'మీరు మీ తండ్రుల పేర్లు నిలబెడతారు' | SRK gives best wishes to Athiya, Sooraj for 'Hero' | Sakshi
Sakshi News home page

'మీరు మీ తండ్రుల పేర్లు నిలబెడతారు'

Published Thu, Aug 27 2015 5:37 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

SRK gives best wishes to Athiya, Sooraj for 'Hero'

ముంబయి: కొత్త చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో నవతరం నటులకు ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ బెస్ట్ విషెస్ తెలియజేశాడు. వారి చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. ప్రస్తుతం తాను నటిస్తున్న 'దిల్వాలే'  చిత్రంలోని ఓ పాట షూటింగ్ కోసం ఐస్ లాండ్లో ఉన్న ఆయన ట్విట్టర్ ద్వారా తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

కొత్త నటులు సూరజ్ పంచౌలీ, ఆదిత్య శెట్టి నటిస్తున్న చిత్రం హీరో త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వారికి తన అభినందనలు తెలియజేస్తూ నటవారసులనిపించుకుంటారని, వారి తండ్రుల పేరు నిలబెడతారని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రానికి నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహిస్తుండగా సల్మాన్ ఖాన్ సహ నిర్మాతగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement