సాక్షి, విజయవాడ: ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అంబేద్కర్ మహా శిల్పం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు గతంలో 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతానని పెట్టలేదన్నారు. అంబేద్కర్ స్మారక చిహ్నన్ని సీఎం జగన్ ఏర్పాటు చేస్తే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.
ఎల్లో మీడియాలో పనులు పూర్తవ్వలేదంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారని, ఎల్లో మీడియా, చంద్రబాబు ఇక్కడికి వస్తే పనులు చూపిస్తానన్నారు. రూ. 400 కోట్లు పెడితే ఎందుకంత ఖర్చు అని టీడీపీ నేతలు అవమానకరంగా మాట్లాడుతున్నారు. అంబేద్కర్ విగ్రహంపై చంద్రబాబు చేసిన రాజకీయాన్ని ప్రజల్లో ఎండగడతామని మంత్రి పేర్కొన్నారు.
రేపు విజయవాడలో డా.బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. తొలుత ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభకు హాజరు కానున్న సీఎం.. అనంతరం స్వరాజ్ మైదానంలో సామాజిక న్యాయ మహా శిల్పాన్ని ఆవిష్కరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment