Ambedkar Smriti Vanam
-
చంద్రబాబు పై దళిత నేతలు ఫైర్
-
బాబూ.. అంబేద్కర్ భావజాలంపై దాడులా?: మేరుగు నాగార్జున
సాక్షి, కాకినాడ: ఏపీలో అంబేద్కర్ భావజాలం మీద దాడులు జరుగుతున్నాయన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. వ్యాపారం చేసుకోవాలనుకున్న ప్రదేశంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడాన్ని చంద్రబాబు సహించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, మేరుగు నాగార్జున గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘అంబేద్కర్ ఆలోచన విధానంపై చంద్రబాబు ప్రభుత్వం కర్కశంగా పని చేస్తోంది. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని అసెంబ్లీలో హామీ ఇచ్చి అమలు చేయని వ్యక్తి చంద్రబాబు. విగ్రహం ఎక్కడ పెడుతున్నారు అని నాలాంటి వాళ్ళు వెళితే అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. విజయవాడ నడి బొడ్డులో కోట్లు ఖరీదైన స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ స్మతివనాన్ని వైఎస్ జగన్ నిర్మించారు.వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం మీద చంద్రబాబుకు ఆగ్రహం పెరిగింది. వ్యాపారం చేసుకోవాలనుకున్న ప్రదేశంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడాన్ని చంద్రబాబు సహించ లేకపోయారు. అంబేద్కర్ విగ్రహం మీద పొలుగులు, గునపాలతో దాడి చేయించారు. టీడీపీ తన కర్కశత్వాన్ని చూపించింది. అంబేద్కర్‌పై దాడి మీ తేలిక స్వభావాన్ని బయట పెట్టింది. మేము ఫిర్యాదు చేసిన తొమ్మిదో తారీఖు వరకు కేసు పెట్టరా?.వైఎస్ జగన్ సూచనల మేరకు మేము నిన్న ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. జరిగిన విషయాలు చెబితే ఎస్సీ కమిషన్ ముక్కు మీద వేలు వేసుకుంది. అంబేద్కర్ విగ్రహంపై దాడికి సంబంధించి జాతీయ ఎస్సీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరుతుంది. త్వరలో జాతీయ ఎస్సీ కమిషన్ విజయవాడలో పర్యటిస్తుంది. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా అంబేద్కర్‌పై దాడులు చేపించలేదు. బాబా సాహెబ్ ఆలోచన విధానాన్ని కాపాడుకోవాలని విజ్ఞులను కోరుతున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. -
అంబేద్కర్ విగ్రహంపై టీడీపీ దాడి.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ఎందుకీ వివక్ష బాబూ?.. అంబేద్కర్‌కు అలంకరణ కరువు
సాక్షి, విజయవాడ: పంద్రాగస్ట్ వేడుకలకు కూడా డా.బిఆర్. అంబేద్కర్ స్మృతి వనం నోచుకోలేదు. అంబేద్కర్ మహా న్యాయశిల్పాన్ని చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడను రాష్ట్ర ప్రభుత్వం రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించింది. అయితే స్వరాజ్య మైదానంలోని అంబేద్కర్ స్మృతివనానికి మాత్రం మరిచింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ అంబేద్కర్ స్మృతివనాన్ని ప్రారంభించారనే ప్రభుత్వం వివక్ష చూపిందని పలువురు బాహాటంగా విమర్శించారు. విద్యుత్ కాంతులతో బందరు రోడ్డు మెరిసిపోతోంది. ఇందిరాగాంధీ స్టేడియంతో పాటు బందరు రోడ్డులోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ అలంకరణ చేశారు. అంబేద్కర్ విగ్రహానికి కూతవేటు దూరంలోనే రాజ్ భవన్, కలెక్టరేట్,కలెక్టర్ క్యాంప్ కార్యాలయం,సీపీ కార్యాలయం, స్టేట్ గెస్ట్ హౌస్ ఉన్నాయి. అంబేద్కర్ మహా న్యాయశిల్పం మినహా అంతటా విద్యుత్ దీపాలంకరణ వెలిగిపోతోంది. బందరు రోడ్డు మధ్యలోని డివైడర్లు, చెట్లు, కరెంట్ పోల్స్‌కు సైతం విద్యుత్ అలంకరణ చేశారు. -
ఊరంతా లైటింగ్.. చీకట్లో అంబేద్కర్.. స్వాతంత్ర దినోత్సవం రోజు అవమానం
-
ఇది రాజ్యాంగంపై దాడే!
ఆకతాయిల పని కాదది. పథకం ప్రకారమే జరిగింది. ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే జరిగింది. అదేదో చాటుమాటు ప్రాంతం కాదు. నిర్జన ప్రదేశం కాదు. విజయవాడ నడిగడ్డ. నగరంలోనే ఏక్ నంబర్ బిజినెస్ రాస్తా. బందర్ రోడ్. రాత్రి తొమ్మిది గంటల వేళ ఆ రోడ్డు మీద ప్రవహించే రణగొణ పీక్ స్థాయిలో ఉంటుంది. అటువంటి సమయంలో అంబేడ్కర్ స్మృతివనం లోకి కొందరు వ్యక్తులు ‘పనిముట్ల’తో ప్రవేశించి, సందర్శకు లను వెళ్లగొట్టి, లైట్లార్పేసి దాడికి తెగబడ్డారంటే... ఈ దాడికి స్వయానా పోలీసు యంత్రాంగమే కాపు కాసిందంటే... అధికార పీఠం అండదండలు లేవని ఎలా అనుకోగలం? అందుకే ఈ దాడి రాజ్య ప్రేరేపితం.మీడియా ప్రతినిధులతోపాటు పలువురు పురజనులు హుటాహుటిన అక్కడికి చేరుకోకపోతే ఆ దాడి ఎంతదూరం వెళ్లేదో? టాప్ ప్రయారిటీ టాస్క్‌గా అక్కడున్న మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పేరును తొలగించగలిగారు. ఇంకా ముందు కెళ్లడం జనం రాకతో కుదరలేదు. స్మృతి వనంలోకి దొంగల్లా ప్రవేశించి, లైట్లార్పేసి దాడికి తెగబడుతున్న వైనంపై సమా చారం అందించినా వెంటనే పోలీసులు స్పందించకపోవడం ఏమిటి? ప్రతిపక్ష నాయకుడి పేరునే కదా తొలగించింది... విగ్రహంపై దాడి జరగలేదు కదా అనే సన్నాయి నొక్కులు పాలక పార్టీ తైనాతీల నోటి వెంట వినబడుతున్నాయి. ఈ లెక్కన ప్రతిపక్షాలకు చెందిన వారి ఇళ్లల్లో అక్రమంగా ప్రవేశించి దొంగతనం చేసినా ఫరవాలేదన్న మాట. పోలీసులు రక్షణ కూడా కల్పిస్తారేమో! నంద్యాల జిలాల్లో ఒక వైసీపీ కార్యకకర్తను పబ్లిగ్గా తెగనరుకుతుంటే ఆ హంతకులకు రక్షణగా పోలీసులు నిలబడిన వైపరీత్యాన్ని కూడా ఈ వారమే చూడవలసి వచ్చింది. ఏపీలో కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చిందా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగ అంతస్సారం... సర్వమానవ సమతావాదం. ఈ సిద్ధాంతానికీ ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్న ఎన్డీఏ కూటమి భావజాలానికీ అస్సలు పొసగదు. కూటమి పెద్దన్న భారతీయ జనతా పార్టీకి ఏ మాత్రం గిట్టదు. బీజేపీ తోలుబొమ్మను ఆడించే తెర వెనుక ఆరెస్సెస్‌కు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చే యాలన్నది చిరకాల వాంఛ. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. నాలుగు రోజుల్లోనే (నవంబర్ 30) ఆరెస్సెస్ అధికార పత్రిక ‘ఆర్గనైజర్’ దాన్ని ఆడిపోసుకోవడం మొదలుపెట్టింది.భారత రాజ్యాంగంలో భారతీయతే లేదని ‘ఆర్గనైజర్’ దుయ్యబట్టింది. ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలైన స్పార్టాకు లైకర్గస్లాగా, ఏథెన్స్కు సోలాన్ లాగా భారత్‌కు మనువు ఉండగా, ఆయన రూపొందించిన మనుస్మృతి ఉండగా ఈ రాజ్యాంగమెందుకని ‘ఆర్గనైజర్’ ప్రశ్నించింది. ఈ మనుధర్మ శాస్త్రం ఎటువంటిదో తెలిసిందే కదా! అసమానతలతో కూడిన కుల వ్యవస్థను సమర్థించిన శాస్త్రం. దళితులనైతే వర్ణవ్యవస్థకు ఆవల బహిష్కృతులుగా, అస్పృశ్యులుగా పరిగణించిన న్యాయ సంహిత ఇది. స్త్రీలకు స్వాతంత్య్రం అవసరం లేదని కూడా మనుస్మృతి అభిప్రాయపడింది. ‘పితా రక్షతి కౌమారే, భర్తా రక్షతి యౌవనే, రక్షంతి స్థవిరే పుత్రా, న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ (బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కుమా రుని రక్షణలో ఉండాలి. స్త్రీలకు స్వతంత్రత అవసరం లేదు)... ఇదీ మనుస్మృతి!ఇటువంటి మనుధర్మ సంహిత భారత రాజ్యాంగంగా ఉండాలని ఒక్క ‘ఆర్గనైజర్’ మాత్రమే కోరుకోలేదు. ఆరెస్సెస్ సిద్ధాంతవేత్తగా ప్రసిద్ధుడైన గురు గోల్వాల్కర్ (బంచ్ ఆఫ్ థాట్స్), ఆరెస్సెస్‌కు ప్రాతఃస్మరణీయుడైన వినాయక్‌రావు దామోదర్ సావర్కర్లు కూడా వివిధ సందర్భాల్లో అభిలషించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తొలి రోజుల్లోనే కాదు, ఆ తర్వాతి కాలంలో కూడా ఆరెస్సెస్ అభిప్రాయం మారలేదని ప్రముఖ కన్నడ రచయిత దేవనూర్ మహాదేవ ఆరెస్సెస్‌పై రాసిన ఒక చిన్న పుస్తకంలో నిరూపించారు. ఆ సంస్థ 1993 జనవరిలో విడుదల చేసిన శ్వేతపత్రంలో భారత రాజ్యాంగాన్ని ‘విదేశీ భావాలతో కూడిన హిందూ వ్యతిరేక సంహిత’గా అభిశంసించారని మహాదేవ రాశారు.ఆరెస్సెస్ అనే సంస్థ ప్రస్తుతం మూడు అంతర్లీన లక్ష్యాల కోసం పనిచేస్తున్నదని మహాదేవ వివరించారు. భారతదేశ ఫెడ రల్ స్వభావానికి విరుద్ధంగా కేంద్రీకృత అధికార స్థాపన మొదటి లక్ష్యం. ఇక రెండవది – మనుధర్మ శాస్త్రం ప్రబోధించిన వర్ణాశ్రమ ధర్మం. అసమానతలతో కూడిన కుల వ్యవస్థను కాపాడటం – సమాజంపై ఆర్యుల ఆధిపత్యాన్ని రుద్దడం మూడవది. ఆర్యులంటే ఎవరు? వర్ణాశ్రమంలో వారి స్థానాలేమిటి? తదితర అంశాలపై వివరణలు అవసరం కాకపోవచ్చు. ఇదిగో ఈ మూడు లక్ష్యాల సాధనలో భాగంగానే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పాఠ్య పుస్తకాల సిలబస్ సవరణ, మతాంతీకరణ వ్యతిరేక బిల్లును తేవడం తదితర చర్యలు చేపట్టిందని మహాదేవ అభియోగం.స్థూలంగా మనుషులంతా సమానం కాదని మనుధర్మ శాస్త్రం అభిప్రాయపడుతుంది. మనుషుల్లో కొందరు ఉత్తమ జాతులవారు, కొందరు నీచ జాతులవారు. ఈ నీచ జాతుల వారు ఉత్తమ జాతులను సేవిస్తూ జీవించాలి. అన్ని జాతుల్లోనూ పురుషుల స్థాయి ఎక్కువ. స్త్రీల స్థాయి తక్కువ. పురుషుల అడుగుజాడల్లో వారి పాదధూళిని తలదాల్చుతూ స్త్రీలు మనుగడ సాగించాలి. ఇటువంటి మనువాద తుప్పు భావాలను చీల్చి చెండాడుతూ మనుషులంతా ఒక్కటేనని చాటిచెప్పిన నవీన ధర్మ శాస్త్రం అంబేడ్కర్ విరచిత భారత రాజ్యాంగం. ఇటువంటి రాజ్యాంగంతో మనువాదులు రాజీపడటం అంత సులభసాధ్య మేమీ కాదు. అందుకే గడిచిన డెబ్బయ్ ఐదేళ్లుగా ఈ రాజ్యాంగంపై, దాన్ని రచించిన బాబాసాహెబ్‌పై వివిధ రూపాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయ రంగంలో మనువాదుల ప్రాబల్యం కారణంగానే రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా అమలు చేయడం ఇప్పటి దాకా సాధ్యం కాలేదు.ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు నాయకత్వం మొదలైన దగ్గర నుంచీ తెలుగుదేశం పార్టీలో వచ్చిన భావజాల మార్పు దాన్ని బీజేపీకి సహజ మిత్రపక్షంగా మార్చింది. కాకుల్ని కొట్టి గద్దలకు వేయడం ఆ పార్టీ ఆర్థిక సిద్ధాంతంగా మారింది. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో నిజాం షుగర్స్, ఆంధ్ర పేపర్, ఆల్విన్, రిపబ్లిక్ ఫోర్జ్ తదితర 56 ప్రభుత్వ రంగ సంస్థలను చంద్రబాబు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడమో, మూసివేయడమో చేశారు. ప్రైవేట్ వ్యక్తులు బాగా బలిస్తే... వారి దగ్గర నుంచి జారిపడే చిల్లరతో పేదలు బతికేస్తారనే ట్రికిల్‌డౌన్ ఆర్థిక సిద్ధాంతం చంద్రబాబుది. భారత రాజ్యాంగం కోరుకున్న పేదల సాధికారతతో ఈ ఆర్థిక సిద్ధాంతా నికి సాపత్యం కుదరదు.పేద వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యనూ, వైద్యాన్నీ ఆయన అందనీయలేదు. కనీస వైద్య సేవలు కూడా ఉచితంగా అందడానికి వీల్లేదని యూజర్ ఛార్జీలను ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆయనదే! వరస కరువుకాటకాలతో, నకిలీ ఎరువులు, పురుగుల మందుల వాడకంతో చితికిపోయిన రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వీల్లేదని ఆయన చెప్పిన పాఠాలు ఎప్పటికీ తెలుగు ప్రజలు మరిచిపోరు. విభజిత రాష్ట్ర ముఖ్య మంత్రిగా కూడా ఈ ఆర్థిక విధానాలకే ఆయన కట్టుబడి ఉన్నారు. ఆర్థిక రంగంలోనే కాదు, సామాజిక రంగంలోనూ ఆయన భావజాలానికీ, మనుస్మృతికీ మధ్యన పెద్దగా తేడాలుండవు. తన కులతత్వ ఆలోచనలు, పురుషాహంకార అభిప్రాయా లను దాచుకోవడం కూడా ఆయనకు సాధ్యపడలేదు. విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీసీల తోకలు కత్తిరిస్తానని ఆయన బహిరంగంగానే బెదిరించారు. ‘ఎస్సీ కులాల్లో పుట్టా లని ఎవరు కోరుకుంటార’ని ప్రెస్‌మీట్‌లోనే ఈసడించు కున్నారు. ‘న్యాయస్థానాల్లో జడ్జీ పదవులకు బీసీలు పనికిరారం’టూ కేంద్రానికి లేఖలు రాశారు. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా’ అని తన మనువాద భావాలను బయటపెట్టుకున్నారు.ఈ మనువాద రాజకీయాలకు పూర్తి భిన్నంగా గడిచిన ఐదేళ్ల జగన్మోహన్రెడ్డి పరిపాలన సాగింది. భారత రాజ్యాంగ లక్ష్యాల సాధన ఆశయంగా, సుస్థిర అభివృద్ధి ధ్యేయంగా సాగిన ఆయన ఐదేళ్ల పరిపాలన దేశం ముందు ఒక ఆదర్శ నమూనాను ఆవిష్కరించింది. ఈ నమూనాపై జరిగిన విద్వేషపూరిత విష ప్రచారం బహుశా ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఎప్పుడూ జరిగి ఉండదు. సమాజంలోని పేదవర్గాల సంక్షే మానికీ, మధ్య తరగతి కలల సాకారానికీ, మహిళల సాధికా రతకూ మనువాద సంపన్న వర్గాలు మనస్ఫూర్తిగా సహకరించవు. ఈ వర్గాలను చంద్రబాబు ఏకం చేసుకున్నారు. వారి వద్ద నున్న సకల అస్త్ర శస్త్రాలు, హంగు ఆర్భాటాలతో యుద్ధానికి దిగారు. విద్వేషపు విషవాయువులతో కార్పెట్ బాంబింగ్ చేశారు. ఒక్కో నియోజకవర్గం ఒక్కో భోపాల్ మాదిరిగా విష వాయువులతో ఉక్కిరి బిక్కిరైంది.విష ప్రచారాన్ని కొంతమందైనా నమ్మి ఉండవచ్చు. అరచేతిలో చూపెట్టిన వైకుంఠానికి మరికొంతమంది మోస పోయి ఉండవచ్చు. వోట్ ఫర్ డెమోక్రసీ (వీఎఫ్‌డీ), అసోసి యేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థలు బల్లగుద్ది చెబుతున్నట్టుగా ఈవీఎమ్లలో మాయాజాలం జరిగి ఉండ వచ్చు. ఈ మాయాజాలంలో దేశంలోనే అత్యధికంగా యాభై లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నట్టు వీఎఫ్‌డీ వాదిస్తున్నది. కారణమేదైనా చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అలవాటు ప్రకారం చేతిలోని వైకుంఠాన్ని చెట్టెక్కించారు. ముసుగు చీల్చు కొని మనువాదం బయటకొచ్చింది.మహిళా సాధికారతపై దాడి జరిగింది. ‘అమ్మ ఒడి’, ‘చేయూత’ వగైరా పథకాలు ఆగిపోయాయి. పేద విద్యార్థుల నాణ్యమైన చదువుపై దాడి జరిగింది. జగనన్న విద్యా కానుక, మధ్యాహ్న భోజనం, రీయింబర్స్మెంట్, వసతి దీవెన తదితర కార్యక్రమాలు పట్టాలు తప్పాయి. ‘ఫ్యామిలీ డాక్టర్’ మాయ మయ్యాడు. ‘ఆరోగ్యశ్రీ’నీ నీరుకార్చారు. పాలనా వికేంద్రీకర ణకు చాపచుట్టారు. వలంటీర్ వ్యవస్థ మాయమైంది. ఆర్బీకేల సేవలు ఆవిరయ్యాయి. విత్తనాల కోసం ఐదేళ్ల తర్వాత రైతులు మళ్లీ క్యూలైన్లలో రోజుల తరబడి నిలబడుతున్నారు. జగన్ మోహన్‌రెడ్డి ప్రారంభించిన ప్రభుత్వ వైద్యశాలలపై ప్రైవేటీ కరణ కత్తి వేలాడుతున్నది. కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర రహదారులపై సైతం టోల్ వసూలుకు రంగం సిద్ధమైంది. రాజ్యాంగ లక్ష్యాలపై వరసగా దాడులు జరుగుతున్నాయి. అంబే డ్కర్ స్మృతివనంపై జరిగిన దాడిని ఒక ప్రతీకాత్మక దాడిగానే పరిగణించాలి. విజయవాడ నడిబొడ్డున ఆకాశమెత్తు అంబేడ్క రుడి మహాశిల్పాన్ని జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేశారు. ఇది ఆంధ్రా మనువాదుల్లో కడుపు మంటకు కారణమైంది. నలభ య్యేళ్ల నాటి కారంచేడు కండకావరం తిమ్మిరి ఇంకా వదల్లేదు. జగన్మోహన్రెడ్డి పేరును తొలగించి కొంత ఆనందాన్ని పొంది ఉండవచ్చు. ముందు ముందు మరిన్ని దాడులు జరగవచ్చు. ఆ దాడుల అసలు లక్ష్యం – భారత రాజ్యాంగం మాత్రమే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
‘అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయాలన్నదే కూటమి సర్కార్ ప్లాన్’
సాక్షి, విజయవాడ: అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. విగ్రహంపై ఉద్దేశపూర్వకంగా దాడి జరిగిందన్నారు. అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టించడం టీడీపీ నేతలకు ఇష్టంలేదని చెప్పుకొచ్చారు.కాగా, విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ నేతలు నిరసన చేపట్టారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనల్లో మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ నేతలు దేవినేని అవినాష్,షేక్ ఆసిఫ్, పోతిన మహేష్, దళిత సంఘం నేతలు, వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నాయి.👉ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది ధ్వంసం చేయాలని చూశారు. ఈ దుశ్చర్యను యావత్ రాష్ట్ర ప్రజానీకం ఖండించారు. అంబేద్కర్‌ను అవమాన పరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత నిరసన చేపట్టాం. ఈ ఘటనకు కారకులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ నిరసన తెలిపాం. కొంతమంది కళ్లు లేని కబోథులు అక్షరాలే కదా అని అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. అంబేద్కర్ విగ్రహం ఉన్న ప్రాంతంలో ఏ చిన్న అవాంతరం జరిగినా అవమానమే. గునపాలతో దాడి చేసేందుకు వస్తే మీకు కళ్లు కనిపించలేదా?. అంబేద్కర్ విగ్రహం బెజవాడ నడిబొడ్డున ఉండటం చంద్రబాబుకు, టీడీపీ నేతలకు ఇష్టం లేదు. అంబేద్కర్‌ను అవమాన పరిచిన వారు ఎంతటి వారైనా విడిచిపెట్టవద్దని గవర్నర్, రాష్ట్రపతికి లేఖలు ఇచ్చాం. ఈ ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తాం. అంబేద్కర్ విగ్రహంపై గునపం పడితే ఊరుకునేది లేదు. మా ఆందోళన ఉధృతం చేస్తాం. ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తాం. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులు ఎలాంటి వారైనా శిక్ష పడాల్సిందేనని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 👉మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహం ఉండటాన్ని ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. ఈ ఘటనపై ఇంతవరకూ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. రాత్రి పూట లైట్లు ఆర్పి అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశారు. అంబేద్కర్ విగ్రహం చుట్టూ సెక్యూరిటీ లేదు. ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగింది. ఈ దాడి ఘటనపై కేంద్రాన్ని, గవర్నర్, రాష్ట్రపతిని, కోర్టులను ఆశ్రయిస్తాం. 👉వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఉండకూడదని నీచమైన చర్యలకు పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం దిగజారిపోయి వ్యవహరిస్తోంది. అంబేద్కర్ విగ్రహంపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. 👉విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేని సాంప్రదాయానికి కూటమి ప్రభుత్వం తెర తీసింది. అంబేద్కర్ విగ్రహంపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. 👉వైఎస్సార్సీపీ నాయకుడు పోతిన మహేష్ మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహంపై దాడిని ప్రజాస్వామ్యం పై దాడిగా పరిగణిస్తాం. రాజ్యాంగంపై నమ్మకం ఉంటే ఈ ఘటనను ప్రభుత్వం ఖండించి ఉండేది. ఈవీఎంలను నమ్ముకున్నారు కాబట్టే అంబేద్కర్‌పై జరిగిన దాడిని ఖండించ లేకపోతున్నారు. చంద్రబాబు అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి ఎందుకు నివాళులర్పించలేదు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. అంబేద్కర్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు. స్వరాజ్య మైదానాన్ని చంద్రబాబు చైనా కంపెనీలకు, సుజనా చౌదరికి అమ్మేయాలని చూశారు. వారసత్వ సంపదైన స్వరాజ్య మైదానాన్ని చంద్రబాబు దోచుకోవాలని చూశారు. కానీ, వైఎస్ జగన్ మాత్రం కాపాడారు. కుట్రలు కుయుక్తలతో అంబేద్కర్ విగ్రహాన్ని విధ్వంసం చేయాలనేదే కూటమి పార్టీల ఉద్ధేశం. పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై ఎందుకు స్పందించలేదు. అంబేద్కర్ విగ్రహంపై దాడికి పాల్పడిన వారిని శిక్షించకపోతే రాష్ట్ర ప్రజలు త్వరలోనే మిమ్మల్ని తిరస్కరిస్తారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
అంబేద్కర్ విగ్రహంపై దాడి రాజకీయ కుట్రే: కైలే అనిల్ కుమార్
సాక్షి, తాడేపల్లి: విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగితే కూటమి ప్రభుత్వం కనీసం స్పందించ లేదన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. అలాగే, విగ్రహం వద్ద దాడిపై టీడీపీ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు.కాగా, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగే అవకాశం ఉందని ప్రభుత్వానికి తెలియదా?. విగ్రహం దాడిపై టీడీపీ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారు. ఒకసారి దుండగులు దాడి చేశారన్నారు. ఇంకో సారి ఏపీ ఐఐసి వాళ్ళు వచ్చారు అన్నారు. మరోసారి వైఎస్ జగన్ అంటే గిట్టని దళితులు ఎవరో చేశారని అంటున్నారు. అసలు దాడి చేసింది ఎవరైనా తేల్చాల్సిందే ప్రభుత్వ మే కదా?. అంత మంది వచ్చి దాడి చేస్తుంటే పోలీసులకు తెలియలేదా?. విగ్రహం వద్ద రాత్రి సమయంలో లైట్లు ఆర్పేస్తే ఎందుకు సిబ్బందిని విచారించలేదు. పోలీసులు కూడా అక్కడే ఉన్నారని అంటున్నారు. ఒకవేళ పోలీసులు లేకపోతే ఎందుకు ఇప్పటివరకు ఎవ్వరినీ విచారించలేదు. పోలీస్ కమిషనర్ ఆఫీస్ పక్కనే ఉన్న అంబేద్కర్ స్మృతివనంపై జరుగుతున్న దాడి కనిపించలేదా?. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబేద్కర్పైనా, ఆయన భావజాలంపైనా చంద్రబాబుకు గౌరవం లేదు. అందుకే ఈ దాడి జరిగినా కనీసం స్పందించలేదు.స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడం సీఎం చంద్రబాబుకి ఇష్టం లేదు. ఆయన అమరావతిలో పెడతాను అన్నారు తప్ప అక్కడ పెట్టలేదు. స్వరాజ్య మైదానాన్ని గతంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి చంద్రబాబు లబ్ది పొందాలని చూశారు. గతంలోనే అక్కడ ప్రజలు ఆందోళన చేస్తే చంద్రబాబు వెనక్కి తగ్గారు. అంబేద్కర్ స్మృతి వనానికి రక్షణ లేకపోవడం దారుణం. అంబేద్కర్‌ను గుర్తు చేసుకునేలా చంద్రబాబు ఏనాడైనా ఒక్క పని చేశారా?. చంద్రబాబు ఏనాడైనా అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లారా?. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర. టీడీపీ నేతలే అరాచక మూకలని పంపారు. అంబేద్కర్ స్మృతి వనం తీసేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టే కుట్ర ఉంది. అందులో భాగంగానే ఈ దాడికి పాల్పడ్డారని భావిస్తున్నాం. వాళ్లే ప్రభుత్వంలో ఉండి మా మీద ఆరోపణలు చేస్తున్నారు. -
ఏపీలో పోలీసు వ్యవస్థ ఉందా..?
-
అంబేద్కర్ ఘటనపై టీడీపీకి వరుదు కళ్యాణి స్ట్రాంగ్ కౌంటర్
-
అంబేద్కర్ విగ్రహంపై పచ్చమూక దాడిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
-
అంబేద్కర్ విగ్రహ ధ్వంసానికే తెగబడ్డారు తెలుగు రాక్షసులు
-
అంబేద్కర్ విగ్రహాన్ని కూటమి సర్కార్ కూల్చే అవకాశముంది: మేరుగు నాగార్జున
సాక్షి, తాడేపల్లి: విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టే అవకాశముందన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అంటూ కామెంట్స్ చేశారు.కాగా, మాజీ మంత్రి మేరుగు నాగార్జున శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘భావితరాలకు దికూచ్చిగా ఉండాలని అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేశారు. గతంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టమంటే చంద్రబాబు కేసులు పెట్టారు. ఎక్కడైనా విగ్రహం పెట్టినప్పుడు చూడటానికి వెళ్లినా కూడా కేసులు నమోదు చేశారు. ఇప్పుడు విజయవాడలో అంబ్కేదర్ విగ్రహంపై దాడికి ప్రయత్నించారు. కూటమి ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టే అవకాశముంది. ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఉండకూడదనే దాడి చేశారు. తక్షణమే ఈ ఘటనపై విచారణ చేపట్టాలి. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.ఇదే సమయంలో మాజీ ఎంపీ నందిగాం సురేష్ మాట్లాడుతూ..‘ప్రజల దృష్టిని మళ్లించడానికే అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశారు. ప్రజలను భయభాంత్రులకు గురి చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారు. ఇప్పుడు హామీలు అమలు చేయకుండా కమిటీలు వేస్తామని కథలు చెబుతున్నారు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.మరోవైపు.. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహంపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణించాలి. ప్రభుత్వమే ఈ దాడి చేయించిందనే అనుమానం కలుగుతోంది. అంబేద్కర్ విగ్రహంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశారంటే వ్యవస్థలు ఎంతగా దిగజారిపోయాయి అనేది అర్థం చేసుకోవచ్చు. విగ్రహం వద్ద వైఎస్ జగన్ పేరుని తొలగించవచ్చేమో కానీ ప్రజల గుండెల్లో ఆయన పేరును తొలగించలేరు. అంబేద్కర్ విగ్రహానికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలి. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు దగ్గరలోనే ఉన్నా ఎందుకు పట్టించుకోలేదు?. సామాజిక న్యాయం కోసం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో అంబేద్కర్ విగ్రహం నిర్మించారు. కూటమి నేతలకు సామాజిక న్యాయం అంటే పట్టదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక, ఇదే ఘటనపై తిరుపతిలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. అంబేద్కర్ స్మృతివనం వద్ద దాడిని ఖండిస్తున్నాను. అన్ని జాతులకు ఆశాజ్యోతి బాబా సాహెబ్ అంబేద్కర్. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఆరాధ్యదైవంగా అంబేద్కర్‌ను భావిస్తారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఘటనలో బాధ్యులైన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. దేశానికే ఆదర్శంగా ఉండాలని వైఎస్ జగన్ విజయవాడ నడి బొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే చూస్తూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనపై బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలి అని కామెంట్స్ చేశారు. -
బాబు కడుపు మంట.. జగన్ పేరు ధ్వంసం
-
అంబేద్కర్ ని కూడా కాదన్నారు..!
-
పచ్చ మీడియా అంబేద్కర్‌ను అవమానించింది: ఆర్కే రోజా
సాక్షి, విజయవాడ: ప్రభుత్వంపై వ్యతిరేక కథనాలు రాస్తున్న పచ్చపత్రికలపై మంత్రి ఆర్కే.రోజా ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ అంటే మీకు (పచ్చ పత్రికలు) గౌరవం లేదా? అని సూటిగా ప్రశ్నించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చూపించేందుకు మనసు రాలేదా? అని మండిపడ్డారు. అంబేద్కర్‌కు నిజమైన వారసుడు సీఎం జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. సీఎం జగన్మోహన్రెడ్డిని అందరూ అభినందిస్తుంటే పచ్చ మీడియా తట్టుకోలేకపోతోందని అన్నారు. పచ్చ మీడియాను..పత్రికలను బహిష్కరించాలన్నారు. శుక్రవారం రోజున ఒక్క నిమిషం కూడా అంబేద్కర్‌ను చూపించలేకపోయారని మంత్రి రోజా తెలిపారు. అంబేద్కర్‌ను పచ్చమీడియా అవమానించిందని..అంబేద్కర్‌కు అండగా నిలబడిన వర్గాలను కూడా అవమానించిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి అంబేద్కర్ విగ్రహాన్ని వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. వంద అడుగుల విగ్రహం పెడతానని చెప్పిన చంద్రబాబు.. ఒక్క విగ్రహమైనా పెట్టాడా? అని ప్రశ్నించారు. ప్రచారాలు, సమస్యల డైవర్షన్‌కు చంద్రబాబు అంబేద్కర్‌ను వాడుకున్నారని అన్నారు. తోపు.. తురుము అని చెప్పుకునే చంద్రబాబు విజయవాడ నడిబొడ్డులో ఏరోజైనా ఇలాంటి కార్యక్రమం చేయగలిగారా? అని నిలదీశారు. అంబేద్కర్ స్మృతివనం చూసేందుకు రెండు కళ్లూ సరిపోవని, మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. విజయవాడను ప్రపంచ పటంలో నిలిపిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. తమ సామాజిక వర్గమైన చంద్రబాబును కాపాడుకోవడం కోవడమే ఎల్లోమీడియా పని అని విమర్శించారు. టీడీపీ,జనసేన తోక పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని మంత్రి ఆర్కే రోజా అన్నారు. చదవండి: ‘ఎల్లో’ ఏడుపులకు సీఎం జగన్ దిమ్మదిరిగే సమాధానం -
అంబేద్కర్ విగ్రహంపై ఎల్లో ఏడుపులకు దిమ్మదిరిగే సమాధానం
-
లక్షలాది మంది సమక్షంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
-
జై భీమ్..ఆకాశమంత స్ఫూర్తి..
-
కుల అహంకార వ్యవస్థల దుర్మార్గాలపై తన పోరాటానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్పూర్తి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడి.. విజయవాడలో సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ..ఇంకా ఇతర అప్డేట్స్
-
అంబేద్కర్ స్మృతి వనం: 18 ఎకరాల్లో దాదాపు రూ.404 కోట్లతో నిర్మాణం
-
అంబేద్కర్ విగ్రహం లేజర్ లైట్ షో
-
అది మా దేవుడి విగ్రహం మీరెందుకు ఏడుస్తున్నారు..!
-
చరిత్రలో నిలిచిపోయే సభ
-
కేవలం విగ్రహం కాదు..కళ్లు చెదిరేలా అంబేద్కర్ స్మృతివనం
-
ప్రారంభోత్సవానికి సిద్ధమైన సామాజిక న్యాయ మహాశిల్పం
-
బానిస సంకెళ్లు తెంచిన మహాశిల్పం..
-
విశాఖ నుంచి విజయవాడకు బయలుదేరిన అంబేద్కర్ అభిమానులు
-
విజయవాడలో ప్రపంచంలోనే అతిపెద్దదైన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
-
సామాజిక న్యాయ మహా శిల్పం..నేడు జాతికి అంకితం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి, అమరావతి: స్వాతంత్రోద్యమంలో ఎన్నో చారిత్రక సమావేశాలకు వేదికగా నిలిచిన బెజవాడ స్వరాజ్య మైదానంలో నిర్మిస్తున్న భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం పనులు పూర్తిచేసుకుని ప్రారంభానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. చరిత్రలో నిలిచిపోయేలా రూపుదిద్దుకున్న సామాజిక న్యాయ మహాశిల్పం జాతికి అంకితమిచ్చే తరుణం వచ్చేసింది. అద్భుతమైన ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ఈ స్మృతివనం పనులను మహాయజ్ఞంలా పూర్తిచేశారు. అత్యంత అందంగా తీర్చిదిద్దుతున్న ఈ ప్రాంగణం ప్రపంచస్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించే వేదికగా మారనుంది. దేశంలో మతాతీతమైన విగ్రహాల్లో ఇదే అతిపెద్దది కావడం విశేషం. 206 (81 అడుగుల బేస్, 125 అడుగుల విగ్రహం) అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రాత్రివేళ ప్రత్యేక కాంతులతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించి, అత్యంత అద్భుతంగా రూపొందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నిత్యం అధికారులతో మాట్లాడుతూ పనులు పరుగులు పెట్టించారు. ఇలా స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ (సామాజిక న్యాయ మహా శిల్పం)ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. ఈ అరుదైన అంబేడ్కర్ సామాజిక న్యాయ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జనవరి 19న ఆవిష్కరిస్తున్నారు. ఇక స్మృతివనాన్ని వీక్షించేందుకు ఈ నెల 20 నుంచి సామాన్య ప్రజలకు ప్రవేశం కల్పించనున్నారు. ఇదీ చదవండి: విగ్రహావిష్కరణ.. విజయవాడలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు 18.18 ఎకరాల్లో.. రూ.404 కోట్లతో... రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 18.18 ఎకరాల్లో దాదాపు రూ.404.35 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో అందమైన గార్డెన్‌ను రూపొందించారు. ఎంఎస్ అసోసియేట్ సంస్థ డిజైన్లు రూపొందించింది. అంబేడ్కర్ విగ్రహం పనుల కోసం రూపొందించిన ప్రాజెక్టు పనులకు దేశీయ మెటీరియల్‌నే ఉపయోగించారు. ప్రత్యేకంగా అందమైన గార్డెన్, వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటేన్లు, చిన్నపిల్లలు ఆడుకోవటానికి, వాకింగ్ చేసుకోవటానికి వీలుగా తీర్చిదిద్దారు. పార్కింగ్ సౌకర్యం కల్పించారు. మొత్తం భవనాన్ని 30 మీటర్ల లోతులో.. 539 పిల్లర్లతో నిర్మించారు. ముందుభాగం కారిడార్‌ను 166 పిల్లర్లతో రూపొందించారు. దీనిని 388 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పుతో రూపొందించారు. ఇందులో ఆయన జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్‌వర్క్ ఏర్పాటుచేశారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చైర్మన్‌గా 8 మంది మంత్రులతో ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటుచేసింది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పనుల ప్రగతిని కమిటీ సమీక్షించింది. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఈ ప్రాజెక్టు పనులు స్వయంగా పర్యవేక్షించారు. పనుల పరిశీలన... ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం రాత్రి ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘరాం, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ సంపత్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌లు పరిశీలించారు. విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలు చర్చించారు. విజయవాడలో నేడు సీఎం జగన్ పర్యటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 19న శుక్రవారం విజయవాడలో పర్యటించనున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభ, స్వరాజ్ మైదానంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. సా.4.30కు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం చేరుకుంటారు. అక్కడ సామాజిక సమతా సంకల్ప సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం స్వరాజ్ మైదాన్ చేరుకుని అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఏపీకే తలమానికం.. అంబేడ్కర్ స్మృతివనంను 18.18 ఎకరాల్లో తీర్చిదిద్దాం. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏపీలో తలమానికంగా నిలువనుంది. 166 పిల్లర్లతో అందమైన కారిడార్, 38 మ్యూరల్స్ ఏర్పాటుచేశాం. స్మతివనం ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దాం. ఇది ఓ మాన్యుమెంట్గా మిగిలిపోనుంది. అడ్వాన్స్ టెక్నాలజీతో మ్యూజియంను ఏర్పాటుచేశాం. – శ్రీలక్ష్మి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జగనన్న నిర్ణయం చరిత్రాత్మకం అంబేడ్కర్ స్మృతివనం నిర్మాణం గొప్ప కార్యక్రమం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రాత్మకం. గత టీడీపీ ప్రభుత్వం దళితులను ఎంతో మోసం చేసింది. అంబేద్కర్ విగ్రహం నిర్మించేందుకు సరైన స్థలం కూడా చంద్రబాబు ఇవ్వలేదు. విజయవాడ నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కేటాయించారు. సీఎం చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తాం. – మేరుగు నాగార్జున, మంత్రి విగ్రహం బేస్ కింది భాగంలో.. ► గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు హాల్స్ ఉంటాయి. ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లు ఆయన చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియంలు ఉంటాయి. ► ఫస్ట్ ఫ్లోర్లో 2,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్లుంటాయి. ఒక హాల్లో అంబేడ్కర్‌కు దక్షిణ భారతదే«శంతో ఉన్న అనుబంధాన్ని డిస్ప్లే చేస్తారు. రెండు హాళ్లలో మ్యూజియం, ఒక హాల్లో లైబ్రరీ ఉంటాయి. ► ఇక సెకండ్ ఫ్లోర్లో 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాల్లు ఉంటాయి. వీటిని లైబ్రరీకి వినియోగించాలనే ప్రతిపాదన ఉంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో.. ► అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపట్టి స్మృతివనం ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ► అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపే (డిజిటల్) మ్యూజియంను 75 మంది సీటింగ్ కెపాసిటీతో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారు. ► ఇది ప్రపంచంలోనే అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపే అతిపెద్ద మ్యూజియం కావడం విశేషం. ► మినీ థియేటర్లు, ఫుడ్‌కోర్టు, కన్వెన్షన్ సెంటర్, వెహికల్ పార్కింగ్ ఉన్నాయి. కన్వెన్షన్ సెంటర్ 6,340 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 2,000 మంది సీటింగ్ సామర్థ్యంతో నిర్మించారు. ఫుడ్‌కోర్టు 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ► బిల్డింగ్ చుట్టూ నీటి కొలనులు, మ్యూజికల్, వాటర్ ఫౌంటేన్, ముందుభాగంలో ఉన్నాయి. నీటి కొలనుకు లైటింగ్, బబ్లింగ్ సిస్టం ఉన్నాయి. ఇవన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడి ఉంటాయి. కాలచక్ర మహా మండల పీఠం బౌద్ధ వాస్తు శిల్పకళతో అంబేడ్కర పీఠం (పెడస్టల్)ను రూపొందించారు. ► విగ్రహ పీఠం లోపల జి ప్లస్ 2 అంతస్తులను ఐసోసెల్స్ ట్రాపేజియం ఆకారంలో ఆర్సీసీ ఫ్రేమ్డ్ నిర్మాణం చేశారు. రాజస్థాన్‌కు చెందిన పింక్ రాక్‌ను ఉపయోగించారు. ► అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్ వర్క్ ఏర్పాటుచేస్తున్నారు. అంబేడ్కర్ జీవితంలో బాల్యం, విద్య, వివాహం, ఉద్యోగం, రాజకీయ జీవితం, పోరాటాలు, రాజ్యాంగ నిర్మాణం ఛాయాచిత్రాలను, ఇతర వస్తువులను ప్రదర్శించే మ్యూజియం ఏర్పాటవుతుంది. ► ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏదైనా ప్రశ్న అడిగితే, ఆయనే సమాధానం ఇచ్చే అనుభూతి వచ్చేలా వీడియో సిస్టం ఏర్పాటుచేస్తున్నారు. èవిగ్రహాన్ని హనుమాన్ జంక్షన్ వద్ద శిల్పి ప్రసాద్ ఆధ్వర్యంలో కాస్టింగ్ చేశారు. ► స్థానిక కూలీలతో పాటు, ఢిల్లీ, బిహార్, రాజస్థాన్ నుంచి వచ్చిన 500–600ల మంది కూలీలు రెండేళ్లపాటు మూడు షిఫ్ట్‌ల్లో పనిచేశారు. ఈ పనులను 55 మంది సాంకేతిక నిపుణులు పర్యవేక్షించారు. -
బడుగులపై సీఎం ప్రేమకు నిదర్శనం
సాక్షి, అమరావతి: విజయవాడ నడిబొడ్డున 206 అడుగుల బీఆర్ అంబేడ్కర్ మహావిగ్రహం రూపకల్పనతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో విశ్వకర్మగా చరిత్రలో నిలిచిపోతారని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అభివర్ణించారు. దేశ చరిత్రలోనే మహాఘట్టంగా నిలిచిపోయే అంబేడ్కర్ మహా విగ్రహం ఆవిష్కరణ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా జరగనుందని, ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు అంబేడ్కర్ సిద్ధాంతాలకు అభిమానించే వారు, దళితులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన సుమారు 1.50 లక్షల మంది హాజరుకానున్నారని పేర్కొన్నారు. ’సామాజిక న్యాయ మహాశిల్పం’ ఆవిష్కరణ, సామాజిక సమతా సంకల్ప సభ కార్యక్రమాల ఏర్పాట్లను పార్టీ నాయకులతో కలిసి విజయసాయిరెడ్డి గురువారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మరెక్కడా లేనివిధంగా రూపొందించిన ఈ మహా శిల్పం నుంచి జీవకళ ఉట్టిపడుతోందన్నారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించే వారిలో దేశంలోనే ముందుండే సీఎం జగన్ అధికారంలోకి వచ్చి కేవలం నాలుగున్నరేళ్ల కాలంలోనే దళితుల కలను సాకారం చేశారన్నారు. ఈ మహా విగ్రహం సీఎం జగన్‌కు బడుగు, బలహీన వర్గాల మీద ఉన్న ప్రేమాభిమానాలను ప్రతిబింబిస్తోందన్నారు. అంబేడ్కర్ స్మృతివనం దేశంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా అవతరించనుందని చెప్పారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మ్యూజియంలో అంబేడ్కర్ బాల్యం, విద్యాభ్యాసం, ఇతర ఘట్టాలకు సంబంధించి చిత్రాల్లో జీవం ఉట్టిపడుతోందన్నారు. విజయసాయిరెడ్డి వెంట మంత్రులు మేరుగు నాగార్జున, కె.నారాయణస్వామి, జోగి రమేష్, ఎంపీలు నందిగం సురేష్, కేశినేని నాని, మాజీ మంత్రులు సుచరిత, వెలంపల్లి శ్రీనివాస్, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకరరావు, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేత దేవినేని అవినాశ్ ఉన్నారు. -
సామాజిక న్యాయ మహాశిల్పం
-
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహాశిల్పం దేశానికే తలమానికం.. ఇది ‘స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’ అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశం..ఇంకా ఇతర అప్డేట్స్
-
ప్రత్యామ్నాయ సాంస్కృతిక శిఖరం
ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అరుదైన భారతీయుడు డా‘‘ బీఆర్ అంబేడ్కర్. అమానవీయ పరిస్థితులను ఎదుర్కొంటూ, విద్యను ఆయుధంగా ఎంచి ఎన్నో ఉన్నత డిగ్రీలు పొంది దేశానికి రాజ్యాంగ రచనలో దీపధారి అయ్యారు. దళితులూ, ఆదివాసీలూ, మహిళలూ, ఇతర అణగారిన వర్గాలకు ఆయన ఒక ధైర్య వచనం. తన కాలంలోనే గాక, ఆ తరువాత కాలాన్నీ వెలిగించడానికి అక్షర సముచ్చయాన్ని నిర్మించిన మేధావి. భారత ఉపఖండంలో తన సౌజన్యం ద్వారా రక్తపాతాన్ని నివారించి, నిర్మాణాత్మక సామాజిక విప్లవాన్ని నడిపిన ప్రత్యామ్నాయ సాంస్కృతిక శిఖరం ఆయన. ఆ మహాను భావుడి జ్ఞాపకార్థం 125 అడుగుల భారీ విగ్రహాన్నీ, ఓ స్మృతి వనాన్నీ నిర్మించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజారాశుల ఆదరణను చూరగొంటోంది. జనవరి 19వ తేదీన విజయవాడ ‘అంబే డ్కర్ నగర్’గా వెలుగొందుతుంది. ప్రత్యామ్నాయ సంస్కృతీ నిర్మాణంలో స్వాతంత్య్రం తర్వాత కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వెలుగొందిన అంబేడ్కర్ శిల్ప నిర్మాణం అత్యు న్నతమైంది, విస్తృతమైంది. దక్షిణ భారతదేశానికి నడిబొడ్డున ఉన్న విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం, ఆవిష్కరణ, స్మృతివన వికాసం చెరపలేని సంఘటనలు. అశోకుని సాంచీ స్తూపానికి ఎంత పేరు వస్తుందో విజయవాడలోని స్మృతివనానికీ అంతే పేరు వస్తుందనడం అతిశయోక్తి కాదు. బౌద్ధమతాన్ని స్వీకరించి బౌద్ధునిగా మహాపరినిర్వాణం పొందిన అంబేడ్కర్ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ విగ్రహం కానీ, స్మృతివనం కానీ ప్రపంచ బౌద్ధ పర్యా టకులను ఆకర్షించడం తథ్యం. నిజానికి బౌద్ధానికి ఈ ప్రాంతం కొత్తేమీ కాదు. అశోకుని కాలంలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతానికి బౌద్ధం విస్తరించింది. అమరావతి స్తూపం మొదటి దశ నిర్మాణాలు మౌర్యుల వాస్తు నిర్మాణాలనే పోలి ఉండటం, అనేక విద్దాంక నాణెములు (పంచ్ మార్క్డ్ కాయిన్స్) లభించడం, అశోకుని కాలపు నాటి బ్రాహ్మీ లిపిలోనే కొన్ని శాసనాలు లభించడాన్ని బట్టి ఆయన కాలంలోనే బౌద్ధం ఇక్కడికి వ్యాపించిందని చెప్పవచ్చు. అలాగే అప్పట్లోనే ఇవ్వాళ దళితులుగా వ్యవహరించ బడుతున్న జన సమూహాలు బౌద్ధాన్ని అవలంబించాయి. అమరావతి స్తూపంపై ఉన్న... ఓ చర్మకారుడు స్తూపానికి ఇచ్చిన దానాన్ని తెలియచేసే శాసనం ఇందుకు మంచి ఉదాహరణ. దళితులు, కులవృత్తులవారే ఆ నాటి స్తూప నిర్మాణానికి రాళ్లు, మట్టినీ మోశారు. అద్భుత శిల్పాలను మలిచారు. అందుకే భారతదేశ చరిత్రలో మొదటి సాంస్కృతిక విప్లవం బౌద్ధం నుండే ప్రారంభమైందని చెప్పవచ్చు. హిందూ మతోన్మాదం బౌద్ధ శిల్పాలను, స్తూపాలను, చైత్యాలను, ఆశ్రమాలను హింసాత్మకంగా కూల్చివేసింది. కానీ మళ్లీ డా‘‘ బీఆర్ అంబేడ్కర్ శిల్పంలో ఒక ప్రత్యామ్నాయ ప్రకాశిత, విభాసిత శిల్ప కాంతులు వెల్లివిరుస్తున్నాయి. అంబేడ్కర్ విగ్రహమే ఒక విశ్వవిద్యాలయంలా ఉంటుంది. ఆయన వేలు ఒక ప్రశ్నోపనిషత్తు. ఆయన విగ్రహం విద్యా వికాసానికి నిలువెత్తు నిదర్శనం. ఆయన ప్రపంచ మానవుడు. లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ ముందు డా‘‘ బీఆర్ అంబేడ్కర్ నిలువెత్తు విగ్రహం భారత దేశ వ్యక్తిత్వాన్ని ప్రకాశింపచేస్తుంది. లండన్ మ్యూజియం లైబ్రరీలో ఆయన చిత్రపటం ప్రపంచ మేధావుల పంక్తిలో మెరుస్తుంది. లండన్ ఇండియన్ హౌస్‌లో ఆయన బంగారు విగ్రహం ఆయన జీవన సాఫల్యానికి గుర్తుగా వుంది. అంబేడ్కర్ పోరాటం ద్వారానే అధికార ప్రతిష్ఠ జరుగుతుందని నొక్కి వక్కాణించాడు. దళితులను దేవుడిపైన లేక సూపర్ మ్యాన్ పైన ఆధారపడవద్దని హెచ్చరించాడు. ‘మీపై మీరు విశ్వాసం ఉంచుకొని నడవండి. ఎవరిపైనా ఆధార పడకండి. నిజాయితీగా ఉండండి. ఎప్పుడూ సత్యాన్ని ఆశ్రయించండి. దేనికీ లోబడకండి. ఎవరికీ తలవంచకండి’ అని అంబేడ్కర్ పిలుపు నిచ్చాడు. అంబేడ్కర్ ఒక ప్రవక్త, దార్శనికుడు. ఆయన ఒక జీవన వ్యవస్థల నిర్మాత. అణగారిన ప్రజల గుండె దివ్వెలు వెలిగించిన భానుడు. ఆయన జీవించిన కాలంలోనే గాక ఆ తరువాత కాలాన్నీ వెలిగించడానికి అక్షర సముచ్చయాన్ని నిర్మించిన మేధావి. జాన్డ్యూ యిని అధ్యయనం చేసిన అంబేడ్కర్ ప్రజాస్వామ్య లౌకికవాది. భారత ఉపఖండంలో తన సౌజన్యం ద్వారా, రక్తపాతాన్ని నివారించి, నిర్మా ణాత్మక సామాజిక విప్లవాన్ని ఆయన నడిపించారు. ఇకపోతే అంబేడ్కర్ పార్క్‌ను మాయావతి గవర్నమెంట్ 125 కోట్ల బడ్జెట్‌తో రూపొందించింది. ప్రత్యామ్నాయ సంస్కృతిని ఆ పార్కు విస్తరించింది. అంబేడ్కర్, మహాత్మాఫూలే, పెరియార్, నారాయణ్ గురూ, సాహూ మహరాజ్ వంటి వారినే కాకుండా ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న ఎందరో పోరాట వీరుల విగ్రహాలను ఆ పార్క్‌లో ఆవిష్కరించారు. ప్రత్యామ్నాయ సంస్కృతికి ఆ పార్కు నిలువెత్తు సాక్ష్యంగా నిలబడింది. వ్యక్తిత్వ నిర్మాణానికి సాంస్కృతిక విప్లవ పునరుజ్జీవానికి సాహిత్యంతోపాటు శిల్పసంపద కూడా ఎంతో ఉప యుక్తం. కొన్ని శిల్పాలు మానవ మస్తిష్కాన్ని ప్రజ్వలింపచేస్తాయి. భారతదేశంలోని ఆర్కిటెక్చర్ ప్రపంచ దేశాల్లో ఉన్న ఆర్కిటెక్చర్లను సమన్వయం చేసుకుంది. భారతదేశానికి వలస వచ్చిన కుషానులు, అరబ్బులు, తురుష్కులు, పారసీకులు ఎందరో భారతీయ శిల్ప సౌందర్యానికి మురిసిపోయారు. వారి శిల్పనైపుణ్యాలు, భారతీయ శిల్ప నైపుణ్యానికి సమన్వయించారు. ‘గాంధార శిల్పం’ వంటివి రూపు దిద్దుకున్నాయి. మన అమరావతి శిల్పం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. భారతదేశంలో ఈనాడు ప్రత్యామ్నాయ శిల్పసంపద అభివృద్ధి చెందు తోంది. లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ ముందు ఉన్న డా‘‘ బీఆర్ అంబే డ్కర్ నిలువెత్తు విగ్రహం స్ఫూర్తితో ప్రతి ఊరిలో అంబేడ్కర్ విగ్రహం ఉండాలని ‘ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ’ కృషి చేసింది. అనేక గ్రామాలకు ఆ మహానుభావుడి విగ్రహాలను అందించింది కూడా! ఈ సందర్భంగానే అంబేడ్కర్ 150 అడుగుల విగ్రహాన్ని ఉమ్మడి రాష్ట్ర సచివాలయం ముందు నిలపాలని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోరాటం చేసింది. 40 రోజులు సచివాలయం ముందు ధర్నా చేసింది. అంబేడ్కర్ యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని పార్టీలూ సపోర్ట్ చేశాయి. అయితే అంబేడ్కర్ వ్యతిరేక భావ వాది, అగ్రవర్ణ కుల అహంకారి, రాజకీయ కపటి, మానవ వనరుల విధ్వంసకుడు, ప్రకృతి వనరుల దోపిడీదారు, నేర రాజకీయ కోవి దుడు, దళిత ద్రోహి నారా చంద్రబాబు నాయుడు అంబేడ్కర్ విగ్రహా నికి బదులు మహాత్మాగాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ తెలంగాణ సచి వాలయం ముందే అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించారు. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్ర హానికి పూనుకొని నిర్మించింది. జనవరి 19వ తేదీన ఈ విగ్రహ ఆవిష్కరణ జరగడం ఒక చరిత్రాత్మక సంఘటన. అంబేడ్కర్ విగ్రహ నిర్మాణంతో విజయవాడకు ప్రత్యామ్నాయ సంస్కృతి ప్రజ్వలనం వస్తుంది. అంతేగాకుండా చైనా, టిబెట్, థాయ్‌లాండ్, జపాన్, జర్మనీ, బర్మా, శ్రీలంక దేశాల నుండి యాత్రికులు వస్తారు. ఇక విజయవాడ భారతదేశానికే తలమానికమైన నగరంగా వెలుగొందుతుంది. కుల, మత, జాతి, లింగ భేదాలు తరమబడతాయి. ప్రపంచంలో పేరెన్నిక గన్న నగరాల్లో ఒకటిగా కీర్తించబడుతుంది. విద్యావ్యాప్తి పెరుగుతుంది. ‘బోధించు, సమీకరించు, పోరాడు’ అనే అంబేడ్కర్ నినా దాన్ని ఈ నిలువెత్తు విగ్రహం పదే పదే గుర్తుచేసి ప్రజారాశులను చైతన్యవంతం చేస్తుంది. అంబేడ్కర్ స్మృతివనం ఏమి చెప్తుందంటే పిల్లల్ని విద్యావంతులు చేసుకోండి. కుల, మత భేదాలు లేని సమసమాజాన్ని నిర్మించుకోండి. హింసలేని కరుణ, ప్రజ్ఞ, నీతి, ఆత్మీయత, అనుబంధం కలిగిన భారత రాజ్యాంగ సూత్ర నిబద్ధమైన ఒక సమాజాన్ని నిర్మించుకోండని ఎలుగెత్తి చాటుతుంది. ఇక విజయవాడ అంబేడ్కర్ నగర్ అవుతుంది. ప్రపంచ కీర్తిని పొందుతుంది. అంబేడ్కర్ స్మృతివనంలోని లైబ్రరీ,అంబేడ్కర్ చిత్రపటాల దృశ్య మాలిక సందర్శనం, అంబేడ్కర్ సమా వేశ మందిరం ప్రపంచ పర్యాటకులకు దృశ్యమాన సౌందర్యం. జ్ఞానభాండాగార సదృశం. బహుముఖ వ్యక్తిత్వానికి నిలువెత్తు నిద ర్శనం. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో ఓ వెలుగుతున్న ప్రత్నా మ్నాయ వెలుగుల సంద్రం. ఆ వెలుగుల తరంగాలలో మనమూ ప్రకాశిద్దాం. ప్రజ్వరిల్లుదాం, ప్రమోదిద్దాం. ఇక పదండి ముందుకు అంబేడ్కర్ ఆశయాలతో... కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 (రేపు విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ) -
బెజవాడ నడిబోడ్డున..‘సోషల్ జస్టిస్ స్వాప్నికుడు’
సాక్షి, అమరావతి: బెజవాడ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది కొండపై కొలువైన దుర్గమ్మ. అదే బెజవాడకు మరో ప్రత్యేక మణిహారంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కరుడు నిలవనున్నారు. నగరం నడిబోడ్డున గొప్ప చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్న స్వరాజ్ మైదానంలో రూపుదిద్దుకున్న బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహం, స్మృతివనం దేశంలోనే ప్రత్యేక గుర్తింపును తీసుకురానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహోన్నత సంకల్పంతో నిర్మిం చిన ‘సామాజిక న్యాయ మహా శిల్పం’ దర్శనీయ ప్రాంతంగా మారనుంది. విజయవాడలో నిర్మిం చింది అంబేడ్కర్ స్మృతివనం మాత్రమే కాదు.. భావితరాలకు అంబేడ్కర్ ఆదర్శాలు, ఆలోచనలను అందించే గొప్ప ప్రయత్నం కూడా. దానికి సంబంధించిన మరికొన్ని విశేషాలు.. ► స్వరాజ్ మైదానంలో 81 అడుగుల పెడస్టల్‌పై 125 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటుతో మొత్తం 206 అడుగుల ఎత్తు వస్తుంది. ► కాంస్య విగ్రహాన్ని ఢిల్లీలో తయారు చేయించారు. దాన్ని భాగాలుగా విజయవాడకు తరలించి స్మృతివనంలో క్రమ పద్ధతిలో అతికించి అద్భుతంగా తీర్చిదిద్దారు. విగ్రహం తయారీలో షూ దగ్గర్నుంచి బెల్ట్ వరకు హనుమాన్ జంక్షన్ వద్ద శిల్పి ప్రసాద్ ఆధ్వర్యంలో కాస్టింగ్ చేశారు. ► ఢిల్లీ నుంచి వచి్చన డిజైనర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నాణ్యతతో తుది దశ పనులు చేస్తున్నారు. ► అంబేడ్కర్ విగ్రహం బేస్(ఫెడస్టల్)లో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లున్నాయి. ► గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు హాళ్లుండగా.. ఒక్కోటి నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. అందులో ఒకటి సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లలో ఆయన చరిత్రను తెలిపే డిజిటల్ మ్యూజియం ఉంటుంది. ► మొదటి అంతస్తు(ఫస్ట్ ఫ్లోర్)లో 2,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్లుంటాయి. ఒక హాల్లో.. అంబేడ్కర్‌కు దక్షిణాదితో ఉన్న అనుబంధాన్ని చిత్రాలతో డిస్ప్లే చేస్తారు. ► రెండో అంతస్తు(సెకండ్ ఫ్లోర్) వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాళ్లుంటాయి. ► అంబేడ్కర్ స్మృతివనంలో విగ్రహం ఉన్న ప్రాంతానికి ఒక వైపు నుంచి వెళ్లి.. మరో వైపు నుంచి తిరిగి వచ్చేలా విశాలమైన హాలు మాదిరిగా నిర్మాణాలను పూర్తి చేశారు. వాటి గోడలకు అంబేడ్కర్ జీవిత విశేషాలు, ఆయన చరిత్రకు సంబం«దించిన ఘట్టాల శిల్పాలను అద్దారు. ► లోపలి భాగంలోని హాళ్లలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అంబేడ్కర్ పాల్గొన్న సమావేశాలు, సభలకు సంబంధించిన పాత చిత్రాలను భారీ చిత్రాలుగా డిజిటలైజ్ చేసి డిస్ప్లే చేశారు. ఆయన రాసిన కీలకమైన లేఖలు, ఉపన్యాసాలను ఆయా ఘట్టాలకు అనుగుణంగా ఫొటోలతో పాటు డిస్ప్లే చేశారు. ► అంబేడ్కర్ ఆశయాలు, ఆదర్శాలు, సందేశాలను సైతం క్లుప్తంగా తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో డిజిటల్ బోర్డులపై డిస్ప్లే చేశారు. ‘చదువు.. సమీకరించు.. బోధించు’ వంటి ప్రధానమైన సందేశాలను ప్రముఖంగా ఏర్పాటు చేశారు. ► స్మృతివనం ఆవరణను పచ్చని తివాచీ పరిచినట్టు గరిక, మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు. అంబేడ్కర్ విగ్రహానికి ముందు ఏర్పాటు చేసిన నెమళ్ల ప్రతిరూపాలు ఆకట్టుకుంటున్నాయి. ► మ్యూజిక్కు అనుగుణంగా ప్రవహించే వాటర్ ఫౌంటెయిన్లను ఏర్పాటు చేశారు. ఫెడస్టల్ చుట్టూ ఉన్న ప్రాంతంలో వాటర్ కొలను మాదిరిగా ఫౌంటేయిన్‌ను ఏర్పాటు చేశారు. ఇంకా మరెన్నో ప్రత్యేకతలు ఈ స్మృతివనంలో దర్శనమిస్తాయి. -
చరిత్రాత్మకంగా చైతన్యమూర్తి : సీఎం జగన్
సాక్షి, అమరావతి: అంబరాన్ని తాకేలా విజయవాడలో మనం ఏర్పాటు చేసుకుంటున్న రాజ్యాంగ నిర్మాత, బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవటమే కాకుండా శతాబ్దాల పాటు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. అది ‘స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’ (సామాజిక న్యాయ మహా శిల్పం) అని అభివర్ణించారు. మన సమాజ గతిని సమతా భావాల వైపు మరల్చటానికి, సంఘ సంస్కరణలకు, పెత్తందారీ భావాలపై తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు ఆ మహా శిల్పం నిరంతరం స్ఫూర్తినిస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. విజయవాడలోని చారిత్రక స్వరాజ్య మైదానంలో ఈ నెల 19వ తేదీన ఆవిష్కరించనున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి పెద్దదన్నారు. అంబేడ్కర్ మహా శిల్పాన్ని ఆవిష్కరించనున్న సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ బుధవారం రాష్ట్ర ప్రజలకు ఈమేరకు సందేశం ఇచ్చారు. ‘అది 81 అడుగుల వేదికపై ఏర్పాటు చేసిన 125 అడుగుల మహా శిల్పం. అంటే.. 206 అడుగుల ఎత్తైన విగ్రహం. ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం, దేశ సామాజిక, ఆరి్థక, రాజకీయ, మహిళా చరిత్రను మార్చేలా దాదాపు 100 ఏళ్ల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఆయన భావాల పట్ల అచంచల విశ్వాసంతో, బాధ్యతతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తున్న ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 19వ తేదీన అందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుతున్నా’ అని తన సందేశంలో సీఎం జగన్ పేర్కొన్నారు. దేశానికే తలమానికం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ సాక్షి, అమరావతి: విజయవాడలో మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 206 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహాశిల్పం రాష్ట్రానికే కాదు.. దేశానికే తలమానికం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. చరిత్రను తిరగరాసేలా మరెందరికో వందల ఏళ్ల పాటు ‘స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’ స్ఫూర్తినిస్తుందన్నారు. ఈ నెల 19వతేదీన విజయవాడలో బాబా సాహెబ్ అంబేడ్కర్ మహా శిల్పం విగ్రహావిష్కరణకు అందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుతూ సీఎం జగన్ బుధవారం ట్వీట్ చేశారు. నిరంతరం కాపాడే మహాశక్తి ఆయన.. అణగారిన వర్గాలకు చదువులు చేరువ చేసిన మహనీయుడు! అంటరానితనం, ఆధిపత్య భావజాలంపై తిరుగుబాటు చేసిన మహానుభావుడు! సమ సమాజ భావాలకు నిలువెత్తు రూపం! రాజ్యాంగం, రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే ఓ మహాశక్తి! ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు నిరంతరం ధైర్యాన్ని, అండని ప్రసాదించే ఓ మహా స్ఫూర్తి! దళితులతో పాటు కులాలు, మతాలకు అతీతంగా పేదలందరి జీవితాల్లో ఈ 77 ఏళ్లలో వచ్చిన అనేక మార్పులకు మూలం డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ భావాలే! -
అంబేద్కర్ విగ్రహం ఏపీకే కాదు.. దేశానికే తలమానికం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: విజయవాడలో ఈనెల 19వ తేదీన 206 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఈ మహత్తర కార్యక్రమానికి ప్రజలందరూ స్వచ్చందంగా తరలి రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. కాగా, ట్విట్టర్ వేదికగా సీఎం జగన్..‘విజయవాడలో మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 206 అడుగుల అంబేద్కర్ గారి మహాశిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం. ఇది “స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’’. చరిత్రను తిరగరాసేలా, మరెందరికో వందల సంవత్సరాల పాటు, స్ఫూర్తినిస్తుంది. ఈనెల 19న జరిగే విగ్రహావిష్కరణకు అందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని కోరుతున్నాను’ అంటూ వీడియోను పోస్టు చేశారు. విజయవాడలో మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 206 అడుగుల అంబేద్కర్ గారి మహాశిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం. ఇది “స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’’. చరిత్రను తిరగరాసేలా, మరెందరికో వందల సంవత్సరాల పాటు, స్ఫూర్తినిస్తుంది. ఈనెల 19న జరిగే విగ్రహావిష్కరణకు అందరూ స్వచ్ఛందంగా… pic.twitter.com/209LhkdHte — YS Jagan Mohan Reddy (@ysjagan) January 17, 2024 -
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు ఒక చరిత్ర
-
ప్రారంభోత్సవానికి సిద్ధమైన అంబేద్కర్ విగ్రహం
-
చకచకా అంబేద్కర్ విగ్రహ నిర్మాణం
-
‘అంబేడ్కర్ స్మృతి వనం చిరస్థాయిగా నిలిచిపోతుంది’
సాక్షి, విజయవాడ: విజయవాడ స్వరాజ్య మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనాన్ని నవంబర్ 26వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారన్నారు స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి. ఈరోజు(గురువారం) ఉన్నతాధికారులతో కలిసి అంబేడ్కర్ విగ్రహ ఏర్పాట్లపై సీఎస్ సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అంబేడ్కర్ స్మృతివనం విగ్రహం దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా అంబేడ్కర్ స్మృతివనం విగ్రహం ఉంటుందన్నారు.