ఒకే పేరుతో రెండు సినిమాలు! | Two Films That Are Going To Be Released With The Same Title | Sakshi
Sakshi News home page

ఒకే పేరుతో రెండు సినిమాలు!

Published Tue, Apr 16 2019 3:52 PM | Last Updated on Tue, Apr 16 2019 6:25 PM

Two Films That Are Going To Be Released With The Same Title - Sakshi

ఇటీవల కాలంలో సినీరంగంలో టైటిల్ వార్‌ తరచూ తెర మీదకు వస్తుంది. ఒక సంస్థ రిజిస్టర్‌ చేసుకున్న టైటిల్‌తో మరో సంస్థ సినిమాను ప్రారంభించటం, లేదా పోస్టర్‌లు, టీజర్‌ లాంటివి రిలీజ్ చేయటం వివాదాస్పదమయ్యింది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న అర్జున్‌ సురవరం సినిమాకు ముందుగా ముద్ర అనే టైటిల్‌ను నిర్ణయించినా వివాదం కావటంతో టైటిల్ మార్చి ప్రమోషన్‌ చేస్తున్నారు.

తాజాగా ఇలాంటి వివాదమే మరొకటి తెర మీదకు వచ్చింది. ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. రాజమౌళి తనయుడు కార్తీకేయ నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ఆకాశవాణి. ఈ సినిమాతో అశ్విన్‌ గంగరాజు దర్శకుడిగా, కీరవాణి తనయుడు కాళభైరవ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

అయితే దాదాపు ఇదే టైటిల్‌తో మరో సినిమా కూడా రెడీ అవుతుంది. సతీష్‌ బత్తుల దర్శకత్వంలో ఆకాశవాణి పేరుతో మరో సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాకు విశాఖపట్టణ కేంద్రం అనే ట్యాగ్ లైన్‌ను జోడించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌కు సంబంధించి ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. మరి ఈ రెండు సినిమాలు అదే టైటిల్లతో ప్రేక్షకుల ముందుకు వస్తాయా..? లేక ఎవరైన టైటిల్ మార్చుకుంటారా..? చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement