
సాక్షి, విజయవాడ: పంద్రాగస్ట్ వేడుకలకు కూడా డా.బిఆర్. అంబేద్కర్ స్మృతి వనం నోచుకోలేదు. అంబేద్కర్ మహా న్యాయశిల్పాన్ని చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడను రాష్ట్ర ప్రభుత్వం రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించింది. అయితే స్వరాజ్య మైదానంలోని అంబేద్కర్ స్మృతివనానికి మాత్రం మరిచింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ అంబేద్కర్ స్మృతివనాన్ని ప్రారంభించారనే ప్రభుత్వం వివక్ష చూపిందని పలువురు బాహాటంగా విమర్శించారు.
విద్యుత్ కాంతులతో బందరు రోడ్డు మెరిసిపోతోంది. ఇందిరాగాంధీ స్టేడియంతో పాటు బందరు రోడ్డులోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ అలంకరణ చేశారు. అంబేద్కర్ విగ్రహానికి కూతవేటు దూరంలోనే రాజ్ భవన్, కలెక్టరేట్,కలెక్టర్ క్యాంప్ కార్యాలయం,సీపీ కార్యాలయం, స్టేట్ గెస్ట్ హౌస్ ఉన్నాయి. అంబేద్కర్ మహా న్యాయశిల్పం మినహా అంతటా విద్యుత్ దీపాలంకరణ వెలిగిపోతోంది. బందరు రోడ్డు మధ్యలోని డివైడర్లు, చెట్లు, కరెంట్ పోల్స్‌కు సైతం విద్యుత్ అలంకరణ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment