరవ దేవాలయాలు సాధారణ శివాలయాలకు భిన్నంగా ఉంటాయి. నైవేద్యాలు కూడా ప్రత్యేకమైనవి.
Comments
Please login to add a commentAdd a comment