Athiya
-
ఈ ప్రేమకథ ప్రమాదం
రెండు ప్రేమ జంటలు తమ ప్రేమ ప్రమాదంలో పడిన ప్పుడు కాపాడుకునేందుకు ఎలా ముందుకు సాగారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘డేంజర్ లవ్ స్టోరీ’. ఖయ్యూం (అలీ తమ్ముడు), మధులగ్నదాస్, గౌరవ్, అథియా హీరో హీరోయిన్లుగా శేఖర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కింది. లక్ష్మీకనక వర్షిణి క్రియేషన్స్ పతాకంపై అవధూత గోపాలరావు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 26న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ప్రెస్మీట్లో సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ– ‘‘భిన్నమైన టైటిల్ ఇది. వైవిధ్యభరితమైన కథాంశంతో నేటి ప్రేక్షకులను అలరింపజేసేలా రూపొందించిన ఇలాంటి చిత్రాలు విజయవంతం కావాలి’’ అన్నారు. ‘‘ఇలాంటి చిన్న సినిమాలు బతికినపుడే పరిశ్రమ కళకళలాడుతూ ఉంటుంది’’ అన్నారు నటి కవిత. ‘‘హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించాం. గోవా, కొల్హాపూర్, నిజామాబాద్ తదితర లొకేషన్లలో షూటింగ్ చేశాం’’ అని అవధూత గోపాలరావు అన్నారు. ‘‘ఊహించని మలుపులతో ఆసక్తికర కథాంశంతో సాగే చిత్రమిది. ఇప్పటి వరకు ఎన్నో ప్రేమకథలు వచ్చినప్పటికీ ఇది భిన్నంగా ఉంటుంది. సస్పెన్స్, హారర్‌తో పాటు మంచి వినోదం ఉంటుంది’’ అని శేఖర్ చంద్ర చెప్పారు. గౌరవ్, అథియా, నటుడు డా.సకారం, నైజాం డిస్ట్రిబ్యూటర్ రాజేందర్ పాల్గొన్నారు. -
లారీ ఢీకొని బాలిక దుర్మరణం
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో లారీ ఢీకొని ఓ బాలిక మృతి చెందింది. ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌కు చెందిన ఓ కుటుంబం స్థానికంగా ఓ హోటల్ నిర్వహిస్తోంది. ఆ కుటుంబానికి చెందిన అతియా (8) అనే బాలిక రోడ్డు దాటుతుండగా.. ఊట్నూరు వైపు వెళుతున్న సిమెంట్ లోడ్ లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన బాలిక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. -
'మీరు మీ తండ్రుల పేర్లు నిలబెడతారు'
ముంబయి: కొత్త చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో నవతరం నటులకు ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ బెస్ట్ విషెస్ తెలియజేశాడు. వారి చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. ప్రస్తుతం తాను నటిస్తున్న 'దిల్వాలే' చిత్రంలోని ఓ పాట షూటింగ్ కోసం ఐస్ లాండ్లో ఉన్న ఆయన ట్విట్టర్ ద్వారా తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. కొత్త నటులు సూరజ్ పంచౌలీ, ఆదిత్య శెట్టి నటిస్తున్న చిత్రం హీరో త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వారికి తన అభినందనలు తెలియజేస్తూ నటవారసులనిపించుకుంటారని, వారి తండ్రుల పేరు నిలబెడతారని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రానికి నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహిస్తుండగా సల్మాన్ ఖాన్ సహ నిర్మాతగా ఉన్నారు. -
తండ్రి తర్వాతే అన్నీ..
సినిమాల్లేవు.. కొత్త ప్రాజెక్టులపై సంతకాలూ చేయలేదు. కనీసం కూతురు తొలిసారిగా సినిమాలో నటిస్తుందన్న ఉత్సాహమూ సునీల్ శెట్టిలో కనిపించడం లేదు. ఎంతగానో ప్రేమించే తండ్రి అనారోగ్యంతో ఉండడమే మనోడి బాధకు కారణం. ఆయనకు ఎలాంటి ఇబ్బందీ రాకూడదనే ఉద్దేశంతో దక్షిణ ముంబైలోని తన ఇంటినే ఐసీయూగా మార్చా డు. ‘మూడు నెలలుగా సరిగ్గా నిద్రపోవడం లేదు. సంతో షం, బాధ కలగలిసిన సమయమిది. ఒకవైపు తండ్రి ఆరోగ్యం బాగాలేదు. కూతురు ఆథియా సిని మాల్లోనూ నటిస్తుందనే సంతోషం మాత్రం ఉంది’ అని సునీల్ వివరించా డు. సూరజ్ పంచోలీ నాయకుడిగా రాబోతున్న ‘హీరో’ సినిమా షూటింగ్కోసం ఆథియా ప్రస్తుతం మనాలీలో ఉంది. తండ్రి అనారోగ్యం సునీల్‌ను బాగా కుంగదీసింది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లకు కూడా దూరమయ్యాడు. దీనికితోడు అఫ్తాబ్ శివ్దాసానితో గొడపడ్డాడంటూ వచ్చిన వార్తలు తనను మరింత బాధపెట్టాయని ఇతడు వాపోయాడు. ‘అఫ్తాబ్ లాంటి సున్నిత, మంచి మనిషితో గొడవలు ఎలా పెట్టుకుంటాను ? అసలే మనోవేదనతో బాధపడుతున్న నాకు ఇలాంటి కథనా లు చదివినప్పుడు మరింత బాధకలుగుతోంది’ అని చెప్పా డు. సినిమాల గురించి మాట్లాడుతూ అవకాశాలు ఎప్పుడైనా వస్తాయని, ప్రస్తుతం తండ్రితో గడపడమే అన్నింటికంటే ముఖ్యమని స్పష్టం చేశాడు. అయితే ఆథియా పరాయి రాష్ట్రంలో ఉన్నా ఆమె గురిం చి తనకు బెంగేమీ లేదని తెలిపాడు. ‘ఆమె పూర్తి సురక్షితంగా ఉంటుందన్న నమ్మకం నాకుంది. సల్మాన్‌ఖాన్ ప్రొడక్షన్ యూనిట్ అంతా మా కుటుంబ సభ్యుల్లాంటి వాళ్లే. ఆథియా, సూరజ్‌ను వాళ్లు సొంత బిడ్డల్లా చూసుకుంటారు’ అని సునీల్ శెట్టి వివరించాడు.