పచ్చ మీడియా అంబేద్కర్‌ను అవమానించింది: ఆర్కే రోజా | Rk Roja Slams On Yellow Media Over Ambedkar Statue Event | Sakshi
Sakshi News home page

పచ్చ మీడియా అంబేద్కర్‌ను అవమానించింది: ఆర్కే రోజా

Published Sat, Jan 20 2024 2:55 PM | Last Updated on Fri, Feb 2 2024 9:16 PM

Rk Roja Slams On Yellow Media Over Ambedkar Statue Event - Sakshi

సాక్షి, విజయవాడ: ప్రభుత్వంపై వ్యతిరేక కథనాలు రాస్తున్న పచ్చపత్రికలపై మంత్రి ఆర్కే.రోజా ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ అంటే మీకు (పచ్చ పత్రికలు) గౌరవం లేదా? అని సూటిగా ప్రశ్నించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చూపించేందుకు మనసు రాలేదా? అని మండిపడ్డారు. అంబేద్కర్‌కు నిజమైన వారసుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు.

సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని అందరూ అభినందిస్తుంటే పచ్చ మీడియా తట్టుకోలేకపోతోందని అన్నారు. పచ్చ మీడియాను..పత్రికలను బహిష్కరించాలన్నారు. శుక్రవారం రోజున ఒక్క నిమిషం కూడా అంబేద్కర్‌ను చూపించలేకపోయారని మంత్రి రోజా తెలిపారు. అంబేద్కర్‌ను పచ్చమీడియా అవమానించిందని..అంబేద్కర్‌కు అండగా నిలబడిన వర్గాలను కూడా అవమానించిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి అంబేద్కర్ విగ్రహాన్ని వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. వంద అడుగుల విగ్రహం పెడతానని చెప్పిన చంద్రబాబు.. ఒక్క విగ్రహమైనా పెట్టాడా? అని ప్రశ్నించారు. ప్రచారాలు, సమస్యల డైవర్షన్‌కు చంద్రబాబు అంబేద్కర్‌ను వాడుకున్నారని అన్నారు. తోపు.. తురుము అని చెప్పుకునే చంద్రబాబు విజయవాడ నడిబొడ్డులో ఏరోజైనా ఇలాంటి కార్యక్రమం చేయగలిగారా? అని నిలదీశారు.

అంబేద్కర్ స్మృతివనం చూసేందుకు రెండు కళ్లూ సరిపోవని, మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. విజయవాడను ప్రపంచ పటంలో నిలిపిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు. తమ సామాజిక వర్గమైన చంద్రబాబును కాపాడుకోవడం కోవడమే ఎల్లోమీడియా పని అని విమర్శించారు. టీడీపీ,జనసేన తోక పార్టీలకు  ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని మంత్రి ఆర్కే రోజా అన్నారు.

చదవండి:  ‘ఎల్లో’ ఏడుపులకు సీఎం జగన్‌ దిమ్మదిరిగే సమాధానం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement