సాక్షి, విజయవాడ: టీడీపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని గట్టి షాక్ ఇచ్చారు. లోక్‌సభ సభ్యత్వంతో పాటు పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. దీంతో, ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.
కాగా, కేశినేని నాని ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు నాయుడు.. పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్‌సభ స్పీకర్ గారిని కలిసి నా లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తున్నాను’ అని పోస్టు చేశారు.
చంద్రబాబు నాయుడు గారు పార్టీ కి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన
— Kesineni Nani (@kesineni_nani) January 5, 2024
కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తన్నాను . pic.twitter.com/dFq85E4SxG
అంతకుముందు, కేశినేని నాని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘తిరువూరు సభకు నన్ను రావొద్దన్నారు.. నేను వెళ్లడం లేదు. నా మైండ్ సెట్ అభిమానులందరికీ తెలుసు. అభిమానుల మైండ్ సెట్ నాకు తెలుసు. మా వాళ్లందరికీ క్లారిటీ ఉంది నేను టీడీపీ పార్టీకి ఓనర్‌ను కాదు. చెప్పాల్సిన టైమ్ వచ్చినప్పుడు అన్నీ చెబుతా. తినబోతూ రుచులెందుకు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా. కాలమే అన్నింటిని నిర్ణయిస్తుంది. ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడాతారో ప్రజలే నిర్ణయిస్తారు. అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటా. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ అధినేత ముగ్గురు పెద్ద మనుషులతో చెప్పించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు సరే. కానీ, ఎంపీగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదు.
ఇండిపెండెంట్‌గా గెలుస్తా..
నేను ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ కోసమే నిలబడ్డా. కానీ, ఎప్పుడూ పార్టీ మారాలనుకోలేదు. చంద్రబాబుకి నేను వెన్నుపోటు పొడవలేదు. పొడిచి ఉంటే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినేమో. పార్టీ పంపించిన ముగ్గురు పెద్దమనుషులు చెప్పిందే నేను పోస్టులో పెట్టా. నాదగ్గరికి ఆ ముగ్గురు వచ్చిపుడు మరో ముగ్గురు సాక్షులు కూడా వచ్చారు. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసైనా గెలుస్తా. ఆ విషయంలో సందేహం లేదు. రాబోయే ఎన్నికల్లో నేను విజయవాడ నుంచే పోటీచేస్తా. కచ్చితంగా మూడో సారి గెలుస్తా. వసంత కృష్ణప్రసాద్ నేను మంచి స్నేహితులం. ఆయన పార్టీకి ఆయన కష్టపడ్డారు.. నా పార్టీకి నేను కష్టపడ్డా. అలాగని కొండపల్లి ఎన్నికల్లో మేం కలిసి పనిచేయలేదు కదా’ అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment