
సాక్షి, అమరావతి: బెజవాడ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది కొండపై కొలువైన దుర్గమ్మ. అదే బెజవాడకు మరో ప్రత్యేక మణిహారంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కరుడు నిలవనున్నారు. నగరం నడిబోడ్డున గొప్ప చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్న స్వరాజ్ మైదానంలో రూపుదిద్దుకున్న బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహం, స్మృతివనం దేశంలోనే ప్రత్యేక గుర్తింపును తీసుకురానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహోన్నత సంకల్పంతో నిర్మిం చిన ‘సామాజిక న్యాయ మహా శిల్పం’ దర్శనీయ ప్రాంతంగా మారనుంది. విజయవాడలో నిర్మిం చింది అంబేడ్కర్ స్మృతివనం మాత్రమే కాదు.. భావితరాలకు అంబేడ్కర్ ఆదర్శాలు, ఆలోచనలను అందించే గొప్ప ప్రయత్నం కూడా. దానికి సంబంధించిన మరికొన్ని విశేషాలు..
► స్వరాజ్ మైదానంలో 81 అడుగుల పెడస్టల్‌పై 125 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటుతో మొత్తం 206 అడుగుల ఎత్తు వస్తుంది.
► కాంస్య విగ్రహాన్ని ఢిల్లీలో తయారు చేయించారు. దాన్ని భాగాలుగా విజయవాడకు తరలించి స్మృతివనంలో క్రమ పద్ధతిలో అతికించి అద్భుతంగా తీర్చిదిద్దారు. విగ్రహం తయారీలో షూ దగ్గర్నుంచి బెల్ట్ వరకు హనుమాన్ జంక్షన్ వద్ద శిల్పి ప్రసాద్ ఆధ్వర్యంలో కాస్టింగ్ చేశారు.
► ఢిల్లీ నుంచి వచి్చన డిజైనర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నాణ్యతతో తుది దశ పనులు చేస్తున్నారు.
► అంబేడ్కర్ విగ్రహం బేస్(ఫెడస్టల్)లో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లున్నాయి.
► గ్రౌండ్ ఫ్లోర్‌లో నాలుగు హాళ్లుండగా.. ఒక్కోటి నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. అందులో ఒకటి సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లలో ఆయన చరిత్రను తెలిపే డిజిటల్ మ్యూజియం ఉంటుంది.
► మొదటి అంతస్తు(ఫస్ట్ ఫ్లోర్)లో 2,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్లుంటాయి. ఒక హాల్లో.. అంబేడ్కర్‌కు దక్షిణాదితో ఉన్న అనుబంధాన్ని చిత్రాలతో డిస్‌ప్లే చేస్తారు.
► రెండో అంతస్తు(సెకండ్ ఫ్లోర్) వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాళ్లుంటాయి.
► అంబేడ్కర్ స్మృతివనంలో విగ్రహం ఉన్న ప్రాంతానికి ఒక వైపు నుంచి వెళ్లి.. మరో వైపు నుంచి తిరిగి వచ్చేలా విశాలమైన హాలు మాదిరిగా నిర్మాణాలను పూర్తి చేశారు. వాటి గోడలకు అంబేడ్కర్ జీవిత విశేషాలు, ఆయన చరిత్రకు సంబం«దించిన ఘట్టాల శిల్పాలను అద్దారు.
► లోపలి భాగంలోని హాళ్లలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అంబేడ్కర్ పాల్గొన్న సమావేశాలు, సభలకు సంబంధించిన పాత చిత్రాలను భారీ చిత్రాలుగా డిజిటలైజ్ చేసి డిస్‌ప్లే చేశారు. ఆయన రాసిన కీలకమైన లేఖలు, ఉపన్యాసాలను ఆయా ఘట్టాలకు అనుగుణంగా ఫొటోలతో పాటు డిస్‌ప్లే చేశారు.
► అంబేడ్కర్ ఆశయాలు, ఆదర్శాలు, సందేశాలను సైతం క్లుప్తంగా తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో డిజిటల్ బోర్డులపై డిస్‌ప్లే చేశారు. ‘చదువు.. సమీకరించు.. బోధించు’ వంటి ప్రధానమైన సందేశాలను ప్రముఖంగా ఏర్పాటు చేశారు.
► స్మృతివనం ఆవరణను పచ్చని తివాచీ పరిచినట్టు గరిక, మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు. అంబేడ్కర్ విగ్రహానికి ముందు ఏర్పాటు చేసిన నెమళ్ల ప్రతిరూపాలు ఆకట్టుకుంటున్నాయి.
► మ్యూజిక్‌కు అనుగుణంగా ప్రవహించే వాటర్ ఫౌంటెయిన్లను ఏర్పాటు చేశారు. ఫెడస్టల్ చుట్టూ ఉన్న ప్రాంతంలో వాటర్ కొలను మాదిరిగా ఫౌంటేయిన్‌ను ఏర్పాటు చేశారు. ఇంకా మరెన్నో ప్రత్యేకతలు ఈ స్మృతివనంలో దర్శనమిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment