ఇది ఆరంభం మాత్రమే.. కేశినేని నాని ట్వీట్‌ | Kesineni Nani Wishes Former Mla Swamidas Who Joined Ysrcp | Sakshi
Sakshi News home page

ఇది ఆరంభం మాత్రమే.. కేశినేని నాని ట్వీట్‌

Published Thu, Jan 11 2024 8:55 PM | Last Updated on Sun, Feb 4 2024 12:41 PM

Kesineni Nani Wishes Former Mla Swamidas Who Joined Ysrcp - Sakshi

సాక్షి, విజయవాడ: ఇది ఆరంభం మాత్రమేనంటూ టీడీపీకి చురకలు అంటించారు కేశినేని నాని. వైఎస్సార్‌సీపీలో చేరిన తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసుకు ఆయన ఎక్స్‌(ట్విట్టర్‌) ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మనల్ని అవమానించిన వాళ్లకు గుణపాఠం చెబుదాం అంటూ స్వామిదాసును ఉద్దేశించి కేశినేని ట్వీట్‌ చేశారు.

కాగా, ఎన్టీఆర్‌ జిల్లాలో తెలుగు దేశం పార్టీకి పెద్ద దెబ్బ పడింది. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్‌ టీడీపీని వీడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారాయన. గురువారం సాయంత్రం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో స్వామిదాస్‌కు కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్‌. స్వామిదాస్‌తో పాటు ఆయన సతీమణి సుధారాణి కూడా వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. 

చంద్రబాబులో మానవత్వం మచ్చుకైనా లేదని.. ఎవరితోనూ మానవీయతతో వ్యవహరించరని తిరువూరు నల్లగట్ల స్వామిదాస్‌ అన్నారు. గురువారం సాయంత్రం సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరిన ఆయన సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘అవసరం లేకపోతే చంద్రబాబు ఎవర్నీ పట్టించుకోరు. ఆయన ఎవరితోనూ మానవీయతతో వ్యవహరించరు. దాదాపుగా 30 ఏళ్లుగా టీడీపీలో పని చేసినా కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదు. భార్యాభర్తలం పది రోజులపాటు చంద్రబాబు ఇంటి ముందు ఎదురుచూసినా ఫలితం లేదు. టీడీపీ నేతలే మాకు వెన్నుపోటు పొడిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement