సాక్షి, విజయవాడ: ఏపీ టీడీపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని.. పార్టీ అధినేత చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా కేశినేని భవన్ నుండి టీడీపీ జెండాను కేశినేని నాని తొలగించారు. దీంతో, టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. మరోవైపు, ఎన్టీఆర్ జిల్లాలో చంద్రబాబు సభ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
అయితే, చంద్రబాబు నిర్ణయంతో కేశినేని నాని టీడీపీకి ఝలక్ ఇస్తున్నారు. తాజాగా కేశినేని భవన్ నుంచి టీడీపీ జెండాను తొలగించారు. మరోవైపు.. చంద్రబాబు సభలో కేశినేని నాని కోసం టీడీపీ నేతలు కుర్చీని కేటాయించారు. ఈ మేరకు చంద్రబాబు సభకు రావాలని కనకమేడలతో నిన్న(శనివారం) కేశినేని నానికి రాయబారం పంపించారు. కాగా, చంద్రబాబు ఆహ్వానాన్ని, రాయబారాన్ని కేశినేని లెక్క చేయలేదు. మరోవైపు.. చంద్రబాబు సభకు కేశినేని వర్గం, మద్దతుదారులు దూరంగా ఉండటం విశేషం.
ఇదిలా ఉండగా.. చంద్రబాబు తలపెట్టిన రా కదలిరా కార్యక్రమం అట్టర్ ప్లాప్ అయ్యింది. చంద్రబాబు సభపై తెలుగు తమ్ముల్లు ఆసక్తి చూపించలేదు. చంద్రబాబు సభను పట్టించుకోలేదు. రా కదలిరా అంటూ వైన్ షాపుల వద్దకు టీడీపీ శ్రేణులు వెళ్లిపోయారు. టీడీపీ కేడర్ మందేసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక, కాసేపట్లో సభకు చంద్రబాబు హాజరు కానున్నారు. అయితే, సభలో మాత్రం ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. జనసమీకరణ కోసం టీడీపీ నేతల నానా కష్టాలు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment