Vijayawada West Assembly Constituency
-
Pawan Kalyan: పక్కలో బల్లెం
పదేళ్లుగా ఆయన వెంట ఉన్నా. జనసేన కోసం ఎంతో కష్టపడ్డా. కష్టకాలంలోనూ పార్టీని వీడకుండా పని చేశా. పవన్ కల్యాణ్‌పై నమ్మకం ఉంది. సీటు గ్యారెంటీగా నాకే వస్తుంది.. టికెట్ ఆశలు సన్నగిల్లుతున్న సమయంలో అప్పటికే రెండుసార్లు పవన్‌ను కలిసిన తర్వాత కూడా జనసేన నేత పోతిన వెంకట మహేష్ మీడియా ముఖంగా భావోద్వేగంగా మాటలివి. కానీ, చివరకు ఏం మిగిలింది?.. విజయవాడ వెస్ట్ సీటును ఆఖరిగా బీజేపీ ఎగరేసుకుపోయింది. గత రెండు నెలలుగా ఏపీ రాజకీయాల్లో విజయవాడ వెస్ట్ పరిణామాలు వాడీవేడిగా సాగాయి. అప్పటికే పొత్తు ప్రకటన చేసినా.. ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేనలు ఇక్కడి సీటు తమదేనంటూ ప్రకటించుకున్నాయి. టీడీపీ నేతలు జలీల్‌ఖాన్, బుద్దా వెంకన్నలు ఎవరికివారే ఆత్మీయ సమావేశాలు, ర్యాలీలతో తమ బలప్రదర్శనలు కొనసాగించుకుంటూ వచ్చారు. అయితే.. ఈలోపే విజయవాడ వెస్ట్ సీటు ఆలోచన వదులుకోవాలని, అది జనసేనకు కేటాయిస్తామని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారనే ప్రచారం తెర మీదకు వచ్చింది. మొదటిసారి.. పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ వెళ్లొచ్చనే చర్చా మొదలైంది. దీంతో జలీల్‌ఖాన్ ఒక అడుగు ముందుకేసి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు. విజయవాడ వెస్ట్ సీటును తనకు వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ టైంలో ‘చూద్దాం’ అని పవన్ జలీల్‌ఖాన్‌తో చెప్పారనే విషయం బయటకు పొక్కింది. దీంతో జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ కాస్త ఆందోళనకు లోనయ్యారు. వెంటనే పవన్ కల్యాణ్‌ను కలిశారు. పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ టికెట్‌పై ఎంతో ఆశలు పెట్టుకున్నారు. పవన్ ఇచ్చిన భరోసాతో సీటు కచ్చితంగా తనకే వస్తుందని పాపం పోతిన మహేష్ భావించారు. రెండో జాబితాలో కచ్చితంగా తన పేరు ఉంటుందని బహిరంగంగా ప్రకటించుకున్నారు కూడా. కానీ, టీడీపీ బదులు బీజేపీ రూపంలో టికెట్ గండాన్ని.. చంద్రబాబు తెర వెనుక జరిపిన కుట్రల్ని ఆయన పసిగట్టలేకపోయారు. రెండోసారి.. కానీ ఇంతలో టీడీపీ-జనసేనతో బీజేపీ కూడా పొత్తు కూడాయి. పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు తీసుకుంది. ఆ సమయంలోనే విజయవాడ వెస్ట్‌పై బీజేపీ నేతలు కన్నేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెస్ట్ సీటు తమకే కావాలని బీజేపీ పట్టింది. దీంతో పోటీ కోసం అంతా సిద్ధం చేసుకున్న మహేష్.. ఆగ్రహానికి లోనయ్యారు. మళ్లీ పవన్ కల్యాణ్‌ను కలిశారు. టికెట్‌పై ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని.. కంగారు పడొద్దంటూ పవన్ మరోసారి అభయం ఇవ్వడంతో మహేష్ మెత్తబడ్డారు. కానీ, అప్పటికే వెస్ట్ సీటుపై నిర్ణయం జరిగిపోయింది!. బీజేపీ నేత వ్యాఖ్యలతో కన్ఫర్మ్ విజయవాడ వెస్ట్ సీటు తమదే అని ప్రకటిస్తూ.. గత గురువారం నాడు బీజేపీ విజయవాడ వెస్ట్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ.. వెస్ట్ సీటు ఎవరికి కేటాయించాలనే దానిపై ఇప్పటికే చర్చలు ముగిశాయని వెల్లడించారు. పార్టీ డిసైడ్ అయిపోయిందని.. అభ్యర్థి ఎవరనేదే తేలాల్సి ఉందని ప్రకటన చేశారు. దీంతో.. మహేష్ మళ్లీ ఆందోళనకు దిగారు. అయినా నమ్మకమే! ఈసారి ఏకంగా.. తన కార్యాలయంలోనే మహేష్ ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగారు. ఆ సమయంలో.. ‘‘పార్టీకి విధేయుడిగా, పదేళ్లు నాకు నమ్మకస్తుడిగా ఉన్న నీకు.. విజయవాడ వెస్ట్ సీటు ఖాయం అని పవన్ కల్యాణ్ మాటిచ్చారు. తాజా సమావేశంలోనూ ఆయన అదే మాట అన్నారు. ఆయన తన మాట నిలబెట్టుకుంటారని నమ్ముతున్నా. జనసేన పార్టీ తప్ప ఎవరికీ సీటు ఇచ్చినా వైఎస్సార్సీపీతో పోటీ పడలేరు. ఒకవేళ ఇక్కడి సీటు బీజేపీకే వెళ్తే.. అది కచ్ఛితంగా వైఎస్సార్సీపీకి అనుకూలిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. ఒకవేళ పవన్ మాట నిలబెట్టుకోలేకపోతే? అనే ప్రశ్నకు.. ఒకవేళ బీజేపీ సుజనా చౌదరికే గనుక టికెట్ ఇస్తే రెబల్‌గా పోటీ చేస్తా.. అదీ పవన్ ఫొటోతోనే అని. తమ సత్తా చూపించుకునేందుకు కొత్త తరం నేతలకు కూడా అవకాశాలు దక్కాలి కదా అని వ్యాఖ్యానించారు. కానీ.. మూడోసారీ.. చివరకు విజయవాడ వెస్ట్‌లో జన సైనికుల ఆశలు అడియాశలయ్యాయి. బీజేపీ జాబితాలో టికెట్ సుజనా చౌదరికే వెళ్లింది. అయినా విజయవాడ వెస్ట్ సీటుపై పోతిన వెంకట మహేష్ పట్టువీడడం లేదు. జనసేనకు ఇవ్వాల్సిందేనంటూ ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించారు. మరోవైపు.. బీజేపీ అభ్యర్థుల ప్రకటనకు రెండ్రోజుల ముందు మూడోసారి మహేష్‌ను పిలిపించుకున్న పవన్.. బుజ్జగింపులకు దిగారు. అధికారంలోకి వస్తే కీలక పదవి ఇస్తామంటూ ఆశ పెడుతున్నారు. కానీ, మహేష్ ససేమీరా అంటున్నారు. ఇక.. ఈ విషయం తెలిసి పవన్ పై మండిపడుతున్న విజయవాడ వెస్ట్ జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. పవన్ వల్ల నిజంగా కాలేదా? కూటమిలో భాగంగా నాకే సీటు కేటాయించడం న్యాయం అని చెబుతున్న మహేష్‌కు.. పవన్ మాత్రం అన్యాయం చేశారు. అయితే.. టీడీపీ-బీజేపీల బలవంతపు పొత్తు కోసం విశ్వప్రయత్నం చేసిన పవన్.. మధ్యలో పొత్తులు, సీట్ల పంపకాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తుల కోసం మధ్యవర్తిత్వం వహించడం వల్ల చాలా కోల్పోవాల్సి వచ్చిందని, పొత్తుల కోసం చాలా త్యాగాలు చేశామని చెప్పుకొచ్చారు. మరి అంతగా బాధపడిపోయిన పవన్.. పార్టీకి విధేయులుగా ఉన్నవాళ్లకు కాకుండా జంప్‌జిలానీలకు ఒకట్రెండు సీట్లు ఇచ్చిన పవన్.. విజయవాడ వెస్ట్ సీటు విషయంలో బీజేపీని ఒప్పించలేకపోయారా?.. నమ్మకంగా ఉన్న మహేష్‌కు టికెట్ ఇప్పించలేకపోయారా? అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు జనసైనికులిప్పుడు. సీటు మహేష్కేనంటూ నమ్మించి మోసం చేశారని.. పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం చేస్తూ వెన్నుపోటులో చంద్రబాబునే మించిపోయారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాబు పాచికేనా? విజయవాడ వెస్ట్ టికెట్ విషయంలో పంతం నెగ్గించుకున్న బీజేపీ.. అభ్యర్థి విషయంలో మాత్రం ‘రాజీ’ పడిందా?. వక్కల గడ్డ భాస్కరరావు, జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, బొబ్బురి శ్రీరాంలాంటి వాళ్లు పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్లు.. నమ్మకస్తులు ఉన్నా.. సుజనా చౌదరికే టికెట్ ఎందుకు ఇచ్చారు? పేర్ల పరిశీలనలో ఏం జరిగింది?.. అని బీజేపీ సీనియర్లు చర్చించుకుంటున్నారు. ఎంపీ సీట్ల విషయంలో చక్రం తిప్పిన చంద్రబాబే.. బీజేపీలో ఉన్న తన సన్నిహితుడు సుజనా చౌదరికే విజయవాడ వెస్ట్ నియోజక వర్గం టికెట్ దక్కేలా చేశారనే టాక్ బలంగా వినిపిస్తోందిప్పుడు. -
జనసేన నేతకు షాకిచ్చిన పవన్.. జనసైనికులు ఫైర్!
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి కారణంగా మూడు పార్టీల కార్యకర్తలకు నేతలు షాకిలిస్తున్నారు. చంద్రబాబు రాజకీయ క్రీడలో బీజేపీ, జనసేన పావులుగా మారడంతో నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో తమ కోసమే పనిచేసే నాయకులకు టికెట్ ఇవ్వకపోవడంతో కార్యకర్తలు ఫైరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ పశ్చిమలో జనసేనకు బిగ్ షాక్ తగిలింది. కూటమి పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి కేటాయిస్తున్నట్టు జనసేన పవన్ కల్యాణ్ తేల్చి చెప్పడంతో పార్టీ కార్యకర్తలు ఖంగుతున్నారు. ఇక్కడ జనసేన నాయకుడు, పార్టీ ఇన్ఛార్జ్ పోతిన మహేష్‌కు సీటు వస్తుందని జనసైనికులు ఆశించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసుకున్నారు. ఇక, తాజాగా పవన్ ప్రకటనతో వీరంతా షాకయ్యారు. కాగా, సీటు మహేష్‌కు ఇవ్వకపోవడంతో పవన్ తీరుపై జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. పవన్ తమను నమ్మించి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, అన్ని డివిజన్ల ఇన్ఛార్జ్లు, కార్యకర్తలతో మహేష్ సమావేశమయ్యారు. పోతినకు టికెట్ ఇవ్వాల్సిందేనంటూ పశ్చిమ జనసేన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. మరోవైపు.. పవన్ మోసం తట్టుకోలేని మహేష్.. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు జనసైనికులు చెబుతున్నారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ.. విజయవాడ పశ్చిమ టికెట్ జనసేనకే కేటాయించాలి. పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టాను. ఇబ్బందులు పడ్డాను.. కేసులు కూడా పెట్టారు. విజయవాడలో జనసేన పార్టీ నిలబడింది అంటే అది నావల్లే. పవన్ పోటీచేసే స్థానంలో టీడీపీ కార్యకర్తలు నానా గోల చేశారు. పిఠాపురంలో అంత డ్యామేజ్ జరిగితే ఒక్క టీడీపీ నేత అయినా స్పందించారా?. ఇదేనా పొత్తు ధర్మం. పొత్తు ధర్మం పాటిస్తేనే ఓట్ల బదిలీ జరుగుతుంది. మన పార్టీ నాయకుడు బాగోకపోతే మనం బాగుంటామా?. పవన్‌కు అవమానం జరిగితే ఒక్క జనసేన నాయకుడైనా స్పందించారా?. విజయవాడలో కేడర్ భవిష్యత్ ఉండాలంటే జనసేనకు సీటు కేటాయించాలి. చివరగా చెబుతున్నా.. నేను జనసేన నుంచే పోటీ చేస్తున్నాను. -
చంద్రబాబుకు సొంత పార్టీలో తలనొప్పులు
ఏ పార్టీ కనిపిస్తే ఆ పార్టీతో పొత్తుకు సిద్ధమవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత పార్టీలో తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. గెలిచేది లేకపోయినా..టిక్కెట్ కోసం మాత్రం పోటీ ఎక్కువవుతోంది. ఈ మధ్యలో జనసేన నేతలు సీన్లోకి ఎంటరై పొత్తులో భాగంగా ఈ సీటు మాదే అంటున్నారు. ఇప్పుడు బెజవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏం చేయాలో తెలియక చంద్రబాబు తల పట్టుకుంటున్నారని టాక్. ఆఖరు నిమిషం వరకు టిక్కెట్ల విషయం తేల్చే అలవాటు చంద్రబాబుకు లేదని అందరికీ తెలుసు. అందుకే బెజవాడ వెస్ట్ తమ్ముళ్ళు చివరి వరకు మేము ఆగలేమని..వెంటనే తేల్చాలని పార్టీ అధినేతను డిమాండ్ చేస్తున్నారని సమాచారం. టీడీపీ ఆవిర్భవించాక 1983లో ఒకే ఒక్కసారి ఇక్కడ పచ్చ జెండా ఎగిరింది. ఈ నలభై ఏళ్ళ కాలంలో మళ్ళీ అక్కడ టీడీపీ జెండా ఎగిరింది లేదు. కాని ఈసారి ఎలాగైనా గెలవాల్సిందే అని చంద్రబాబు అక్కడి నేతలకు హుకుం జారీ చేశారట. ఇప్పుడు బుద్ధా వెంకన్న, జలీల్‌ఖాన్‌లు టిక్కెట్ కోసం పట్టుబడుతున్నారు. తమ మనసులో మాట అప్పుడప్పుడు అధిష్టానానికి వినిపించే ప్రయత్నం చేసిన బుద్ధా వెంకన్న , జలీల్ ఖాన్ ఇప్పుడు టిక్కెట్ కోసం నేరుగా పంచాయతీ పెట్టేస్తున్నారట. తాజాగా బుద్ధా వెంకన్న వెస్ట్ నియోజకవర్గంలో తనకు ఉన్న బలం చంద్రబాబుకు తెలియచేసేందుకు ఓ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ టీడీపీ టిక్కెట్ కోసం తాను పెట్టుకున్న అప్లికేషన్ ను ర్యాలీగా వెళ్లి బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో ఉంచి మరీ పూజలు చేయించాడట. తెలుగుదేశం పార్టీ, అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబంపై ఈగ వాలకుండా చూసుకుంటున్న తనకే టిక్కెట్ అడిగే హక్కు ఉందని బుద్ధా వెంకన్న అంటున్నారు. తనకే టిక్కెట్ ఇచ్చి తీరాలంటూ పబ్లిక్‌గానే తన డిమాండ్ ను చంద్రబాబు ముందు ఉంచారట. ఒకవేళ పొత్తులో భాగంగా వెస్ట్ టిక్కెట్ ఇవ్వడానికి కుదరకపోతే అనకాపల్లి ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని తన డిమాండ్ల చిట్టాను చంద్రబాబుకు వినిపించారట. గతంలో ఒకసారి తనకు టిక్కెట్టివ్వకపోతే ఎక్కడ స్విచ్ వేస్తే.. ఎక్కడ బల్బు వెలుగుతుందో తనకు తెలుసని బెదిరించిన బుద్ధా తాజాగా చేసిన వ్యాఖ్యలు బెజవాడ టీడీపీలో రచ్చకు దారి తీసాయి. ఇదిలా ఉంటే నాకేం తక్కువ అంటూ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ టిక్కెట్ రేస్ లోకి దూసుకొచ్చారు. బుద్ధా వెంకన్న ర్యాలీ నిర్వహించాడని తెలియగానే... నేనే లోకల్...నాకే టిక్కెట్టివ్వాలంటూ జలీల్ ఖాన్ పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎవడు పడితే వాడు టిక్కెట్ అంటే కుదరదు...టీడీపీ కూడా పశ్చిమ టిక్కెట్ ను మైనార్టీలకు కేటాయించాలి...ఆ టిక్కెట్ తనకే ఇవ్వాలి అని చంద్రబాబును నిలదీస్తున్నారట. తనకు బెజవాడ వెస్ట్ టిక్కెట్ ఇవ్వకపోతే ఉరేసుకుంటానని జలీల్‌ఖాన్ బెదిరిస్తున్నారట. టీడీపీ నాయకత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటుగా.. పవన్ కళ్యాణ్‌ను కూడా అర్థిస్తున్నారట. వెస్ట్ టిక్కెట్ కోసం జనసేన పట్టుపట్టవద్దని తనకే మద్దతుగా నిలవాలని పవన్‌ను ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేశారట. తనకు టిక్కెట్ ఇవ్వకపోతే పరిణామాలు వేరేలా ఉంటాయని చంద్రబాబును జలీల్‌ఖాన్ వార్నింగ్ ఇస్తున్నాడట. ఇలా ఓ వైపు బుద్ధా వెంకన్న...మరోవైపు జలీల్ ఖాన్ టిక్కెట్ కోసం కుస్తీ పడుతుంటే..పశ్చిమ నియోజకవర్గం జనసేన శ్రేణుల్లో కలవరం మొదలైందని టాక్. పొత్తులో భాగంగా పశ్చిమ టిక్కెట్ జనసేనకు వస్తుందని నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పోతిన మహేష్ గంపెడాశతో ఉన్నారు. ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు టిక్కెట్ కోసం కొట్లాడుకోవడంతో తనకు దక్కకుండా పోతుందనే ఆందోళన పోతిన మహేష్‌కు పెరిగిపోతోందట. అందరితోనూ పొత్తులు పెట్టుకుంటూ సంతోషపడుతున్న చంద్రబాబుకు టిక్కెట్ల విషయంలో సొంత పార్టీ నేతలతోనే తలనొప్పులు ఎదురవ్వడంతో దిక్కు తోచడంలేదని చెబుతున్నారు. మరి బెజవాడ వెస్ట్‌లో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. -
పవన్‌ను నిలదీసేందుకు సిద్ధం!
ఎన్టీఆర్, సాక్షి: పొత్తు సంగతి ఏమోగానీ జనసేన నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు సీట్ల పంపకంపై ఎటూ తేల్చకుండానే.. ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ పోతున్నారు. మరోవైపు జనసేనాని తన పోటీ విషయంలోనే కాదు.. సీట్ల విషయంలోనూ స్పష్టత లేకుండా పోయారు. ఈ పరిణామాల నడుమ.. ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుమని పదిహేను స్థానాల్లో కూడా పోటీ చేస్తామో? లేదో? అనే ఆందోళనలో ఉన్నారు. పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డందుకు ఫలితం ఇదేనా అని పవన్‌ను నిలదీసేందుకు ‘సిద్ధం’ అవుతున్నారు. పొత్తు రాజకీయాల్లో మునుపెన్నడూ లేని చిత్రమైన పరిణామాలకు ఏపీ కేంద్రంగా మారింది. ఒక పార్టీ అధినేత అయ్యి ఉండి కూడా పోటీ విషయంలో పవన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పొత్తు ధర్మం పాటించలేదని బాబుపై అసంతృప్తి మాత్రమే వ్యక్తం చేస్తూ.. ఆ జట్టును వీడేది లేదంటూ పాత పాటే పాడుతున్నారు. అదే సమయంలో టీడీపీ నేతలకు పవన్ అపాయింట్మెంట్ ఇస్తుండడం.. తమ టికెట్లకు ఎసరు పెట్టొద్దన్న వాళ్ల(మాగంటి బాబు, వేదవ్యాస్, జలీల్ఖాన్లాంటి వాళ్లు) విజ్ఞప్తులను పరిశీలిస్తానని చెప్తుండడంపై జనసేన నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తమ పోటీకి అనుకూలంగా మొదటి నుంచి భావిస్తున్న సీటు.. విజయవాడ వెస్ట్. అయితే దాని కోసం టీడీపీ నేతలు తన్నుకున్నంత పని చేస్తుండడం.. ఆ పరిణామాలపై చంద్రబాబు మౌనంగా ఉండడం.. వెరసి ఆ సీటు వదులుకోవాల్సి వస్తుందేమో అనే ఆందోళనలో ఉన్నారు. విజయవాడ వెస్ట్‌కు తెలుగు దేశంలో మామూలు పోటీ లేదు. ఒకవైపు బుద్ధా వెంకన్న ఆ సీటును చంద్రబాబు తనకే ఇస్తారని ఆశతో ఉన్నారు. దుర్గగుడిలో ప్రత్యేక పూజలు బైక్ ర్యాలీతో బలప్రదర్శన నిర్వహించుకున్నారు. అదే సమయంలో మైనారిటీ వర్గాలకే ఆ టికెట్ కేటాయించాలంటూ జలీల్‌ఖాన్ తెరపైకి వచ్చారు. తమ సామాజిక వర్గం తరఫున తనకే టికెట్ దక్కుతుందని ధీమా ప్రకటించారు. బుద్దాకు కౌంటర్‌గా ఇవాళ(శుక్రవారం) వన్‌టౌన్‌లో బలప్రదర్శన పేరిట ర్యాలీ నిర్వహించారు. ఇక ర్యాలీల పర్వం చూస్తున్న జనసేనలో టెన్షన్ పెరిగిపోతోంది. విజయవాడ వెస్ట్ నుంచి పోతిన వెంకట మహేష్ టికెట్ ఆశిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే చాలాకాలం నుంచి బరిలో తానే నిలవబోయేదని ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. అయితే తాజా పరిణామాలు ఆయనకు మింగుడుపడడం లేదు. ఈ విషయంపై పవన్‌ను కలిసి చర్చించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పోటీ యాత్రలు.. మరోవైపు.. ఇలాగే చూస్తూ ఊరుకుంటే.. విజయవాడ వెస్ట్‌లోనే కాదు ఇంకా చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులే ఎదురు కావొచ్చని జనసేన నేతలు ఒక అంచనాకి వచ్చారు. జనసేనకు కాస్తో కూస్తో బలం, పేరు ఉన్న చోట్ల కూడా టీడీపీ నేతలు పాదయాత్రలు, బలనిరూపణలు చేసుకుంటూ కొట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో పోటీ యాత్రలకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలో జనసేన బొర్రా వెంకట అప్పారావు మహా పాదయాత్రకు సిద్ధం కాగా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బలం చూపించుకోవాలని జనసేన తాపత్రయపడుతోంది. ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో ఇకనైనా ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించాలని.. చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకోవాలని.. టీడీపీ నేతల దూకుడుకు కళ్లెం వేయించే దిశగా పవన్‌పై ఒత్తిడి పెంచేందుకు జనసేన నేతలు ‘సిద్ధం’ అవుతున్నారు. -
టీడీపీలో సీట్ల కోసం ఫీట్లు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల కోసం టీడీపీ నేతలు నానాపాట్లు పడుతున్నారు. ఆ పార్టీ ఉనికి కోసం నేతలు ఫీట్లు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ల కోసం ఆ పార్టీ నేతలు కొందరు పూజలు చేస్తుంటే, మరికొందరు వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చనీయాంశమవుతున్నారు. టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన నేతలు కూడా టికెట్ తమకేనంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరూ టికెట్ కోసం పాట్లు పడుతున్నారు. పశ్చిమలో మూడు ముక్కలాట ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో సీటు కోసం టీడీపీలో మూడు ముక్కలాట నడుస్తోంది. ఆ పార్టీ ఆవిర్భావ సమయంలో తప్ప ఈ నియోజక వర్గంలో టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలంగా ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థులే విజయబావుటా ఎగరేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నియోజక వర్గ ప్రజల్లో విశేష ఆదరణ పొందాయి. దీంతో పార్టీ నేతలు జోష్‌లో ఉన్నారు. భారీ మెజార్టీతో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ‘పశ్చిమ’ ఇన్చార్జి ఆసిఫ్, స్థానిక నేతలను కలుపుకొని ప్రభుత్వ, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ దూసుకుపోతున్నారు. టీడీపీలో ఎవరి గోల వారిదే.. పశ్చిమ నియోజక వర్గంలో పార్టీకి బలం లేదని తెలిసినా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేష్ వద్ద మెప్పు కోసం ఇక్కడ టీడీపీ నాయకులు హడావుడి చేస్తున్నారు. ఎటూ సీటురాదు, వచ్చినా గెలిచే అవకాశం లేదని స్పష్టంగా తెలిసినా పేపరు పులిగా పేరొందిన బుద్దా వెంకన్న తమకు సీటు కేటాయించాలని ర్యాలీ చేసి హడావుడి చేస్తున్నారు. ఇటీవల కొంత మంది ముస్లిం నేతలు, తమ సామాజిక వర్గానికే సీటు కేటాయించాలని హంగామా చేస్తున్నారు. విజయవాడ టికెట్ తనదేనని టీడీపీ నేత జలీల్‌ఖాన్ ప్రకటించుకున్నారు. ‘అందరు టికెట్టు అడుగుతారుకానీ గెలిచే స్థోమత ఉండాలి. మంచి విలువలు ఉండాలి. నాకు సీటు ఇవ్వకపోతే ముస్లిం మైనార్టీలు ఉరి వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.’ అని జలీల్‌ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. మరో ముస్లిం మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ తనదే టికెట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు జనసేన నేత పోతిన మహేష్ పొత్తులో భాగంగా తమకే టికెట్ కేటాయిస్తారని ధీమాగా నియోజక వర్గంలో తిరుగుతున్నారు. పశ్చిమలో టీడీపీ, జనసేనలో ఎవరికివారే తమదే సీటు అని చెప్పుకొని నాయకులు తిరుగుతుంటే, అరకొరగా ఉన్న పార్టీ నేతలు, క్యాడర్ అయోమయానికి గురవుతున్నారు. సీనియర్ నేతలు కూడా.. టీడీపీలో సీనియర్ నేతలమంటూ గొప్పలు చెప్పుకొనే కొంత మంది, తమ నియోజక వర్గంలో వ్యక్తమవుతున్న తీవ్ర అసంతృప్తికి తోడు, పట్టుకోల్పోయి, టికెట్ మీద ఆశలు సన్నగిల్లి పూజలు చేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా ఇటీవల కృష్ణా తీరంలో చేసిన పూజలే నిదర్శనం. ఇది టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూజలపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. పేరుకు మాత్రం చంద్రబాబును సీఎం చేయడానికి పూజలు చేస్తున్నామని కలరింగ్ ఇస్తున్నా నియోజకవర్గంలో తమకు సీటుతోపాటు, గెలుస్తామనే నమ్మకం లేకనే, పూజలు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారనే విమర్శలు ఉన్నాయి. మచిలీపట్నంలో.. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పూజలు చేయడం దానికి దేవినేని ఉమా సైతం హాజరయ్యారు. ఇటీవల విజయవాడ గురునానక్ కాలనీ సమీపంలో మూడు రోజులపాటు టీడీపీ నేత కేశినేని చిన్ని సైతం యాగం చేశారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన వీరు, చివరి ప్రయత్నంగా పలు కార్యక్రమాలు చేస్తూ గట్టెక్కాలని తాపత్రయ పడుతున్నారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి, నియోజక వర్గంలో తిరుగుతూ కార్యకర్తల్లో ధైర్యం నింపకుండా కాల హరణం చేస్తున్నారని టీడీపీలో కొందరు నేతలు విమర్శిస్తున్నారు. -
టీడీపీలో వెస్ట్ ఫైట్: నోరు జారిన జలీల్ ఖాన్!
ఎన్టీఆర్, సాక్షి: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ వార్ ముదురుతోంది. టికెట్ కోసం సీనియర్ నేత బుద్దా వెంకన్న ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తెరపైకి వచ్చారు. టికెట్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలే తప్పవంటూ హెచ్చరించే క్రమంలో నోరు జారారాయన. విజయవాడ వెస్ట్‌లో టీడీపీ టికెట్ కోసం బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో వార్ ముదురుతోంది. మైనారిటీలకు టికెట్‌ఇవ్వకపోతే ఉరి వేసుకుంటారో.. ఏం చేసుకుంటారో తెలియదంటూ జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. అయితే అంతకు ముందు ఆయన నోరు జారారు. టికెట్ ఇవ్వకపోతే తానే ఉరేసుకుంటానని జలీల్ ఖాన్ అన్నారు. ఆ వెంటనే సవరించుకుని.. మైనారిటీలకు గనుక టికెట్ దక్కకపోతే ఉరి వేసుకుంటారో.. ఏం చేసుకుంటారో తెలియదంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ఉరేసుకునేందుకు ప్రయత్నించగా.. తాను వారించి ఆపానని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు సర్వేలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని.. చంద్రబాబు ఈ స్థానం నుంచి మైనారిటీలకే టికెట్ ఇస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారాయన. ఆపై ఓ అడుగు ముందుకేసి వెస్ట్ టికెట్ తనదేనని.. ఎన్నికల బరిలో నిలబడతానంటూ జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. అలాగే ఈ విషయంపైనే పవన్ కల్యాన్‌ను కలిసి పరిస్థితి వివరించానని.. పొత్తులో భాగంగా ఈ సీటును వదిలేసుకోవాలని జనసేనను కోరారని చెప్పుకొచ్చారు. ఇక.. చంద్రబాబుకు దరఖాస్తు సమర్పిస్తానంటూ గురువారం బుద్దా వెంకన్న విజయవాడలో గురువారం ర్యాలీ నిర్వహించారు. దుర్గ గుడికి వెళ్లి విజయవాడ వెస్ట్ టికెట్ తనకే దక్కాలంటూ పూజలు చేసినట్లు చెప్పారు. విజయవాడ వెస్ట్ టికెట్ గనుక ఇవ్వడం కుదరకుంటే.. అనకాపల్లి ఎంపీ సీటు అయినా ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబుని కోరే ఆలోచనలో బుద్దా వెంకన్న ఉన్నట్లు తెలుస్తోంది. ఒక పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని తమకే కేటాయించాలని కోరేందుకు జనసేన సైతం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో బుద్దా వెంకన్న ర్యాలీ పరిణామాలను ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎక్కడ ఏకపక్షంగా టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటిస్తుందో అనే ఆందోళనతో పవన కల్యాణ్‌ను కలిసేందుకు సిద్దమవుతున్నారు. -
టికెట్టు నాదే.. తాట తీస్తా: బుద్దా వెంకన్న
విజయవాడ, సాక్షి: టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న తీరుపై మిత్రపక్షం జనసేన తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. విజయవాడ పశ్చిమలో జనసేన తరఫున అభ్యర్థిని నిలబెట్టాలని ఆ పార్టీ నేతలు బలంగా ప్రయత్నిస్తుండగా.. ఆ ప్రయత్నాలకు బుద్ధా వెంకన్న గండికొడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ బలప్రదర్శన పేరిట నిర్వహించిన హడావిడిపై జనసేన నేతలు మండిపడుతున్నారు. విజయవాడ వెస్ట్ టిక్కెట్ తనకే ఇవ్వాలంటూ గురువారం బుద్ధా వెంకన్న దుర్గగుడి వరకు ర్యాలీ చేపట్టారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇవ్వబోయే దరఖాస్తును అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. తనకే బాబు టికెట్ ఇప్పించేలా అమ్మవారి ఆశీర్వదించారంటూ బయటకు వచ్చి హడావిడి చేశారు. ‘‘చంద్రబాబుకిచ్చే అప్లికేషన్ ముందుగా కనకదుర్గమ్మకు ఇచ్చా. విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి ఎంపీగా నాకు అవకాశం ఇవ్వాలని అప్లికేషన్ ఇచ్చా. .. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తా. అలాగని టిక్కెట్ రాలేదని ఎవరైనా చంద్రబాబుని విమర్శించినా తాట తీస్తా. నాకు టిక్కెట్ కేటాయించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దర్నీ కోరుతున్నా’’ అని అన్నారాయన. అయితే.. ఈ తతంగం అంతా చూస్తున్న జనసేన నేతలకు మండిపోతోంది. పశ్చిమ టిక్కెట్ తమకే కేటాయించాలంటూ జనసేన నేత పోతిన మహేష్ చాలాకాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో.. ఇప్పుడు బుద్ధా చేసిన హడావిడిని జనసేన నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడ చంద్రబాబు ఏకపక్షంగా ఈ సీటును కూడా ప్రకటిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇలా పదే పదే పొత్తు ధర్మాన్ని ఉల్లంఘిస్తూ సీట్లు ప్రకటించుకోవడంపై పార్టీ అధినేత పవన్‌ను కలిసి నిలదీసే యోచనలో జనసేన నేతలు ఉన్నట్లు సమాచారం. -
జనసేనలో భయం.. భయం
గుంటూరు, సాక్షి: చంద్రబాబు విషకౌగిలిలో చిక్కుకుంటే ఇక తప్పించుకోవడం కష్టం.. పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడిప్పుడే ఆ తత్త్వం మెల్లగా బోధపడుతోంది. జనసేనకు సీట్ల కేటాయింపును ఆఖరి నిమిషం దాకా నాన్చి... చివర్లో అతి కొద్ది సీట్లతో పవన్‌ను కట్టడి చేసేలా చంద్రబాబు పెద్ద ప్రణాళికతో ఉన్నారని ఇప్పటికే జనసేన నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండగా.. జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపై ఇప్పటికీ ఆ పార్టీ నేతల్లో స్పష్టత లేదు. దీంతో జనసేన కార్యకర్తలు సందిగ్ధంలో పడిపోయారు. పార్టీ అధినేత పవన్ రెండు మూడు వారాలుగా మౌనంగా ఉండడంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందో.. ఈ పొత్తు ఎటు పోయి ఎటు వస్తుందోనని జనసైనికులు తలలు పట్టుకుంటున్నారు. యుద్ధానికి సన్నద్ధమవ్వాల్సిన సమయంలో పార్టీ అధినేత మొదలు.. పార్టీలో ఏ ఒక్క నాయకుడు తాము ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది. ఇలాగైతే అసలుకే మోసం తమకు ఇన్ని స్థానాలు కావాలని.. ఈ స్థానాలు కేటాయించాల్సిందేనని పవన్ కళ్యాణ్ ఇప్పటి దాకా టీడీపీని స్పష్టంగా కోరలేదు. జనసేనలోను కొందరు కీలక నేతలకు కూడా ఎలాంటి స్పష్టత లేదు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది గత ఎన్నికల్లోనూ చివరి వరకూ తేల్చలేదు. దీంతో అసలుకే మోసం వచ్చింది. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ పవన్ ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఎక్కడి నుంచి పోటీ అనేది ఆఖరి నిమిషం వరకూ గోప్యంగా ఉంచడం ఈ ఎన్నికల్లో ఒక ఎత్తుగడగా భావిస్తున్నారు. వాడుకుని వదిలేస్తారేమో? రెండేళ్లుగా పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడూ రాష్ట్ర పర్యటనకు వచ్చి మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతాయా? అన్నంత హడావుడి చేసేవారు. సరిగ్గా ఎన్నికల సమయంలో మాత్రం ఆయన మౌనంగా ఉండిపోవడం వెనుక చంద్రబాబు జిమ్మిక్కులు ఉన్నాయని జనసైనికులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మూడున్నర నెలలుగా వారాహి యాత్రను సైతం పక్కనపెట్టేశారు. ప్రతి పొత్తు సమయంలోనూ చంద్రబాబు తమతో పొత్తు పెట్టుకున్న పార్టీని రాజకీయంగా వాడుకుని ఆ తర్వాత ఆ పార్టీని అణగదొక్కే నైజం అందరికీ తెలిసిందే. ఆ వ్యూహాన్ని ఇప్పుడు జనసేనపైనా మొదలుపెట్టి ఉండొచ్చని పార్టీలో చర్చ సాగుతోంది. పవన్‌కు అవమానం : జనసైనికుల ఆవేదన మొదటి నుంచి చంద్రబాబు వెంట పవన్ కళ్యాణ్ వెంపర్లాడడంతో దాన్ని అలుసుగా తీసుకుని తమ అధినేతను కూరలో కరివేపాకులా వాడుకుని వదిలేసే ఎత్తుగడలో బాబు ఉన్నాడని ఇప్పటికే జనసేన నేతలు మెల్లగా అర్థం చేసుకుంటున్నారు. తెలుగుదేశం–జనసేనలు కచ్చితంగా కలిసి పోటీ చేస్తాయని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖరాఖండీగా ఆ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. నచ్చేవారు ఉంటే ఉండండి.. లేదంటే వెళ్లిపోండి అని కేడర్‌ను అయోమయంలో పడేశారు. తమ అధినేత ఇంత చేస్తే పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని స్థానాలు కేటాయించేదీ చంద్రబాబు తేల్చకపోవడంపై ఆ పార్టీలో పెద్ద ఎత్తున మేధోమథనం సాగుతోంది. తమను చంద్రబాబు చివరిలో ముంచేస్తే పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. నెలాఖరు నుంచి పర్యటనలు: నాదెండ్ల నెలాఖరు నుంచి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలు ఉంటాయని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. అన్ని అసెంబ్లీ స్థానాలు కవర్ చేసేలా, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలతోపాటు బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. పొత్తులు కాదు కత్తులే పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న నాదెండ్ల మనోహర్ కోరుకుంటున్న గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ స్థానం మొదలు ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న నియోజకవర్గాలన్నింటిలోనూ స్థానిక టీడీపీ నాయకులు వ్యూహాత్మకంగా గత వారం పది రోజులుగా అక్కడి జనసేన నాయకులకు వ్యతిరేకంగా పోటీ కార్యక్రమాలు మొదలుపెట్టారు. జనసేనలో కీలక నేతగా కొనసాగుతున్న నాదెండ్ల మనోహర్ ఆశిస్తున్న గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా టికెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో జనసేనకు పోటీగా పాదయాత్ర చేస్తుండగా... రాజా అనుచరులు నియోజకవర్గంలో ప్రత్యేక సమావేశాలు పెట్టి నాదెండ్ల మనోహర్‌పై బహిరంగంగానే విమర్శలకు దిగారు. పొత్తులో సీట్ల కేటాయింపు కొలిక్కి రాకమునుపే చంద్రబాబు మాత్రం తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాల గురించి బహిరంగ సభలో ప్రకటిస్తున్నారని జనసేన నాయకులు భగ్గుమంటున్నారు. మండపేట నియోజకవర్గంలో జరిగిన బహిరంగసభలో చంద్రబాబు ఆ స్థానంలో టీడీపీ పోటీ చేసే అంశాన్ని పేర్కొనడం స్థానికంగా రెండు పార్టీల మధ్య వివాదంగా మారింది. అక్కడ జనసేన నుంచి టికెట్ ఆశిస్తున్న తూర్పు గోదావరి జిల్లాలోని జనసేన కీలక నాయకుడు మనస్తాపం చెంది.. సీట్ల కేటాయింపు తేలేవరకు మండపేట నియోజకవర్గంలో టీడీపీ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన నాయకులకు సందేశాలు పంపినట్టు ప్రచారం జరుగుతోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనూ ఇదే తరహా వాతావరణం ఉండగా, ఉమ్మడి ఉభయగోదావరి, ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. ఫొటోలోనే పవన్.. పక్కన అక్కర్లేదా: జనసైనికులు జనసేనలో టికెట్లపై గందరగోళం నెలకొనగా... చంద్రబాబు మాత్రం పవన్ ఫొటోలు పెట్టుకుని వరుసగా తమ పార్టీ రాజకీయ కార్యక్రమాలకు వాడేసుకుంటున్నారు. వెళ్లిన ప్రతిచోట తమ అభ్యర్థులకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం చేసేసుకుంటున్నారు. మరోవైపు జనసేనలో మాత్రం సీట్ల కేటాయింపు తేలక ఎన్నికల హడావుడి లేకుండా పార్టీ పూర్తి స్తబ్ధుగా తయారైంది. చంద్రబాబు తన ఫొటో పక్కనే పవన్ కళ్యాణ్ ఫొటోలు పెట్టుకొని జనసేనకు ఏమాత్రం సంబంధం లేకుండానే రోజుకు రెండు బహిరంగ సభలు నిర్వహించడం జనసైనికులకు మింగుడుపడడం లేదు. -
పచ్చ మీడియా అంబేద్కర్‌ను అవమానించింది: ఆర్కే రోజా
సాక్షి, విజయవాడ: ప్రభుత్వంపై వ్యతిరేక కథనాలు రాస్తున్న పచ్చపత్రికలపై మంత్రి ఆర్కే.రోజా ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ అంటే మీకు (పచ్చ పత్రికలు) గౌరవం లేదా? అని సూటిగా ప్రశ్నించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చూపించేందుకు మనసు రాలేదా? అని మండిపడ్డారు. అంబేద్కర్‌కు నిజమైన వారసుడు సీఎం జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. సీఎం జగన్మోహన్రెడ్డిని అందరూ అభినందిస్తుంటే పచ్చ మీడియా తట్టుకోలేకపోతోందని అన్నారు. పచ్చ మీడియాను..పత్రికలను బహిష్కరించాలన్నారు. శుక్రవారం రోజున ఒక్క నిమిషం కూడా అంబేద్కర్‌ను చూపించలేకపోయారని మంత్రి రోజా తెలిపారు. అంబేద్కర్‌ను పచ్చమీడియా అవమానించిందని..అంబేద్కర్‌కు అండగా నిలబడిన వర్గాలను కూడా అవమానించిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి అంబేద్కర్ విగ్రహాన్ని వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. వంద అడుగుల విగ్రహం పెడతానని చెప్పిన చంద్రబాబు.. ఒక్క విగ్రహమైనా పెట్టాడా? అని ప్రశ్నించారు. ప్రచారాలు, సమస్యల డైవర్షన్‌కు చంద్రబాబు అంబేద్కర్‌ను వాడుకున్నారని అన్నారు. తోపు.. తురుము అని చెప్పుకునే చంద్రబాబు విజయవాడ నడిబొడ్డులో ఏరోజైనా ఇలాంటి కార్యక్రమం చేయగలిగారా? అని నిలదీశారు. అంబేద్కర్ స్మృతివనం చూసేందుకు రెండు కళ్లూ సరిపోవని, మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. విజయవాడను ప్రపంచ పటంలో నిలిపిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. తమ సామాజిక వర్గమైన చంద్రబాబును కాపాడుకోవడం కోవడమే ఎల్లోమీడియా పని అని విమర్శించారు. టీడీపీ,జనసేన తోక పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని మంత్రి ఆర్కే రోజా అన్నారు. చదవండి: ‘ఎల్లో’ ఏడుపులకు సీఎం జగన్ దిమ్మదిరిగే సమాధానం -
చంద్రబాబుకు దళితులంటే నచ్చదు: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: పెత్తందారుల పత్రికలు చరిత్రను కూడా వక్రీకరిస్తున్నాయని.. ఎల్లో మీడియాను చూస్తే పాత్రికేయం ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభలో మాట్లాడుతూ, పేదవాడి పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగా ఉండిపోవాలా? అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. విజయవాడ– సామాజిక చైతన్యాలవాడ ఈ రోజు మన విజయవాడను చూస్తుంటే.. సామాజిక చైతన్యాలవాడగా ఇవాళ కనిపిస్తుంది. భారతరత్న, బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ మహావిగ్రహం, స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆవిష్కరణ సందర్భంగా ఇవాళ ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వాతాతకు, ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ, మొత్తం దళిత జాతికి, బహుజనులకు, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి గుండెకు ఈ రోజు మీ జగన్ ఈ వేదికపైనుంచి అభినందనలు తెలియజేస్తున్నాడు. సామాజిక న్యాయ మహాశిల్పం– దేశంలో మారుమోగనున్న విజయవాడ. ఈ మహా విగ్రహం స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహాశిల్పం. అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ మనకు కనిపిస్తుంది. దాని గురించి మనం మాట్లాడుతాం. కానీ ఇక మీదట నుంచి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇండియాలో విజయవాడ పేరు మారుమోగుతుంది. ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లో అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం. ఇది ఈ విజయవాడలో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే.. అంబేద్కర్ జన్మించి 133 సంవత్సరాల తర్వాత, అంబేద్కర్ మరణించిన 68 సంవత్సరాల తర్వాత కూడా ఈ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్– సామాజిక న్యాయ మహా శిల్పం కింద ఈ రోజుకి ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎందుకు చేస్తున్నామంటే కారణం... ఈ విగ్రహం వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, ఆర్ధిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘసంస్కర్త, ఓ మరణం లేని మహనీయుడు విగ్రహం విజయవాడలో ఆవిష్కారం అవుతోంది. అంబేద్కర్ నిరంతర స్ఫూర్తి... బాబాసాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ బ్రతికే ఉంటాడు. ఎప్పటికీ మన అడుగుల్లోనూ, బ్రతుకుల్లోనూ కనిపిస్తాడు. ఈ దేశంలో పెత్తందారీతనం మీద, అంటరానితనం మీద, కుల అహంకారవ్యవస్ధల దుర్మార్గులు మీద, ఆ దుర్మార్గాల మీద, అక్కచెల్లెమ్మలపై వివక్ష మీద పోరాటాలకు ఆ మహామనిషి నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటాడు. 75వ రిపబ్లిక్‌డేకు వారం రోజుల ముందే... విజయవాడలో.. అది కూడా స్వాతంత్య్ర సమర చరిత్ర ఉన్న మన స్వరాజ్య మైదానంలో, 75వ రిపబ్లిక్ డేకు సరిగ్గా వారం రోజుల ముందు మనం అంబేద్కర్ మహా విగ్రహం ఆవిష్కరిస్తున్నాం. ఈ విగ్రహం చూసినప్పుడల్లా పేదలు, మహిళలు హక్కులకు, మానవ హక్కులకు, ప్రాథమిక హక్కులకు, సమానత్వ ఉద్యమాలకు, రాజ్యాంగ హక్కులకు నిరంతరం స్పూర్తి ఇస్తూనే ఉంటుంది. అంటరానితనంపై తిరుగుబాటు. అంటరానితనం మీద, ఆధిపత్య భావజాలం మీద ఓ తిరుగుబాటుగా ఆయనను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకున్నా మనకు కనిపిస్తుంటాడు. ఈరోజు ఆయన సమసమాజ భావాలకు నిలువెత్తు రూపంగా ఎప్పుడూ మనందరికీ ఆయన గురించి ఆలోచన చేసినప్పుడు కనిపిస్తుంటాడు. రాజ్యాంగ హక్కుల ద్వారా, రాజ్యాంగ న్యాయాల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే ఒక మహాశక్తిగా ఆయన మనందరికీ స్పూర్తి నిస్తూనే ఉంటాడు. తమ గొంతు విప్పలేని దళిత వర్గాలకు, అల్పసంఖ్యాకులకు, వాయిస్ లెస్ పీపుల్‌కు.. గొంతు వినిపించలేని అట్టడుగునున్న ఉన్న వర్గాలకు, ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని, రిజర్వేషన్ కల్పించాలని చరిత్ర గతిని మార్చిన పూనాపాక్ట్ జరగడానికి కారకులు అంబేద్కర్. ఈ రోజు దళిత జాతి నిలబడిందన్నా, అల్ప సంఖ్యాకులు నిలబడగలుగుతున్నారన్నా కూడా రిజర్వేషన్లు కల్పించి ఒక్క తాటిపై నిలబెట్టే కార్యక్రమం జరిగిందంటే అది అంబేద్కర్ గారి స్పూర్తి. ఇవాళ ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అణగారినవర్గాలకు నిరంతరం ధైర్యాన్ని, శక్తిని, అండను ఇస్తుంది. మహా శక్తిగా తోడుగా నిలబడుతుంది. పోరాటానికి ప్రతిరూపం– బాబాసాహెబ్ చదువుకునేందుకు వీల్లేదని తరతరాలుగా అణచివేసిన వర్గాల్లో తాను జన్మించి, చదువుకొనేందుకు మాకు మాత్రమే హక్కుందని అని చెప్పి అనుకొనే వర్గాలకన్నా... కూడా గొప్పగా చదువుకున్న విద్యా విప్లవం అంబేద్కర్ గారు. ఆయన బడిలో చదువుకుంటున్న రోజుల్లో ఆయన దళితుడు కాబట్టి ఆ తరగతి గదిలో మంచి నీరు తాగాలంటే కుండలో నుంచి గ్లాసు ముంచుకొని నీరు తాగడానికి వీల్లేదట. బడిలో ప్యూను దళిత విద్యార్థులకు నీటిని ఆయన తెచ్చుకున్న గ్లాసులో పై నుంచి పోసేవాడట. ఒక్కసారి ఆంబేద్కర్ గారి మాటల్లో వింటే... బడికి ఏరోజైనా ప్యూన్ రాకపోతే ఆరోజు తాగడానికి మంచినీళ్లు లేనట్టే అనే మాటలు బాధ కలిగిస్తాయి. అలాంటి నిజాలను చూసినప్పుడు ఇంకా మనం ఎక్కడ ఉన్నామని అనిపించే మాటలివి. అంటరాని తరాన్ని స్వయంగా అనుభవించి దాని మీద ఒక తిరుగుబాటును, ఓ విప్లవాన్ని, ఓ స్వాతంత్య్ర పోరాటాన్ని వీటన్నింటినీ ఉమ్మడిగా చూస్తే, ఉమ్మడి చేస్తే...ఆ పోరాటానికి రూపమే అంబేద్కర్. అటువంటి పరిస్థితులు స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా వేర్వేరు రూపాల్లో ఇవాళ్టికీ ఉన్నాయి. రూపం మార్చుకున్న అంటరానితనం.. అంటరానితనం రూపం మార్చుకుంది అంతే.. అంటరానితనం అంటే కేవలం ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోకూడదు, దూరం పెట్టడమే మాత్రమే అంటరానితనం కాదు. అంటరానితనం అంటే పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో, ఆ గవర్నమెంట్ బడిని పాడుపెట్టడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అని తెలియజేస్తున్నాను. డబ్బులున్న వారి పిల్లలకు ఒక మీడియం, పేద పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటించి, పేద పిల్లలు తెలుగుమీడియంలోనే చదవాలని, వారు ఇంగ్లీషు మీడియంలో చదవరాదని బరితెగించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఈ రోజు కూడా ఈ అహంకారులు, ఈ పెత్తందార్లు తమ పత్రికలో రాశారు. పొద్దున్నే పత్రిక చదివాను. అంబేద్కర్ తెలుగు మీడియం మాత్రమే ఉండాలి అని అన్నారట. ఈ పెత్తందార్ల పిల్లలు, మనవళ్లు మాత్రం ఇంగ్లీషు మీడియంలోనే చదువుతారట. వీళ్ల మాటలు చూస్తే ఒక నిజం చెప్పకూడదు, అబద్ధాలు ఏ స్థాయిలో చెబుతున్నారో చూస్తే బాధనిపిస్తుంది. వాస్తవం ఏమిటంటే.. అంబేద్కర్ చదువుకున్నది ఇంగ్లీషు మీడియంలో, ఆయన పిల్లవాడిగా 4వ తరగతి ఇంగ్లిషు మీడియంలో పాసైనప్పుడు బంధుమిత్రులంతా పండగ చేసుకున్నారట. కానీ ఈ పెత్తందార్ల పత్రిక, ఆ ఈనాడు పత్రిక ముసుగులో.. తాము పాటించే ఈ అంటరానితనాన్ని అబద్ధాలతో అందమైన మేకప్ వేయాలనుకున్న ఇలాంటి దుర్మార్గులు, నీచులు మన దళితులకు, బహుజనులకు వ్యతిరేకులు. చరిత్రను వక్రీకరిస్తూ రాతలు.. చివరికి చరిత్రను కూడా ఇలాంటి వాళ్లు వక్రీకరిస్తూ రాతలు రాస్తున్నారంటే ఏ స్థాయికి పాత్రికేయం పడిపోయిందని ఆలోచన చేయమని కోరుతున్నాను. పేద కులాల వారు ఎప్పటికీ తమ పొలాల్లో పనివారుగా ఉండిపోవాలట. తమ ఇళ్లల్లో పనివారుగా, తమకు సేవకులుగా ఉండిపోవాలట. చిన్న, చిన్న వృత్తులు, చిన్న చిన్న వ్యాపారాలు మాత్రమే వాళ్లు చేసుకోవాలట. తమ అవసరాలు తీర్చేవారుగానే మాత్రమే వాళ్లు మిగిలిపోవాలట. ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేదలు ఏ ఆస్పత్రిలోకి వైద్యం చేయించుకుంటున్నారో. ఆ గవర్నమెంట్ ఆస్పత్రుల్లో ఎక్కడైతే పేదలకు ఉచితంగా వైద్యం అందుతోందో, అటువంటి ఆస్పత్రులు నీరుగార్చడం, పేదలు ఏ బస్సుల్లో ఎక్కుతున్నారో.. ఆ ఆర్టీసీని కూడా ప్రయివేటుకు అమ్మేయాలనుకోవడం ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఏ పౌర సేవ కావాలన్నా, ఏ పథకం పేదవాడికి కావాలన్నా, వారు లంచాలు ఇచ్చుకుంటూ వివక్షకు లోనవుతూ, కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, జన్మభూమి కమిటీల చుట్టూ తిరగేలా... వారి సహనాన్ని పరీక్షించడం కూడా.. రూపం మార్చుకున్న అంటరాని తనమే. అవ్వాతాతలకు పెన్షన్, రైతన్నలకు ఎరువులు కావాలన్నా పొద్దున్నే లేచి పొడువాటి లైన్లలో నిలబడి, చివరకి ఆ క్యూలైన్లలోనే మనుషులు చనిపోతున్నా కూడా పాలకుల గుండె కరక్కపోవడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఈ అంటరానితనంలో పేదల మీద పెత్తందారీ భావజాలంలో ఇవన్నీ కూడా భాగాలే. ఎస్సీల అసైన్డ్ భూముల్ని కూడా కాజేసి తాము గజాల లెక్కన అమ్ముకోవాలనుకున్న రియల్ ఎస్టేట్ రాజధానిలో పేద సామాజికవర్గాలకు చోటు లేకుండా తాము మాత్రమే ఒక కోట కట్టుకోవాలన్న కుతంత్రాలు చేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. రూపం మార్చుకున్న ఈ అంటరానితనం అంటే పేదల ఇళ్ల నిర్మాణానికి భూములిస్తే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులకు వెళ్లి, కేసులు వేసి సిగ్గు లేకుండా వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, మన మైనార్టీలు, మన నిరుపేద పిల్లలు చదువుకునే ఆ గవర్నమెంట్ బడులలో ఇంగ్లీషు మీడియం చదువులు చెప్పడానికి వీల్లేదని కోర్టులకు సైతం వెళ్లి పిటిషన్లు వేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేద వర్గాల పిల్లలకు ట్యాబులిస్తే అందులో వారు చూడకూడనివి చూస్తున్నారంటూ.. వాళ్ల పిల్లల చేతుల్లో కూడా సెల్ ఫోన్లు ఉన్నాయని, ట్యాబులున్నాయన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా కూడా మర్చిపోతూ, డిజిటల్ లిటరసీని మన పేద పిల్లలకు ఇవ్వటానికి వీల్లేదని కుట్రపూరితంగా రాతలు రాయడం, వాదించడం కూడా రూపంమార్చుకున్న అంటరానితనమే. 56 నెలల మన సామాజిక, ఆర్దిక, రాజకీయ యుద్దానికి నిదర్శనం. స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ అలాగే మిగిలిపోయిన ఈ రూపం మార్చుకున్న అంటరానితనంపై.. 56 నెలలుగా మనం చేస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ యుద్ధానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ అంబేద్కర్ గారి విగ్రహం ఎప్పటికీ కనిపిస్తుంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం ఈ విగ్రహం దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 81 అడుగుల వేదిక ఏర్పాటు చేసి, దాని మీద 125 అడుగుల మహా విగ్రహం. అంటే 206 అడుగుల ఎత్తయిన ఈ విగ్రహం.. దేశంతో కాదు మనం పోటీ పడేది ప్రపంచంతోనే పోటీ పడుతున్నామని తెలియజేస్తున్నాను. తరతరాలు ఈ ఆకాశమంత మహానుభావుడిని గుర్తుచేసుకోవాలి తరతరాలు కూడా ఈ ఆకాశమంతటి మహానుభావుడి, ఈ ఆకాశమంతటి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రతి పిల్లాడూ, ప్రతి పాపా ఆయన జీవిత చరిత్ర నుంచి స్పూర్తిని తెచ్చుకోవాలి. ఎందుకంటే అభివృద్ధికి, అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేద్కర్ గారి భావజాలం. ఇలాంటి భావజాలం మన పెత్తందార్లకు మాత్రం నచ్చదు. పెత్తందార్లంటే ఎవరో మీ అందరికీ బాగా ఈ పాటికి అర్థమయ్యుంటుంది. చంద్రబాబు దళితులకు చేసింది శూన్యం దళితులకు చంద్రబాబు నాయుడు సెంటు భూమిని ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చింది లేదు, అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించింది అంతకంటే లేదు. ఎందుకంటే చంద్రబాబు రక్తంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద ఏ కోశానా, ఏనాడూ కూడా ఈ మనిషికి ప్రేమే లేదు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోరు పారేసుకుంటే గ్రామాల్లో ఆ ఎస్సీలు ఎలా బతకగలుగుతారనే కనీస ఆలోచన చేయకుండా అంత చులకనగా మాట్లాడే స్వభావం. బీసీల తోకలు కత్తిరిస్తా కబడ్దార్ అన్న వ్యక్తి, పేద సామాజిక వర్గాలంటే గిట్టని ఈ వ్యక్తి మన మాదిరిగా పేద అక్కచెల్లెమ్మలు, కుటుంబాలు బాగుండాలని ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, దేశంలో ఎప్పుడూ చూడని విధంగా అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలని ఆ పెద్ద మనిషికి ఎందుకు అనిపిస్తుంది ?. పెత్తందారీ పార్టీలకు, నాయకులకు చదువుకొనే మన పేద పిల్లలకు అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్ద, విద్యాకానుక, ట్యాబులు ఇవ్వాలని, ఇంగ్లీషు మీడియంలో చదువులు చెప్పించాలని, బైలింగువల్ బుక్స్ ఇవ్వాలని, మన గవర్నమెంట్ బడుల్లో మన తరగతి గదుల్లో డిజిటలైజేషన్ జరగాలని, ఐఎఫ్ పీలు ఏర్పాటు చేయాలని, నాడునేడుతో మన చదువులు మార్చాలని ఇటువంటి పెత్తందారీ నాయకులకు, పార్టీలకు ఎందుకు అనిపిస్తుంది? పెత్తందారీ పార్టీలకు, నాయకులకు మన అక్కచెల్లెమ్మలకు ఒక దిశా యాప్ తేవాలని, అమ్మ ఒడి, ఆసరా, సున్నావడ్డీ, చేయూత ఇవ్వాలని, అక్కచెల్లెమ్మలపేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, 22 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చి.. వారి ముఖాలలో చిరునవ్వులు చూడాలని పెత్తందారీ పార్టీలకు, నాయకులకు ఎందుకు అనిపిస్తుంది? ఆలోచన చేయండి. మన రైతన్నలకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, రైతు భరోసాతో రైతన్నలకు ఆదుకోవాలని, వారికి చేయిపట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థను పెట్టాలని ఎందుకు అనిపిస్తుంది?. పెత్తందారీ పార్టీలకు, నాయకులకు.. పేదలకు వైద్యం, ఆరోగ్యం కోసం వారికి మెరుగైన ఆరోగ్యశ్రీ ఇవ్వాలని, ఆరోగ్య ఆసరాతో ఆదుకోవాలని, 104, 108 ఫోన్ కొడితే చాలు కుయ్.. కుయ్.. కుయ్ అంటూ పేద వాడి ముంగిటకు వచ్చి, పేదవాడికి అండగా నిలబడే పరిస్థితి రావాలని, గ్రామ స్ధాయిలో విలేజ్ క్లినిక్ రావాలని, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకురావాలని, ఆస్పత్రులు రూపు రేఖలు మారాలని, వైద్యం కోసం పేదవాడు వెళితే 53 వేల మంది డాక్టర్లు, నర్సులను ఆసుపత్రులలో రిక్రూట్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది? ఆ పెత్తందారీ పార్టీలకు, పెత్తందారీ నాయకులకు గ్రామ స్థాయిలోనే ఒక లంచాలు లేని, వివక్ష లేని వ్యవస్థను తీసుకురావాలని, ఓ వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలని, సచివాలయం తేవాలని ప్రతి పేదవాడికీ అందుబాటులతో ఉండాలని ఎందుకు అనిపిస్తుంది?. పెత్తందారీ పార్టీలకు, నాయకులకు నామినేటెడ్ పోస్టుల్లోనూ, నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ 50 శాతం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ 50 శాతం పదవులు ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం చేయాలని వాళ్లకు ఎందుకు అనిపిస్తుంది? మంత్రిమండలిలో ఏకంగా 4 డిప్యూటీ సీఎం పదవులు, నా అంటూ.. నా ఎస్సీలకు,ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు మనం ఇస్తే, మంత్రి మండలిలో 68 శాతం మంత్రి పదవులు ఇస్తూ... సామాజికపరంగా రాజకీయ పదవుల్లో దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఈ 56 నెలల్లో అడుగులు పడ్డాయి. శాసనసభ స్పీకర్ గా బీసీ, శాసన మండలి చైర్మన్ గా ఒక ఎస్సీ, మండలి డిప్యూటీ చైర్ పర్సన్‌గా ఒక మైనార్టీ అక్కకు పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. మనందరి ప్రభుత్వం వచ్చాక రాజ్యసభకు 8 మందిని పంపిస్తే అందులో నలుగురు నా వాళ్లు అనుకుంటున్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల వారే. మండలిలో మన పార్టీ వారు 43 మంది సభ్యులుంటే అందులో 29 మంది నా అని నేను పిల్చుకుంటున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలే. రాష్ట్రంలో 13 జెడ్పీ చైర్మన్ పదవులుంటే అందులో 9 నా అంటూ నేను పిల్చుకుంటున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలే. 17 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే అందులో 12 నా అంటూ నేను పిల్చుకుంటున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములే కనిపిస్తున్నారు. రాష్ట్రంలో 87 మున్సిపాలిటీలుంటే అందులో 84 మీ బిడ్డ గెలుచుకుంటే.. అందులో ఏకంగా 58 నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలే కనిపిస్తున్నారు. 196 మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉంటే అందులో ఏకంగా 117 ఏకంగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలే ఉన్నారు. 137 కార్పొరేషన్ చైర్మన్ పదవులుంటే 79 నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలే. మొత్తంగా రాజకీయ నియామకాలు, పదవుల్లో సగానికిపైగా నా అక్కచెల్లెమ్మలున్నారని గర్వంగా చెప్పగలుగుతున్నాను. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 56 నెలల కాలంలోఏకంగా 2.10 లక్షలకు పైగా.. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే అందులో... 80 శాతం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలే ఉగ్యోగాల్లో ఉన్నారు. ఇలాంటి సామాజిక న్యాయం మనందరి ప్రభుత్వంలో కాకుండా మరెక్కడైనా చూశారా? ఈరోజు ఈ పెత్తందారీ పార్టీలకు, పెత్తందారీ నాయకులకు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు.. వారి కోసం నవరత్నాల పాలన అందించాలని, కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి అవ్వాతాత వరకు అందరి పట్ల ప్రేమ, మమకారం చూపాలని వీళ్లకు ఏరోజైనా అనిపించిందా? మీ బిడ్డ పాలనలో ఈ 56 నెలల కాలంలో రూ.2.47 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కుతున్నాను. నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతున్నాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. మరి రాష్ట్రాన్ని దోచుకొనేందుకుమాత్రమే పదవులు కావాలని ఆకాంక్షిస్తున్న పెత్తందారీ పార్టీలు, నాయకులకు ఏరోజైనా ఇలా బటన్ నొక్కడం, తద్వారా రూ.2.47 లక్షల కోట్లు పేద అక్కచెల్లెమ్మలకు పోతుందని ఏరోజైనా అనిపించిందా? ఆలోచన చేయండి. సామాజిక న్యాయంలో పుట్టిన వ్యవస్ధలు. ఇవన్నీ కూడా సామాజిక న్యాయాన్ని అందించడంలో విప్లవంగా పుట్టిన వ్యవస్థలు. ఇవాళ గ్రామ స్థాయిలో చిక్కటి చిరునవ్వుతో మన పిల్లలు కనిపిస్తారు. 2 వేల జనాభాకు ఒక సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్.. లంచాలు, వివక్షలేకుండా ప్రతి పేదవాడు, రైతన్నను, అక్కచెల్లెమ్మను చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామ స్వరాజ్యం అంటే ఇదీ, అంబేద్కర్ గారి కలలుగన్న రాజ్యం ఇది అని ఆ చెల్లెమ్మలు, తమ్ముళ్లు దేశానికే చూపిస్తున్నారు. ఇవన్నీ సామాజిక న్యాయాన్ని అందించడంలో విప్లవంగా పుట్టిన వ్యవస్ధలు. కాబట్టి మనం ఆచరించిన విధానాలకు ప్రతీకగా ఈ సామాజిక న్యాయ మహాశిల్పం అనేదాన్ని మనం నిర్మించుకున్నాం. ఈ రోజు ఆవిష్కరణ కూడా చేస్తున్నాం. మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం, మీ కష్టం తెలిసిన మీ అన్న ప్రభుత్వం ఇంటింటా ప్రతి గ్రామం నుంచి, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్నయినా తీసుకోండి. ప్రతి గ్రామంలో మార్పులు కనిపిస్తాయి. ప్రతి గ్రామంలో ఇంటింటా చదువుల విప్లవం, మహిళా సాధికార విప్లవం కనిపిస్తుంది. ప్రతి గ్రాంలో పరిపాలన సంస్కరణలు కనిపిస్తాయి. ఒక వ్యవసాయ విప్లవం కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాల విప్లవం కనిపించేటట్టుగా జిల్లాలో ఎప్పుడూ చూడని అభివృద్ధి కనిపిస్తుంది. వైద్య, ఆరోగ్య రంగంలో ఎప్పుడూ ఊహించని విధంగా గ్రామ స్థాయిలో మార్పు చెందిన మరో విప్లవం మన పిల్లలకు కనిపిస్తుంది. నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి. ప్రతి అంశంలోనూ పేదల అభ్యున్నతికి తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు కలకాలం ఉండాలని కోరుకుంటూ... ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమానికి ఇక్కడి నుంచి అందరం బయలుదేరి అక్కడికి పోదాం అని పిలుపునిస్తూ... సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు. ఇదీ చదవండి: స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్: విజయవాడ ప్రతిష్ట ఆకాశమంత ఎత్తుకు.. . -
రామో‘ఛీ’.. నీ నీచపు రాతలపై జాలేస్తోంది: YSRCP
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఈనాడులో రాసిన చెత్త రాతలపై వైఎస్సార్సీపీ మంత్రులు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన వయసుకు తగినట్టు నడుచుకోవాలని హితవు పలుకుతున్నారు. కేవలం చంద్రబాబు కోసమే ఇలాంటి వార్తలు రాయడమేంటని ప్రశ్నిస్తున్నారు. పలుచోట్ల ఈనాడు పేపర్‌ను చించివేసి, మంటల్లో వేసి దగ్ధం చేస్తున్నారు. పచ్చ మీడియా ఏడుపే.. ఏడుపు.. పచ్చ బ్యాచ్‌కు ఏదీ చాతకాదు.. ఇంకొకరు చేస్తే చూడలేరు. ఇదీ చంద్రబాబుకు మొదటి నుంచీ ఉన్న రోగమే కదా!. సీఎం జగన్ దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ లక్షలాది పేద, దళిత, గిరిజన, అణగారిన వర్గాల ఇంటి పండుగ. పచ్చ బ్యాచ్ మీరు ఏడుస్తూనే ఉండండి. మేము ఆ వర్గాలను ప్రగతిపథం వైపు నడిపిస్తూ ముందుకు సాగుతాం: వైఎస్సార్సీపీ ఏడుపే… ఏడుపు 😂 మీకు ఏదీ చేతకాదు... ఇంకొకరు చేస్తే చూడలేరు. ఇది @ncbn కు మొదటి నుంచీ ఉన్న రోగమే కదా కొత్తగా చెప్పేదేముంది. మీకు దళితులు, బడుగులు, పేదలు అంటేనే అసహ్యం. కానీ నేడు సీఎం @ysjagan దళితుల ఆత్మగౌరవాన్ని మహనీయుడు డా. అంబేద్కర్ రూపంలో సమున్నతంగా నిలబెట్టారు. ఇది లక్షలాది… https://t.co/VZcESUbfWI — YSR Congress Party (@YSRCParty) January 19, 2024 గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కుటుంబాలకి సాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఎస్సీ ఉపప్రణాళిక ద్వారా దేశం మొత్తం మీద 53,85,270 కుటుంబాలు లబ్ధి పొందగా.. వారిలో ఒక్క మన రాష్ట్రం నుంచే 51,91,091 కుటుంబాలు సాయం పొందాయి. ఇది సీఎం @ysjagan పాలన దార్శనికతకి నిదర్శనం.… pic.twitter.com/Kcmu3s5j8J — YSR Congress Party (@YSRCParty) January 19, 2024 మంత్రి అమర్నాథ్ సీరియస్ ఈనాడు పత్రికా లేక.. ! చంద్రబాబు టాయిలెట్ పేపరా..? మనందరి ముఖ్యమంత్రి జగన్ గారు విజయవాడ నడిబొడ్డున రాజ్యాంగ స్ఫూర్తికి చిహ్నంగా.. ఆకాశమంత ఎత్తున అంబేడ్కర్ మహా శిల్పం నెలకొల్పారు రామోజీకి పచ్చ కామెర్లు వచ్చాయి అందుకే అంబేడ్కర్ విగ్రహంపైనా విషం చిమ్మటానికి బరితెగించాడు. ఈ వయసులో ఇదేం పాడు పని.. ఇవేం రోత రాతలు రామోజీ ..!? ఈనాడు పత్రికా లేక.. ! చంద్రబాబు టాయిలెట్ పేపరా..!! మనందరి ముఖ్యమంత్రి జగన్ గారు విజయవాడ నడిబొడ్డున రాజ్యాంగ స్ఫూర్తికి చిహ్నంగా.. ఆకాశమంత ఎత్తున అంబేడ్కర్ మహా శిల్పం నెలకొల్పడంతో రామోజీకి పచ్చ కామెర్లు వచ్చాయి. అందుకే అంబేడ్కర్ విగ్రహంపైనా విషం చిమ్మటానికి బరితెగించాడు. ఈ వయసులో… pic.twitter.com/B0chsF9Wfl — Gudivada Amarnath (@gudivadaamar) January 19, 2024 జాలేస్తోంది.. యెల్లో మీడియాకు అంబటి చురకలు బడుగు బాంధవుడి విగ్రహంపైనా పచ్చ మంద ఏడుపులు జగన్‌కు అంబేడ్కర్ విగ్రహం తాకే అర్హత లేదంటూ కథనాలు యెల్లో మీడియాకు వైఎస్సార్సీపీ నేతల కౌంటర్ ఎక్స్ వేదికగా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చురకలు డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణని చూసి బోరున విలపిస్తున్నారు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియాని చూస్తే జాలి వేస్తుంది. దుష్ర్పచారం చేస్తున్న ఎల్లో పత్రికలను దహనం చేస్తున్న డా. అంబేద్కర్ అభిమానులు ! pic.twitter.com/ukd0gT7Yha — Ambati Rambabu (@AmbatiRambabu) January 19, 2024 డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణని చూసి బోరున విలపిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియాని చూస్తే జాలి వేస్తుంది!@JaiTDP — Ambati Rambabu (@AmbatiRambabu) January 19, 2024 పిచ్చి రాతలు రాస్తే చెప్పుతో కొడతారు: కొడాలి నాని అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం సందర్భంగా గుడివాడలో సంబరాలు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, వేడుకల ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని. ఎమ్మెల్యే కొడాలి నాని కామెంట్స్.. ప్రపంచంలో అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహం విజయవాడలో ఏర్పాటు కావడం సంతోషకరం అంబేద్కర్ చూపిన మార్గంలో పయనిస్తూ, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారు జనవరి 19వ తేదీ క్యాలెండర్లో అంబేద్కర్ డేగా చరిత్రలో నిలిచిపోతుంది ఇంతటి గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం సంతోషకరం రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వ్యతిరేకంగా రామోజీ, రాధాకృష్ణ కుట్రలు చేస్తున్నారు పిచ్చి రాతలు రాస్తున్న వారిద్దరూ రోడ్లపైకి వస్తే యువత చెప్పులతో కొడతారు. రామోజీ.. వయసుకు తగినట్టు నడుచుకో: మంత్రి పెద్దిరెడ్డి రామోజీరావుకు ఏం అర్హత ఉందని సీఎం జగన్ గురించి రాశారు. రామోజీరావు అగ్రవర్ణాల అహంకారి. వయసుకు తగ్గట్టుగా రామోజీ నడుచుకుంటే మంచింది. నేను 2009లో ఫారెస్ట్ మంత్రిగా పనిచేశాను. ఎర్రచందనం అక్రమ తరలింపు కట్టడికి నేనే మొదటగా చర్యలు తీసుకున్నాను. ఎవరి హయాంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ ఎక్కువగా జరిగిందో అందరికీ తెలుసు. చంద్రబాబు హయాంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. చంద్రబాబు తన పక్కన తెచ్చిపెట్టుకున్న కిషోర్ కుమార్ రెడ్డి ఎవరు?. 2009లో మహేశ్వర్ నాయుడు, రెడ్డి నారాయణలపై టాడా కేసులు పెట్టాం. ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి వారి పేర్లతో రామోజీరావు వార్తలు రాస్తున్నాడు. ఎన్నికల కోసమే రామోజీ తాపత్రయం. సీఎం జగన్‌ను మీరు ఎంత తిడితే ఆయనకు అంత ఆశీర్వాదం. గతంలో కంటే ఎక్కువ సీట్లను వైఎస్సార్సీపీ సాధిస్తుంది. చంద్రబాబుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్ధులున్నారా? సమాధానం చెప్పాలి. మేం తీసేసినోళ్లను, పనికిరానోళ్లను చంద్రబాబు తన దగ్గర చేర్చుకుంటున్నాడు. ముఖ్యమంత్రి జగన్ వద్ద క్వాలిటీ లీడర్ షిప్ ఉంది. చంద్రబాబు ఏ రకంగానూ మాకు ధీటుగా లేడు. -
‘రామోజీ.. మరి నీకు అర్హత ఉందా?’
సాక్షి, విజయవాడ: తన వయసుకు తగినట్టు రామోజీరావు నడుచుకుంటే మంచిదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హితవు పలికారు. రామోజీరావుకు ఏం అర్హత ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అంబేద్కర్ గురించి కథనాలు రాశారు. సీఎం జగన్‌కు అర్హత లేదని రామోజీ చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లిండచమే అవుతుందన్నారు. కాగా, మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రామోజీరావు అగ్రవర్ణాల అహంకారి. సీఎం జగన్‌కు అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత లేదని చెప్పడానికి రామోజీకి ఏం అర్హత ఉంది. ఆయన వయసుకు తగ్గట్టుగా రామోజీ నడుచుకుంటే మంచింది. నేను 2009లో ఫారెస్ట్ మంత్రిగా పనిచేశాను. ఎర్రచందనం అక్రమ తరలింపు కట్టడికి నేనే మొదటగా చర్యలు తీసుకున్నాను. ఎవరి హయాంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ ఎక్కువగా జరిగిందో అందరికీ తెలుసు. చంద్రబాబు హయాంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. చంద్రబాబు తన పక్కన తెచ్చిపెట్టుకున్న కిషోర్ కుమార్ రెడ్డి ఎవరు?. 2009లో మహేశ్వర్ నాయుడు, రెడ్డి నారాయణలపై టాడా కేసులు పెట్టాం. ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి వారి పేర్లతో రామోజీరావు వార్తలు రాస్తున్నాడు. ఎన్నికల కోసమే రామోజీ తాపత్రయం. సీఎం జగన్‌ను మీరు ఎంత తిడితే ఆయనకు అంత ఆశీర్వాదం. గతంలో కంటే ఎక్కువ సీట్లను వైఎస్సార్సీపీ సాధిస్తుంది. చంద్రబాబుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్ధులున్నారా? సమాధానం చెప్పాలి. మేం తీసేసినోళ్లను, పనికిరానోళ్లను చంద్రబాబు తన దగ్గర చేర్చుకుంటున్నాడు. ముఖ్యమంత్రి జగన్ వద్ద క్వాలిటీ లీడర్ షిప్ ఉంది. చంద్రబాబు ఏ రకంగానూ మాకు ధీటుగా లేడు అంటూ కామెంట్స్ చేశారు. -
చంద్రబాబు చిట్టా విప్పితే తట్టుకోలేరు: కేశినేని నాని
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలలకు రూపం ఈ అంబేద్కర్ విగ్రహమని అన్నారు ఎంపీ కేశినేని నాని. అంబేద్కర్ విగ్రహంపై రాజకీయం చేయడం టీడీపీకి సమంజసం కాదు. నేను చంద్రబాబు చిట్టా విప్పితే తట్టుకోలేరంటూ నాని వార్నింగ్ ఇచ్చారు. కాగా, కేశినేని నాని గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘దేశంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సీఎం జగన్ ఆలోచనలకు స్ఫూర్తి అంబేద్కర్. వివక్ష లేని సమాజం కావాలని అంబేద్కర్ ఆశించారు. సీఎం జగన్ ఇప్పుడు వివక్ష లేని పాలన అందిస్తున్నారు. అంటరానితనం, కుల వివక్షపైన అంబేద్కర్ పోరాటం చేశారు. పేదలను ఉన్నత స్థాయితో ఉంచాలని ఆశించే నాయకుడు సీఎం జగన్. ఆరోజు అంబేద్కర్ పోరాడిన వర్గాల కోసం నేడు సీఎం జగన్ పోరాడుతున్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని గతంలో అందరూ ఊరు చివర పెట్టేవారు. సీఎం జగన్ మాత్రం రాష్ట్రం నడి బొడ్డున ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టారు. ఆ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. అంబేద్కర్ విగ్రహంపై రాజకీయాలు చేయడం టీడీపీకి సమంజసం కాదు. నేను చంద్రబాబు చిట్టా విప్పితే మీరు తట్టుకోలేరు’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో కేశినేని చిన్ని వ్యాఖ్యలపై నాని స్పందించారు. ఈ సందర్బంగా ఉత్తర కుమారుడి ప్రగల్బాలు పట్టించుకోవాల్సిన అవసరంలేదని సెటైరికల్ పంచ్ విసిరారు. అలాగే, రేపు ఎన్నికల బాక్స్‌లు తెరిచాక 80 శాతం ఏ పార్టీ ఖాళీ అవుతుందో తెలుస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. -
‘అంబేద్కర్ విగ్రహంపై అవమానకరంగా మాట్లాడుతున్నారు’
సాక్షి, విజయవాడ: ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అంబేద్కర్ మహా శిల్పం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు గతంలో 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతానని పెట్టలేదన్నారు. అంబేద్కర్ స్మారక చిహ్నన్ని సీఎం జగన్ ఏర్పాటు చేస్తే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఎల్లో మీడియాలో పనులు పూర్తవ్వలేదంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారని, ఎల్లో మీడియా, చంద్రబాబు ఇక్కడికి వస్తే పనులు చూపిస్తానన్నారు. రూ. 400 కోట్లు పెడితే ఎందుకంత ఖర్చు అని టీడీపీ నేతలు అవమానకరంగా మాట్లాడుతున్నారు. అంబేద్కర్ విగ్రహంపై చంద్రబాబు చేసిన రాజకీయాన్ని ప్రజల్లో ఎండగడతామని మంత్రి పేర్కొన్నారు. రేపు విజయవాడలో డా.బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. తొలుత ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభకు హాజరు కానున్న సీఎం.. అనంతరం స్వరాజ్ మైదానంలో సామాజిక న్యాయ మహా శిల్పాన్ని ఆవిష్కరించనున్నారు. వెలుగుల నడుమ బడుగు బాంధవుడు (ఫొటోలు).. క్లిక్ చేయండి -
Kesineni Nani: ఉంటే ఉండండి.. పొతే పోండి..
రెండేళ్లుగా తనను పార్టీలో కుదురుగా ఉండనివ్వకుండా ఇబ్బందులు పెడుతూ వస్తున్న తెలుగుదేశాన్ని వీడిన కేశినేని నాని ఇప్పుడు తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. తనను కాదని తన సోదరుడు కేశినేని శివనాథ్ (చిన్ని)కి తెలుగుదేశం ఎంపీ టికెట్ ఇస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు కేశినేని నానిని ఇప్పటికే వైఎస్సార్సీపీ పార్టీ విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం ఇంచార్జ్‌గా నియమించగా ఇప్పటికే ఆయన తన పనులు మొదలు పెట్టారు. కేడర్‌తో సమావేశం కావడం, వారిని తనవెంట నడిపించేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. మరోవైపు ఆయన తన పరిధిలోని విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ నియోజకవర్గాలతోబాటు తిరువూరు, మైలవరం.. నందిగామ.. జగ్గయ్యపేటల్లోని తన కేడర్‌తో కూడా భేటీలు నిర్వహిస్తూ ఎప్పటిలా తనకు మద్దతుఇవ్వాల్సిందిగా కోరుతూ ముందుకుసాగుతున్నారు. ఇదిలా ఉండగా ఆయనకు సంబంధించి ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకున్నది. కేశినేని నాని తన ప్రధాన అనుచరులు.. నాయకులతో కూడిన వాట్సాప్ గ్రూపులో మొన్న ఆయన తరఫున ఒక మెసేజ్ పోస్ట్ చేసారు. కేశినేని నాని ఇకపై వైఎస్సార్సీపీతో కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారని, ఈ క్రమంలో ఆయన ఆలోచలను.. నిర్ణయాలు.. అడుగుల గమనాన్ని అంగీకరించి, ఆమోదించేవాళ్ళు మాత్రమే ఆ వాట్సాప్ గ్రూపులో ఉండాలని, ఆయన ఆలోచనలు, నిర్ణయాలను వ్యతిరేకించేవాళ్ళు సదరు గ్రూపు నుంచి వెళ్లిపోవచ్చని అందులో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అంటే నాని అలా టీడీపీని వీడి వైఎస్సార్సీపీ వెంట నడవడాన్ని అంగీకరించాలని వాళ్లు గ్రూపు నుంచి వెళ్లిపోవాలని అందులో తేల్చి చెప్పేశారు. అయితే, అలా చెప్పినప్పటికీ ఒక్కరు కూడా గ్రూపు నుంచి వెళ్లలేదని తెలుస్తోంది. అంటే వారంతా నాని నిర్ణయాన్ని ఆమోదిస్తున్నట్లే అని తెలుస్తోంది. ఇది కాకుండా ఇంకా ఆ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రామ మండల స్థాయి నాయకులు పెద్ద ఎత్తున కేశినేని నాని వెంట వైఎస్సార్సీపీ వెంట నడిచేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయన సైతం తన బలాన్ని.. బలగాన్ని నిరూపించుకుని ఎన్నికల్లో తన పట్టును రుజువు చేసుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారు. వాస్తవానికి కేశినేని నాని వెంట తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు కూడా వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనకు టిక్కెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయనతోబాటు ఇంకా పెద్ద సంఖ్యలో గ్రామ, మండల స్థాయి నాయకులూ వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. తామంతా ఈసారి ఐక్యంగా కదులుతామని, నాని మొన్న చెప్పినట్లు జిల్లాలో 60 శాతం వరకూ టీడీపీ కేడర్‌ను తమ వెంట తీసుకుపోతామని వారు అంటున్నారు. రెండుసార్లు గెలిచిన నాని ఇప్పుడు వైఎస్సార్సీపీలో చేరడంతో ఆ సామాజికవర్గంలో కూడా ఆలోచన మొదలైంది. మళ్ళీ వచ్చేది జగన్.. గెలిచేది జగన్ అని వారు భావిస్తున్నారు. దీంతో ఎన్టీయార్ జిల్లాలో ఈసారి తెలుగుదేశానికి గట్టి దెబ్బ తప్పదు అని తెలుస్తోంది. - సిమ్మాదిరప్పన్న -
అది చంద్రబాబు మనస్తత్వం: మంత్రి అంబటి ఫైర్
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ జనసేన కలిస్తే అరాచకం ఎలా ఉంటోందో ఇప్పుడు తెలిసొచ్చిందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంత్రి విడదల రజిని కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించిన అంబటి.. అరాచకవాదులుగా టీడీపీ శ్రేణులు తయారయ్యాయంటూ మండిపడ్డారు. మంత్రి రజినీ ఆఫీస్‌పై పక్కా ప్రణాళికతోనే దాడి చేశారని మంత్రి అంబటి మండిపడ్డారు. రజినినీ ఓడించలేకే దాడులకు పాల్పడుతున్నారన్నారు. దాడులు చేయడమే టీడీపీ లక్ష్యంగా చేసుకుందని.. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు అరాచకవాదులుగా తయారయ్యారన్నారు. ఎర్ర పుస్తకాల్లో(లోకేష్ రెడ్ బుక్‌ను ప్రస్తావిస్తూ..) పేర్లు రాసుకుని బెదిరిస్తారా? అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళా మంత్రిపై.. అందునా బీసీ నేతపై దాడి మంచిది కాదని అంబటి హితవు పలికారు. రాష్ట్రంలో టీడీపీ జనసేన కలిస్తే అరాచకం ఎలా ఉంటోందో ఇప్పుడు తెలిసిందని చెప్పారు. కుప్పంలో చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు దిగుతున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేశారని మంత్రి అంబటి రాంబాబు ఉద్ఘాటించారు. గతంలో రుణమాఫీ చేస్తానని చంద్రబాబు రైతులను మోసం చేశాడు. రావణుడికి పది తలలు ఉన్నట్లే.. చంద్రబాబుకి పవన్ ఒక తలగా ఉంటుండని ఎద్దేవా చేశారు. సీఎం అయితేనే అసెంబ్లీకి వస్తాననే మనస్తత్వం చంద్రబాబుదని.. పదవిపై చంద్రబాబుకి ఎందుకంత వ్యామోహమే అర్థం కావట్లేదన్నారు మంత్రి అంబటి. అయితే.. వందమంది కలిసివచ్చినా సీఎం జగన్‌ను ఓడించలేరని.. వచ్చే ఎన్నికల కోసమే 175 మంది సభ్యుల టీమ్‌ను సిద్ధం చేస్తున్నారని అంబటి చెప్పారు. ఇంకా మంత్రి అంబటి రాంబాబు ఏమన్నారంటే... – అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. – ఈ సందర్భాన నూతన సంవత్సరం మొదటి రోజునే వృద్ధాప్య, వితంతు పింఛన్లను రూ.3వేలకు పెంచి ఇవ్వడం జరుగుతోంది. – ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి రాజకీయంగా కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. – అదేమంటే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తున్న రూ.వెయ్యి పింఛన్‌ను అధికారంలోకి రాగానే రూ.2వేలు చేస్తానని హమీ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన ఇంకో మాట కూడా అన్నారు. నేను రూ.వెయ్యి పింఛన్‌ను రూ.2వేలు చేస్తానంటున్నాను.. చంద్రబాబు ఇంకా మరో రెండు మాసాలు అధికారంలోనే ఉంటారు కనుక నా మాటను కాపీ కొట్టి ఆయన రూ.2వేలు చేస్తారేమో.. అదే జరిగితే, నేను అధికారంలోకి రాగానే రూ.3వేల వరకు పెంచుకుంటూ పోతానన్నారు. – ఆ ప్రకారంగానే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2,250 నుంచి పెంచుకుంటూ ఈరోజుకు రూ.3వేల పింఛన్‌ను అందిస్తోన్నారు. – ఈనెల మూడోతేదీ నుంచి ప్రతీ వాలంటీర్ ఇంటింటికీ వెళ్లి రూ.3వేల చొప్పున పింఛన్‌ను అందించడంతో .. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న దమ్మున్న ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు చేరువ కాబోతున్నారు. బాబు, పవన్‌ల ప్రగల్భాలకు రెస్పాన్స్ నిల్.. – ప్రజలంతా ఒకసారి ఆలోచించాలి. ఇచ్చిన ప్రతీ మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు. అదే, ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని బుట్టదాఖలా చేసింది చంద్రబాబు నాయుడు. – ఈ వ్యత్యాసాన్ని గమనించిన ప్రజలు రేపటి ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబును తుక్కుతుక్కుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు. – ఇదే విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు ఎవరు దొరికితే వాళ్లతో సయోధ్య చేసుకోవాలని వెంపర్లాడుతున్నాడు. – దాన్లో భాగంగానే జనసేనతో కలిసి పనిచేయాలనుకున్నాడు. ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని ఓట్లు చీలకుండా జగన్ గారిని అధికారంలో నుంచి దించేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాడు. దాడులకు తెగబడుతున్న తెలుగుదేశం పార్టీ – చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ కలయికలో రాష్ట్రంలో రాజకీయాలు మారతాయని ఆశపడ్డారు. అయితే, వారిద్దరి పొత్తుపై ఏ విధమైన రెస్పాన్స్ ప్రజల్లో లేదని గమనించాక.. ఇక, లాభం లేదనుకుని వైఎస్ఆర్సీపీ పైన దాడులకు తెగబడుతున్నారు. – నిన్న గుంటూరులో జరిగిన ఒక ఘటనకు కారణమిదే. చిలకలూరిపేట శాసనసభ్యురాలు, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న శ్రీమతి విడదల రజినీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంచార్జిగా నియమించారు. నూతన సంవత్సరం మొదటి రోజు నుంచి ఆమె ఇక్కడ ఆఫీసు నుంచి పనిచేయడానికి సర్వం సిద్ధమైన క్రమంలో రాత్రి 12 గంటల సమయంలో పార్టీ ఆఫీసుపై దాడులకు పాల్పడ్డారు. – ఆఫీసును పూర్తిగా ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. రాళ్లు వేశారు. బ్యానర్లు చించేశారు. – స్పాట్లోనే పోలీసులొచ్చి ఆ దాడి చేస్తున్న ఒక గుంపును పట్టుకున్నారు. ఆ గుంపులో ఎవరున్నారంటే, అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్లే. – తెలుగుదేశం పార్టీ మనుషులు ప్రీప్లాన్డ్‌గా మంత్రి రజినీ గారి ఆఫీసు మీద దాడిచేసి హింసాత్మకంగా అరాచకాలను సృష్టించడం చాలా దురదృష్టకరం. ఉగ్రవాదులు, అరాచకశక్తులు వారు – ఒక బీసీ మహిళ అయిన విడదల రజినీ గుంటూరులో పోటీ చేస్తుంటే.. మీకెందుకంత కడుపు మంట..? – దమ్ముంటే, ఆమెను ఢీకొట్టి గెలవాలి. మీరు గెలిచి ఆమెను ఓడించే పరిస్థితి లేదని తెలుసుకున్నారు గనుకే వారి పార్టీ ఆఫీసుపై దాడి చేశారు. ఇది ఎంతవరకు సబబు..? – తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక ఉగ్రవాదులుగా, హింసావాదులు, అరాచకశక్తులుగా తయారయ్యారు. అధికారమెటూ రాదని .. అరాచకానికి పూనుకున్నారా..? – ఎప్పుడైతే, తెలుగుదేశం పార్టీ జనసేనతో జతకట్టిందో..ఈ రాష్ట్రంలో ఒక అరాచకాన్ని సృష్టించేందుకు వారు కంకణం కట్టుకున్నారు. – వారి పొత్తుపై ఎటూ ప్రజల్లో స్పందన కనిపించడం లేదు గనుక .. అధికారంలోకి ఎటూ రాలేము కనుక.. రాష్ట్రంలో ఒక అరాచకాన్ని సృష్టించి వైఎస్ఆర్సీపీపై దాడులు చేసి, పోలీసువారిపైనా దాడులకు పాల్పడి ఏదో సాధించాలనే మీ తాపత్రయం చాలా దురదృష్టకరం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు కుట్ర – ఇదే సందర్భంలో నేనొక సంఘటనను గుర్తుచేస్తున్నాను. ఖమ్మంలో ఓ పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యేందుకు నేనెళితే.. నా మీద కూడా దాడి చేయడానికి తెలుగుదేశం పార్టీ వాళ్లే ప్రయత్నించారు. – వారంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. ఆరోజు నామీద దాడి చేసి నన్ను అల్లరిపాల్జేయాలని చూశారు. – ఈ విధంగా ఎక్కడబడితే అక్కడ దాడులకు పూనుకుని.. రాష్ట్రంలో అలజడులు, అరాచకం కలిగిస్తున్నారు. – తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ తోడైంది కాబట్టి మేం రాష్ట్రంలో ఎన్ని దాడులు చేసినా.. ఎంత అరాచకం సృష్టించినా అడ్డుకునేవారు లేరని భావిస్తున్నారు వారు. అందుకే, తెలుగుదేశం పార్టీ మనుషులు విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నారు. – ఆ రెండు పార్టీల కలయికతో జరుగుతున్న దాడుల కారణంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వారు సిద్ధపడ్డారనేది కనిపిస్తోంది. పవన్‌కళ్యాణ్ పెద్ద అరాచకశక్తి – జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ అందరూ చూస్తుండగా.. కాలి చెప్పు తీసి కొడతానంటాడు. ఇదెక్కడి విడ్డూరం. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడైన వ్యక్తి అలా చేస్తాడా..? – రెండుచోట్ల పోటీచేసి ఓడిపోయిన వ్యక్తి అతడు. తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకోకపోయినా.. ఆయన్ను అభిమానించే వ్యక్తులు మాత్రం అలా కోరుకోవడం సహజం. – అలాంటి వ్యక్తి తాను ఒక పార్టీకి అధ్యక్షుడినని మరిచి బూతులు తిడుతూ.. కాలి చెప్పు చేతబట్టుకుని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల్ని కొడతాననడం.. పెద్ద అరాచకం కాదా..? ఆయనో పెద్ద అరాచక శక్తి కాదా..? – అలాంటి అరాచక శక్తితో కలిసి చంద్రబాబు రాష్ట్రంలో అరాచకాల్ని సృష్టించేందుకు ప్రయత్నించడం చాలా దురదృష్టకరం. దుర్మార్గుల్లా తండ్రీకొడుకుల బెదిరింపులు – చంద్రబాబు ఆ వయసులో కూడా పోలీసుల మీదికి తన పార్టీ మనుషుల్ని దాడి చేయమని ఉసిగొల్పుతాడా..? తరమండి.. కొట్టండి అంటూ బహిరంగంగా రెచ్చగొట్టి పంపుతాడు. ఏంటి ఈ దౌర్భాగ్యం..? – ఇంత అరాచకానికి కారణమేంటి..? ఎందుకంత మీకు ఫ్రస్టేషన్..? – మీరు అధికారంలోకి రాలేమనే కదా.. ఈ విధమైన దాడులు, రెచ్చగొట్టడాలు చేస్తుందని ప్రశ్నిస్తున్నా.. – ఇక, ఆయన కొడుకుల్లో దత్తపుత్రుడు కాకుండా సొంతపుత్రుడు లోకేశ్ ఒక ఎర్రబుక్కులో తాను టార్గెట్ చేసిన వారి పేర్లు రాశాడంట. అధికారంలోకి రాగానే వారి తాట తీస్తాడంట. అది ఎర్రబుక్కో... ఎర్రిబుక్కునో తెలియదు గానీ ఏంటి మీ బెదిరింపులు..? – చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్ ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులకు దిగజారిపోయారు. – మీరంతా అధికారుల్ని బెదిరించాలనుకున్నా.. ప్రజల్ని భయపడాలని కోరుకుంటున్నా.. ఇక్కడ వణికేవారెవరూ లేరన్నది సంగతిని మీరు గ్రహించాలి. ఆ రెండుపార్టీలకు అధికారం కలే – ఈ రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు సృష్టించినా.. దాడులకు పాల్పడి ఎంతమందిని భయపెట్టినా.. తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు కూటమి అధికారంలోకి రాలేదు.. రాదు. – ఈ విషయం అందరికన్నా ముందు గ్రహించిన వారు ఆ రెండు పార్టీల నేతలే. కుప్పంలోనే చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు. నాన్‌లోకల్ నేతలు మీరు – మొన్న కుప్పంలో ఆయన మాట్లాడుతూ.. తనను మళ్లీ గెలిపిస్తే కుప్పంను ప్రపంచానికి అనుసంధానం చేస్తానంటున్నాడు. అక్కడ ఎయిర్‌పోర్టు పెట్టి కూరగాయలు ఎగుమతి చేస్తాడంట. – ఏమయ్యా చంద్రబాబూ.. నువ్వేమైనా కొత్తగా రాజకీయాల్లో కొస్తున్నావా..? కొత్తగా ఎన్నికల్లో నిలబడుతున్నావా..? కొత్తగా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నావా..? – 14 ఏళ్లపాటు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేశావే.. మరి, అప్పుడు కుప్పం నియోజకవర్గానికి ఏం చేశావు..? అప్పుడు చేయనివాడివి.. ఇప్పుడు చేస్తానంటే నమ్మడానికి కుప్పం ప్రజలేమైనా అమాయకులా..? – నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కనీసం, కుప్పంకు రెవెన్యూ డివిజన్‌ను తీసుకురాలేకపోయావు. ఇది ఎంత హాస్యాస్పద విషయం. – కనీసం, కుప్పంను మున్సిపాల్టీ కూడా చేసుకోలేకపోయావు. ఆ నియోజకవర్గంలో అదీఇదీ చేస్తానన్న పెద్దమనిషివి..మరి, కనీసం అక్కడ నువ్వు సొంత కొంప కట్టుకున్నావా..? – కుప్పం వస్తే గెస్టుహౌస్‌లో ఉంటున్నావు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వస్తే కరకట్టమీదనున్న లింగమనేని వారి గెస్టుహౌస్‌లో ఉండాల్నా..? – అదే పవన్‌కళ్యాణ్ ఈ రాష్ట్రానికొస్తే నోవాటెల్ హోటల్లో ఉండాలి. సొంత ఇళ్లులేని నేతలు మీరు. ఇంతకంటే, ప్రజలు మీ గురించి చర్చించుకోవాల్సిన దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా..? నాన్‌లోకల్ నేతలు మీరు. – అలాంటి మీరు ఈ రాష్ట్రాన్ని ఏదో ఉద్దరిస్తామంటే.. కుప్పం ప్రజలే కాదు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరూ నమ్మరు గాక నమ్మరని మీరు గమనించండి. పది తలల చంద్రబాబుకు ఒక తల పవన్‌కళ్యాణ్ – చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ పార్టీల కలయిక ఆరోగ్యకరం కాదు. పది తలల రావణాసురుడు చంద్రబాబు అయితే.. ఆయనకున్న ఒక తల పవన్‌కళ్యాణ్. – కనుకే, బాబు నోట వినిపించని మాటల్ని పవన్‌కళ్యాణ్ చేత చెప్పిస్తుంటాడు. – హౌసింగ్‌లో అవినీతి జరిగిందని.. సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని కేంద్రానికి పవన్‌కళ్యాణ్ లేఖ రాయడం కూడా అందులో భాగమేనని ప్రజలు అర్ధం చేసుకోవాలి. – వీరి ఇద్దరి కలయికతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే తప్ప వారివల్ల ఈ రాష్ట్రానికి ఏమీ ప్రయోజనం ఉండదని ప్రజలు గమనించాలని కోరుతున్నాను. అరాచకశక్తుల్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం – రాజకీయ కుట్రలు, వ్యూహాలు పన్ని వైఎస్ఆర్సీపీ మీద, మా పార్టీ నాయకులపైన దాడులు చేస్తామంటే ఇక్కడెవరూ భయపడేది లేదు. – మీరు ఒక బీసీ మహిళ ఆఫీసుపై దాడిచేస్తారా.? చట్టం ఊరుకుంటుందనుకుంటున్నారా..? మిమ్మల్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం.. జాగ్రత్త – అరాచకశక్తులకు ఈ రాష్ట్రంలో తావులేదని హెచ్చరిస్తున్నా. – చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్‌తో పాటు నిన్న మంత్రి గారి ఆఫీసుపైన రాళ్లేసిన వెధవలైనా .. ఎవరైనా గానీ అరాచకం సృష్టించాలనుకుంటు.. చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. పట్టుకుంటాం. అరెస్టులు చేస్తాం.. చట్టపరంగా తగిన శిక్ష విధించే వరకు పోరాడతామని హెచ్చరిస్తున్నాను. ప్రభుత్వం, చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తుంది. – కనుక, ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఏదో నాలుగు సీట్లల్లో గెలిచేందుకు పనిచేయండి గానీ.. మీరిద్దరూ ఈ రాష్ట్రంలో అరాచకాలు చేయడానికి పనిచేస్తామంటే ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారని హెచ్చరిస్తున్నాను. చదవండి: మంత్రి రజిని ఆఫీస్‌పై దాడి.. 30 మంది అరెస్ట్ -
టీడీపీలో దుమారం రేపిన కేశినేని నాని వ్యాఖ్యలు
విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు బెజవాడ టీడీపీలో మరోసారి దుమారం రేపాయి. తన సోదరుడు చిన్నాతో పాటు బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలను ఆయన పరోక్షంగా టార్గెట్ చేశారు. ఓ వైపు తనతో పాటు తన వర్గాన్ని ప్రమోట్ చేసుకుంటూ సొంత పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పశ్చిమ నియోజవర్గంలో తన కుమార్తె శ్వేత పోటీ చేయడం లేదని చెప్పారు. కొన్ని కబంధ హస్తాల నుంచి పశ్చిమ నియోజకవర్గానికి విముక్తి చేయడానికే తాను ఇంఛార్జ్‌గా వచ్చానని తెలిపారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేవారిని తాను సహించనని కేశినేని నాని హెచ్చరించారు. మేం ఏలుకుంటాం.. దోచుకుంటాం అంటే ఊరుకునేది లేదన్నారు. తాను ఎవరి చీకటి వ్యాపారాల్లో వాటాదారుడిని కాదని అన్నారు. అందుకే వాళ్లతో తనకు పడదని చెప్పారు. తాను వెళ్లిపోతే విజయవాడ నుంచి జగ్గయ్యపేట వరకు దోచుకోవచ్చనేదే వారి అజెండా అని తీవ్రంగా విమర్శించారు. తాను తినను.. ఎవ్వరీని తిననివ్వను.. అనేదే వాళ్ల బాధని పరోక్షంగా విమర్శలు చేశారు. కేశినేని నాని అనే వ్యక్తి ఎంపీగా లేకపోతేనే వాళ్లకు సంతోషమని అన్నారు. చదవండి: Tuni TDP Clashes: తునిలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ -
28న కురుపాంకు సీఎం జగన్మోహన్రెడ్డి
కురుపాం: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ నెల 28వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ కేంద్రంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సభాస్థలి, హెలిప్యాడ్ స్థలాలను శాసనమండలి సభ్యుడు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త తలశిల రఘురాం, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కురుపాం, పార్వతీపురం ఎమ్మెల్యేలు పాముల పుష్పశ్రీవాణి, అలజంగి జోగారావు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, కలెక్టర్ నిషాంత్‌కుమార్, ఎస్పీ విక్రాంత్‌పాటిల్ తదితరులు శుక్రవారం పరిశీలించారు. నాలుగో ఏడాది జగనన్న అమ్మఒడి నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమచేసే బృహత్తర కార్యక్రమానికి కురుపాం వేదికగా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా సీఎం రాకకు వీలుగా జియ్యమ్మవలస మండలం చినమేరంగి పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో హెలిప్యాడ్, కురుపాం నుంచి చినమేరంగి వెళ్లే రహదారి సమీపంలోని సెయింట్ మాంట్ ఫోర్ట్ పాఠశాలకు ఆనుకొని ఉన్న స్థలంలో బహిరంగ సభావేదికను ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాకు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో పెద్దఎత్తున ప్రజలు తరలివస్తారనే ఆలోచనతో భారీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ప్రజాప్రతినిధులు సూచించారు. హెలిప్యాడ్, సభాస్థలి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. సభకు వచ్చే వాహనాలకు పార్కింగ్ సౌకర్యం, పారిశుద్ధ్యం నిర్వహణ అంశాలపై దృష్టిసారించాలన్నారు. సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ ఆర్.గోవిందరావు, పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పీఓలు సి.విష్ణుచరణ్, కల్పనాకుమారి, డీఆర్వో జె.వెంకటరావు, సబ్‌కలెక్టర్ నూరుల్‌కమర్, ఆర్డీఓ హేమలత, అదనపు ఎస్పీ డాక్టర్ ఒ.దిలీప్‌కుమార్, పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, తదితరులు పాల్గొన్నారు. సభాస్థలాన్ని పరిశీలించిన పాలకులు, అధికారులు ఏర్పాట్లపై సూచనలిచ్చిన సీఎం కార్యక్రమ సమన్వయ కర్త తలశిల రఘురాం పాల్గొన్న జెడ్పీ చైర్మన్, ఎమ్సీల్సీ, ఎమ్మెల్యేలు, అధికారులు బాంబ్‌స్క్వాడ్ తనిఖీలు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కురుపాం నియోజకవర్గ కేంద్రానికి వస్తున్న సందర్భంగా బహిరంగ సభా ప్రాంతం, హెలిప్యాడ్ పరిసరాలను పోలీసులు తనిఖీ చేశారు. బాంబ్‌స్క్వాడ్ బృందం నిశితంగా పరిశీలించింది. ఆయా ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది గస్తీ కాస్తున్నారు.